Saturday, 26 December 2020

పందళ రాజు ప్రతినిధిగా మూలంతిరునాల్ ఎన్.శంకర్..

కేరళ/పందళం : శబరిమల అయ్యప్పకు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే మకరజ్యోతి కార్యక్రమానికి ముందుగా అయ్యప్పకు పందళరాజు చేయించిన తిరువాభరణాలను అలకరించే అనావాయితి.ఈ అభరణాలు పందళం నుండి శబరిమాలకు కాలినడకన చెట్టు..పుట్ట..కొండాకోన దాటి దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి అయ్యప్పను చేరుతాయి.దారిపొడవునా ఈ అభరణాలు ప్రయాణం చేసినంత దూరం ఆలయ సిబ్బంది, డోలీలతో పాటు..కేరళ పోలీసులు వెంట వుంటారు.ఈ ఏడాది ఈ అనవాయితి కొనసాగించేందుకు అభరణాల వెంట  పందళ రాజు ప్రతినిధిగా మూలంతిరునాల్ ఎన్.శంకర్ వుంటారు. ఈ మేరకు పందళరాజ వంశీకులు ఓ లేఖను విడుదల చేశారు.
 అసలు ఈ తిరువాభరణాలు ఏమిటి ? 

అంటే వీటిని పందళ రాజు కొన్ని వేల సంవత్సరాల క్రిందట చేయించారు అని తెలుస్తోంది.

 సంవత్సరకాలం అంతా పందళ రాజ ప్రసాదంలోని "స్రంపికల్ భవనం"లో  అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచబడతాయి.మకర జ్యోతి కి వెళ్ళలేని భక్తులు ఈ ఆభరణాలను మండలపూజా  సమయంలో ఇక్కడ  దర్శించుకోవచ్చును. 
మళయాళ పంచాగం(కొల్ల వర్షం) లోని ధనుర్మాసం ఇరవై ఎనిమిదో రోజున అంటే జనవరి పన్నెండో తారీఖున తిరువాభరణ మూడు పెట్టెలకు ప్రత్యేక పూజల చేస్తారు. ఈ మూడు పెట్టెలలో అన్నిటికన్నా పెద్దది  అయిన  తిరువాభరణం పెట్టిలో బంగారు కిరీటాలు, కవచం, హారాలు, ఉంగరం, లక్ష్మీ రూపు, పెద్ద, చిన్న ఖడ్గాలు, పూలు ఉంచడానికి వాడే పళ్ళెము, స్వామి వాహనాలైన గజము, పులి బంగారు బొమ్మలు ఉంటాయి. 
రెండోది  అయిన కొడి పెట్టిలో  స్వామి వారి ధ్వజాలు, అన్నిటికన్నా చిన్నదైనా "వెళ్లి పెట్టి"లో వెండి పూజా సామాగ్రి ఉంటాయి.
అనంతరం తెల్లవారు జాము నాలుగు గంటలకు పందళ రాజు నియమించిన అధికారి ఆధ్వర్యంలో మూడు తిరువాభరణ  పెట్టెలను దీక్షలో ఉన్న స్వాములు శిరస్సున ధరించి నడుచుకొంటూ శబరిమల బయలు దేరుతారు.వీరిని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు, కాపలాగా రక్షక భటులు ! 
వారి తొలి మజిలీ ఆరన్ముల శ్రీ పార్ధసారధి ఆలయం. తిరువాభరణ యాత్ర అక్కడికి చేరుకొనే సరికి మధ్యాహన్నం అవుతుంది. సరిగ్గా అదే సమయానికి సన్నిధానం పైన ఒక "కృష్ణ పక్షి" (గరుడ)ఎగురుతుంది. పక్షి రాకతో తిరువాభరణాలు బయలుదేరాయి అన్న సంకేతం ఆలయం వద్ద ఉన్న వారికి అందుతుంది. ఈ ఎనభై మూడు కిలోమీటర్ల దారిలో వచ్చే గ్రామస్థులు మహదానంతో స్వామి వారి ఆభరణాలకు ఘన స్వాగతం పలుకుతారు. 
మార్గ మధ్యలో విశ్రాంతికి, భోజనాదులకు ఆలయాలలో విడిది చేస్తారు. ఇలా తిరువాభరణ యాత్ర మకర సంక్రాంతి నాటి మధ్యాహన్నం పంబా తీరం చేరుతుంది. అక్కడ స్నానాదులు, పూజలు పూర్తి చేసుకొని సాయంత్రం అయిదు గంటలకు సన్నిధానం చేరుకొంటాయి. తిరువాభరణాలు ఆలయం చేరిన దగ్గర నుండి భక్తులలో  మరి కొద్దీ సేపట్లో మకర జ్యోతి దర్శనం, అనంతరం తిరువాభరణ దారి అయిన శ్రీ ధర్మశాస్త దర్శనం చేసుకోబోతున్నామన్నసంతోషం మొదలవుతుంది. సంధ్యా చీకట్లు ఆవరించుకొంటున్న సమయంలో స్వర్ణాభరణ భూషితులైన శ్రీ మణికంఠ స్వామికి మేల్ సంతి హారతి ఇస్తారు. వెంటనే పొన్నాంబల మేడు నుండి మకర జ్యోతి కనిపిస్తుంది. అవధులు దాటిన ఆనందంతో లక్షలాది మంది భక్తులు "స్వామి శరణం!అయ్యప్ప శరణం!" అంటూ చేసే శరణ ఘోషతో శబరి కొండలు మారు మోగుతాయి. 
శ్రీ ధర్మశాస్త ఈ ఆభరణాలను ధరించి ఐదు రోజుల పాటు దర్శనమిస్తారు. చివరి రోజున పందళ రాజు పూజ చేసుకొన్న తరువాత ఆలయాన్ని మరుసటి నెల పూజల దాకా మూసివేస్తారు.పందళ రాజు తిరువాభరణాలతో తిరుగు ప్రయాణం మొదలుపెడతారు.మార్గ మధ్యలో వచ్చే రేణి పేరునాడ్  గ్రామంలో ఉన్న శ్రీ ధర్మశాస్త కి తిరువాభరణాలను ఒక రోజు అలంకరిస్తారు. ఇక్కడి ఆలయం శబరిమల ఆలయం ఒక్కసారే నిర్మించారని అంటారు. జనవరి ఇరవై మూడో తారీఖు నాటికి తిరువాభరణాలు పందళ రాజా భవనం లోని "స్రంపికల్ భవనం". చేరుకొంటాయి. తిరిగి వీక్షించాలంటే సంవత్సరం పాటు ఎదురు చూడాల్సినదే!!

Friday, 25 December 2020

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి సందడి... బంగారు రధంపై మలయప్ప... ఉత్తరద్వారాన కొలువు తీరిన భద్రాద్రి రాముడు...

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి భక్తి శ్రద్దాలతో నిర్వహించారు.. తిరుమలలో ఉత్తర ద్వారం లో నుండి శ్రీనివాసుని భక్తులు దర్శించుకున్నారు.. మరోవైపు మలయప్ప శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ విధుల్లో బంగారు రధంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్ఛారు... అంధ్రుల ఆయోధ్య భధ్రాచలంలో సీతారాములు లక్షమణ హనుమంత..గరుడ పరివారంతో ఉత్తరద్వారంలో కోలుతీరి..భక్తులకు దర్శనం ఇచ్ఛారు..ద్వారకాతిరుమలలో వెంకన్న..మంగళగిరి పానకాల నరసింహుడు.. వేములవాడ రాజన్న .యాదాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహుడు అందుగలడిందులేడన్న చందంగా తెలుగు రాష్ట్రాల లో అన్ని దేవాలయాలలో ఉత్తర ద్వారంలో దేవేరులతోకూడి స్వాములు దర్శనం ఇచ్ఛారు... 

Sunday, 20 December 2020

ముందు రొడ్డు వేసేద్దాం... తరువాత తవ్వి పొద్దాం...

ఖమ్మంలో.. రోడ్డు డివైడయర్స్ పనులు నిర్మాణం చక చక సాగుతున్నాయి.. రాపర్తి నగర్ నుండి టి.ఎన్ జివో వైపు కొద్ది రోజుల క్రితమే చక్కగా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశారు.. చాలా బాగుంది ఆ ప్రాంత  ముచ్ఛట పడేలోపే రెండు మూడు కాలువ ల కోసం అంటూ రెండు.. మూడు చోట్ల సిమెంట్ గొట్టాలు వేసేందుకు తవ్వి పోశారు... చాలి చాలకుండా మట్టి పోసి వదిలేయడం వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. దీంతో ఆదే రోడ్డులో నివాసం ఉంటున్న కొందరు శ్రమదానం చేసి..కొంత మట్టి పోసి రోడ్డుకు సమం చేశారు.. కాగా గత మూడు రోజులుగా..డివైడర్ల కోసం రోడ్డు మధ్యలో తవ్వకాలు మోదలు పెట్టారు..ఈసారి డివైడర్ల నిర్మాణం లేని రోడ్డు డైవర్షన్ల దగ్గర కూడా డ్రిల్లింగ్ చేయడం కొసమెరుపు.. ఇదేంటి ఇలా తవ్వకాలు చేస్తున్నారు అని అడిగితే లైను తప్పకుండా వుండాటానికి తవ్వకాలు చేస్తున్నామంటూ సమాధానం.. బస్ డిపో రోడ్డులో కూడా ఇలాగే తవ్వేసి వదిలి వేయడంతో అక్కడ రోడ్డు డైవర్షన్ల దగ్గర పెచ్ఛులతో రోడ్డుకనిపిస్తోంది..ప్రణాలిక లేకుండా తవ్వి పోయడం పట్ల ఆ ప్రాంత వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.....  

Tuesday, 15 December 2020

ఆల్లం టీ ముందు అన్ని బలాదూరే అంటున్న కల్వకుంట్ల కవిత...

MLC కల్వకుంట్ల కవిత ఓ టీ కప్పుతో కనిపించారు.. International TEA Day సందర్భంగా ఆమే  టీ ని ఇష్టపడేవారికి శుభాకాంక్షలు తెలిపారు. ఓ కప్పు అల్లం టీ తాగడం వల్ల ఉత్సాహం.. ఉల్లాసం...ఆనందం వుంటుందని పేర్కొన్నారు..
Nothing feels better than a piping hot cup of Ginger Tea or what we fondly call Allam Chai in the middle of a super hectic day! 
Here, I share my selfie with my cup of tea, would absolutely enjoy looking at your selfie with a cup of tea too! 
#InternationalTeaDay

Friday, 11 December 2020

శ్రీ‌నివాస‌మంగాపురంలో ఏకాంతంగా కార్తీక వ‌న‌భోజ‌నం


టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం కార్తీక వనభోజన కార్యక్రమం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.
ఇందులో భాగంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పానికి వేంచేపు చేశారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వహించారు.
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Thursday, 3 December 2020

క్లాస్ రూమ్‎లో పెళ్లి చేసుకున్న టీనేజ్ ప్రేమికులు


కాకినాడ :  గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పెళ్లి కలకలం సృష్టించింది. కాలేజీ నడుస్తున్న సమయంలో క్లాస్ రూమ్‎లోనే పెళ్లి చేసుకున్నారు మైనర్లు. క్లాస్ రూమ్ లోనే అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు అబ్బాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మైనర్లు వివాహం నవంబర్ 17న జరిగినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్‎గా మారాయి. వైరల్ అయిన వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చాడు. అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచారు.

Wednesday, 2 December 2020

తిరుమల‌వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా అచ్యుతార్చ‌న‌..గోపూజ‌...

 కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధ‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో అచ్యుతార్చ‌న‌, గోపూజ శాస్త్రోక్తంగా జ‌రిగాయి. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.
ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ గోవు స‌క‌ల దేవ‌తా స్వ‌రూప‌మ‌న్నారు. గోధూళిని తాకితే వాయువ్య స్నానం చేసిన ఫ‌లితం ద‌క్కుతుంద‌ని, గోదానం వ‌ల్ల 14 లోకాల్లోని దేవ‌త‌ల ఆశీర్వాదం ల‌భిస్తుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంద‌న్నారు.ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత స్వామి, అమ్మ‌వార్ల‌కు తిరువారాధ‌న చేశారు. అనంతరం క‌పిల గోవుకు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. గోప్ర‌ద‌క్షిణ చేశారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

ఉద్యమనేత వారసుణ్ణి.. ప్రతిపక్షాలకు భయపడను.. మంత్రి అజయ్ కుమార్ వెల్లడి.


ఖమ్మం :  తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు ఉధ్యమాల నేత అని ఆయన వారసునిగా ఖమ్మం జిల్లా   అభివృద్ధిని  ఉధ్యమంగా చేపట్టి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు  తెలంగాణ రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో నిర్మాణంలో నూతన ఐ.టి.హబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు..
ఖమ్మం నగరం చుట్టు 11 కిలోమీటర్ల మేరకు పలు రకాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని..కొన్ని పూర్తి  కావడంతో ఆయా ప్రాంతాల్లో చక్కటి వాతావరణం నెలకొన్నదని. చెప్పారు.
ఆహ్లాదకరమైన ఖమ్మం లక్ష్యంగా ముందుకు సాగుదామని ఆయన పిలుపు నిచ్చారు..
GHMC ఎన్నికల్లో తనపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని..
పోలింగ్ తేదీ నాడు తను ఎం.ఎల్.ఏ క్యార్టర్సుకు పరిమితమైనట్లు చెప్పారు..
GHMC ఎన్నికల్లో తెరాస విజయం తధ్యమని ఆయన నొక్కి చెప్పారు..

Tuesday, 1 December 2020

ఓటర్ల తీరుపై సజ్జనార్ అసంతృప్తి...సపరేట్ ట్రీట్మెంట్ వుండాలని వ్యాఖ్య...


జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడంపై సీపీ సీరియస్ అయ్యారు. ఓటు వేసిన వారిని వేయనవారికి వేరే వేరేగా ట్రీట్ చేయాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోలీంగ్ భారీగా తగ్గిన విషయం తెలిసిందే.


గ్రేటర్ ఎన్నికల పోలింగ్ పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ శాతం తగ్గడం బాధాకరమన్నారు. దీనిపై సమాజం ఆలోచించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 30 నుంచి 35 శాతం పోలింగ్ శాతం మాత్రమే నమోదయ్యిందని ఆయన భావించారు. కోట్లు ఖర్చు పెట్టి, ప్రజల సొమ్ముతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఓటు వేసిన వారికి ఓ రకంగా ఓటు వేయని వారికి మరోరకంగా ట్రీట్ చేయాలన్నారు. ఓటు వేసిన వారికి ప్రొత్సాహకాలు అందించాలన్నారు. స్పెషల్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. ఓటు వేసిన వారికి అన్నిరకాల సదుపాయాలు కల్పించాలన్నారు.

మరోవైపు ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వకుండా నిబంధన తేవాలన్నారు. విద్యార్థులు సీట్లు పొందకుండా నిబంధన పెట్టాలన్నారు. జాబ్‌ అవకాశాలు విషయంలో కూడా ఈ వ్యత్సాసం చూపించాలన్నారు. దీనిపై యంత్రాంగంతో పాటు, ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులతో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకుంటే బావుంటుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఓటు హక్కుపై ఈసీ మరింత అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సందర్భంగా నగరంలో పలుచోట్ల పర్యటనలు చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా పోలింగ్ శాతం తగ్గడంపై రాజకీయ నిపుణులు సైతం అసహనం వ్యక్తంచేస్తున్నారు. యువత
ఓట్లు వేయకపోవడం చాలా బాధాకరమన్నారు. ఐటీ సెక్టార్ వాళ్లు సెలవులు వస్తే వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, మీడియా ముందు చర్చల్లో మాట్లాడటానికి చదువుకున్నవాళ్లు ఆసక్తి చూపుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే తప్పా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. గతఎన్నికలతో పోలిస్తే భారీగా ఓటింగ్ తగ్గడంపై విస్మయం చెందుతున్నారు. 2009లో 45. 27 శాతం, 2014లో 50.86 శాతం పోలింగ్ నమోదు అయ్యింది

Friday, 27 November 2020

శైలజ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తిన ఎం.ఎల్.ఏ.రోజా...



మహిళలకి అవకాశం ఇస్తే ఎంత ఎతైన ఎదుగుతారు అందుకు శైలాజారెడ్డి ఉదహారణ అంటూ నగరి ఎం.ఎల్.ఏ. రోజా పేర్కొన్నారు. రెడ్డీస్ మల్టీ ప్లేక్సు ప్రారంభించిన అనంతరం ఆమే మాట్లాడారు. వివరాల్లోకి వెళితే ఇది డిజిటైలేజేషన్లి వేగంగా విస్తరించిన 20వ శాతాబ్ధాపు అవిష్కరణల్లో  మనకు ఏది కావాలి అన్న వార్త అయినా వినోదం అయినా  క్షణంలో లో మన ముందుకు తీసుకుని వస్తోంది డిజిటల్ప్పు వ్యవస్థ...మనం ఎక్కడున్న  దిన పత్రికలూ టీవి ఛానల్ కన్నా దీటైన్నది  సోషల్ మీడియా. సోషల్ మీడియా లో అతిముఖ్యమైనది యూట్యూబ్. ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు యూట్యూబ్ లో క్షణంలో  ప్రత్యేక్షం. యూట్యూబ్ మన జీవితంలో భాగం అయిపొయింది.
ఇప్పుడు రెడ్డీస్  ముల్టీప్లెక్ వారు ప్రేక్షకులను మరింతా కనువిందు చేయటానికి సరికొత్త ఛానల్ లతో మన ముందుకు వచ్ఛఛారు..   పొలిటికల్ల్ ప్రియులకు పొలిటికల్ ఛానల్, మహిళలకోసం మహిళా ఛానల్, స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ ఛానల్, సినిమా ప్రేక్షకులకి ఆర్ – ఫ్లెక్స్ (R-Flex OTT ) ఓ టి టి  ని ఇలా ఎన్నో సరికొత్త చానెల్స్ ని అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో అతిధుల సమక్షంలో ఘనంగా  ప్రారంభించారు.
రెడ్డీస్  ముల్టీప్లెక్ ప్రారంభోత్సవానికి దర్శకుడు ఎస్ వి కృష్ణ రెడ్డి, నగరి ఎమ్ ఎల్ ఏ రోజా, మాజీ ఏం పి మధు యాష్కీ గౌడ్, నరసింహ రెడ్డి, విద్య వతి, అవినాష్ రెడ్డి, రవి చంద్ర రెడ్డి, స్నేహ, శైలజ చరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి, బియగూడ హరీష్, తదితరులు పాల్గున్నారు.
అనంతరం నగరి ఎమ్ ఎల్ ఏ రోజా గారు మాట్లాడుతూ “మహిళలకి అవకాశం ఇస్తే ఎంత ఎతైన ఎదుగుతారు దానికి నిదర్శనమే శైలజ చరణ్ రెడ్డి. యూట్యూబ్ ఛానల్, ఓ టి టి సినిమాలు, టి వి ఛానల్ ఇవి అన్ని చాలా రిస్క్ తో కూడుకున్న వ్యాపారాలు, మా శైలజ రెడ్డి గారికి ధెర్యం ఎక్కువ, వారు ఈ రంగం లో కూడా మంచి విజయం సాదించాలి అని వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులని మరింత ఎంటర్టైన్ చేయాలనీ కోరుకున్నారు.
ఎస్ వి కృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ* “ఈ రెడ్డీస్  ముల్టీప్లెక్ నేటి యూత్ కి మంచి వేదిక అవుతుంది. సినిమాలు, యూట్యూబ్ ఛానల్, రియల్ ఎస్టేట్ అని మంచి పద్ధతితో చేస్తున్నారు. మంచి విజయం సాదించాలి అని కోరుకున్నారు.
*శైలజ చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ* “ఈ రెడ్డీస్  ముల్టీప్లెక్ నాకు కొత్తయిన నేను విజయం సాధిస్తానని నమ్మకం నాకుంది. ఈ రెడ్డీస్  ముల్టీప్లెక్ కులానికి కానీ మతానికి కానీ ఏ రాజకీయానికి సంబంధించింది కాదు కానీ రెడ్డి అంటే అందరికి మంచి చేసేవాడు, అందరిని రక్షించేవాడు అని ఈ పేరు పెట్టడం జరిగింది. నేటి యూత్ కి కావాల్సిన అని హంగులు మా యూట్యూబ్ చానెల్స్ లో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ అంటే అందరికి చిన్న చూపు ఉంది కానీ ఇప్పటి శాటిలైట్ చానెల్స్ కన్నా యూట్యూబ్ ఛానల్ ఎక్కువ గా దూసుకుపోతున్నాయి. ఆర్ – ఫ్లెక్స్ (R-Flex OTT ) ఓ టి టి ద్వారా అని భాషల్లో సినిమాలు చేస్తాము. రియల్ ఎస్టేట్ లో పేద వాళ్ళకి సహాయంగా తక్కువ ధరతో అందరికి ఇళ్ళు ఇవ్వాలని ఆశిస్తున్నాము. త్వరలోనే శాటిలైట్ ఛానల్ ని కూడా ప్రారంభిస్తాం” అని తెలిపారు.
*మాజీ ఏం పి మధు యాష్కీ గౌడ్ గారు మాట్లాడుతూ* “రెడ్డీస్  ముల్టీప్లెక్ ప్రారంభించిన శైలజ గారికి, విజయ్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు. వారు ప్రాంరంభించిన ఈ రెడ్డీస్  ముల్టీప్లెక్ లో విజయం సాదించాలి అని యూత్ కి కొత్త వారికీ టాలెంట్ ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు.
*విజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ* “టాలీవుడ్ అనేది ఒక చేపల చెరువు, కానీ ఇప్పుడు ఆన్ లైన్ అనే మహా సముద్రం ఆ చేపల చెరువు ను మిగేసింది. ఇప్పుడు ప్రపంచం అంత యూట్యూబ్ మరియు ఓ టి టి లనే చూస్తుంది. మేము మా చానెల్స్ ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాం. ఎవరి దగ్గరైన మంచి కథ ఉండి డైరెక్షన్ చేయగాలే టాలెంట్ ఉంటె మేము అవకాశం ఇష్టం. రెడ్డీస్  ముల్టీప్లెక్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో కొత్త యూట్యూబ్ చానెల్స్ తో మీముందుకు వస్తున్నాం. అని రంగాల వారికీ అవసరమైన వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి. స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ ఛానల్, మహిళలకి బ్యూటీ ఛానల్, రాజకీయ ప్రియులకి పొలిటికల్ ఛానల్ ఎలా అని రంగాల చానెల్స్ ని మేము మా రెడ్డీస్  ముల్టీప్లెక్ లో సమకూరిస్తాం.

తిరుమలలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం


కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం కైశిక ద్వాదశి ఆస్థానం జ‌రిగింది. తిరుమ‌ల‌లో వ‌ర్షం, ఈదురుగాలుల కార‌ణంగా మాడ వీధుల్లో ఊరేగింపును టిటిడి ర‌ద్దు చేసింది. ఉదయం 4.45 గంటలకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆల‌యంలో ధ్వ‌జ‌స్తంభం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆనంత‌రం స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రాశ‌స్త్యం..
పురాణాల ప్ర‌కారం శ్రీ‌వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…
కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, బోర్డు స‌భ్యులు శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, అద‌నపు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుమల వ‌సంత మండ‌పంలో శ్రీ రాధా దామోద‌ర పూజ


కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శుక్ర‌‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ రాధా దామోద‌ర పూజ ఘనంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ రాధాకృష్ణుల ఉత్స‌వ‌మూర్తుల‌ను వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ రాధ, కృష్ణుడు(దామోద‌రుడు) స‌క‌ల‌సృష్టికి మూల‌కార‌కుల‌ని చెప్పారు. ప్ర‌కృతి స్త్రీ స్వ‌రూప‌మ‌ని, స‌మ‌స్త జీవ‌రాశులు క్షేమంగా ఉండేందుకు రాధా దామోద‌ర పూజను టిటిడి నిర్వ‌హించింద‌ని వివ‌రించారు. స్వామి, అమ్మ‌వారి అనుగ్ర‌హంతో వ్యాధిబాధ‌లు తొల‌గుతాయ‌న్నారు.
ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ రాధాకృష్ణులకు తిరువారాధ‌న చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ద‌నాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి

తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి చక్రతీర్థానికి  చేరుకున్నారు. తిరుమ‌ల‌లో కురుస్తున్న భారీ వర్షాల కార‌ణంగా చ‌క్ర‌తీర్థం ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తుండ‌డంతో ఈ తీర్థానికి అభిషేకం, పుష్ప నివేద‌న‌, హార‌తి స‌మ‌ర్పించారు.  

Thursday, 26 November 2020

మంజీరా నదిలో దూకి ఏఓ ఆత్మహత్య


సంగారెడ్డి: ఆవేశమో..ఆవేదనో ఓ యువ అధికారిణి నిండు ప్రాణం బలి తీసుకుంది. మనూరు మండలం రావిపల్లి బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి అరుణ అనే వ్యవసాయశాఖ అధికారిణి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం అరుణ సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి కారులో వచ్చిన అరుణ బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి బలవన్మరనానికి పాల్పడ్డారు. విషయం అందుకున్న అధికారులు గల్లంతు అయిన అరుణ కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పని వత్తిడి వల్లా ఇలా చేసిందా లేక ఏవరైన బెదిరింపులా..మరేదైన కారణం వుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది..

Wednesday, 25 November 2020

అక్రమణలకు నాకు సంబంధం లేదు : కూరపాటి రంగరాజు

ఖమ్మం, నవంబర్" 25 : TNGOS భూ ఆక్రమణలతో తనకు సంబంధం లేదని తనపై  తప్పుడు కేసులు బనాయించారని టిఎన్జీవో ల మాజీ నాయకులు కూరపాటి రంగరాజ పేర్కొన్నారు. బుధవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశంలో టి ఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో జరిగిన భూ అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొందరు కావాలనే తనపై పై అక్రమ కేసులు బనాయించారని  కూరపాటి రంగరాజు ఆవేధన వ్యక్తం చేశారు.  తన హయo లో ఎలాంటి భూ ఆక్రమణ జరగలేదని 2018లో టీఎన్జీవోస్ నూతన పాలకవర్గం ఏర్పడిందని తనకు సంబంధం లేని విషాయంలో తనను దోషిగా చూడడం సరైంది కాదని ఆయన అన్నారు. సుమారు 8 ఎకరాల భూమి ఆక్రమించారని ఖమ్మం రూరల్, ఖమ్మం టు టౌన్ PC లోని నా పై అక్రమ కేసులు పెట్టాటం జరిగిందని నాపై తగిన విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆయన జిల్లా ఉన్నతాధికారులను కోరారు తన హయంలోనే 1687 మించి సభ్యులు ఉంటే 1570 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించామని అన్నారు నేను 2016లో పదవి విరమణ అప్పుడే డిసెంబర్ లో TNGOS నుంచి కూడా తొలగించారని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు* వీటన్నింటిపై తగిన విచారణ జరిపించి *తనకు న్యాయం చేయాలని విలేకరులను ఉన్నతాధికారులను కూరపాటి రంగరాజు కోరారు*

Monday, 23 November 2020

అల్లూరి సీతారామరాజు అనుచరుడు బాలుదొర@ 111 కన్నుమూత! 1924లో అల్లూరికి సేవలందించిన విప్లవ వీరుని అనుచరుడు... అనారోగ్యంతో కన్నుమూత తుది శ్వాస విడిచిన మన్నెం యోధుడు...


విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు.

తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన వయసు 111 సంవత్సరాలు. వయసు మీదపడిన కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆయన, ఆదివారం నాడు మరణించారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై పోరాటం జరుపుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు.అప్పట్లో తాను ఎత్తయిన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడినని, ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్తను గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వారు నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చి..111యేళ్ల విప్లవ కారునికి తుది విడ్కోలు పలికారు.

Sunday, 22 November 2020

తిరుమలలో కార్తీక శోభ... పార్వేట మండపంలో వనభోజనం.....

                                          
తిరుమల, నవంబరు 22 : తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం కార్తీక వన భోజన మహోత్సవం ఆదివారం తిరుమల పార్వేట మండపంలో వైభవంగా జరిగింది. 
ముందుగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడి పార్వేట మండపంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పార్వేట మండపం వ‌ద్ద‌ మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. శాక్సాఫోన్, డోలు, నాదస్వర వాయిద్య సంగీతం ఆకట్టుకుంది. అనంత‌రం గ‌రుడ వైభ‌వం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ  ప్ర‌తి ఏడాదీ పవిత్రమైన కార్తీకమాసంలో కార్తీక వన భోజన మహోత్సవాన్ని నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. ఇందులో భాగంగా ఈసారి కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కార్య‌క్ర‌మాన్ని 250 మంది భ‌క్తుల‌తో ఏకాంతంగా నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన‌ట్టు చెప్పారు. 
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, బోర్డు స‌భ్యులు శ్రీ ముర‌ళీకృష్ణ‌, ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి‌, శ్రీ నాగరాజ, డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య పేష్కార్ శ్రీ జగన్ మోహనాచార్యులు, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాస్, ఎవిఎస్వోలు శ్రీ గంగ‌రాజు, శ్రీ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

భారీగా రేషన్ బియ్యం పట్టివేత...

ఖమ్మం, నవంబర్' 22 : భారీగా రేషన్ బియ్యం పట్టివేత రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల విలువ చేసే 410 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తల్లాడ  పోలీసులు పట్టుకున్నట్లు వైరా ఏసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. 
ప్రభుత్వం నిరుపేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని  రేషన్ దుకాణాల నుండి  తక్కువ ధరలకు సేకరించి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో సిఐ వసంతకుమార్ , పెట్రొలింగ్ విధులు నిర్వహిస్తున్న తల్లాడ ఎస్సై తిరుపతి రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వై.సాంబశివరావు మరియు సిబ్బందితో  తల్లాడ ప్రధాన రహదారి రెడ్డిగూడెం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.అనుమానాస్పదంగా వెళ్తున్న  ఏపీ 37 TA 66 88, TSO5 UC 2856 గల రెండు లారీలను ఆపి తనిఖీ చేయగా 410 క్వింటాళ్ల రేషన్  బియ్యం ఎలాంటి పత్రాలు లేకుండా  తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారని ఏసీపీ తెలిపారు.  జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్లు తోట రవికుమార్, బిట్రా పుల్లారావు ను అదుపులోకి తీసుకొని విచారించగా ..సేకరించిన రేషన్ బియ్యాన్ని  ఖమ్మం మీదుగా కాకినాడకు  తరలిస్తునట్లు తెలిపారని ఏసీపీ పెర్కొన్నారు.

Saturday, 21 November 2020

చెన్నై విమానాశ్రయం దగ్గర అమిత్ షా కు చేదు అనుభవం..


  
చెన్నై : కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా తమిళనాడు పర్యటనలో అనూహ్య సంఘటన జరిగింది. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌లో వెళ్తూ, జీఎస్‌టీ రోడ్డుకు ఇరువైపులా వేచి ఉన్న బీజేపీ, ఏఐఏడీఎంకే కార్యకర్తలకు అభివాదం చేసేందుకు కారు దిగి, నడుస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు ఆయనపైకి ఓ ప్లకార్డును విసిరాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్లకార్డు ఆయనపై పడకుండా నిరోధించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆగంతకుడు విసిరిన ప్లకార్డుపై గో బ్యాక్ అమిత్ షా అని రాసి ఉంది. ఈ వ్యక్తి చెన్నైకి చెందిన దురైరాజ్ (67) అని పోలీసులు తెలిపారు. 
చెన్నై విమానాశ్రయం బయట ఉన్న జీఎస్‌టీ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ కార్యకర్తలకు అభివాదం చేసేందుకు అమిత్ షా ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి, తన కారు నుంచి దిగి, రోడ్డుపై నడిచారు. దీంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. 
ఇదిలావుండగా, అమిత్ షా రెండు రోజులపాటు తమిళనాడులో పర్యటిస్తారు. 2021లో తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ చర్చలు జరపడంతోపాటు ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు.

వేడుక‌గా వెంక‌న్న పుష్ప‌యాగం.

తిరుమల, 21-11-2020 : పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌ని‌వారం పుష్పయాగ మహోత్సవం శోభాయ‌మానంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.@ సత్యన్యూస్

సోనూసూద్ కు భరణిచే ఆత్మీయ సత్కారం.

 

హైదరాబాద్ : నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలసకార్మికులకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారిని ఆయన ఆదుకుంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా సోనూసూద్ ను ప్రజలు కొనియాడుతున్నారు.

ఈ క్రమంలోనే  ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సోనూసూద్ ను ఆచార్య సినిమా సెట్స్లో సన్మానించారు. వలసకార్మికలకు ఆయన చేసిన సాయాన్ని తనికెళ్ల భరణి కొనియాడారు. తనికెళ్ల భరణి సోనూసూద్ తో పాటు దర్శకుడు కొరటాల శివను సైతం సన్మానించారు.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టిస్తోన్న అల్లుడు అదుర్స్ సెట్స్ లో సినిమా యూనిట్ సోనూసూద్ ను ఘనంగా సన్మానించింది.*

Tuesday, 17 November 2020

చంద్రప్రభా వాహనం పై ధనలక్ష్మి అలంకారంలో పద్మావతి అమ్మవారు

తిరుపతి/తిరుఛానూర్, 17-11-2020 :
చంద్రప్రభ వాహనంపై ధనలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు 
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి  అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు,  జెఈవో శ్రీ‌ పి.బ‌పంత్‌కుమార్ దంప‌తులు, సివిఎస్వో శ్రీ  గోపీనాథ్ జెట్టి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి , సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి , విఎస్వో శ్రీ బాలిరెడ్డి‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాసులు, అలంకార భట్టార్ శ్రీ ఎం.జి.రామచంద్రన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
న‌వంబ‌రు 19న పంచమీ తీర్థం :
నవంబరు 19వ తేదీ గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం) సందర్భంగా ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉద‌యం 10 నుండి మధాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా నిర్వహించనున్నారు.

సూర్యప్రభ వాహనంపై శోభిల్లిన శ్రీవారి దేవేరి


శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం అమ్మవారు శ్రీ శ్రీనివాసమూర్తి అలంకారంలోని సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌పంత్‌కుమార్‌ దంపతులు, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, విఎస్వో శ్రీ బాలిరెడ్డి‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Monday, 16 November 2020

గ‌రుడ‌ వాహ‌నంపై శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుప‌తి‌, 2020 న‌వంబ‌రు 16 :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ  రోజైన సోమ‌వారం రాత్రి విశేషమైన గ‌రుడ‌ వాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారు  దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. గరుత్మంతుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తున్నారు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది. వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  జెఈవో శ్రీ పి.బ‌పంత్‌కుమార్‌ దంపతులు, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ బాలిరెడ్డి‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.  

శబరిమలైలో సమాచారకేంధ్రంప్రారంభించిన ప్రముఖులు. (పుణ్యం పూంకవనం 2020-2021 ప్రారంభోత్సవం)

 
 16 నవంబర్ 2020 : శబరిమల సున్నిధనం వద్ద తాంత్రి బ్రహ్మాస్రీ కందారు రాజీవరు పట్టణంధిట్ట ఎస్పీ తో కలసి శబరి మలై సన్నిధిలో  పునరుద్ధరించిన వెబ్‌సైట్‌ను శ్రీ ప్రారంభించారు. కార్యక్రమంలోఎన్ వాసు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు. ఎస్.పి. . పి విజయన్ ఐపిఎస్, ఐజిపి-కేరళ పోలీసు ప్రధాన కార్యాలయం. .   లోక్‌నాథ్ బెహెరా ఐపిఎస్, డిజిపి & స్టేట్ పోలీస్ చీఫ్ , జస్టిస్ గోపీనాథ్.  కేరళ హైకోర్టు.న్యాయమూర్తి, 
 శ్రీజిత్ ఐపిఎస్, ఐజిపి-క్రైమ్ బ్రాంచ్, శబరిమల  యొక్క మెల్సంతి. జయరాజ్ నంపూతిరి, శ్రీ. ఓం మనోజ్, శ్రీమతి. సంత షీలా నాయర్ ఐఎఎస్ (రిటైర్డ్), సన్నిధనం పోలీస్ స్పెషల్ ఆఫీసర్ . బి. కృష్ణ కుమార్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రముఖులు & పాల్గొనగా మరికొందరు వర్ఛువల్ పద్దతిలో ఆన్‌లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎస్.పి పర్యవేక్షణలో శబరిమల, పంబా పరివాహక ప్రాంతాలను శుభ్రం చేసి వ్యర్థాలను ఏరివేశారు.

భక్తి శ్రద్దలతో శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు..

తిరుపతి, 16-11-2020 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమ‌వారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు ఆల‌యంలో జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదుకలను మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీ. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంతప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నార‌ని పురాణాల ఐతిహ్యం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

సకటాసుర వధ అలంకారంలో కత్తి - డాలు చేబూని దర్శనం ఇచ్ఛిన పద్మావతి అమ్మ..

తిరుపతి, 16-11-2020 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై సకటాసుర వధ అలంకారంలో కనువిందు చేశారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ.  సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sunday, 15 November 2020

తిరుఛానూర్ బ్రహ్మోత్సవాలలో వసంతోత్సవ వేడుక..


 శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆదివారం సాయంత్రం వసంతోత్సవం ఏకాంతంగా జరిగింది. కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు. వసంతోత్సవంలో పాల్గొన్న తరువాత అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి దంపతులు, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, అర్చకులు శ్రీ బాబుస్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుచానూరుకు చేరిన‌ తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారం.


తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆది, సోమ‌వారాల్లో జ‌రుగ‌నున్న గ‌జ, గ‌రుడ వాహ‌న‌సేవ‌ల్లో అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని ఆదివారం ఉద‌యం తిరుచానూరుకు తీసుకొచ్చారు
ముందుగా తిరుమ‌లలో శ్రీవారి ఆల‌యం నుండి ఈ హారాన్ని వైభ‌వోత్స‌వ మండ‌పానికి తీసుకొచ్చారు. తిరుమ‌ల‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం అక్క‌డి నుండి వాహ‌నంలో భ‌ద్ర‌త నడుమ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి తీసుకొచ్చారు. తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్‌కు అంద‌జేశారు. అక్క‌డ హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఆల‌యంలోకి తీసుకెళ్లారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లారు.
 ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వోలు శ్రీ గంగ‌రాజు, శ్రీ చిరంజీవి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Saturday, 14 November 2020

కోదండరామునిగా శ్రీవారి దెవేరి...


శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం రాత్రి హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో అమ్మవారు  దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.