Thursday, 30 November 2023

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా గోపూజ... Gopuja held in Vasantha Mandapam....

తిరుమల: కార్తీక మాసంలో టీటీడీ త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధ‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో గోపూజ‌ శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఉద‌యం 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు జ‌రిగింది. ముందుగా రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారిని వ‌సంత మండ‌పంలో కొలువుతీర్చారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గోపూజ ముక్కోటి దేవతల పూజాఫలంతో సమానమని అన్నారు. ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత స్వామి, అమ్మ‌వార్ల‌కు తిరువారాధ‌న చేశారు. అనంతరం ఆవు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. గోప్ర‌ద‌క్షిణ చేశారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.
Tirumala, As part of the Vishnu Pujas organized by TTD in the month of Kartika, Gopuja was held at Tirumala Vasanta Mandapam on Wednesday that was telecated live by SVBC for the sake of global devotees.  
Initially, Sri Venugopala Swamy along with Rukmini and Satyabhama were seated them in Vasanta Mandapam.  On this occasion, Sri Mohana Rangacharyulu,  Vaikhanasa Agama Advisor said that cow is very important in Hindu Sanatana Dharma and Gopuja is equal to the worship of the three crore deities mentioned in  ancient sacred texts.
Later Go Puja was performed to a cow and calf.


Wednesday, 29 November 2023

*తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం: ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్*



హైద‌రాబాద్:తెలంగాణఅసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం మొదలైందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు.ప్ర‌చార ఘ‌ట్టం ముగిసిన అనంతరం మీడియాతో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 13 నియోజకవర్గాల పరిధిలో నాలుగు గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెంట్ పీరియడ్ ప్రారంభమైందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధ మైందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియ మావళి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ప్రచార గడువు ముగి యడంతో సోషల్‌ మీడియా లోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని తెలిపారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడి యాలో అవకాశ ముందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని పేర్కొన్నారు. ఇక పోలింగ్ రోజున అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌ల‌కు సెల‌వు ఇవ్వాల‌ని ఆదేశించారు.టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండ కూడదు. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధం. ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయట కూడా వెబ్‌ కాస్టింగ్‌. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.పోలింగ్‌ కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిషేధం. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.737 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం అని వికాస్‌రాజ్‌ వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా 19,375 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాజ్ రాజ్ చెప్పారు. బుధవారం సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారం నిలిపే యాలని స్పష్టం చేశారు. రేపు ఎన్నికల సిబ్బంది సామగ్రి పంపిణి చేస్తాం అని వికాస్ రాజ్ చెప్పారు. పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయో గించుకుంటున్నారని అన్నారు.
ఇక వివిధ పార్టీల పోలింగ్ ఏజంట్లు ఉదయం 5.30 గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. నియో జ‌క‌వ‌ర్గాల‌లో నాన్ లోకల్ లీడ‌ర్స్ అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని కోరారు...

Tuesday, 28 November 2023

*పార్టీ బూత్ ఏజెంట్లకు ముఖ్య గమనిక.*



ఈ నేల 30 వ తేదీన తెలంగాణ  శాసనసభకు జరిగే ఎన్నికలలో ఈవీఎం లు పూర్తి గా చెక్ చేసుకోవాల్సిన అవసరం పార్టీ బూత్ ఏజెంట్ల పైన ఉంది.
*బూత్ ఏజెంట్లు చేయవలసిన పనులు.*
👉🏿 ఎలక్షన్ కి ఒక రోజు ముందు అనగా 29 న సాయంత్రం 5 గంటలకు పోలింగ్ బూత్ కి వెళ్లి ఎన్నికల ప్రెసిడింగ్ ఆఫీసర్ ని కలిసి ఏజెంట్ పాస్ తీసుకోవాలి.
👉🏿 30 వ తేదీన 7 గంటలకు  పోలింగ్  మొదలు అవుతుంది . మన బూత్ ఏజెంట్లు  6 గంటలకే పోలింగ్ స్టేషన్ కి వెళ్లి మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎం టెస్ట్ చేసుకోవాలి.
👉🏿 మాక్ పోలింగ్ ద్వారా కనీసం 100 ఓట్లు వేసి తరువాత రిజల్ట్ చెక్ చేయాలి.
👉🏿 రిజల్ట్ చెక్ చేసిన తరువాత  ఈవీఎం లను క్లీన్ చేయాలి. అన్ని పార్టీల ఓట్లను సున్నా చేసి పోలింగ్ మొదలయియేట్లు చూసుకోవాలి. 
👉🏿 ఇవ్వన్నీ అయిన తరువతనే పోలింగ్ స్టార్ట్ చేయాలి.
👉🏿 ప్రతి పోలింగ్ బూత్ కి ఇద్దరు ఏజెంట్లు ఉండాలి. ఒకరు రిలీవింగ్ ఏజెంట్ గా ఉంటారు.
👉🏿 ఏజెంట్ టీ కానీ, భోజనానికి వెళ్ళినప్పుడు రిలీవింగ్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్ గా ఉండాలి.
👉🏿 ప్రతి గంటకి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో చెక్ చేయాలి.
👉🏿 పోలింగ్ పూర్తి అయిన తరువాత ఈవీఎం సీల్ చేసి బాక్స్ లో భద్రపరిచే వరకు ఉండి పోలింగ్ ఆఫిసర్ దగ్గర ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో నిర్ధారించుకుని ….
అధికారికంగా ప్రెసిడింగ్ ఆఫీసర్ సంతకం చేసిన ఫారం-17 ఖచ్చితంగా తీసుకోవాలి. 
రిసిప్ట్ తీసుకోవాలి.

మెకానిక్ మహిళలు...


కేరళ : మేమూ ఏదైనా చేయగలమని నిరూపిస్తున్నారీ తరం అమ్మాయిలు. అలాంటివాళ్లే వీళ్లూ. కేరళలో తొలి విమెన్‌ మెకానిక్‌ వర్క్‌షాప్‌ను ప్రారంభించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఈ ‘వనిత’ వర్క్‌షాప్‌ని ప్రారంభించింది బిన్సి, మెర్సి, బింటు అనే ముగ్గురు యువతులు. వీరిది కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలోని వెస్ట్‌ ఎలేరి అనే చిన్న గ్రామం. పల్లెటూరి అమ్మాయిలం అవకాశాల్లేవంటూ కూర్చోలేదు వీళ్లు. తమ కాళ్లపై తాము నిలబడేలా ఏం చేయగలమా అని ఆలోచించారు. ‘రీబిల్డ్‌ కేరళ’ పేరుతో ఆ రాష్ట్రం మహిళలకు ఉపాధి మార్గాలు చూపిస్తోంది. వాళ్లు ప్రవేశపెట్టిన ‘కుడుంబశ్రీ’ ఇప్పటికే విజయం సాధించింది. ఆ ఉత్సాహంతోనే ప్రభుత్వం మరిన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలనుకుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొన్న ఈ ముగ్గురూ వాహనాల రిపేరింగ్‌లో ఆసక్తి చూపారు. శిక్షణ తీసుకొని సొంతంగా టూవీలర్‌ వర్క్‌షాప్‌ ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే తమ పనితనంతో అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో తమ బైక్స్‌ను రిపేరు చేయించుకునేందుకు చాలామంది వాహనదారులు వీరి దగ్గరకు వస్తున్నారు. అలా వీరితోపాటు మరో ముగ్గురు మహిళలకూ ఉపాధి కల్పిస్తున్నారు. ‘ప్రస్తుతానికి టూవీలర్లపైనే దృష్టిపెట్టాం. భవిష్యత్తులో ఆటోలు, కార్లనూ రిపేరు చేస్తాం. అమ్మాయిలు అన్ని పనులూ చేయగలరు. శిక్షణిచ్చేవారే అరుదు. అందుకే ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ కూడా ఇవ్వాలనుకుంటున్నాం’ అంటున్నారీ నారీమణులు.

Monday, 27 November 2023

29-30 తేదీలు ప్రకటనలకు MCMC నుండి ముందస్తు ధ్రువీకరణ పొందండి: జిల్లా ఎన్నికల అధికారి

*పోలింగ్ రోజు, పోలింగ్ రోజుకు ఒక రోజు ముందు ప్రింట్ మీడియాలో రాజకీయ పార్టీల ప్రకటనలకు  జిల్లాస్థాయి MCMC నుండి ముందస్తు ధ్రువీకరణ పొందాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్ తెలిపారు.నవంబర్ 29, 30న పత్రికలలో  ఎన్నికలకు సంబంధించిన  ప్రకటనల జారీ కోసం ముందస్తుగా జిల్లా కేంద్రంలోని ఎం.సి.ఎం.సి. కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి.గౌతమ్  తెలిపారు. 
ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం  పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి అనగా నవంబర్ 28 సాయంత్రం 4 గంటల నుంచి  సైలెన్స్ పీరియడ్ పాటించాలని, సైలెన్స్ పిరియడ్ లో ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాల సర్వే వివరాలను వెల్లడించడం, పత్రికల్లో ప్రచురించడం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం నిషేధించినందున, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

*తెలంగాణలో పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి**ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్*


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవిఎం ల పరీశీలన పూర్తి అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు.ఆదివారం సాయంత్రం సిఇఒ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ.. పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు వేగంగా చేస్తున్న ట్లు చెప్పారు.1.68లక్షల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామని, 26,660 హో మ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.45 లక్ష ల మందికి ఎపిక్ కార్డుల ప్రింటింగ్ పూర్తి చేసి బీఎల్‌ఓ ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. 2290 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎన్నికల విధులు 2.5 లక్షల ఉద్యోగులు నిర్వహి స్తున్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల బందోబస్తుకు రాష్ట్రానికి చెందిన 45 వేల మంది పోలీసులు, 23,500 హోమ్ గార్డ్ లు ఇతర రాష్ట్రాల నుంచి వస్తు న్నారని వెల్లడించారు.3వేల మంది ఎక్సైజ్ పోలీసులు, 50 వేల మంది రిజర్వ్ పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు. వీటితో పాటు కేంద్ర బలగాలు విధుల్లో ఉంటాయని, ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.ప్రతి పోలింగ్‌స్టేషన్‌లో వీల్ ఛైర్స్ అందుబాటులో ఉంటా యన్నారు. బ్రెయిలీలో కూ డా 40 వేల బ్యాలెట్ ప్రింటింగ్ చేశామన్నారు. 190 కేంద్ర కంపెనీల బలగాలు తెలంగాణలో విధుల్లో ఉండనున్నాయ న్నారు. సోమవారం రాత్రి వరకు 74 వివిధ పోలీస్ కేంద్ర బలగాలు తెలంగాణకి రానున్నాయని చెప్పారు.రాష్ట్రంలో పోలింగ్‌కి 48 గంటల ముందు 144 సెక్షన్ ఉంటుందని.. ఎవరూ ప్రచారాలు, డోర్ డోర్ టు ప్రచారం చేయవద్దని హెచ్చరించారు.వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్ళు స్వస్ధలాలకు వెళ్లాలన్నారు. ఈసీ ఇచ్చిన నోటీసులకు కేటీఆర్‌ను వివరణ కోరామని ఇంకా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని స్పష్టం చేశారు.బిఆర్‌ఎస్ నాయకులు ఇతర పార్టీ నాయకులపై ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, కొన్నింటికి పరిశీలన సంబంధిత నాయకులకు నోటీసులు పంపించినట్లు తెలిపారు..

తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం....


KARTHIKA JWALA TORANAM HELD
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం కృత్తికా 
దీపోత్సవం జరిగింది. సాయంత్రం గర్భాలయంలో, ఆ తరువాత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు. 
TIRUPATI, As a part of the auspicious Karthika Deepam, the ceremonious Jwala Toranam was observed with religious fervor in Sri Kapileswara Swamy temple in Tirupati on Sunday evening.
The Shiva Lingam and Thrishoolam arranged at Unjal Mandapam stood as a cynosure to devotees on the occasion.
Scores of devotees thronged and lit lamps every where in and around the temple premises.

Sunday, 26 November 2023

సరిహద్దుల్లో పారాహుషార్... ప్రాణహిత పరివాహక ప్రాంతం లో డ్రోన్ తో ప్రత్యేక నిఘా...

*తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు, ప్రాణహిత పరివాహక ప్రాంతం లో డ్రోన్ తో ప్రత్యేక నిఘా...*
*"డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్ "* ప్రారంభించిన సీపీ 
 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  ఎన్నికలు జరిగే విధంగా ముందస్తు చర్యల్లో యాంటీ ఎక్స్మిస్ట్ ఆపరేషన్స్ లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమీషనరెట్ మంచిర్యాల జోన్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమనపల్లి ఫెర్రీ పాయింట్ వద్ద *"డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్"*  రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ (డిఐజి ) , మంచిర్యాల డిసిపి సుదీర్ కేకెన్ ఐపీఎస్.,  మనోజ్ ఐపిఎస్., ఇతర పోలీసు అధికారులతో ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ..యాంటీ ఎక్సమిస్ట్స్ ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘా లో భాగంగా మావోయిస్టుల కదలికలు, వారు ఏదైనా సంఘటనలకు పాల్పడే సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం కోసం సాంకేతిక పరిజ్ఞానం ను  ఉపయోగించి డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్ ను ఏర్పాటు కోసం కాన్స్టేబుల్ సిబ్బంది కి ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈరోజు నుండి ఎన్నికలు పూర్తి అయ్యేవరకు డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అని ఈ ప్రాంతం లో ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంత ప్రజలకు ఒక సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం లో ప్రజలు తమ  అమూల్యమైన ఓటు ను స్వేచ్ఛ వాతావరణం లో వినియోగించు కోనేలా చూడవలసిన బాధ్యత పోలీస్ శాఖ పై ఉంది దానిలో భాగంగా పెట్రోలింగ్ యూనిట్ ను ప్రారంభించడం జరిగింది సీపీ గారు తెలిపారు.  మంచిర్యాల జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గలకి సంబంధించిన ముఖ్యంగా ఈప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ లొకేషన్స్ లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. భారత ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ మేరకు ఈ పోలింగ్ స్టేషన్స్ లో మూడంచల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్ర బలగాలు CRPF, CISF, జార్ఖండ్ ఆర్మూర్ బెటాలియన్ వారు కమీషనరేట్ కు రావడం జరిగింది. వారిని ఎన్నికల విధుల్లో  వినియోగించడం జరుగుతుంది. ఎన్నికల లో స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, QRT టీమ్స్, SST టీమ్స్, FST టీమ్స్, ఎంసీసీ టీమ్స్ చాలా యాక్టివ్ గా పని చేయడం జరుగుతుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో  ఎన్నికలు ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో *ఇన్సిడెంట్ ఫ్రీ* ఎన్నికలు జరిగే విధంగా పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ మోహన్, చెన్నూర్ రూరల్ సీఐ విద్య సాగర్,NIB ఇన్స్పెక్టర్ మంగీలాల్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, కోటపల్లి ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేయండి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్


ఖమ్మం, నవంబర్ 26: పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఆదివారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, ఏఎస్డి జాబితా, మార్కెడ్ కాపీ ల తయారు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ల కొరకు ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రక్రియ పూర్తికి అధికారులకు, కలెక్టర్ సూచనలు చేశారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, కలెక్టరేట్ ఏవో అరుణ, పర్యవేక్షకులు మదన్ గోపాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 25 November 2023

తెలంగాణ ఏజెన్సీలో కేంద్ర బలగాలు...


 భద్రాచలం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమవుతున్నారు.తెలంగాణ లో ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు అధికారులు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. చర్ల, దమ్ముగూడెం మండలాల్లోని పోలింగ్ స్టేషన్లను కేంద్ర బలగాలు, పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నాయి.పోలింగ్ స్టేషన్లలో బాంబ్ స్క్వాడ్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావితం ప్రాంతం కావడంతో ఈ ఏరియాలో అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసు కుంటున్నారు. ..

ప్రవర్తన మీరితే కఠిన చర్యలు : కలెక్టర్ వి.పి.గౌతమ్


ఖమ్మం, నవంబర్ 25: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ హెచ్చరించారు. కలెక్టర్ శుక్రవారం అర్ధరాత్రి స్వయంగా నగరంలో విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నయాబజార్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, సారధినగర్, గొల్లబజార్, గాంధీచౌక్, చర్చి కాంపౌండ్, తుమ్మలగడ్డ, నిజాంపేట, జడ్పిసెంటర్ లలో అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. శుక్రవారం నగరంలో 3 ఎఫ్ఐఆర్ లు నమోదుచేసినట్లు ఆయన అన్నారు. నగరంలోని కొత్తగూడెం ప్రాంతం ఆర్య కలర్ జిరాక్స్ సెంటర్ వద్ద బిఆర్ఎస్ కార్యకర్త ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పట్టుకొని, ఖానాపురం హావేలి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన అన్నారు. కస్బా బజార్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త రూ. 27,900 లు, ఓటర్ స్లిప్పులతో పంపిణీకి ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పట్టుకొని ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్ ఎదురుగా పోలీస్ తనిఖీల్లో మహబూబాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరకు ఓటర్లకు పంపిణీకి తరలిస్తున్న రూ. 8 లక్షల 70 వేలను సీజ్ చేసి 1 టౌన్ లో, కాంగ్రెస్ కార్యకర్తలపై ఖమ్మం 1 టౌన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 ఎంసిసి టీములు, 17 ఎస్ఎస్టీ టీములు, 20 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు ఏర్పాటుచేసి 24/7 నిరంతర నిఘా పెట్టినట్లు, 12 ఇంట్రాస్టేట్, 6 ఇంట్రాడిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటుచేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అక్రమ నగదు, మద్యం తరలింపుపై ఉక్కుపాదం మోపుతామని ఆయన అన్నారు. సి విజిల్ యాప్ పై ఓటర్లలో, యువతలో అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. ఎన్నికల అక్రమాలు దృష్టికి వస్తే, సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, సి విజిల్ ఎస్పీ ద్వారా ఫిర్యాదుచేస్తే, నిఘా టీమ్ 20 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటుందని, ఫిర్యాదుదారు వివరాలు బహిర్గతం కావని, 100 నిమిషాల లోపు ఫిర్యాదుపై చర్యలు పూర్తవుతాయని కలెక్టర్ అన్నారు. ఓటర్లు డబ్బు, మద్యం, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, దీనిని నోటుకు అమ్ముకోవద్దని, నైతికతతో ఓటువేసి, సామాజిక బాధ్యత గుర్తెరుగాలని కలెక్టర్ తెలిపారు.

*#నూతన వివిప్యాట్ గోడౌన్ ప్రారంభం#...*
ఖమ్మం, నవంబర్ 25: నూతన కలెక్టరేట్ ఆవరణలో రూ. 278 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇవిఎం, వివిప్యాట్ గోడౌన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ శనివారం ప్రారంభించారు. ఇవిఎం ల భద్రతా అవసరాలు, ఇవిఎం ల ఫస్ట్ లెవల్ చెకప్ తదితర ఆవసరాలకు నూతన గోడౌన్ ను ఉపయోగించనున్నటు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల అనంతరం 5  నియోజకవర్గాల ఇవిఎం లు భద్రపర్చనున్నట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా గోడౌన్ అంతా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, జెఇ విశ్వనాథ్, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Friday, 24 November 2023

కైశిఖ ద్వాదశి... మాడ వీధుల్లో శ్రీ‌దేవి,భూదేవి. స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ద‌ర్శ‌నం


కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం 4.45 నుండి 5.45 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత 
శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 6 నుండి ఉదయం 7.30 గంట‌ల‌ వరకు స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రాశ‌స్త్యం.. పురాణాల ప్ర‌కారం శ్రీ వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.
నంబ‌దువాన్ క‌థ‌...కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

Thursday, 23 November 2023

భక్తులకు శ్రీనివాస దివ్యానుగ్రహం... అలిపిరిలో ఉప్పొంగిన ఆధ్యాత్మిక చైతన్యం..

లోక కళ్యాణార్థం భవిష్యత్తులో టీటీడీ మరిన్ని  భక్తి చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.  అలిపిరి సమీపంలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో గురువారం ఉదయం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తరతరాలుగా సనాతన హైందవ సంస్కృతిలో హోమానికి విశేష ప్రాధాన్యత ఉందన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో  శ్రీవారి పాదపద్మముల వద్ద ఈ హోమ కార్యక్రమాన్ని శాశ్వతంగా  నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల కోరికలను భగవంతునికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు. ఎంతో ఖర్చు, శ్రమ తో కూడిన హోమ కార్యక్రమాన్ని భక్తుల కోసం తక్కువ ఖర్చుతో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.సప్త గో ప్రదక్షిణ మందిరం నందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హోమ వేదిక వద్ద ప్రతిరోజు 100 మంది గృహస్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆన్లైన్లో డిసెంబర్ 31వ తేదీ వరకు హోమం టికెట్లు బుక్ అయ్యాయని తెలిపారు. భక్తులు వర్చువల్ గా కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. దాత సహకారంతో త్వరలో దాదాపు 500 మంది గృహస్తులు కూర్చుని ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనేలా వేదికను నిర్మించనున్నట్లు చైర్మన్ తెలిపారు. భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు, భక్తుల చెంతకు భగవంతుణ్ణి తీసుకువెళ్లాలనే  సంకల్పంతో టీటీడీ శ్రీనివాస కళ్యాణాలు, వైభవోత్సవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, భజన బృందాల ఏర్పాటు, అన్నమాచార్య సంకీర్తనలు భక్త లోకానికి అందించడం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం స్థాపన లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చైర్మన్ వివరించారు.ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, భగవంతుని ఆరాధించే అనేక పద్ధతుల్లో హోమ కార్యక్రమం అత్యంత ప్రాసస్యమైందని తెలిపారు.  హోమం చేయడం, గానం చేయడం ద్వారా భగవంతుని త్వరగా చేరుకోవచ్చన్నారు. 
శోభాయ మానంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ ప్రారంభోత్సవ ఊరేగింపు :
ఎస్వీ  వేద విశ్వవిద్యాలయం నుండి 
గురువారం ఉదయం 7 గంటలకుశ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభోత్సవ ఊరేగింపు నిర్వహించారు.  వేద  విద్యార్థులు, అధ్యాపకులు, భజన మండళ్ల కళాకారులు ఊరేగింపుగా సప్తగో ప్రదక్షిణ మందిరంకు చేరుకున్నారు. 
Tirumala, On the auspicious day of Uttana Ekadasi in the sacred month of Karthika TTD commenced the significant Sri Srinivasa Divyanugraha Homam for the well being of the entire humanity, advocated TTD Chairman Sri Bhumana Karunakara Reddy.
Speaking at Homa Vedika at Alipiri Go Mandiram on Thursday, the TTD Trust Board Chairman said TTD has been doing a lot of religious programs since several decades and began yet another significant ritual for the well-being of devotees in the name of Sri Srinivasa Divyanugraha Visesha Homam.
He said this ritual has an important place in Hindu Dharmic  scriptures invoking the blessings of Lord Agni with Venkateswara Sankalpam. Adding further he said it is not a single day event but lasts till the existence of Universal Supremo Sri Venkateswara Swamy
"Usually performing Homam individually is expensive for many and with this Homam the devotees who aspire to perform Homam shall participate in an economic way. Even before we gave wide publicity towards this unique Homam, the tickets in online are booked till December ", he maintained.
The TTD Board Chief said very soon a permanent Homa Vedika will be built with the contribution of a donor so that 400-500 devotees can participate in different time slots in an uninterrupted manner. The devotees can select the date of their choice or on their special days. The only motto of TTD is beget the divine blessings of Sri Venkateswara Swamy to devotees, he reiterated.
Devotional Cultural Treat
Earlier a colourful procession of various artistes displaying portraying various deities led from SV Vedic University to Homa Vedika amidst Veda Ghosha by Vedic students.
Devotees jubilant
Meanwhile devotees who participated in the Homam on its maiden expressed immense satisfaction and thanked TTD Chairman and the EO for rolling out the unique idea in the larger interests of devotees.
Decorations
On the other hand the floral, pandal and electrical illuminations enhanced the glory and grandeur of the Homa Vedika in a befitting manner.
The utsava murthies of Sri Srinivasa with Sridevi and Bhudevi were seated on a special platform and Homam was performed with utmost devotion by vedic pundits of SV Vedic University.
#SriSrinivasaDivyanugrahaViseshaHomam

Wednesday, 22 November 2023

అభ్యర్థుల గుణ గణాల వారీగా... అన్ని పార్టీలకు లోక్ సత్తా మద్దతు.......

లోక్ సత్తా ఈ ఎన్నికలలో అభ్యర్థుల వారీగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది .  మొదటి విడుత మద్దతు :-
 1. సనత్ నగర్ - కోట నీలిమా - కాంగ్రెస్ 
2. ఖైరతాబాద్ - విజయారెడ్డి - కాంగ్రెస్
 3. సికింద్రాబాద్ -( కంటోన్మెంట్ ) - వెన్నెల - కాంగ్రెస్
 4. సికింద్రాబాద్ - మేకల సారంగఫాని - బిజె పి  
5. ఉప్పల్ - ప్రభాకర్ - బిజె పి
  6. మల్కాజ్ గిరి - రామచందర్ రావు - బిజె పి 
 7. జుబికిహిల్స్ - మాగంటి గోపినాథ్ - బి ఆర్ యస్
 8. మేడ్చల్ - మల్లారెడ్డి - బి ఆర్ యస్ 
9. కూకట్ పల్లి -ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ - జన సేన 
10. అంబర్ పెట్ - prof  అన్వర్ ఖాన్ - బి యస్ పి

దీపకాంతులతో మేరిసిన లక్ష్మీరనారాయణులు... తిరుపతిలో వేడుకగా కార్తీక దీపోత్సవం...

కార్తీకం సర్వశ్రేష్టం

కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి

దీపోత్సవం  జ్ఞాన జ్యోతులు  వెలిగించాలి : టీటీడీ ఛైర్మన్  భూమన కరుణాకరరెడ్డి

తిరుపతిలో వేడుకగా కార్తీక దీపోత్సవం 
గోవిందనామస్మరణతో మారుమోగిన టీటీడీ పరిపాలన భవనం మైదానం 
భారీ సంఖ్యలో హాజరైన భక్తులు

TEMPLE CITY SHINES UNDER CANOPY OF GHEE LAMPS
KARTHIKA DEEPOTSAVAM WITNESSES HUGE DEVOTEE TURN OUT
SHIVA-KESAVA GLORIFIES KARTHIKA MONTH-KURTALAM PONTIFF
KARTHIKA DEEPOTSAVAM TO ILLUMINATE OUR LIVES WITH WISDOM-TTD CHAIRMAN
DEVOTEES HAIL TTD's UNIQUE PROGRAMS 
వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సంప్రదాయాలకు కార్తీకమాసం శ్రేష్టమైనదని, ఈ మాసంలో దైవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వందల రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందని కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ దీపాన్ని వెలిగిస్తే మనలోని అజ్ఞానం అనే అంధకారం తొలగి జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుందన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ మాసంలో నాగులచవితి, భైరవాష్టమి పర్వదినాలు రావడం శుభసూచికమని చెప్పారు. పూజ కంటే స్తోత్రం, స్తోత్రం కంటే జపం, జపం కంటే ధ్యానం, ధ్యానం కంటే ఏకాగ్రతతో కూడిన సమాధి స్థితి కోటి రెట్లు ఉత్తమమైనవన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా ఈ స్థితిని సాధించాలని కోరారు. దైవనామాన్ని జపిస్తే దీర్ఘాయువు కలుగుతుందన్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీనివాసుని కటాక్షం కలగాలని స్వామీజీ ఆకాంక్షించారు.
దీపోత్సవం  జ్ఞాన జ్యోతులు  వెలిగించాలి : టీటీడీ  చైర్మన్ టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపోత్సవం మనందరిలో  అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు  వెలిగించాలని ఆయన  ఆకాంక్షించారు. ప్రపంచ హైందవ సంస్కృతిని కాపాడేందుకు, ప్రజల్లో భక్తి భావాన్ని పెంచేందుకు టీటీడీ మహత్తరమైన భక్తిచైతన్య ఉద్యమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా 2021వ సంవత్సరం నుంచి కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్తీక మహా దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరంపరలో భాగంగా ఈ ఏడాది మొదటగా ఈ రోజు ఆ దేవ దేవుడి పాదాల చెంతన  పెద్ద ఎత్తున కార్తీక మహా దీపోత్సవం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. శివ కేశవుల వైశిష్ట్యం, దీపం ప్రాముఖ్యత, దీపారాధన వల్ల లోకానికి కలిగే ప్రయోజనం గురించి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించగలుగుతున్నామని తెలిపారు. అజ్ఞానమనే చీకట్లను పారదోలి ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్ఞానదీపాలు వెలిగించాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నానని చెప్పారు.
 ప్రజల్లో భక్తి చైతన్యం మరింతగా నింపడానికి రామకోటి తరహాలోనే గోవింద కోటి రాసిన 18 నుండి 25 ఏళ్ళ లోపు వయసు ఉన్న యువతీయువకులకు వారితో పాటు కుటుంబ సభ్యులకు ఒక సారి స్వామివారి బ్రేక్ దర్శనం కూడా కల్పించాలని తమ పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. సులభశైలిలో భగవద్గీతను కోటి పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. విశేష పర్వదినాల్లో భక్తులు తమ గోత్ర, నామాలతో సంకల్పం చేసుకుని హోమం చేసుకునేందు కోసం ఈ నెల 23వ తేదీ నుండి అలిపిరి వద్ద ఉన్న సప్త గో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
కార్తీక మహా దీపోత్సవం ఇలా ...
ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు యతి వందనం చేశారు. పండితులు డా. కె.రామానుజాచార్యులు స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. వేదస్వస్తి అనంతరం ఆయన దీప ప్రాశస్త్యాన్ని తెలియజేశారు.  అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన హరిహర కార్తీక నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
TIRUPATI, The mega religious fete in the auspicious month of Karthika, the Karthika Deepotsavam organised by TTD for the third consecutive year under the aegis of All Dharmic Projects, stood as a stupendo fantabulous phantasmagorically magical hit on Monday evening.
The TTD Parade Grounds in Tirupati, donned a glitterati look under the shine of thousands of ghee lit lamps on the auspicious occasion of Karthika Deepam on first Monday of Karthika month.

Speaking on the occasion, Kurtalam Peethadhipati Sri Siddheswarananda Bharati Theertha Swamy while complimenting TTD for organizing such a massive spiritual program said, Karthika month signifies the importance of Pujas for both the super power deities of Shiva and Keshava.

TTD Chairman Sri Bhumana Karunakara Reddy said the chief motto of the program is to get rid of the egos within ourselves by lighting the lamp of wisdom. He said since 2021 TTD has been conducting this unique fete for the benefit of devotees. He also said Govinda Koti, Srinivasa Divyanugraha Puja are alsobeing taken up to imbibe the essence of Hindu sanatana dharma among the devotees.
Later series of rituals like Vishwaksena Aradhana, Punyahavachanam, Vishnu Sahasranama Parayanam, Lakshmi Puja, dance ballet by students of SV college of Music and Dance on Shiva-Keshava Vaibhavam enthralled the audience followed by Govinda Namas and Kumbha Harati.
The devotees lit ghee lamps arranged in front of them chanting the relevant mantras as recited by Vedic pundits. DrRamanujacharyulu of Dharmagiri Veda Pathashala explained the significance of each program. It was a visual spectacle to watch all the lamps which appeared as a glittering carpet.
Devotees hailed the program and thanking TTD for executing such spiritual programs.

Monday, 20 November 2023

*తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, హనుమంతరావు*


తిరుమలాయపాలెం :.తెలంగాణ రాష్ట్రం కోసం 1200వందలమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియ గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని,తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది,తెచ్చింది మేమె అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్చు హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి ఆయన తిరుమలాయపాలెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పొంగులేటి, హనుమంతరావు మాట్లాడుతూ.మాయమాటలు చెప్పి అధికారం చెదక్కించుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా తరిమికొట్టాలని అన్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మీరు గెలిపించిన ఎమ్మెల్యే, అభివృద్ధి పేరు చెప్పి పార్టీ మారాను అని చెప్పాడు,
మీ గ్రామంలో ఏం అభివృద్ధి చేశాడని అన్నారు.
అధికార పార్టీలో చేరి డబుల్ బెడ్ రూం ఇల్లు,దళిత బందు, కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇప్పించడాని ప్రశ్నించారు.ఆయన వ్యక్తిగత స్వలాభం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ కు తొత్తుగా మారాడని ఆరోపించారు.డబ్బుమదంతో,అధికార మదంతో విర్రవీగుతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి,ప్రజా పరిపాలన కు యుద్ధం జరుగుతుందని అన్నారు.ఈ యుద్ధం లో ప్రజలు బాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెండు సార్లు తెలంగాణా ప్రజలకు మాయమాటలు చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడనీ,తెలంగాణా బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ వక్కటైన నెరవేర్చలేదని మండిపడ్డారు.కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రం లోకి వచ్చి, రెండు పర్యాయాలల్లో అభివృద్ధి  చెయ్యలేకపోయాను, ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే అద్భుతాలు చేస్తాను మాయమాటలు చెపుతునన్నాడని విమర్శించారు.ఇలాంటి  మాయమాటలు చెప్పే కేసీఆర్ ను ప్రజలు నమ్మవద్దని, తెలిపారు.మా ప్రజాపాలన కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం,మీ శ్రీనన్న గెలుపుకోసం, మీరందరూ యుద్ధం చేసి, హస్తం గుర్తుపై ఓటు వేసి కేసీఆర్ చెంప చెళ్లు మనే సమాధానం చెప్పాలని పొంగులేటి కోరారు.నాయకులు బెల్లం శ్రీనివాస్,ఎంపీపీ బోడ మంగీలాల్, రామసహయం నరేశ్ రెడ్డి,చావా శివరామకృష్ణ, కొప్పుల అశోక్,శ్యాం సుందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం.. PUSHPAYAGAM VISUAL TREAT AT TIRUCHANOOR...

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం  ఆదివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో   పుష్పయాగం శోభాయమానంగా జరిగింది. 
వేడుకగా స్నపన తిరుమంజనం : ఉదయం అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖకు దాతలు సమర్పించిన 3 టన్నుల పుష్పాలను  అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు పుష్పాలు, పత్రాలను అందించారు.
పుష్పాల ఊరేగింపు : మధ్యాహ్నం ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు  ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు. అనంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం జరిగింది. వైదికుల చతుర్వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది
Tirupati,The colourful floral ceremony was a visual treat to the devotees who took part in the celestial annual Pushpayagam held in Tiruchanoor on Sunday evening.
About three tonnes of various ornamental and traditional flowers have been used during the ceremony.

Saturday, 18 November 2023

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం... పద్మపుష్కరిణిలో పవిత్రస్నానంతో భక్తుల తన్మయత్వం ...

తిరుపతి: శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 50 వేలకు పైగా భక్తులు అమ్మవారి పద్మసరోవరంలో చక్రస్నానం సమయంలో పుణ్యస్నానాలను ఆచరించారని చెప్పారు. ఇంకా వేలాదిమంది భక్తులు వస్తున్నారని,  సాయంత్రం వరకు ఈ పుణ్యస్నాన వేడుక జరుగుతూనే ఉంటుందని వివరించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో శ్రీ ధర్మారెడ్డి నేతృత్వంలో
అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి  ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 5.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 
శోభాయ‌మానంగా సిరులతల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం
పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో  విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పచ్చ చామంతులు, యాలకులు, ఆఫ్రికన్ గ్రేప్స్, రెడ్ మరియు ఎల్లో రోజాపెటల్స్, వట్టివేరు, తులసిమాల‌లు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. తిరుపూర్ కు చెందిన దాతలు అమ్మవారి మాలలు, కిరీటాలను ప్రత్యేకంగా తయారు చేయించారు.
ఆకట్టుకున్న ఫలపుష్పం మండపం
పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటుచేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో తామర పూలు, రోజాలు, లిల్లీలు తదితర 6 రకాల, కట్ ఫ్లవర్స్, 6 రకాల సంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 12 నుండి 12.10 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

Tirupati Unprecedented flow of devotees and their ecstasy marked the Panchami Theertham at Tiruchanoor on the last day of annual Karthika Brahmotsavams on Saturday.
Speaking to media after Chakra Snanam, TTD Chairman Sri Bhumana Karunakar Reddy said the Panchami Theertham signifies the divine emergence Sri Padmavati Devi in a thouaand petal golden lotua at the centre of Padma Sarovaram.
He said lakhs of devotees participated and like never before,  over 50,000 devotees took the holy dip in the temple at a time while thousands are waiting for their turn. He said the sanctity of the temple tank waters lasts long the entire day.
He said under the leadership of TTD EO Sri AV Dharma Reddy the nine day long Karthika Brahmotsavams were conducted smoothly without any inconvenience to devotees and complimented the TTD, vigilance, police, district administration and also lauded the impeccable services of Srivari Sevaks and health workers to the multitude of devotees.
Earlier in the morning, the utsava deity of Sri Padmavati Devi on  Pallaki Vahanam took out a celestial ride along the Mada streets and blessed the devotees.
There after the utsava idol was brought in a procession to the Panchami Theertha Mandapam. The Srivari Sare and ornaments which commenced journey at Tirumala in early hours also reached Tiruchanoor temple by 11am and archakas performed special pujas to Sare before adoring to the Goddess at the Mandapam.
On the occasion of Panchami Theertham Sri Venkateswara had presented ornaments worth ₹2.5 crore to His divine Consort Sri  Padmavati Devi which included 5 kg gold Lakshmi Kasula Mala and Yajnopavitam.
Thereafter grand Snapana  Tirumanjanam was performed to utsava idol of Sri Padmavati and devotees were thrilled at the sight the unique garlands, keeritsms, hair decorations etc.which included the green Chrysanthemum, Tulasi and Cardamom garlands which have stolen the show.
Fruit and flower Mandapam 
The canopy of fruits and flowers arrayed at Panchami Mandapam with variety of fruits and one ton flowers which included six varieties of cut flowers and six other varieties of traditional flowers that enthralled the devotees.
During the Chakra Snanam to tge utsava idol of Sri Padmavathi Devi and Sri Sudarshana Chakrathalwar between 12noon and 12.10 pm thousands of devotees also took holy dip chanting Govinda.. Govinda with utmost religious ecstacy.
Later in the evening Goddess  be taken out on Mada steeets on Bangaru Tiruchi and followed with the Dwajavarohanam ritual heralding the conclusion of the nine day annual Karthika Brahmotsavams at Tiruchanoor.
Creditby:  ttdphotographer

Friday, 17 November 2023

పద్మావతి అమ్మకు.. అనంతాళ్వాన్ సారే....


తిరుపతి/తిరుమలతిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పంచమి తీర్ధం నిర్వహించనున్నారు అర్చకులు... వేల సంఖ్యలో హాజరయ్యే భక్తుల కోసం టిటిడి ఏర్పాట్లు చేసింది.
కాగా పంచమితీర్థం పురస్కరించుకుని తిరుమల అనంతాళ్వాన్ తోటలోని పసుపు మొక్కలు అమ్మవారి కైంకర్యానికి సిద్ధపరిచారు. తిరుమల అనంతాళ్వాన్ తోటలో పెరిగిన పసుపు మొక్కలను దాదాపు 50 బుట్టల్లో తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి సరేతో పాటు సమర్పించనున్నారు..ఈ మేరకు అనంతాళ్వాన్ 23వ తురుము వారసులు టి.ఎ.రంగాచారి సతీ సమేతంగా తోటి నుండి పసుపు మొక్కలను సేకరించారు.  అనంతరం తోటలో ఉన్న అమ్మవారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తిరుచానూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అనంతాళ్వాన్ తోట పునః వైభవానికి కృషి చేసిన పివి రామిరెడ్డి (విజయవాడ) తదితరులు పాల్గొన్నారు. @మణికుమార్ (సినీయర్ జర్నలిస్ట్)

Thursday, 16 November 2023

కోనేరు కోనప్పకు మావోల హెచ్చరిక...


 సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప  ను మావోయిస్టులు హెచ్చరిస్తూ లేఖ రాశారు. అయితే ఈ లేఖపై ఎమ్మెల్యే కోనప్ప స్పందించారు. కేవలం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలనే లేఖలో టార్గెట్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. మాజీ మావోయిస్టులతో కలిసి బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కుట్ర చేస్తున్నారని అనుమానం వస్తోంది. లేఖ కూడా ఆయన సృష్టించినట్టుగానే ఉందని కోనేరు కోనప్ప తెలిపారు.
లేఖలో ఏముందంటే..
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖ కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను హెచ్చరిస్తూ ఈ లేఖ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్ప, బీజేపీ అభ్యర్థి పాల్వయి హరీశ్‌రావులను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఓటర్లకు మావోలు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు పార్టీ సిర్పూర్ చెన్నూర్ ఏరియా కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మంగు పేరుతో ఈ లేఖ విడుదలయింది.

Monday, 13 November 2023

బరిలో 133 మంది అభ్యర్థులు... ఖమ్మం చేరిన ఎన్నికల సామాగ్రి......


ఖమ్మం, నవంబర్ 13: జిల్లాలో నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియలో భాగంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పాత్రికేయులతో నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ప్రక్రియ సోమవారం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
 ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 147 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, స్క్రుటినీలో 14 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని తెలిపారు. 133 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని అన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 36 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఆయన తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో 40 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ఇద్దరి నామినేషన్లు తిరస్కరించబడ్డాయని అన్నారు. మధిర నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులవి చెల్లుబాటు కాగా, ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ అయ్యాయని వివరించారు. వైరా నియోజకవర్గంలో 15  మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ఒక అభ్యర్థి తిరస్కరణకు గురయ్యారని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థుల నామపత్రాలు చెల్లుబాటు కాగా, ముగ్గురి నామినేషన్ తిరస్కరించబడ్డాయని ఆయన అన్నారు. స్క్రూటిని ప్రక్రియ ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 15 వరకు అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఉంటుందని ఆయన అన్నారు. ఉపసంహరణ దరఖాస్తుపై అభ్యర్థి సంతకం ఉండాలని, అభ్యరి నేరుగా గాని, అభ్యరి ప్రతిపాదిత వ్యక్తి గాని అందజేయవచ్చని ఆయన అన్నారు. అదేరోజు సాధారణ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో గుర్తుల కేటాయింపు జరుగుతుందని ఎన్నికల అధికారి అన్నారు.
------------------------------------------------------------------------
జిల్లాకు చేరిన ఎన్నికల సామాగ్రి...
ఖమ్మం, నవంబర్ 13: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నుండి పోలింగ్ కు సంబంధించిన ఎన్నికల సామాగ్రి జిల్లాకు చేరినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో పోలింగ్ ఎన్నికల సామాగ్రిని జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30న జరిగే పోలింగ్‌ కు సంబంధించి ఫార్మ్స్‌, ఇతర ఫార్మెట్లు, ఎన్నికల విధులకు సంబంధించిన నిబంధనలు, విధి విధానాల వైట్‌ కలర్‌ బుక్‌లెట్స్‌, ఎల్లోకలర్‌ బుక్‌లెట్స్‌, పోలింగ్‌ ఏజెంట్లు/రిలీవింగ్‌ ఏజెంట్ల కదలికల నమోదుల షీట్స్‌, ఈవిఎం వైట్‌ పేపర్స్‌, ఎనవలప్‌ సెట్‌, స్క్రూట్నీ వైట్‌ కలర్‌ డాక్యుమెంట్లు, ఎనవలప్‌ సెట్, నాన్‌ స్టాట్యూటరీ ఎల్లో కలర్‌ కవర్సు, ఎనవలప్‌ ఫర్‌ పోలింగ్‌ ఏజెంట్స్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌, ఫారమ్‌10 ఎల్లో కలర్‌, హ్యాండ్‌బుక్‌, సూచనలు, సీల్‌ సామాగ్రి, స్టేషనరీ ఐటమ్స్‌ స్టాంప్‌ప్యాడ్స్‌, సైన్‌బోర్డ్స్‌, పోలింగ్‌ సామాగ్రి ఎగ్జిట్‌, ఎంట్రీ, స్త్రీ, పురుష, పోలింగ్‌ ఏజెంట్స్‌ సూచికలు, పెన్నులు, పేపర్లు, పెన్సిల్స్‌, పిన్స్‌, సీలింగ్‌ వ్యాక్స్‌, గమ్‌పేస్టు, బ్లేడ్స్‌, క్యాండిల్‌ స్టిక్స్‌, త్రెడ్‌, మెటల్‌ రూల్‌, కార్బన్‌ పేపర్‌, క్లాత్‌, ప్యాకింగ్‌ పేపర్‌, ఇంక్‌బాటిల్స్‌, రబ్బర్‌ బ్యాండ్స్‌ తదితర సామాగ్రి ఉన్నట్లు ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శించే పోస్టర్లు, కేంద్రం లోపల ప్రదర్శించే పోలింగ్ అధికారుల వివరాలు ఎక్కడ ప్రదర్శిస్తే ఉపయుక్తంగా ఉంటుందో ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా నుండి ప్రత్యేకంగా విధులకు హాజరయ్యే సిబ్బంది, అధికారులకు వెల్ఫేర్‌ కిట్స్‌ అందజేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఇందులో పేస్ట్‌, బాతింగ్‌ సోప్‌, మస్కిటో లిక్విడ్స్‌, కొబ్బరినూనె, అద్దం, దువ్వెన, తదితర వినియోగించే సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి అందించేందుకు గాను సిద్దం చేయడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి అజయ్ కుమార్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు రాంబాబు, కలెక్టరేట్ పర్యవేక్షకులు మదన్ గోపాల్, సత్యనారాయణ, అధికారులు తదితరులు ఉన్నారు.

Friday, 10 November 2023

విలువైన ఓటుపై. చర్చించండి..ఎన్నికల పరిశీలకులు తుషార్ కాంత మహంతి


ఖమ్మం, నవంబర్ 10: స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం, పాలేరు అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకులు తుషార్ కాంత మహంతి అన్నారు. శుక్రవారం ఎన్నికల పరిశీలకులు,  జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ఓటుహక్కుపై చైతన్యం కల్గించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కని అన్నారు. ఓటు విలువైన ఆయుధమని, విలువైన ఓటును ప్రలోభాలకు గురై అమ్ముకోవద్దని, ఈ దిశగా చర్చ జరగాలని, కుటుంబీకులు, గ్రామస్థుల్లో అవగాహన కల్పించి, చైతన్యం తెచ్చే బాధ్యత యువతపై ఉందని అన్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వమే ప్రజాస్వామ్యమని ఆయన తెలిపారు. ఓటు హక్కు విషయంలో దేశంలోని ప్రతి ఒక్కరు సమానమని, అందరికి ఒకే ఓటు ఉంటుందని, అందరికి సమాన స్వేచ్ఛ, హక్కులు రాజ్యాంగం ప్రకారం వుంటాయని ఆయన అన్నారు. ఓటరు జాబితాలో ఓటు ఉందా లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తెలుసుకోవాలని, ఓటు ఏ పోలింగ్ కేంద్రం, ఏ ప్రాంతంలోవుందో తెలుసుకోవాలని, తమదే కాక, తమ సంబంధికుల ఓట్ల విషయమై విచారణ చేయాలన్నారు. ఓటర్ జాబితాలో పేరు ఉండి, ఎపిక్ కార్డు రానివారు, వారి గుర్తింపు ధ్రువీకరణ చూపి ఓటు వేయవచ్చన్నారు. ఎన్నికల్లో ధన, ప్రలోభాల ప్రభావం లేకుండా, స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణలో యువత పాలుపంచుకోవాలన్నారు. ఎన్నికల్లో ధన, ప్రలోభాలు ఏవైనా దృష్టికి వస్తే సి విజిల్ యాప్ ద్వారా అధికారుల దృష్టికి తేవాలన్నారు. సి విజిల్ యాప్ ద్వారా చేసే ఫిర్యాదులో ఫిర్యాదుదారు ఫోన్ నెంబర్, వివరాలు లేకుండా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుకు 20 నిమిషాల్లో అధికారులు చేరుకొని చర్యలు తీసుకుంటారని, 100 నిమిషాల్లో చర్యలు చేపట్టకపోతే, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేరుకుంటుందని, సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదుకు అధికారులు జవాబుదారీతనం వహిస్తారని ఆయన అన్నారు. డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీ, అనుమతి లేకుండా ప్రయివేటు ఆస్తులపై పోస్టర్లు, ప్రచారం, ఓటర్లకు బెదిరింపులు, రాత్రి 10 తర్వాత ప్రచారం తదితర వాటిపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. యువత ఓటు తప్పనిసరిగా వేయాలని, ఓటు వేసే సామాజిక బాధ్యతను ఎప్పటికి మరువకూడదని వారు అన్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన ఓటరు ఉత్తేజిత వీడియో పాటను విద్యార్థినులు ఆసక్తిగా తిలకించారు. సి విజిల్ యాప్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేయించి, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా యాప్ లపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో శిక్షణ స్వీప్ జిల్లా నోడల్ అధికారి కె. శ్రీరామ్, కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. పద్మావతి, కళాశాల లెక్చరర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 8 November 2023

*సైబర్‌ ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి*



*-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా* 
సైబర్‌ నేరాలపై వచ్చే పిర్యాదులపై పోలీస్‌ అధికారులు తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాల్సిందిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సైబర్‌ వారియర్స్‌కు సూచించారు.  పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సైబర్‌ వారియర్స్‌ సిబ్బందితో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా సైబర్‌ నేరాలపై వచ్చిన ఫిర్యాదులపై సైబర్‌ వారియర్స్‌ తీసుకుంటున్న చర్యలతోపాటు, ప్రస్తుత పెండిరగ్‌లో వున్న  సైబర్‌ కేసుల్లోని నిందితులను పట్టుకోవడంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులు , సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ  టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్ది అదే స్థాయిలో సైబర్‌ నేరగాళ్ళ కొత్త మార్గాల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతూ ప్రజల సోమ్మును దోచేస్తున్నారు. ఈ నేరాలను నియంత్రించాలంటే ముందుగా ప్రజల సైబర్‌ నేరాలు జరిగే తీరుతెన్నులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి వుంటుందని. అలాగే సైబర్‌ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయిన బాధితులు తక్షణమే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కి సమాచారం అందించే విధంగా ప్రజలకు ఈ ఉచిత టోల్‌నంబర్‌ పై అవగాహన కల్పించాలని. ముఖ్యంగా సైబర్‌ వారియర్స్‌ సైబర్‌ నేరాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగివుండటం అవసరమని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. ఈ సమావేశంలో సైబర్‌  క్రైమ్స్‌ ఏసిపి విజయ్‌కుమార్‌, ఇన్స్‌స్పెక్టర్‌ లక్ష్మీ నారయణ, ఐటీకోర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ సంతోష్‌తో పాటు సైబర్‌ మరియు ఐటీకోర్‌ విభాగాలకు చెందిన ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల బరిలో బర్రెలక్క @ శిరీష...

నిరుద్యోగ యువతిగా ఇన్‌స్టా గ్రాంలో ఓ చిన్న సెటైరికల్ వీడియోతో ప్రభుత్వంపై తనకున్న అసహనాన్ని వ్యక్తం చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బరిలో దిగింది .హాయ్ ఫ్రెండ్స్.. బర్లు కాయనికి వచ్చిన ఫ్రెండ్స్.. ఎంత చదివిన కానీ డిగ్రీలు.. పట్టాలొస్తున్నాయి గానీ.. జాబులు మాత్రం వస్తలేవ్వు.. నోటిఫికేషన్ వెయ్యరు ఏం వెయ్యరు.. అందుకే మా అమ్మను అడిగి..నాలుగు బర్రెలు కొన్నా..అంటూ ఓ అమ్మాయి చెప్పే వీడియో.. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది గుర్తుందా.బర్రెలక్కగా తెగ ఫేమస్ అయిన శిరీష @ బర్రెలక్క మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శిరీష.. అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం ఉదయం నామినేషన్ వేసింది...