Tuesday, 28 June 2022

అవిభక్త కవలలు వాణి - వీణాలకు సర్వత్రా అభినందనలు..

♦ నేడు విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణా-వాణి ఉత్తీర్ణత సాధించారు
♦సీఈసీ చదువుతున్న వీణకు 712 మార్కులు వాణి 707 మార్కులు సాధించారు. వీరికి అన్ని వర్గాల ప్రజల నుండి అభినంధనలు..శుభాకాంక్షలు అందుతున్నాయి.. సి.ఎం.కెసిఆర్, కెటిఆర్ లతో సహా  తెలంగాణ మంత్రులు  సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాధోడ్, పువ్వాడ అజయ్ కుమార్.. తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.వాణి -వీణల ఇంటర్ ఉత్తీర్ణత విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్  వెంగళరావు నగర్ డివిజన్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్క ఉ వెళ్లి శుభాకాంక్షలు తెలియచేసారు. 
ఈ కార్యక్రమంలో స్తానిక డివిజన్ కార్పొరేటర్ దేదీప్య రావు, డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, ప్రధాన కార్యదర్శి వేణు, విజయ్ ముదిరాజ్, జి టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, సత్యనారయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment