Monday, 27 November 2023

29-30 తేదీలు ప్రకటనలకు MCMC నుండి ముందస్తు ధ్రువీకరణ పొందండి: జిల్లా ఎన్నికల అధికారి

*పోలింగ్ రోజు, పోలింగ్ రోజుకు ఒక రోజు ముందు ప్రింట్ మీడియాలో రాజకీయ పార్టీల ప్రకటనలకు  జిల్లాస్థాయి MCMC నుండి ముందస్తు ధ్రువీకరణ పొందాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్ తెలిపారు.నవంబర్ 29, 30న పత్రికలలో  ఎన్నికలకు సంబంధించిన  ప్రకటనల జారీ కోసం ముందస్తుగా జిల్లా కేంద్రంలోని ఎం.సి.ఎం.సి. కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి.గౌతమ్  తెలిపారు. 
ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం  పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి అనగా నవంబర్ 28 సాయంత్రం 4 గంటల నుంచి  సైలెన్స్ పీరియడ్ పాటించాలని, సైలెన్స్ పిరియడ్ లో ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాల సర్వే వివరాలను వెల్లడించడం, పత్రికల్లో ప్రచురించడం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం నిషేధించినందున, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

No comments:

Post a Comment