హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో కూడా మాస్కులు ధరించాలని సూచించింది. ఈ మేరకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. మాస్క్ ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తామని ఆయన తన ట్వీట్ లో వెల్లడించారు. అటు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న 459 కేసులు రాాగా ఒక్క హైదరాబాద్ లోనే 232 కేసులు వచ్చాయి.
Thursday, 30 June 2022
కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- మంత్రి పువ్వాడ…..
ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ విపి గౌతం గారితో కలిసి వివి.పాలం గ్రామ సమీపంలో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి పువ్వాడ పరిశీలించారు.
భవన నిర్మాణం, ప్రాంగణానికి సంబందించిన పనులను పరిశీలిస్తూ, ప్లాన్ ప్రకారంగా పనులను కొనసాగుతున్నాయా లేదా అని పరిశీలించారు.
పౌర సేవల, పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని 44కోట్లతో 1,69,000వేల చ.అ.విస్తీర్ణంలో చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.
ఇప్పటికే మెయిన్ బిల్డింగ్ స్లాబ్లు నిర్మాణ పనులు, సివిల్ పనులు పూర్తి అయినట్లు అధికారులు వివరించారు. అన్ని గదులలో ఇప్పటికే ఫ్లోరింగ్ పనులు సైతం పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ఫినిషింగ్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
భవనం మొత్తం తిరిగి విద్యుత్ పనులు, ప్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్, టైల్స్ పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు.
భవన ప్రాంగణం ముందు భాగం మొత్తం చదును చేయాలని, చదును చేసిన అనంతరం నడక దారి, కాంపౌండ్ వాల్ చేపట్టాలని సూచించారు. భవన సముదాయం వెనక భాగంలో సీసీ రోడ్డు, పాత్ వే పనులను పరిశీలించారు. భవనం గోడకు ఆనుకొని పాట్ ప్లాంటింగ్ ఉండాలని, ఆ తర్వాత వరుసలో మొక్కలు ప్లాంటేషన్ చేసి, ప్లాంటేషన్ తర్వాత సీసీ రోడ్ చేపట్టాలన్నారు.
భవన సముదాయం మధ్యలో చేపట్టవల్సిన ప్లాంటింగ్, లాన్ పనులను సుందరంగా ఉండేలా చూడాలని అదేశించారు. అవసరమైనంత మేరకు కూలీల సంఖ్య పెంచి పనుల వేగం పెంచాలని సూచించారు.
వాహనాల పార్కింగ్, ఇతర పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తవుతున్న పనుల వివరాల నివేదికను అందివ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో మేయోర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ గారు, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాoప్రసాద్ గారు, MRO నర్సింహారావు గారు, AMC చైర్మన్ లక్ష్మిప్రసన్న గారు, కార్పొరేటర్లు కమర్తపు మురళి గారు, వలరాజ్ గారు, నాయకులు RJC కృష్ణ గారు అధికారులు తదితరులు ఉన్నారు.
Tuesday, 28 June 2022
అవిభక్త కవలలు వాణి - వీణాలకు సర్వత్రా అభినందనలు..
♦ నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణా-వాణి ఉత్తీర్ణత సాధించారు
♦సీఈసీ చదువుతున్న వీణకు 712 మార్కులు వాణి 707 మార్కులు సాధించారు. వీరికి అన్ని వర్గాల ప్రజల నుండి అభినంధనలు..శుభాకాంక్షలు అందుతున్నాయి.. సి.ఎం.కెసిఆర్, కెటిఆర్ లతో సహా తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాధోడ్, పువ్వాడ అజయ్ కుమార్.. తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.వాణి -వీణల ఇంటర్ ఉత్తీర్ణత విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ వెంగళరావు నగర్ డివిజన్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్క ఉ వెళ్లి శుభాకాంక్షలు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో స్తానిక డివిజన్ కార్పొరేటర్ దేదీప్య రావు, డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, ప్రధాన కార్యదర్శి వేణు, విజయ్ ముదిరాజ్, జి టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, సత్యనారయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Saturday, 25 June 2022
మట్టిగణపతే మహాగణపతి.. భవిష్యత్ తరాల హితామే మన లక్ష్యం కావాలి..
ఖమ్మం, జూన్ 25 (మణికుమార్ కొమ్మమూరు) : మట్టి గణపతులనే పూజిద్దామని, ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం జరుపుకుందామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, స్తంభాద్రి ఉత్సవ కమిటీ, కుమ్మరి సంఘ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు 2021 ఆదేశాల మేరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలు నిషేధించినట్లు, జిల్లా లోని చెరువులు, జల వనరుల్లో నిమజ్జనానికి అనుమతి లేనట్లు ఆయన తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల అమ్మకం చేయకూడదని, చేస్తే, షాపుల సీజ్ చేయడంతో పాటు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. గత గణేష్ చతుర్థి సమావేశంలో ఉత్సవ కమిటీల సూచన మేరకు మట్టి గణపతుల నిమజ్జనం పై ముందస్తుగా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రకృతికి విరుద్ధంగా చర్యలను ఎవరు సమర్థించరని, గణేష్ నిమజ్జనం తర్వాత దుష్ప్రభావాలు తరతరాలకు ఏర్పడడం మంచిది కాదని ఆయన అన్నారు. పర్యావరణ హిత నిమజ్జనం కలిసికట్టుగా అందరం జరుపుకుందామన్నారు. మున్నేరులో నిమజ్జనం చేస్తున్నట్లు, మున్నేరు జలాలు కలుషితం కాకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. పర్యావరణ సమతుల్యతకి విఘాతం కల్గడంతో అకాలవర్షాలు, విపరీతమైన ఎండలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మట్టి గణపతులను ప్రతిష్టించే మండపాలకే అనుమతులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మట్టి గణపతుల తయారీకి కార్యాచరణ చేయాలని, ప్రభుత్వ యంత్రాంగం నుండి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో అతిపెద్దదైన ఖైరతాబాద్ విగ్రహం కూడా మట్టితో తయారు చేస్తున్నారన్నారు. కాలుష్య రహిత, పర్యావరణ హిత గణేష్ చతుర్థి కి మనమందరం ప్రతినబూనాలన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, కార్పొరేటర్ ప్రసన్న, మునిసిపల్ కమిషనర్లు, ఇర్రిగేషన్ అధికారులు, స్తంభాద్రి ఉత్సవ కమిటీ, కుమ్మరి సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Friday, 24 June 2022
హిరో నందమూరి బాలకృష్ణకు కరోనా... రెండు రోజుల క్రితం బాలకృష్ణతో ఓ కార్యక్రమంలో కలసి పాల్గొన్న హారీష్ రావు
హైదరాబాద్ :శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ మరియు శాసనసభ్యులు, హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గం, ఆంద్ర ప్రదేశ్ వారు తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటనలో తెలియజేశారు.గత రెండు మూడు రోజులుగా తనను కలిసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తెరిగి తగిన పరీక్షలు చేయించుకోవడంతో పాటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరలోనే సాధారణ కార్యకలాపాలలో పాల్గొంటానన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా బసవతారకం ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు బాలకృష్ణ తో కలసి పాల్గొన్నారు..దీంతో పలువురు హారిష్ రావు ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది..
*PRESS NOTE*
Sri Nandamuri Balakrishna, Chairman, Basavatarakam Indo American Cancer Hospital & Research Institute and MLA, Hindupur Assembly Constituency, Andhra Pradesh has informed that he got tested positive for COVID.
★ He advised all those came in close contact with him for last two days to get them tested immediately and take necessary precautions.
★ He requested all his fans and well wishers to not to worry about him as he is doing fine and hoped to return to normalcy soon.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఖమ్మం, జూన్ 24: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 77 బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు, ఇట్టి చోట్ల అన్ని భద్రతా చర్యల్ని చేపట్టాలన్నారు. రోడ్డు మలుపులు, జంక్షన్లు, ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటుచేయాలని, ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. హై వే లపై ఉన్న గ్రామాల ప్రజలకు భద్రతపై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై నియతకాల సమీక్షలు చేయాలన్నారు. జిల్లా రోడ్డు భద్రతా మ్యాప్ ను అభివృద్ధి పర్చాలన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే త్వరితగతిన చేరేలా అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించడం, ప్రాణాలు కాపాడటం చేసిన వారిని ప్రోత్సహించేలా సన్మాన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. రోడ్లపై పశువులు తిరగకుండా చూడాలని, రోడ్లపై ఉన్న పశువులను గోశాలలకు తరలించాలని ఆయన అన్నారు. రోడ్లపై వ్యూ అంతరాయం కలగకుండా చెట్ల కొమ్మలు, పిచ్చి మొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ రావాలని, దాని కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వినియోగిస్తున్న ట్రాక్టర్లు కేజీ వీల్స్ సమస్య రాకుండా చూడాలని, సీజ్ చేసిన వాహనాలను పట్టి కోనుగోలు చేసిన అనంతరం మాత్రమే విడుదల చేయాలని ఆయన తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 295 ప్రమాదాలు జరిగినట్లు, ఇందులో 101 మంది మరణాలు సంభవించగా, 284 మంది గాయపడ్డట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ల వారిగా వారి వారి పరిధిలో తరచు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నగర పరిధిలో పోలీసు అధికారులు, మునిసిపల్ కమీషనర్ తో సమావేశమై, ఏ ఏ చోట్ల ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ ఏ అవసరాలు ఉన్నాయో పరిశీలన చేసి, అమలుకు కార్యాచరణ చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ చేయాలన్నారు. మీడియన్స్ ప్రారంభ ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మీడియన్స్ గ్యాప్ ల వద్ద అటు ఇటు కనిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డిసిపిలు షబరీష్, ఏఎస్ సి బోస్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారిని డా. మాలతి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి, ఏసిపిలు, సిఐలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులకు ఐ ఈ ఎల్ టి ఎస్, జి ఆర్ ఇ, టోఫెల్ లలో నైపుణ్య తర్ఫీదు. స్టెఫిన్ లీడ్స్ అకాడమీ డైరెక్టర్ వి. బ్రహ్మయ్య
ఖమ్మం :విదేశీ యూనివర్శిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఖమ్మంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టెప్ ఇన్ లీడ్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ వి. బ్రహ్మయ్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐ ఇ ఎల్ టి ఎస్ , జి ఆర్ ఇ, టోఫెల్, జి మ్యాట్, పి టి ఇ, కోర్సులలో నైపుణ్య తర్ఫీదు ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీటెక్, డిగ్రీ విద్యార్థులు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ శిక్షణ పొందడానికి అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్యను అందుబాటులోకి తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎస్సీ అభివృద్ధి శాఖ తరుపున ఈ శిక్షణ శిబిరం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశాల మేరకు విదేశీ యూనివర్శిటీలలో మాస్టర్స్ అడ్మిషన్లకు నిర్వహించే టోఫెల్/ఐఈఎల్ టిఎస్, జీఆర్ ఇ/ జీమ్యాట్, పి టి ఈ కోర్సులను ఖమ్మంలో వచ్చే నెల మొదటి వారం నుంచి ఉచిత శిక్షణను అందించనున్నట్లు బ్రహ్మయ్య చెప్పారు. విద్యార్థులు మార్కుల మెమో, కులం సర్టిఫికెట్, ఆదాయం స్థానికత, సర్టిఫికెట్ లతో పాటు ఆధార్, ఫోటోలతో డబల్యూ డబల్యూ డబల్యూ. స్టెప్ ఇన్ లీడ్స్. కం వెబ్సైట్లో ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపాలని బ్రహ్మయ్య కోరారు.ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 9030463377 /6309527888/8247688945 నెంబరులో సంప్రదించాలన్నారు.
Thursday, 23 June 2022
పువ్వాడ ఇంట పెళ్లిసందడి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వారసుడు డా.పువ్వాడ నయన్, అపర్ణ ల నిశ్చయ తాంబూల వేడుక తాత గారు మాజీ ఎమ్మేల్యే పువ్వాడ నాగేశ్వర రావు, విజయ లక్ష్మి గార్ల ఆశీర్వాదంతో హైద్రాబాద్ లోని శంషాబాద్ GMR ఏరినా ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి గారు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, సహచర మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు, మహ్మద్ అలీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాసయాదవ్ గారు, సత్యవతి రాథోడ్ గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, బండి పార్థసారధి రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, శాసన సభ శాసన మండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తాతా మధు సూదన్ గారు, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లు VP గౌతమ్ గారు, అనుడీప్ గారు, విష్ణు ఎస్ వారియర్ గారు, సునీల్ దత్ గారు, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, ఎమ్మేల్యే సండ్ర వెంకటవీరయ్య గారు, మెచ్చా నాగేశ్వరరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ గారు, wyra మాజీ ఎమ్మెల్యే మధన్ లాల్, వివిధ శాఖల అధికారులు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేటర్లు, trs రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు తదితరులు వచ్చి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
Wednesday, 22 June 2022
వాటికన్ సిటీలో ఓడిశా సి.ఎం.... ఓడిశా పుత్రికకు ఓటు చేయాలంటు సందేశం...
ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రోమ్ పర్యటనలో బిజీ బిజీగా గడిపారు.. వాటికన్ సిటీ సందర్మించిన ఆయన క్రిష్టియన్ మత ప్రభోదకుడు జాన్ పోప్ ఫ్రాన్సిస్ తో కాసేపు గడిపారు.. అనంతరం చర్చి వెలుపల సిస్టర్స్.. ఇతరులతో ముచ్ఛటించి వారి కొరిక మేరకు ఫోటోలు దిగారు.. కాగా ముందు నుండి ఊహించినట్లుగానే బజాపా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆయన మద్దతు తెలిపారు.. ఓడిశా రాష్ట్ర పుత్రిక రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యేందుకు శాసనసభ్యులు.పార్లమెంట్ సభ్యులు.తదితరులు ఓటు చేయాలని ..ఆయన సోషల్ మీడియా వేదికగా సందేశం ఇచ్ఛారు...
వైరల్ అయిన రాష్ట్రపతి అభ్యర్థి ఫోటోలు
భారత రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ఎన్నిక నల్లేరు మీద నడకైన వేళ బజాపా రాష్ట్రపతి అభ్యర్థి తాను చిన్నప్పటి నుండీ వెళుతున్న శివాలయానికి వెళ్లి గుడి అంతా చీపురుతో శుభ్రం చేసి శివయ్యను దర్శించుకున్నా ఈ చిత్రాలు..వీడియోలు అన్ని బాషలలో నెట్టింట్లో బారీగా ఫార్వార్డ్ అవుతుండగా ఓడిశాలో తొలిసారి ఎం.ఎల్.ఏ అయిన వెంటనే ఆమే దగ్గర లోని రామాలయం సందర్శించి ఆలాయాన్ని శుభ్రం చేసిన ఫోటోలు సైతం నెట్టింటా వైరల్ గా మారాయి..
మహారాష్ట్ర రాజకీయ పరిణామాల, ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర పతి అభ్యర్థి గా తమ రాష్ట్ర మహిళ ప్రకటన పట్ల హర్షం.. వెరశి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎంపిక కావడంలో ఎటువంటి సందేహాలు లేవని స్పష్టం అవుతోంది...
Tuesday, 21 June 2022
ఖమ్మంలో ఘనంగా యోగా డే... యోగాతోనే ఆయురారోగ్యాలన్న అతిధులు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన *8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం* కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ నీరజ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు,జిల్లా కలెక్టర్ గౌతం గారు,పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ గారు,మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి గారు హాజరై జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు..
ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ :యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు, నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. యోగాతో మానవ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్యంగా ఉంటామని అన్నారు ప్రజలంతా ప్రతిరోజు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని పిల్లలకు కూడా యోగాను నేర్పించాలని సూచించారు.యోగా ద్వారా విద్యార్థులు చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయి అన్నారు.చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు ఒక గంట లేదా అరగంట యోగ చేస్తే శరీరానికి చాలా మంచిదన్నారు..
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా DSWO క్రీడల అధికారి పరంధామ రెడ్డి,ఆయుష్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ నరసింహారావు,BNYS ఇన్చార్జి కనకలక్ష్మి,నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి బానోత్ దేవి లాల్,వలంటీర్ మొహాన్,నాగ చారి తదితరులు పాల్గొన్నారు...
Tuesday, 14 June 2022
యువ ఇంజనీర్ కు ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ వీ పి గౌతమ్ ప్రోత్సాహం...
ఖమ్మం యువ ఇంజనీర్ గార్లపాటి రాకేష్ కిట్స్ కాలేజ్ విద్యార్థి కని పెట్టిన ఎలక్ట్రిక్ కారును స్వయంగా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నడిపిన జిల్లా కలెక్టర్ శ్రీ వీ పీ గౌతమ్ గారు ...
కలెక్టరేట్ ఆవరణలోని TNGO కార్యాలయం వద్ద రాకేష్ ను 𝕥𝕟𝕘𝕠 జిల్లా అధ్యక్ష కార్య దర్శులకు పరిచయం చేసిన కలెక్టర్ గారు .ఈ సందర్భంగా కారు వివరాలు తెలియ చేసిన రాకేష్ ....
అనంతరం TNGOS యూనియన్ కార్యాలయంలో ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీ రామోజీ రమేష్ .TNGO జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అఫ్జల్ హాసన్ ఆర్ వీ ఎస్ సాగర్ .నందగిరి శ్రీను ,భాగం పవన్ .సవర్జన్ పాల్ ,శ్రీనివాసరెడ్డి ,కంచి శ్రీను తదితరులు యువ ఇంజనీర్ రాకేష్ ను పూల మాల శాలువా తో సత్కరించారు ...
రక్తదానం చేసిన జోయ్ ఆలుకాస్ సిబ్బంది...
ఖమ్మం : అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. స్థానిక జోయాలుకాస్ లో సంస్థకు చెందిన 38 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ ప్రసోభ్ మాట్లాడుతూ రక్త దానం మహాదానం తెలిపారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న రోగులను కాపాడి వారికి నూతన జీవితం అందించినట్లు అవుతుందన్నారు. ప్రతి వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానంపై అపోహలు తొలగించుకుని రక్తదానం చేసి రోగుల ప్రాణాలను కాపాడాలనే ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ ఇంచార్జ్ కిరణ్, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో రక్తదానం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Monday, 13 June 2022
క్రియేటివ్ హైస్కూల్ లో బ్యాక్ టు స్కూల్ వేడుకలు... తల్లిదండ్రులకు రెడ్ కార్పేట్ వెల్కం..
ఖమ్మం : స్థానిక హర్కారా బావి సెంటర్ లో ఉన్న క్రియేటివ్ హైస్కూల్ లో సోమవారం బ్యాక్ టు స్కూల్ వేడుకలు అద్భుతంగా నిర్వహించడం జరిగింది. కరోనా కల్లోలం తర్వాత ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా విద్యాసంస్థలు ప్రతి విద్యా సంవత్సరం లాగే జూన్ నెల నుండి ప్రారంభమైన శుభ సందర్భంగా క్రియేటివ్ హైస్కూల్ లో బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను రెడ్ కార్పెట్ వెల్కమ్, బొకేస్, టీచర్స్ వెల్కమ్ కృత్యాలతో ఆహ్వానించడం జరిగింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బిజ్జాల కమలాకర్ , డైరెక్టర్ కౌశిక్, ప్రిన్సిపాల్ లక్ష్మి కుమార్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Sunday, 12 June 2022
లలనగా..పాలనగా..ఆకాసేపు అమ్మగా మారిన కానిస్టేబులమ్మ
మహబూబాబాద్ జిల్లాలో టెట్ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. పరీక్ష రాసేందుకు చంటిపిల్లల తల్లులు సైతం పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లల ఆలనాపాలనా చూసేందుకు కుటుంబసభ్యులు పరీక్ష కేంద్రాల వద్ద వేచి ఉన్నారు.ఇదిలా ఉంటే ఓ పరీక్ష కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్ ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే మరో పక్క తన మాతృత్వాన్ని చాటుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న టెట్ పరీక్ష మహబూబాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో 11,429 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్దకు చంటి పిల్లల తల్లులు తమ కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. అభ్యర్థులు పరీక్షలు రాస్తుండగా కుటుంబ సభ్యులు చెట్లకు ఉయ్యాలలు కట్టి పిల్లలను ఆడిస్తుండగా ఓ మహిళా కానిస్టేబుల్ పసి పాపను ఎత్తుకొని ఆడిస్తూ పాలు తాగించారు.
ఆకట్టకుంటున్న స్థాంబాద్రి ఎగ్జిబిషన్....
కరోనా ప్రభవం నుండి ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్థాంబాద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో వేసవి సాయం వెళల్లో నగర ప్రజలు ఆనందంగా గడుపుతున్నారు.. జైంట్ వీల్..డ్రాగన్.. స్వీమ్మింగ్..హార్సు సైకిల్ వంటి వాటిలో పిల్లలు సేద తీరుతున్నారు..
చిన్న పెద్ద పిల్లల ఆటల వస్తువులు మరియు 50 రకాల వస్త్రాల దుకాణాలు,స్టాల్స్ ఏర్పాటు చేయడంతో నగర వాసులు ఉల్లాసంగా ఎగ్జిబిషన్ లో గడుపుతున్నారు.
ఈ నెల 27 వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుందని నగర ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు బాలు..వాసు... కోరారు..
Thursday, 2 June 2022
వైభవంగా శ్రీ షిరిడి సాయి ఆలయ ద్వాదశ వసంత మహోత్సవం.
ఖమ్మం,జూన్ 2.
స్థానిక వి.డి.వోస్ కాలనీలోని శ్రీ షిరిడి సాయి మందిరం లో ఆలయ ద్వాదశ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.స్వామివారికి తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయాన్ని శోభాయమానంగా పుష్పాలతో అలంకరించి విశేషరీతిలో సంప్రదాయ సిద్ధంగా పూజా కార్యక్రమాలను జరిపారు. తెల్లవారుజామున బాబా వారికి కాగడ హారతి మేలుకొలుపు తో ప్రారంభమైన ఈ ఉత్సవంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, బాబా వారికి అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, బాబా వారి మధ్యాహ్న హారతి తదితర వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు మిక్కిలినేని నరేందర్, అయితం రవీందర్, కత్తెర రామ్మోహన్రావు,భైరవరపు సీతారామారావు, చేకూరి శ్రీధర్,తొగుడు పద్మజ, ఆలయ అర్చకులు రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.అనంతరం మధ్యాహ్నం దాదాపు నాలుగు వేల మంది భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మిక్కిలినేని నరేందర్, అయితం రవీందర్ లు పర్యవేక్షించారు.
ఆలయంలో సాయంత్రం సంధ్యా హారతి, దీపోత్సవం, పల్లకి ఉత్సవం, సాయి చాలీసా భజనా, శేజ్ హారతి తదితర పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు రోహిత్ శర్మ సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు.
ఆలయంలో సాయంత్రం సంధ్యా హారతి, దీపోత్సవం, పల్లకి ఉత్సవం, సాయి చాలీసా భజనా, శేజ్ హారతి తదితర పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు రోహిత్ శర్మ సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు.
Subscribe to:
Comments (Atom)