హైదరాబాద్ : నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలసకార్మికులకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారిని ఆయన ఆదుకుంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా సోనూసూద్ ను ప్రజలు కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సోనూసూద్ ను ఆచార్య సినిమా సెట్స్లో సన్మానించారు. వలసకార్మికలకు ఆయన చేసిన సాయాన్ని తనికెళ్ల భరణి కొనియాడారు. తనికెళ్ల భరణి సోనూసూద్ తో పాటు దర్శకుడు కొరటాల శివను సైతం సన్మానించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న అల్లుడు అదుర్స్ సెట్స్ లో సినిమా యూనిట్ సోనూసూద్ ను ఘనంగా సన్మానించింది.*
No comments:
Post a Comment