ప్లాస్టిక్ విస్తళ్ళకూ ప్లాస్టిక్ సంచూలకూ ప్లాస్టిక్ గ్లాసులకూ ప్రత్యామ్నాయాలు లేనే లేవు. అని మనతో ఎందరో చెప్తూ వుంటారు. అవి నమ్మి మనం కూడా అది నిజమే అనుకుంటాం. నిజానికి ఎన్నో అద్భుతమైన ప్రత్యామ్నాయాలు వున్నాయ్.
ఇలా మనమంతా ఆకుల్ని నిజంగానే వాడడం మొదలైతే చెట్లు వాటంతట అవే ఈ భూమిపై పెరుగుతాయి పచ్చదనం దానంతట అదే పరుచుకుంటుంది.
అడుగడుగునా ఉన్న పొల్యూషన్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఆక్సిజన్ శాతం పెరగడం మళ్ళీ మొదలౌతుంది.
ఆకుల్లో ముదురాకులే వాడుకోవాలి కనక మరీ లేత ఆకులు చిరిగిపోతాయి కనక
బాదమాకులు, అరిటాకులు, టేకు ఆకులు, తామరాకులు, కొబ్బరాకులు, తాటాకులు, ఈతాకులు, అడ్డాకులు, మట్టి పిడతలు ఇవి కాక అడ్డాకుల కాఫీ కప్పులు, టీ కప్పులు, వేడి వేది బాదం పాలకు,సేమ్యా పాయసాలకు టీ కాఫీలకూ పనికొచ్చేట్టు తయారు చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు ప్రతి చోటా ఇవే వాడేవాళ్ళు చివరికి మా అడవుల్లో కూడా..
మా అమ్మమ్మగారు అన్నం, పొంగల్, ఉప్మా లాంటివి ఊరువెళ్ళేటప్పుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక విస్తరాకు అందులో అన్నం అందుకు తగ్గట్టు పులుసూ/ సాంబారు అన్నం వేసి పేపర్తో కట్టి ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా పులుసు సాంబారు లు వద్దు అనుకున్న వారికి ఇస్తరాకు అందులో అన్నం పెట్టి ఒకవైపు పప్పు మరొకవైపు కూర ఇంకోవైపు పచ్చడి వెసి కట్టి ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు వాటిని తయారు చేసేందుకు మిషన్లు కూడా వున్నాయ్. మరొక అద్భుతమైన పరిశ్రమ పర్యావరణ పరిరక్షణతో పాటు. ప్లాస్టిక్ కి నో చెప్పేద్దాం మనమంతా కలిసి. ఏ పెళ్ళికైనా పండగకైనా అరటాకులు లేదా అడ్డాకుల విస్తళ్ళు లేదా బాదమాకులు హాయిగా వాడుకోవచ్చు. రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. నిజానికి బాదమాకులలో ఉప్మా ఇడ్లీలు తింటే దాంటో రుచి ఇంకెక్కడా లేదూ.. రాదూ... - మన ప్రకృతిని మన జీవరాశిని మనం కాక ఎవరు రక్షించుకునేది. అన్నింటికీ నోరుపెట్టుకుని జనమం మీద పడిపోయే మనం ఈ విషయంలో గొంతెత్తి చెప్పలేమా??? ఇంత చిన్న విషయం చెప్పడానికి కూడా మొహమాట పడిపోతే ఇంక మనమెందుకు మన బతుకెందుకు నొరుమూసుకుని ఓ మూల సన్నాసుల్లా పడి వుండడానికా ???!!!!- గౌతమ్ కశ్యప్
No comments:
Post a Comment