Wednesday, 8 November 2023

*సైబర్‌ ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి*



*-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా* 
సైబర్‌ నేరాలపై వచ్చే పిర్యాదులపై పోలీస్‌ అధికారులు తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాల్సిందిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సైబర్‌ వారియర్స్‌కు సూచించారు.  పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సైబర్‌ వారియర్స్‌ సిబ్బందితో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా సైబర్‌ నేరాలపై వచ్చిన ఫిర్యాదులపై సైబర్‌ వారియర్స్‌ తీసుకుంటున్న చర్యలతోపాటు, ప్రస్తుత పెండిరగ్‌లో వున్న  సైబర్‌ కేసుల్లోని నిందితులను పట్టుకోవడంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులు , సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ  టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్ది అదే స్థాయిలో సైబర్‌ నేరగాళ్ళ కొత్త మార్గాల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతూ ప్రజల సోమ్మును దోచేస్తున్నారు. ఈ నేరాలను నియంత్రించాలంటే ముందుగా ప్రజల సైబర్‌ నేరాలు జరిగే తీరుతెన్నులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి వుంటుందని. అలాగే సైబర్‌ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయిన బాధితులు తక్షణమే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కి సమాచారం అందించే విధంగా ప్రజలకు ఈ ఉచిత టోల్‌నంబర్‌ పై అవగాహన కల్పించాలని. ముఖ్యంగా సైబర్‌ వారియర్స్‌ సైబర్‌ నేరాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగివుండటం అవసరమని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. ఈ సమావేశంలో సైబర్‌  క్రైమ్స్‌ ఏసిపి విజయ్‌కుమార్‌, ఇన్స్‌స్పెక్టర్‌ లక్ష్మీ నారయణ, ఐటీకోర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ సంతోష్‌తో పాటు సైబర్‌ మరియు ఐటీకోర్‌ విభాగాలకు చెందిన ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment