Wednesday, 1 November 2023

శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కెసీఆర్



లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి  కె చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగం నిర్వహించారు. 
శత చండీయాగంలో భాగంగా.. గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, నవాక్షరీ మూల మంత్ర జప అనుష్ఠానము, రాహు బృహస్పతి నంధిశాంతి,  త్రైలోక్య మోహన గౌరీ హోమము , అఘోరాస్త్ర హోమ కార్యాలను, చండీ సప్తశతీ పారాయణములు, చతుర్వేద పారాయణములు, మహామంగళారతి, మంత్రపుష్పము, అష్టావధాన – సేవ తదితర కార్యక్రమాలను సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు నిర్వహించారు.
అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు తీర్థ ప్రసాద వితరణము గావించారు.

No comments:

Post a Comment