Friday, 17 November 2023

పద్మావతి అమ్మకు.. అనంతాళ్వాన్ సారే....


తిరుపతి/తిరుమలతిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పంచమి తీర్ధం నిర్వహించనున్నారు అర్చకులు... వేల సంఖ్యలో హాజరయ్యే భక్తుల కోసం టిటిడి ఏర్పాట్లు చేసింది.
కాగా పంచమితీర్థం పురస్కరించుకుని తిరుమల అనంతాళ్వాన్ తోటలోని పసుపు మొక్కలు అమ్మవారి కైంకర్యానికి సిద్ధపరిచారు. తిరుమల అనంతాళ్వాన్ తోటలో పెరిగిన పసుపు మొక్కలను దాదాపు 50 బుట్టల్లో తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి సరేతో పాటు సమర్పించనున్నారు..ఈ మేరకు అనంతాళ్వాన్ 23వ తురుము వారసులు టి.ఎ.రంగాచారి సతీ సమేతంగా తోటి నుండి పసుపు మొక్కలను సేకరించారు.  అనంతరం తోటలో ఉన్న అమ్మవారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తిరుచానూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అనంతాళ్వాన్ తోట పునః వైభవానికి కృషి చేసిన పివి రామిరెడ్డి (విజయవాడ) తదితరులు పాల్గొన్నారు. @మణికుమార్ (సినీయర్ జర్నలిస్ట్)

No comments:

Post a Comment