Friday, 24 June 2022

ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులకు ఐ ఈ ఎల్ టి ఎస్, జి ఆర్ ఇ, టోఫెల్ లలో నైపుణ్య తర్ఫీదు. స్టెఫిన్ లీడ్స్ అకాడమీ డైరెక్టర్ వి. బ్రహ్మయ్య


ఖమ్మం :విదేశీ యూనివర్శిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఖమ్మంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టెప్ ఇన్ లీడ్స్ అకాడమీ  మేనేజింగ్ డైరెక్టర్ వి. బ్రహ్మయ్య తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐ ఇ ఎల్ టి ఎస్ , జి ఆర్ ఇ, టోఫెల్, జి మ్యాట్, పి టి ఇ,  కోర్సులలో నైపుణ్య తర్ఫీదు  ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీటెక్, డిగ్రీ విద్యార్థులు  60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ శిక్షణ  పొందడానికి అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్యను అందుబాటులోకి తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎస్సీ అభివృద్ధి శాఖ తరుపున ఈ శిక్షణ శిబిరం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశాల మేరకు విదేశీ యూనివర్శిటీలలో మాస్టర్స్ అడ్మిషన్లకు నిర్వహించే టోఫెల్/ఐఈఎల్ టిఎస్, జీఆర్ ఇ/ జీమ్యాట్, పి టి ఈ కోర్సులను ఖమ్మంలో వచ్చే నెల మొదటి వారం నుంచి ఉచిత శిక్షణను అందించనున్నట్లు బ్రహ్మయ్య చెప్పారు.  విద్యార్థులు మార్కుల మెమో, కులం సర్టిఫికెట్, ఆదాయం  స్థానికత, సర్టిఫికెట్ లతో పాటు ఆధార్, ఫోటోలతో  డబల్యూ డబల్యూ  డబల్యూ. స్టెప్ ఇన్  లీడ్స్. కం వెబ్సైట్లో ఆన్ లైన్  లో దరఖాస్తులు పంపాలని బ్రహ్మయ్య కోరారు.ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  మరిన్ని వివరాలకు 9030463377 /6309527888/8247688945 నెంబరులో సంప్రదించాలన్నారు.

No comments:

Post a Comment