Thursday, 16 November 2023

కోనేరు కోనప్పకు మావోల హెచ్చరిక...


 సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప  ను మావోయిస్టులు హెచ్చరిస్తూ లేఖ రాశారు. అయితే ఈ లేఖపై ఎమ్మెల్యే కోనప్ప స్పందించారు. కేవలం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలనే లేఖలో టార్గెట్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. మాజీ మావోయిస్టులతో కలిసి బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కుట్ర చేస్తున్నారని అనుమానం వస్తోంది. లేఖ కూడా ఆయన సృష్టించినట్టుగానే ఉందని కోనేరు కోనప్ప తెలిపారు.
లేఖలో ఏముందంటే..
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖ కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను హెచ్చరిస్తూ ఈ లేఖ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్ప, బీజేపీ అభ్యర్థి పాల్వయి హరీశ్‌రావులను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఓటర్లకు మావోలు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు పార్టీ సిర్పూర్ చెన్నూర్ ఏరియా కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మంగు పేరుతో ఈ లేఖ విడుదలయింది.

No comments:

Post a Comment