ఖమ్మం సెప్టెంబరు,04 : ‘‘గ్రీవెన్స్ డే’’లో సమర్పించిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడు గ్రామానికి చెందిన బండారు అనురాధ తాను రాజులదేవర పాడు అంగన్‌వాడీ సెంటర్`2 నందు అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోగా హెల్పర్‌గా సెలక్ట్ చేయడం జరిగినదని కాని ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదని, తనకు ఆర్డర్ ఇప్పించి న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా సంక్షేమ శాఖాధికారిని ఆదేశించారు. తిరుమలాయపాలెం మందలం బచ్చోడ గ్రామంకు చెందిన ఎన్.రేణుక 20 సంవత్సరాల క్రితం తన భర్త చనిపోవడం జరిగినదని, తనకు ఇంటి స్థలం కాని, ఇళ్లుకాని లేవని తనకు ఒక కుమార్తెయని, తనకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం కలెక్టరేట్ డబుల్ బెడ్‌రూమ్ విభాగం పర్యవేక్షకులను ఆదేశించారు. చింతకాని మండలం నేరడ గ్రామంకు చెందిన షేక్ జరీనా 2 సంవత్సరాల క్రితం తన భర్త చనిపోవడం జరిగినదని తనకు ఎలాంటి ఆదెరువు లేదని, వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకోవడం జరిగినదని, వితంతు పింఛను ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. చింతకాని మండలం నాగిలిగొండ గ్రామానికి చెందిన చాట్ల వాసుదేవరావు తాను డిగ్రి వరకు చదువుకోవడం జరిగినదని, దళితబంధు సర్వే సమయంలో తాను హైద్రాబాదులో ఉండటం జరిగినదని సమాచారం లేక పోవడంతో తాను దళితబంధు పథకంకు దరఖాస్తు చేసుకోలేక పోయినానని తనకు దళితబంధు పథకం మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఎస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. వైరా మండలం రెబ్బవరం గ్రామంకు చెందిన దారా నాగమని, భర్త జానుకోటి తాము ఎపిజివిబి రెబ్బవరం బ్యాంకులో వ్యవసాయ అవసరాల నిమిత్తం రూ.80, వేలు ఋణం తీసుకోవడం జరిగినదని, ప్రభుత్వం కల్పించిన రుణమాపీ పథకంలో తన పేరు లేదని, అట్టి రుణమాపీ వర్తింప చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఎల్‌డిఎం, వైరా తహశీల్దారును ఆదేశించారు. కంచికచర్లకు చెందిన కొమ్మురి లక్ష్మీ, భర్త భాస్కరరావు తమకు దెందుకూరు గ్రామం నందు సర్వే నెం.40/ఐ లో 1.9 ఎకరం తొమ్మిది కుంటల భూమి కలదని, కొత్త పాసుపుస్తకము నందు అట్టి భూమి తమ ప్రమేయం లేకుండా విభజించబడి 40/ఐ, 40/ఐ2 లుగా వేరొకరిపై నమోదు చేయడం జరిగినదని అట్టి భూమికి సంబంధించిన ప్రతులను సమర్పించు చున్నామని వాటిని పరిశీలించి తమకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం వైరా తహశీల్దారును ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంకు చెందిన వేమిరెడ్డి రంగారెడ్డి తనకు వారసత్వంగా చొప్పకట్లపాలెం గ్రామ రెవెన్యూలో సర్వేనెం.111/అలో ఒక ఎకరము భూమి కలదని , అట్టి భూమిని ధరణిలో దరఖాస్తు చేసుకోవడం జరిగినదని, పాసు పుస్తకము ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ధరణి విభాగం పర్యవేక్షకులను కలెక్టర్ ఆదేశించారు.
‘‘గ్రీవెన్స్ డే’’లో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment