తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ దర్శించుకున్నారు. కుమార్తె సుహానాఖాన్, భార్య గౌరీ ఖాన్, నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల ఏడో తేదీన షారుఖ్ నటించిన ‘జవాన్’ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. గతంలో అమీర్ ఖాన్ సినిమాకు వ్యతిరేకంగా హిందూ వర్గాలు నిర్ణయం తీసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన నేపథ్యంలో జవాన్ సినిమా విడుదల సందర్భంగా షారుక్ ఖాన్ తిరుమల సందర్శన హిందూ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది
No comments:
Post a Comment