Sunday, 26 November 2023

పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేయండి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్


ఖమ్మం, నవంబర్ 26: పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఆదివారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, ఏఎస్డి జాబితా, మార్కెడ్ కాపీ ల తయారు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ల కొరకు ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రక్రియ పూర్తికి అధికారులకు, కలెక్టర్ సూచనలు చేశారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, కలెక్టరేట్ ఏవో అరుణ, పర్యవేక్షకులు మదన్ గోపాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment