Tuesday, 14 June 2022

రక్తదానం చేసిన జోయ్ ఆలుకాస్ సిబ్బంది...



ఖమ్మం : అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. స్థానిక జోయాలుకాస్ లో సంస్థకు చెందిన 38 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ ప్రసోభ్ మాట్లాడుతూ రక్త దానం మహాదానం తెలిపారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న రోగులను కాపాడి వారికి నూతన జీవితం అందించినట్లు అవుతుందన్నారు. ప్రతి వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానంపై అపోహలు తొలగించుకుని రక్తదానం చేసి రోగుల ప్రాణాలను కాపాడాలనే ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ  మార్కెటింగ్ ఇంచార్జ్ కిరణ్, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో రక్తదానం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

No comments:

Post a Comment