ఖమ్మం,జూన్ 2.
స్థానిక వి.డి.వోస్ కాలనీలోని శ్రీ షిరిడి సాయి మందిరం లో ఆలయ ద్వాదశ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.స్వామివారికి తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయాన్ని శోభాయమానంగా పుష్పాలతో అలంకరించి విశేషరీతిలో సంప్రదాయ సిద్ధంగా పూజా కార్యక్రమాలను జరిపారు. తెల్లవారుజామున బాబా వారికి కాగడ హారతి మేలుకొలుపు తో ప్రారంభమైన ఈ ఉత్సవంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, బాబా వారికి అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, బాబా వారి మధ్యాహ్న హారతి తదితర వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు మిక్కిలినేని నరేందర్, అయితం రవీందర్, కత్తెర రామ్మోహన్రావు,భైరవరపు సీతారామారావు, చేకూరి శ్రీధర్,తొగుడు పద్మజ, ఆలయ అర్చకులు రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.అనంతరం మధ్యాహ్నం దాదాపు నాలుగు వేల మంది భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మిక్కిలినేని నరేందర్, అయితం రవీందర్ లు పర్యవేక్షించారు.
ఆలయంలో సాయంత్రం సంధ్యా హారతి, దీపోత్సవం, పల్లకి ఉత్సవం, సాయి చాలీసా భజనా, శేజ్ హారతి తదితర పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు రోహిత్ శర్మ సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు.
ఆలయంలో సాయంత్రం సంధ్యా హారతి, దీపోత్సవం, పల్లకి ఉత్సవం, సాయి చాలీసా భజనా, శేజ్ హారతి తదితర పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు రోహిత్ శర్మ సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు.
No comments:
Post a Comment