హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వివిధ కేసుల్లో పట్టుబడిన Abandoned & Unclaimed వాహనాలను ఇప్పటి వరకు 13 విడతల్లో వేలం వేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అన్నారు.ఈ 13 విడతల్లో మొత్తంగా 12000 వాహనాలకు గాను వేలం నిర్వహించామన్నారు. వాహనాలను వేలం వేయడం ద్వారా సుమారు రూ.6 కోట్ల 75 లక్షలు సమకురాయన్నారు.సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో సుమారు 5750 వాహనాలకు సంబంధించి మూడు నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. త్వరలో వాటిని కూడా వేలం నిర్వహిస్తామని సీపీ తెలిపారు.సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో మరో 4500 లకు పైగా Abandoned & Unclaimed వాహనాలు లా & ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఉన్నాయని, వాటికి సంబంధించిన నోటీసులు కూడా త్వరలో జారీ చేస్తామన్నారు.వాహనాలకు సంబంధించిన వివరాలను అన్నిwww.cyberabadpolice.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచామన్నారు.అభ్యంతరాలు ఉన్న వాహన యజమానులు ఆరు నెలల కాల పరిమితిలోపు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను సంప్రదించాలని సూచించారు. వివరాలకు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ MTO-2, N.Veeralingam గారిని Cell No: 9490617317 కు సంప్రదించాలన్నారు.
No comments:
Post a Comment