.
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆదివారం సాయంత్రం వసంతోత్సవం ఏకాంతంగా జరిగింది. కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు. వసంతోత్సవంలో పాల్గొన్న తరువాత అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి దంపతులు, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, అర్చకులు శ్రీ బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment