*తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు, ప్రాణహిత పరివాహక ప్రాంతం లో డ్రోన్ తో ప్రత్యేక నిఘా...*
*"డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్ "* ప్రారంభించిన సీపీ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు జరిగే విధంగా ముందస్తు చర్యల్లో యాంటీ ఎక్స్మిస్ట్ ఆపరేషన్స్ లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమీషనరెట్ మంచిర్యాల జోన్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమనపల్లి ఫెర్రీ పాయింట్ వద్ద *"డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్"* రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ (డిఐజి ) , మంచిర్యాల డిసిపి సుదీర్ కేకెన్ ఐపీఎస్., మనోజ్ ఐపిఎస్., ఇతర పోలీసు అధికారులతో ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ..యాంటీ ఎక్సమిస్ట్స్ ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘా లో భాగంగా మావోయిస్టుల కదలికలు, వారు ఏదైనా సంఘటనలకు పాల్పడే సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం కోసం సాంకేతిక పరిజ్ఞానం ను ఉపయోగించి డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్ ను ఏర్పాటు కోసం కాన్స్టేబుల్ సిబ్బంది కి ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈరోజు నుండి ఎన్నికలు పూర్తి అయ్యేవరకు డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అని ఈ ప్రాంతం లో ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంత ప్రజలకు ఒక సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం లో ప్రజలు తమ అమూల్యమైన ఓటు ను స్వేచ్ఛ వాతావరణం లో వినియోగించు కోనేలా చూడవలసిన బాధ్యత పోలీస్ శాఖ పై ఉంది దానిలో భాగంగా పెట్రోలింగ్ యూనిట్ ను ప్రారంభించడం జరిగింది సీపీ గారు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గలకి సంబంధించిన ముఖ్యంగా ఈప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ లొకేషన్స్ లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. భారత ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ మేరకు ఈ పోలింగ్ స్టేషన్స్ లో మూడంచల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్ర బలగాలు CRPF, CISF, జార్ఖండ్ ఆర్మూర్ బెటాలియన్ వారు కమీషనరేట్ కు రావడం జరిగింది. వారిని ఎన్నికల విధుల్లో వినియోగించడం జరుగుతుంది. ఎన్నికల లో స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, QRT టీమ్స్, SST టీమ్స్, FST టీమ్స్, ఎంసీసీ టీమ్స్ చాలా యాక్టివ్ గా పని చేయడం జరుగుతుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో *ఇన్సిడెంట్ ఫ్రీ* ఎన్నికలు జరిగే విధంగా పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ మోహన్, చెన్నూర్ రూరల్ సీఐ విద్య సాగర్,NIB ఇన్స్పెక్టర్ మంగీలాల్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, కోటపల్లి ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment