ఖమ్మం, నవంబర్ 13: జిల్లాలో నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియలో భాగంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పాత్రికేయులతో నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ప్రక్రియ సోమవారం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 147 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, స్క్రుటినీలో 14 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని తెలిపారు. 133 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని అన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 36 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఆయన తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో 40 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ఇద్దరి నామినేషన్లు తిరస్కరించబడ్డాయని అన్నారు. మధిర నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులవి చెల్లుబాటు కాగా, ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ అయ్యాయని వివరించారు. వైరా నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ఒక అభ్యర్థి తిరస్కరణకు గురయ్యారని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థుల నామపత్రాలు చెల్లుబాటు కాగా, ముగ్గురి నామినేషన్ తిరస్కరించబడ్డాయని ఆయన అన్నారు. స్క్రూటిని ప్రక్రియ ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 15 వరకు అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఉంటుందని ఆయన అన్నారు. ఉపసంహరణ దరఖాస్తుపై అభ్యర్థి సంతకం ఉండాలని, అభ్యరి నేరుగా గాని, అభ్యరి ప్రతిపాదిత వ్యక్తి గాని అందజేయవచ్చని ఆయన అన్నారు. అదేరోజు సాధారణ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో గుర్తుల కేటాయింపు జరుగుతుందని ఎన్నికల అధికారి అన్నారు.
------------------------------------------------------------------------
జిల్లాకు చేరిన ఎన్నికల సామాగ్రి...
ఖమ్మం, నవంబర్ 13: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నుండి పోలింగ్ కు సంబంధించిన ఎన్నికల సామాగ్రి జిల్లాకు చేరినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో పోలింగ్ ఎన్నికల సామాగ్రిని జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30న జరిగే పోలింగ్ కు సంబంధించి ఫార్మ్స్, ఇతర ఫార్మెట్లు, ఎన్నికల విధులకు సంబంధించిన నిబంధనలు, విధి విధానాల వైట్ కలర్ బుక్‌లెట్స్, ఎల్లోకలర్ బుక్‌లెట్స్, పోలింగ్ ఏజెంట్లు/రిలీవింగ్ ఏజెంట్ల కదలికల నమోదుల షీట్స్, ఈవిఎం వైట్ పేపర్స్, ఎనవలప్ సెట్, స్క్రూట్నీ వైట్ కలర్ డాక్యుమెంట్లు, ఎనవలప్ సెట్, నాన్ స్టాట్యూటరీ ఎల్లో కలర్ కవర్సు, ఎనవలప్ ఫర్ పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్‌మెంట్ లెటర్స్, ఫారమ్10 ఎల్లో కలర్, హ్యాండ్‌బుక్, సూచనలు, సీల్ సామాగ్రి, స్టేషనరీ ఐటమ్స్ స్టాంప్‌ప్యాడ్స్, సైన్‌బోర్డ్స్, పోలింగ్ సామాగ్రి ఎగ్జిట్, ఎంట్రీ, స్త్రీ, పురుష, పోలింగ్ ఏజెంట్స్ సూచికలు, పెన్నులు, పేపర్లు, పెన్సిల్స్, పిన్స్, సీలింగ్ వ్యాక్స్, గమ్‌పేస్టు, బ్లేడ్స్, క్యాండిల్ స్టిక్స్, త్రెడ్, మెటల్ రూల్, కార్బన్ పేపర్, క్లాత్, ప్యాకింగ్ పేపర్, ఇంక్‌బాటిల్స్, రబ్బర్ బ్యాండ్స్ తదితర సామాగ్రి ఉన్నట్లు ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శించే పోస్టర్లు, కేంద్రం లోపల ప్రదర్శించే పోలింగ్ అధికారుల వివరాలు ఎక్కడ ప్రదర్శిస్తే ఉపయుక్తంగా ఉంటుందో ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా నుండి ప్రత్యేకంగా విధులకు హాజరయ్యే సిబ్బంది, అధికారులకు వెల్ఫేర్ కిట్స్ అందజేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఇందులో పేస్ట్, బాతింగ్ సోప్, మస్కిటో లిక్విడ్స్, కొబ్బరినూనె, అద్దం, దువ్వెన, తదితర వినియోగించే సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి అందించేందుకు గాను సిద్దం చేయడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి అజయ్ కుమార్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు రాంబాబు, కలెక్టరేట్ పర్యవేక్షకులు మదన్ గోపాల్, సత్యనారాయణ, అధికారులు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment