Monday, 28 November 2022

ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించండి : అధికారులకు అదనపు కలెక్టర్ స్నేహాలత సూచన


ఖమ్మం, నవంబర్ 28: గ్రీవెన్స్ డే సమర్పించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. సోమవారం గ్రీవెన్స్ డే ను పురస్కరించుకుని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. 
    ఈ సందర్భంగా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం సువర్ణాపురం గ్రామానికి చెందిన ఎస్కె. మీరాబీ, తన భర్త కరోనా తో మరణించినట్లు, తనకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం మంజూరుకు కోరగా, జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని విచారణ చేసి, తగుచర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆదేశించారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామం నుండి నాగలక్ష్మి, సత్యవతి, విజయలక్ష్మీ, మాధవి లు తమకు దళితబంధు పథకం క్రింద షీప్ యూనిట్లు మంజూరు అయినట్లు, ఇంతవరకు గ్రౌండింగ్ చేయలేదని, గ్రౌండింగ్ చేయాలని కోరగా, అదనపు కలెక్టర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారికి చర్యలకై ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం మంగలగూడెం నుండి రాయల వెంకటయ్య, సర్వే నెం. 192 లో చట్ట విరుద్ధంగా పాస్ పుస్తకాలు జారీచేసారని, విచారణ చేసి తగుచర్యలకు కోరగా, ఖమ్మం రూరల్ తహసీల్దార్ ను తగుచర్యలకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురం నుండి వనం కృష్ణకాంత్ కోదాడ-ఖమ్మం 365ఏ జాతీయ రహదారి నిర్మాణం పేరుతో మండలంలోని వనరుల దోపిడీ చేస్తున్నట్లు తగు చర్యలకై కోరగా, నేషనల్ హైవే వారిని ఇట్టి విషయమై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వేంసూరు మండలం రాయుడుపాలెం నుండి సిహెచ్. రాధారాణి అంగన్వాడీ ఆయా పోస్టులో నియామకం గురించి కోరగా, జిల్లా సంక్షేమ అధికారిని పరిశీలనకై ఆమె ఆదేశించారు. కామేపల్లి మండలం ఉట్కూరు నుండి ఎస్కె ఖాసిం, గ్రామంలోని మసీదుకు సంబంధించి వివరాలు కోరగా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఆప్టోమెట్రిస్ట్ అసోసియేషన్ వారు, మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో పనిచేసిన ఆప్టోమ్స్ ను రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా దరఖాస్తు ద్వారా కోరగా, జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని పరిశీలించి, తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. స్థానిక సుందరయ్య నగర్ నుండి తోట నాగమ్మ తన ఇంటి ప్రక్క రెండు ఖాళీ ప్లాట్లు చెత్త చెదారం తో నిండివున్నాయని శుభ్రం చేయించుటకు కోరగా, మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కు వెంటనే చర్యలకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. 
    ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శాఖల వారిగా పెండింగ్ గ్రీవెన్స్ లను సమీక్షించారు. గ్రీవెన్స్ లను త్వరితగతిన పరిష్కరించాలని, గ్రీవెన్స్ వెబ్ సైట్ లో దరఖాస్తుల పరిష్కారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. 
    ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Minister Ajaykumar launched Equality Protection Campaign

Hyderbad : State Transport Minister Puvvada Ajay Kumar and Vasantha Lakshmi formally launched the Equality Protection and Empowerment Campaign of the Disabled by Brahmakumaris in collaboration with the Telangana Government at the minister's residential complex in Hyderabad. After that, they started the campaign bus trip by waving the flag.
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో బ్రహ్మకుమారిస్ వారు చేపట్టిన దివ్యాంగుల సమానత్వం పరిరక్షణ, సాధికారత ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం వద్ద లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి దంపతులు.అనంతరం ప్రచార బస్సు యాత్రను జెండా ఊపి వారు ప్రారంభించారు.

Sunday, 27 November 2022

శబరిమలై సన్నిదిలో పోటేత్తిన జనం...80వేలు పైగా ఆదివారం దర్శనం.. స్వచ్ఛ సర్వేక్షన్ పై అధికారుల దృష్టి...

శబరిమలై లో అయ్యప్పలు పోటెత్తారు సన్నిధానం మాలా దారులు, ఇరుముడి దారులతో నిండిపోయి రద్దీగా కనిపిస్తోంది శనివారం 80,000 పైగా అయ్యప్ప స్వామిని దర్శించినట్లు శబరిమలై దేవస్థానం  బోర్డు తెలిపింది. ఆదివారం కూడా అదే మొత్తంలో భక్తులు రద్దీ నెలకొని ఉంది స్వామి శరణం నామస్మరణతో శబరి కొండలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ ఎడాది కొవిడ్ ఆంక్షలు పూర్తిగా తొలగడంతో పాటు..ఎక్కువ గా స్వాములు మాలాధారణ  చేసినట్లు లెక్కలు చేబుతుండగా..యాత్రికుల సౌకర్యార్థం శబరిమల దేవస్థానం బోర్డ్ పలుచోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి సమాచారం సహకారం అందజేస్తుంది శబరిమలై యాత్రికుల కోసం చెంగనూరు కొట్టాయం కొచ్చిన్ తోపాటు పంబ ఎరిమేలీ, శబరిమల దేవస్థానం ప్రాంతంలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం బోర్డు తెలియజేసింది భక్తులు ఈక్వూని సందర్శించడం ద్వారా ఎక్కువ సమయం పట్టకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంది శబరిమలై లో పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు మరోవైపు కేరళ అటవీశాఖ వివిధ స్వచ్ఛంద  సంస్థలను కలుపుకొని పర్యావరణ శుభ్రత పై యాత్రికులకు అవగాహన కల్పిస్తోంది శబరిమల పంబ అటవీ ప్రాంతాల్లో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ప్లాస్టిక్ కు తదితర వ్యర్ధాలను ఈరోజు తొలగించారు..
@ మణికుమార్..
(సహకారం శబరిమల నుండి
ఇంటూరి రామకృష్ణ)

అభివృద్ధిలో ఖమ్మం బేష్... అధికారులు ఖమ్మం చూసి రావాలని కేసీఆర్ సూచన

హైదరాబాద్ : 
◆నిజామాబాద్ అభివృద్ధిపై ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం అభివృద్ధి పై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘ వొకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరం గా మారింది. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలె. మీరంతా కలిసి ఖమ్మం టూరు వెల్లండి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రాండి.’’ అని నిజామా బాద్ అధికారులను, ఎమ్మెల్యేలను సిఎం కేసీఆర్ ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్సీ కవిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Thursday, 24 November 2022

ఓటు ప్రాధాన్యతపై అవగాహన పెంచండి : అధికారులతో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్..


ఖమ్మం, నవంబర్ 24: గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జిల్లాలో పర్యటించి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం క్రింద క్రొత్త ఓటర్ల నమోదు, ఓటర్ జాబితా లో తొలగింపు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి ఖమ్మం రూరల్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తల్లంపాడు, జలగం నగర్, ఖమ్మం అర్బన్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇందిరానగర్ లను సందర్శించి అక్కడ చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని బూత్ లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ క్రొత్త ఓటర్లు పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంతమంది ఉన్నది, మరణించిన వారి ఓట్ల తొలగింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మందికి క్రొత్త ఓటర్ నమోదు ఫారాలు ఇచ్చింది, ఇప్పటివరకు ఎంతమందిని నమోదు చేసుకుంది అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వారందరి నుండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి పోలింగ్ కేంద్రం పరిధిలో క్రొత్తగా వచ్చిన వారిని ఎలా నమోదు చేసుకుంటుంది, ఎన్ని దరఖాస్తులు వచ్చింది, విచారణ ఎలా చేస్తుంది అడిగి తెలుసుకున్నారు. ఆధార్ సేకరణ పురోగతిని అడిగారు. సంబంధిత తహశీల్దార్లు ప్రతివారం బూత్ లెవల్ అధికారులను పిలిచి ప్రక్రియ పై సమీక్షించాలన్నారు. మండల పరిధిలో ఎన్ని కళాశాలలు ఉన్నావో, వాటి నుండి దరఖాస్తులు స్వీకరించి, అడ్రసుల ప్రకారం సంబంధిత మండలాలకు పంపాలన్నారు. సూపర్వైజర్లు వారి వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల సందర్శన చేయాలని, ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థినులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మంచి, చెడులు జరుగుతుంటాయని, అన్నిటికీ మనం సాక్ష్యంగా ఉంటామని, వీటితోనే మన సమస్యలు తెలుసుకుంటామని అన్నారు. ఇలా జరగాలి, ఇలా జరగకూడదు అనే అవగాహన ఉంటే చాలని ఆయన తెలిపారు.
కళాశాలలో 680 మంది క్రొత్త ఓటర్లు గా నమోదు అవుతున్నట్లు, ఓటు ప్రాధాన్యత పై కుటుంబం, సమాజం అందరితో మాట్లాడాలని, మంచి సమాజ నిర్మాణం కోసం అంతా కలిసి పనిచేయాలని అన్నారు. ఓటరుగా అర్హులైన వారందరు నమోదవ్వాలని,ఓటు ప్రాధాన్యత పై కుటుంబం, సమాజం అందరితో మాట్లాడాలని, ఓటుతో మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అవ్వాలని ఆయన తెలిపారు.
     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, 17 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి నుండి ముందస్తు దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ఓటు చాలా విలువైనదని, ఎన్నికల ప్రక్రియపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు. 
   కార్యక్రమంలో కళాశాల ఓటరు నమోదుకు నియమించబడ్డ అంబాసిడర్లచే ఓటరు నమోదుకు చేపడుతున్న ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఓటు ప్రాముఖ్యత వారు తెలిపారు. ఓటు అమ్ముకోకూడదని విద్యార్థినులు చేసిన స్క్రిప్ట్ ఆలోచింపచేసింది.
    ఈ సందర్భంగా ఓటరు నమోదుపై రూపొందించిన పోస్టర్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆవిష్కరించారు.
     ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. పద్మావతి,  ఖమ్మం ఆర్డీఓ రవీంద్రనాథ్, ఎస్డీసి దశరథం, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, తహశీల్దార్లు సుమ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో పోడుభూముల సమస్య త్వరలోనే పరిష్కారం.... ఈడీ దాడులకు బెదరం : ఎంఎల్ సి తాతామధుసూదన్

24-11-2022
ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం.
---------------------------------------------------------
*ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహణ..*

*టిఆర్ఎస్ పార్టీ తరఫున విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన FRO శ్రీనివాస్ రావు గారికి నివాళులు అర్పించిన 
*పోడు భూముల సమస్యలను తీర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  ఇప్పటికే కసరత్తు బాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్  ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసినందున. త్వరలోనే పోడు భూముల సమస్య పూర్తిగా తీరనున్నదని ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు.ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలతో కలసి పాల్గొని మాట్లాడారు.
 తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నాయకులపై ఇడి, ఐటి అధికారులు దాడులు చేస్తున్నారని, BJP పార్టీ ఉడత ఊపులకు తెలంగాణ బిడ్డలు భయపడే ప్రసక్తే లేదంటూ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంపై అనేక కుట్రాలు., కుయుక్తులు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వ బీజేపీ నిరంకుశ విధానాన్ని  తాత మధుసూదన్ .తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈడీ దాడులతో టిఆర్ఎస్ నాయకులను కేంద్ర బిజెపి భయపెట్టించాలని చూస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట నడుస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులను లొంగదీసుకునేందుకే తమ చేతిలో కీలుబొమ్మగా ఉన్న ఈడి లను మన రాష్ట్రంలో ఉపయోగించి మొన్న నామ నాగేశ్వరరావు , నిన్న మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ రవిచంద్ర, నేడు మంత్రి మల్లారెడ్డి పై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు*
*తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తెలంగాణ గడ్డపై స్వామీజీల ముడుపుల రూపంలో పట్టుబడిన బిజెపి నాయకుల బండారం బయటపడిందని ఈ వ్యవహారంతోనే బిజెపి పార్టీ గోరి కట్టడం ఖాయమని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలుగా చలామణి అవుతున్న బిజెపి ఎంపీలు రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా ? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కుంగలో తొక్కి గుజరాతీలకు గులాం గిరి చేస్తున్న బిజెపి నాయకులకు త్వరలోనే తెలంగాణ ప్రజలు తమ గుణపాఠం నేర్పుతారని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంగా మెలుగుతున్నారని, తెలంగాణ బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరికినే ప్రసక్తే లేదని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితమ్మ పై అవక్కులు చవాకుల పేలిన ఎంపీ అరవింద్ ఇకనైనా బుద్ధితో మెలగాలని హితవు పలికారు. Bjp నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  తెలంగాణ రాష్ట్రంలో CM కెసిఆర్  చేస్తున్న సంక్షేమ పథకాలతో యావత్ దేశంలో తమకు రాజకీయ ఉనికి కోల్పోతామని భయపడుతున్న బిజెపి నాయకులు కొందరు వ్యక్తులతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర పన్నుతున్న విషయం మనందరికీ తెలిసిందేనని, తెలంగాణ ప్రజలంతా జాగ్రత్తగా మెదగాలని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ & జిల్లా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ వెంట జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, నగర మేయర్ నీరజ , రాష్ట్ర విత్తన అభివృద్ధి శాఖ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , జిల్లా రైతు సమన్వయ కోఆర్డినేటర్ నల్లమల్ల వెంకటేశ్వర్లు , కార్పొరేటర్ కమర్తపు మురళి , మాజీ జిల్లా గ్రంథాలయ  చైర్మన్ ఖమార్ , రూరల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 23 November 2022

ఆ నలుగురై ముందు నిలిచిన తెరాస నేతలు..శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి...

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడులో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావు పై గుత్తికోయలు(వలస ఆదివాసులు) కత్తులతో దాడి చెయ్యగా తీవ్రంగా గాయపడ్డి మరణించిన ఎఫ్ఆర్వో చల్లమల్ల శ్రీనివాసరావు అంత్యక్రియలకు తెరాస నేతలు ఆ నలుగురై ముందు వరుసలో నిలిచారు..R.O శ్రీనివాస రావు భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించిన మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎం.ఎల్.సి.తాత మధులు అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు. కెసిఆర్ ఆదెశాల మేరకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో చండ్రుగొండ చేరుకున్న తెరాస నేతలు. FRO శ్రీనివాసరావు  దేహాన్ని  సందర్శించి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.  ఇటువంటి దారుణాలు ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని మంత్రులు అజయ్ని కుమార్స, ఇంద్రకరణ్ రెడ్డి లు పేర్కొన్నారు. శ్రీనివాస రావు ఆత్మ‌కు శాంతి కలగాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ప్రభుత్వం తరుపున రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన విషయం పేర్కొన్నారు.అనంతరం శ్రీనివాసరావు పాడే మోసారు..ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. 
కార్యక్రమంలో వీరితో పాటు ఎమ్మెల్యేలు రెగా కాంతారావు, రాములు నాయక్, మెచ్చ నాగేశ్వర రావు, CMO సెక్రటరీ స్మితా సబర్వాల్, హరితాహరం OSD ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ (HoFF) దొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, కలెక్టర్ VP గౌతమ్, కొత్తగూడెం SP వినీత్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Monday, 21 November 2022

ప్రతాపని నరసింహారావు దంపతులచే లక్ష రుద్రార్చన..శివకళ్యాణం....

ఖమ్మం : కమనీయ కార్తీకం చివరి సోమవారం బ్రాహ్మణ బజార్ లోని శ్రీభ్రమరాంబా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్ఛారు..
అభిషేకాలు..అర్చనలు ఈశ్వరునికి ప్రీతికరంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం 8 గంటలక గణపతి పూజ,పాశుపతహోమం
10 గంటలకు మహాన్యాస పూర్వక అభిషేకం
మధ్యాహ్నం12 గంటలకు లక్ష  రుద్రాక్షార్చన
సాయంత్రం 4 గంటలకు శాంతి కల్యాణం , జ్యోతిర్లింగార్చన అనంతరం సాయంత్రం కోటి దీపాల వెలుగులతో ఆలయప్రాంగణం జ్యోతి ర్శయంగా శోభిల్లింది..
 ప్రతాపని నర్సింహారావు దంపతుల నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి శివాలయ ప్రధాన అర్చకులు బాదంపూడి కాళిప్రసాద్ నేతృత్వం వహించగా బాదంపూడి శివకుమార్, విజయకుమార్, పృథ్వి, నాగేశ్వరరావు, రామారావు తదితరులు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.

Wednesday, 16 November 2022

ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. జిల్లా జడ్జ్ డా.టి.శ్రీనివాసరావు సూచన


ఖమ్మం, నవంబర్ 16:  జిల్లా కోర్టులో పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులతో ఏర్పాటుచేసిన 4 కోర్ట్ హాళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మొబైల్ కోర్ట్, ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్-కమ్-ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎక్సైజ్ కోర్ట్ హాళ్ల నిర్వహణకు భవన పునర్నిర్మాణం చేపట్టి, ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పనిని ప్రతి రోజు చేయాలని ఆయన అన్నారు. తాను వచ్చినప్పటి నుండి సత్తుపల్లి బార్ అసోసియేషన్, ఖమ్మం బార్ అసోసియేషన్ లకు కలెక్టర్ సహకారంతో ఏసీ లు పెట్టించినట్లు, ఇంకా భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో ప్రధమ స్థానంలో నిలిచామని ఆయన తెలిపారు. 
    కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, న్యాయవాదులకు, ప్రజలకు సౌలభ్యం కొరకు సమీకృత కోర్టు భవనాల సముదాయం నిర్మించినట్లు, ఇది చూసే పాలనా సౌలభ్యం కొరకు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పౌరునికి న్యాయం అందించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పనిచేయాలన్నారు. ప్రధాన న్యాయమూర్తి సామాజిక కోణంలో పనిచేస్తున్నారని, ప్రజల్లో న్యాయం లభిస్తుందనే నమ్మకం కల్గిస్తున్నారని, న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. కోర్టులో ఏసీ, ఫర్నిచర్ లకు ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 
  ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి డానిరూత్, ఎస్సి/ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి అమరావతి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జావిద్ పాషా, న్యాయమూర్తులు శాంతిసోని, మౌనిక, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు, బార్ బాధ్యులు వీరేందర్, వీరన్న, యాకుబ్, వెంకట నారాయణ, ఇమ్మడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి


కొమురం భీం ఆసిఫాబాద్
జిల్లాలోని పలు మండలాలలో నిర్మించిన ఏడు పోలీస్ స్టేషన్ లను బుధవారం హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చి దేశంలోనే ఎక్కడ లేనివిధంగా హైదరాబాదులో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ కెమెరాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నూతన జిల్లాలను ప్రకటించిన అనంతరం అడ్మినిస్ట్రేషన్ , ల్యాండ్ ఆర్డర్ చాలా చక్కగా పనిచేస్తున్నాయని తెలిపారు. పౌరరక్షణ, శాంతిభద్ర తలను కాపాడటంలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నరని వారికి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజారక్షణకు కృషి చేస్తారని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పోలీస్ స్టేషన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో వాంకిడి, రెబ్బెన్ కాగజ్ నగర్ రూరల్, పెంచికల పేట్, చింతలమానెపల్లి, కౌటాల, కాగజ్ నగర్ సర్కిల్ భవనం నిర్మాణాలకు రెండేళ్ల క్రితం నిధులు విడుదల చేశామన్నారు. భవనాలు పూర్తి స్థాయిలో పూర్తి కాగా వీటిని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, డిజిపి మహేందర్ రెడ్డి, జిల్లా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

స్టూడెంట్ ముసుగులో డ్రగ్ దందా... పాతబస్తీ పోలీసులకు చిక్కిన సూడానియన్...


*హైదరాబాద్:* బెంగళూరు నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్​ తరలిస్తున్న డ్రగ్​ పెడ్లర్​​ను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడి వద్ద 12 గ్రాముల యమ్​డియమ్​ఏ డ్రగ్స్,ఒక మొబైల్​ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్​ తరలించి అమ్ముతున్న సూడాన్​ దేశానికి చెందిన ​డ్రగ్​ పెడ్లర్​ను​​,హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.సూడాన్​ దేశానికి చెందిన మహ్మద్ యాకుబ్ భారత దేశానికి చదుకోవడానికి వచ్చాడు. కానీ చదువు ముసుగులో అక్రమంగా బెంగళూరు నుంచి డ్రగ్స్​ తరలించి హైదరాబాద్​లో అమ్ముతున్నాడు.ఈ క్రమంలో ఈరోజు పాతబస్తీ, ఫలక్​నుమా పోలీసులు, హైదరాబాద్​ నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్​ వింగ్​ అధికారులతో కలిసి చేపట్టిన జాయింట్​ ఆపరేషన్​లో ఫలక్​నుమా పోలీస్​స్టేషన్​ పరిధిలో నిందితుడు పట్టుపడ్డాడు. యాకుబ్ గతంలో హైదరాబాద్​లోనే ఉండేవాడని అతనిపై రాజేంద్రనగర్​, కుషాయిగూడ పోలీస్ స్టేషన్​లో కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు.అతడి వద్ద 12 గ్రాముల యమ్​డియమ్​ఏ డ్రగ్స్,ఒక మొబైల్​ ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tuesday, 15 November 2022

అధికార లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు...వ్యక్తి గతంగా మంచి మిత్రుడిని కొల్పోయానన్న కెసిఆర్.. బాధాకరం... మంత్రి పువ్వాడ.

Hyderabad/15.11.2022
👉
వ్యక్తి గతంగా మంచి మిత్రుడిని కొల్పోవడం బాధకరం .అధికార లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అదేశాలు జారీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు..మంత్రులు హరీష్ రావు..అజయ్ కుమార్ తదితరులతో కలసి నానాక్ రామ్ గూడాలోని కృష్ణ గృహానికి వెళ్లిన కెసిఆర్...కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం మహేష్ బాబును పలకరించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్వక్తం చేశారు..అల్లూరి సీతారామరాజు గా కృష్ణ దేశభక్తి చాటాడంటూ గుర్తుచేసుకున్నారు
 ముఖ్యమంత్రి కేసీఆర్..
ప్రముఖ చలనిత్ర సీనియర్ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి ముఖ్యమంత్రి కేసీఅర్ గారితో కలిసి వెళ్లి కృష్ణ పార్ధీవదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ అని కొనియాడారు.
కృష్ణ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎనలేని సేవలు అందించారని అన్నారు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Sunday, 13 November 2022

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసులో మానిటరింగ్ హబ్ ప్రారంభించిన మంత్రి హారీష్ రావు...


• రాష్ట్రంలోని 887 PHC ల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, TSMSIDC అనుసంధానం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దీని ద్వారా. ఉన్నతాధికారులు ఎక్కడి నుంచే మానిటర్ చేసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. 
ఏవైనా ఔట్ బ్రేక్స్ కలిగినప్పుడు సలహాలు సూచనలు ఇచ్ఛేందుకు మానిటరింగ్ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా వుంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. 
• డాక్టర్లు తమ phc లోని ఫార్మసీ, ల్యాబ్ ను మానిటర్ చేసే అవకాశం కలుగుతుంది. 
•  మెడికల్ కాలేజీలు, జిల్లా హాస్పిటల్ తో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం కలుగుతుంది. 
•  సీసీ కెమెరాలతో సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటుంది. 
•  ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం దేశంలో మొదటిసారి. 
• తెలంగాణలో ప్రాథమిక వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ గారు బలోపేతం చేస్తున్నారు.
•  43 పిహెచ్సి లకు 67 కోట్లతో కొత్త బిల్డింగ్ లను మంజూరు చేశాం. 372 పిహెచ్ సి ల మరమ్మతులను 43 కోట్ల 18 లక్షలతో చేపట్టాము. 1239 సబ్ సెంటర్ల కొత్త భవనాలకు శాంక్షన్ ఇచ్చాము. ఒక్కో దానికి 20 లక్షల ఖర్చు చేస్తున్నాం. అన్నిటికి కలిపి మొత్తంగా 247 కోట్లు వెచ్చించాం. 1497 సబ్ సెంటర్ లను ఒక్కోదానికి 4 లక్షల చొప్పున 59 కోట్లతో మరమ్మత్తులు చేపట్టాము.
• మునుగోడు ఎన్నిక వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైంది. 969 పోస్టులకు మెరిట్ లిస్ట్ ప్రకటించాము  వారం పది రోజుల్లో నియామక పత్రాలు అందిస్తాం. దీంతో అన్ని phc ల్లో డాక్టర్లు ఉంటారు. 
• పల్లె దవాఖానల కోసం 1569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో మొదలవుతుంది. 
• రాష్ట్రంలో 331 బస్తి దవాఖానలు పనిచేస్తున్నాయి. వీటిని 500 కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 
• ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైంది. 
• వీటి వల్ల ఉస్మానియా, గాంధీ,ఫీవర్ వంటి హాస్పిటల్లపై ఒత్తిడి తగ్గింది. 
• 2019లో ఉస్మానియా హాస్పిటల్ లో 12 లక్షలు ఓపీ ఉంటే.. ఈ ఏడాది  5 లక్షలకు తగ్గింది. గాంధీలో 6.5లక్షల నుండి 3.70 లక్షలకు, నిలోఫర్ లో  8 లక్షల నుండి 5.5 లక్షలకు, ఫీవర్ హాస్పిటల్ లో 4 లక్షల నుండి 2 లక్షలకు తగ్గింది. దీంతో అక్కడ సర్జరీల పెరిగాయి. 
• తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల టెస్టులు చేశారు. 
• వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసానన్న సంతృప్తి కలిగింది. 
• స్టాఫ్ నర్స్, 1165 స్పెషలిస్ట్ డాక్టర్ నోటిఫికేషన్ త్వరలో ఇస్తాం. 
• కేంద్రం 157 మెడికల్ కాలేజ్ లు ఇచ్చినా ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటాం. స్వయంగా నేనే పత్రాలు తీసుకొని వెళ్తాను. కిషన్ రెడ్డి చొరవ తీసుకుంటారా..?

బ్రహ్మాణ, ఆర్యవైశ్య సంఘాల వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అజయ్ కుమార్

Khammam/13.11.2022
ఖమ్మం నగరంలో పలు కుల సంఘాల అధ్వర్యంలో వేరు వేరుగా నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమాల్లో వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..
శ్రీనివాస నగర్ లోని SN మూర్తి మామిడి తోటలో వేరు వేరుగా జరిగిన బ్రహ్మాణ   ఆర్యవైశ్య సంఘాల, వైఎస్ఆర్ నగర్ వద్ద గల మామిడి తోటలో NRI పేరెంట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధనలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని వారిని అభినందించారు. కుల సంఘాలు స్వార్థ ప్రయోజనాలకు కాకుండా అయా కులాలలో పేదలకు చేయుత ఇవ్వాలని.. ఆర్థికంగా అభివృద్ధి కోసం సంఘం నేతలు పనిచేయాలని సూచించారు..

Saturday, 5 November 2022

తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం : డయల్ యువర్ ఇ.ఓలో దర్మారెడ్డి

తిరుమల, 2022 న‌వంబ‌రు 05

టీటీడీ న‌గ‌దు, బంగారు డిపాజిట్ల‌పై శ్వేత ప‌త్రం

- 15 వేల 900 కోట్లు జాతీయ బ్యాంకుల‌లో డిపాజిట్‌

- హిందూ మ‌త ద్వేషులు చేస్తున్న ఇలాంటి కుట్ర‌లు, కుతంత్రాల ప్ర‌చారాన్ని భ‌క్తులు న‌మ్మ‌వ‌ద్దు

- డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి
        శ్రీ‌వారికి భ‌క్తులు స‌మ‌ర్పించిన న‌గ‌దు, బంగారు డిపాజిట్ల‌ను జాతీయ బ్యాంకుల‌లో డిపిజిట్ చేసిన‌ట్లు టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు .తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. కిషోర్ - కావాలి

ప్ర‌శ్న - త్వ‌ర‌లో కాల ప‌రిమితి ముగియ బోతున్న రూ.5 వేల కోట్ల డిపాజిట్లను ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం నిజమేనా.

ఈవో -  టీటీడీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఏ ప్ర‌భుత్వ‌నికి డ‌బ్బులు ఇవ్వ‌లేదు, భ‌విష్య‌త్లులో కూడా ఇవ్వ‌దు. చైర్మ‌న్‌, టీటీడీ మీద బుర‌ద చ‌ల్ల‌డానికి హిందూ మ‌త ద్వేషులు ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డుతున్నారు. టీటీడీ చైర్మ‌న్‌, బోర్డు అధికారులు ఇంత వ‌ర‌కు ఏ త‌ప్పు చేయ‌లేదు, ఇక‌మీద కూడా చేయ‌రు. రాష్ట్ర‌ ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయ‌లేదు. ఇప్ప‌టిదాకా రూ.15 వేల 900 కోట్లు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేశాం. ఇక‌పై కూడా వ‌డ్డీ ఎక్కువ‌గా ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తాం.
హిందూ మ‌త ద్వేషులు చేస్తున్న ఇలాంటి కుట్ర‌లు, కుతంత్రాల‌ను భ‌క్తులు న‌మ్మ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. టీటీడీ న‌గ‌దు, బంగారం బ్యాంక్ డిపాజిట్లపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేస్తాం.
2. హనుమంత్ ప్రసాద్ - హైదరాబాద్,    తిరుమల్ రావు - నల్గొండ

ప్రశ్న- మా కాలనీలోని రామాలయంలో ధూప, దీప, నైవేద్యాలు భారంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఐదువేలు సరిపోవడం లేదు. టిటిడి తరఫున ఆర్థిక సహాయం అందించగలరు. మాకాల‌నీల‌లో కళ్యాణ మండపం నిర్మించేందుకు చర్యలు తీసుకోండి.

ఈవో - టీటీడీ అధికారులు పరిశీలించి, శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా సహాయం అందించేందుకు ప్రయత్నిస్తాం.
క‌ల్యాణ మండ‌పం నిర్మాణానికి  నిబంధ‌న‌ల మేర‌కు అధికారులు ప‌రిశీలిస్తారు.  

3. పెంచలయ్య - నెల్లూరు

ప్రశ్న- మా గ్రామంలో దేవాలయం నిర్మాణానికి టీటీడీ ఆమోదం తెలిపింది. తర్వాత రద్దు చేశారు

ఈవో - ఆల‌య నిర్మాణానికి నిబంధనలను పరిశీలిస్తాం.

4. సుభాషిణి - చెన్నై

ప్రశ్న- వయోవృద్ధులకు స‌హాయ‌కులుగా వ‌చ్చే రక్తసంబంధీకులు 50 సంవత్సరాలు పైబ‌డి  ఉండాల‌నే నిబంధ‌న పెట్టారు. వ‌యోవృద్ధుల‌ను ఆల‌యంలో తోసేస్తున్నారు.

ఈవో -  వ‌యోవృద్ధుల‌ను శ్రీవారి సేవకులు మాత్రమే తీసుకుని వెళ్ళి ద‌ర్శ‌నం చేయించేలా చర్యలు తీసుకుంటాం.

5. రాంబాబు - ఖమ్మం

ఈవో - స్వామివారికి వెండి కిరీటం ఇవ్వాలనుకుంటున్నాం.

 ఈవో - శ్రీవారికి వెండి కిరీటం వాడటం లేదు. మీ నుండి వెండి కిరీటం విరాళంగా తీసుకుని టిటిడి అనుబంధాలయాల్లో వినియోగించే విషయం పరిశీలిస్తాం.

6. సాంబయ్య - వరంగల్

ప్రశ్న- విఐపి బ్రేక్ దర్శనాలకు లెటర్ ఎప్పుడు ఇవ్వాలి.

ఈవో -  ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటల లోపల లెటర్ ఇవ్వాలి. ఆరున్నర గంటల త‌రువాత  మీ మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. తర్వాత దర్శనం టికెట్లు పొందాలి.

7. బాలాజీ - చెన్నై

ప్రశ్న- మేము చెన్నై నుండి ఎలక్ట్రికల్ బైక్ లో తిరుమల వచ్చాం. అక్కడ చార్జింగ్ పాయింట్లు లేవు. తిరుమ‌ల‌, తిరుప‌తిలో చార్జీంగ్ పాయింట్లు ఏర్పాటు చేయగలరు.

ఈవో - ప్రస్తుతం అలిపిరి, తిరుమలలో టీటీడీ చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. భ‌క్తులు అవ‌స‌ర‌మైతే భ‌క్తులు వినియోగించుకోవ‌చ్చు. త్వరలో ఏపిఎస్ ఆర్టీసి, హెచ్‌సిఎల్‌ వారితో సమన్వయం చేసుకొని ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.

8. అశోక్ కుమార్ - చెన్నై

ప్రశ్న- అలిపిరి నడక మార్గంలో తనిఖీల సమయంలో సిబ్బంది భ‌క్తుల‌ను అవమానిస్తున్నారు.

ఈవో - భద్రత కారణాలు రీత్య అలిపిరి, శ్రీ‌వారిమెట్టు వ‌ద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. భ‌క్తుల ప‌ట్ల అవ‌మానంగా ప్ర‌వ‌ర్తించ కుండా చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్ సిబ్బంది మిమ‌ల్ని అవ‌మానించి ఉంటే క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను.

9. తేజ - బెంగళూరు

ప్రశ్న- వృద్ధులకు, చిన్న పిల్లలకు నేరుగా దర్శనం కల్పించండి.

ఈవో - ప్ర‌తి రోజు ఒక గంట వృద్ధులకు, దివ్యాంగుల‌కు, చిన్న పిల్లల త‌ల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తున్నాం. ఈ టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని తిరుమ‌ల‌కు రావాలి.

10. రాజేశ్వరరావు - కరీంనగర్

ప్రశ్న- శ్రీవారి సేవలో లడ్డు ప్ర‌సాద సేవను తీసేసారు. తిరిగి ప్ర‌వేశ పెట్టండి.

ఈవో - లడ్డు ప్ర‌సాద సేవ చేయ‌డానికి అనుభ‌వం క‌లిగి, చేయగలవారు ఉంటే పరిశీలిస్తాం.

11. యువరాజు - తిరుపతి

ప్రశ్న- శ్రీనివాసం వ‌స‌తి స‌మూదాయాల వ‌ద్ద రోడ్డు దాటడానికి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జ్ ఏర్పాటు చేయ‌గ‌ల‌రు.

ఈవో - తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీకి తెలియ‌జేసి స‌మ‌స్య‌ ప‌రిష్క‌రించే ఏర్పాటు చేస్తాం.

12. సూర్యనారాయణ - విజయవాడ,     మల్లేశ్వరరావు - నిర్మల్

ప్రశ్న- నడిచి వెళ్లే భక్తుల‌కు దివ్యదర్శనం టోకెన్లు ఎప్పటినుంచి ప్రారంభిస్తారు.

సర్వదర్శనం ఎస్ ఎస్ డి  టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేయగలరు

ఈవో - న‌వంబర్ 1వ తేదీ నుండి అలిపిరి వద్ద గల శ్రీదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, శ్రీ గోవిందరాజస్వామి స‌త్రాల వద్ద ఎస్ ఎస్‌డి టోకెన్లు జారీ చేస్తున్నాం. సోమవారం నుండి గురువారం వరకు 15 వేలు, శుక్ర, శని, ఆదివారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేస్తున్నాం. ఇప్పటికే రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టోకెన్లు ఆన్‌లైన్‌లో ఉంచ‌డం జరిగింది.

13. శ్రీనాథ్ - తూర్పుగోదావరి

ప్రశ్న- శ్రీవారి సేవను ఆఫ్ లైన్ కూడా ఇవ్వగలరు.

ఈవో -  శ్రీ‌వారిసేవ‌ను ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలి. శ్రీ‌వారి సేవ స్వ‌చ్ఛంద సేవ కావున సేవ‌కులు ఎవ‌రికి డ‌బ్బు ఇవ్వ‌కండి.

14. సాంబ‌మూర్తి -  

ప్ర‌శ్న - మాగ్రామంలో శ్రీనివాస కళ్యాణం చేయాలని ఉంది. నాకు అంత ఆర్థిక స్థోమత లేదు.

ఈవో - శ్రీనివాస కళ్యాణం నిర్వ‌హించ‌డానికి రెండు ప‌ద్ధ‌తులు ఉన్నాయి. ఒకటి దాతల సహకారంతో,  రెండవది టీటీడీ చేయడం, మా అధికారులు పరిశీలించి త‌గిన నిర్ణయం తీసుకుంటారు.

15. ఆనంద్ - ముంబై

ప్రశ్న- దర్శనానికి 9 గంటలపాటు వేచి ఉండవలసి వస్తోంది. మాకు సమయ నిర్దేశిత దర్శనం కల్పిస్తే ఇతర ఆలయాలను దర్శించుకుంటాము.

ఈవో - న‌వంబ‌రు 1వ తేదీ నుండి తిరుపతిలో ఎస్ ఎస్‌డి టోకెన్లు మూడు ప్రాంతాల్లో జారీచేస్తున్నాం.

16. శివగోపాల్ - కర్నూలు

ప్ర‌శ్న - నారాయణగిరి ఉద్యాన‌వ‌నాల‌లో నిర్మించిన విధంగా షెడ్ లను బయట క్యూలైన్ల వద్ద కూడా నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈవో - ప్రతి రోజు తిరుమ‌ల‌కు వ‌చ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. కాబ‌ట్టి తిరుమ‌ల మొత్తం షెడ్లు నిర్మించ‌లేము. అందుకే తిరుప‌తిలో నవంబరు 1వ తేదీ నుండి ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేస్తున్నాం.

17. లక్ష్మీనారాయణ - రాజమండ్రి

ప్రశ్న- ఎస్వీబిసి లో ప్రసారమయ్యే కార్యక్రమాలు చాలా బాగున్నాయి. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ఈ కార్య క్ర‌మాల‌ను వీక్షిస్తున్నాము. చిన్నపిల్లల ఆసుపత్రికి రూ.10 వేల రూపాయలు విరాళం ఇచ్చిన వారికి కూడా బ్రేక్ దర్శనం కల్పించగలరు.

ఈవో - చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రికి ఇప్పటికే లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తున్నాం. రూ.10 వేలు విరాళం ఇచ్చే దాత‌ల‌కు దర్శనం కల్పించలేము.

18. అప్పారావు గుడివాడ

ప్ర‌శ్న - కరోనా సమయంలో అద్భుతంగా పారాయణం చేశారు. వయోవృద్ధులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి.

ఈవో - ప్రతి రోజు వ‌యోవృద్ధుల‌కు ప్ర‌త్యేకంగా ఒక గంట దర్శనం కల్పిస్తున్నాము ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చు

19. రజ‌ని - చెన్నై,      వేంకటేశ్వర్లు - బద్వేల్  

ప్ర‌శ్న - శ్రీవారి సేవ చివరి రోజు ఆలయ డ్యూటీ వచ్చింది, అందులో లాగేస్తున్నామని భ‌క్తులు కోపడ్డారు.

ఈవో - వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్ లలో గంటల తరబడి శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తులు ఆల‌యంలోకి రాగానే ఎక్కువ స‌మ‌యం స్వామివారిని చూడాల‌నుకుంటారు. దీని వ‌ల్ల క్యూ కాంప్లెక్స్‌ల్లో భ‌క్తుల‌కు ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌వ‌ల‌సి వ‌స్తుంది. కావున శ్రీ‌వారి సేవ‌కులు స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రించాలి.

20. జయలక్ష్మి - కర్నూలు

ప్ర‌శ్న - ప్రతి నెల విడుదల చేసే ఆర్జిత‌ సేవలు లక్కీ డిప్‌లో  తగలడం లేదు. నేను సంగీతం టీచర్ ని, నాదనీరాజన వేదిక‌పై పాడేందుకు అవకాశం కల్పించగలరు.

ఈవో - శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను ఆన్‌లైన్‌లో రిజిస్ట‌ర్‌ చేసుకోవచ్చు, అలాగే తిరుమలలో కూడా ముందు రోజు రిజిస్టర్ చేసుకుని లక్కీ డిపోలో పాల్గొన‌వచ్చు. నాద‌నీర‌జ‌నం వేదిక‌పై పాడ‌టానికి అవ‌కాశం క‌ల్పిస్తాం.

21. ఆంజనేయులు - విజ‌య‌వాడ‌

ప్ర‌శ్న - తిరుప‌తిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పిల్ల‌ర్ల‌పై స్వామివారి నామాలు ఏర్పాటు చేసి వాటి మీద వాహ‌నాలు తీరుగుతున్నాయి. ఇది మంచిదేనా.

ఈవో - ఆగమపండితులతో సంప్రదించి చ‌ర్య‌లు తీసుకుంటాం.

22. వెంకటేశ్వరరావు - ఏలూరు

ప్ర‌శ్న - తిరుమ‌ల‌లో మాకు భజనలు చేసేందుకు అవకాశం కల్పించండి.

ఈవో - అఖండ హరినామ సంకీర్తనలో పాల్గొనేందుకు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోండి.

23. శ్రీకాంత్ - తిరుపూరు

ప్ర‌శ్న - శ్రీవారి సేవ మూడు రోజులు ఉండేది ఇప్పుడు తీసేశారు.

ఈవో - ఏడు రోజుల సేవ‌కు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మూడు రోజుల సేవను పరిశీలిస్తాం.

25. వేణుగోపాల్ హైదరాబాద్

ప్ర‌శ్న - గదుల‌ బుకింగ్‌కు సంబంధించిన స్కానింగ్‌ను తిరుమ‌ల ఆర్‌టిసి బ‌స్టాండ్‌లో ఏర్పాటు చేయండి. సమస్యలను తెలిపేందుకు డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కాకుండా వేరే మార్గాలను ప్రవేశపెట్టండి. ఆర్జిత‌ సేవల లక్కి డిప్‌కు ఆధార్ కార్డు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోండి. దాత‌ల‌కు అందించే స‌దుపాయాల‌ను త‌గ్గిస్తున్నారు.

ఈవో - అలిపిరి వద్ద గదుల స్కానింగ్ స‌దుపాయం అందుబాటులో ఉంది. ఆర్‌టిసి బ‌స్టాండ్ వ‌ద్ద కూడా ఏర్పాటు చేసే విష‌యం పరిశీలిస్తాం. స‌మ‌స్య‌ల‌ను ఈమెయిల్‌, కాల్ సెంటర్ ద్వారా కూడా తెలియజేయవచ్చు. దాత‌ల‌కు అందించే స‌దుపాయాల‌ను త‌గ్గించ‌డం లేదు.

26. ప్రసాదరావు - హైదరాబాద్

ప్ర‌శ్న - ఎస్వీబిసి కార్యక్రమాలు బాగున్నాయి. భగవద్గీతలోని శ్లోకాలు సిడిల‌ రూపంలో అందించండి.

ఈవో -  భగవద్గీత శ్లోకాలను,వాటి తాత్ప‌ర్య‌ల‌ను త‌యారు చేసి యూట్యూబ్ లో ఉంచాము. ఈ - మెయిల్ చేస్తే సిడిలు కూడా పంపుతాం.

శ్రీభ్రమరాంబిక సేవ సమితి ఆధ్వర్యంలో "భావ"దేవునికి కుంభహారతి

 క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా శ్రీభ్రమరాంబిక సేవ సమితి ఆధ్వర్యంలో బాపట్లలో కొలువైన  "భావ"దేవునికి కుంభహారతి దీప సెమ్మెను సేవ సభ్యులు సమర్పించారు. 
 ఈ దీప సెమ్మెను సమితి గౌరవ సభ్యులు P. రామకృష్ణ దంపతుల సహకారంతో శనివారం ఉదయం బాపట్ల ఎం.ఎల్.ఏ. కోన రఘుపతి ద్వారా ఆలయంలో  "భావ"దేవునికి భక్తితో సమర్పించడం జరిగిందని సమితి బాధ్యులు మంచిరాజు మహాలక్ష్మి తెలిపారు.. ఈ సందర్భంగా కార్యక్రమానికి.విచ్ఛేసిన రఘుపతి.. కుంభహారతికి వితరణ చేసిన రామకృష్ణ దంపతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు..కార్యక్రమంలో మంచిరాజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు
భావన్నారాయణ స్వామి దేవాలయం, బాపట్ల జిల్లా, బాపట్ల పట్టణంలో ఉంది.ఇది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఇది ఒకటి.[1] ఇది పూర్వం చోళుల చే నిర్మితమైంది. శైవానికి పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే, వైష్ణవానికి కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి బాపట్ల (భావపురి), పొన్నూరు (స్వర్ణపురి), భావనారాయణ (కృష్ణా జిల్లా), సర్పవరం (నేడు కాకినాడ (అంతర్భాగం), పట్టిసం. వీనిలో ప్రకాశం జిల్లాలోని పెదగంజాం కూడా ఉందని చెప్తారు. వీటిలో ప్రధానమైంది బాపట్ల. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్లగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడు ఇతర పరివార దేవతలయిన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారులతో కొలువైవుండి భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తాడు.ఇది పురాతన ఆలయం. పవిత్రోత్సవం, రథోత్సవం బాగా జరుగతాయి. ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం క్షీర భావనారాయణ స్వామి తన భార్య సుందరవల్లితో కలిసి కొలువై ఉన్నాడు. ఇక్కడి దేవత 1426సంవత్సరాల నాటి స్వయంభువు

Thursday, 3 November 2022

10కోట్లకు పరువు నష్టం దావా వేస్తాం.. తమపై వచ్ఛిన ఆరోపణలు ఖండించిన ఛాంబర్ క్రీయశీల సభ్యులు...


 ఖమ్మం : వెగ్గళం  శ్రీనివాసరావు అండ్ అదర్స్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, ,ప్రధాన కార్యదర్శి గొడవర్తి శ్రీనివాసరావు,  జనరల్ కార్యవర్గ సభ్యులు కమర్తపు  మురళి పేర్కొన్నారు. ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండాలని ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు.  చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ ప్రతిష్టలు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
అసలు వెగ్గళం  శ్రీనివాసరావు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడు కాదని అతను రెండు సంవత్సరాల క్రితమే చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడిగా ఉండనని లిఖితపూర్వకంగా రాసినట్లు చెప్పారు. ఇటువంటి ఆరోపణలు  చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పత్తిపాక రమేష్, సహాయ కార్యదర్శి కురివెళ్ల  లక్ష్మీకాంతరావు, కోశాధ్యక్షులు తూములూరి లక్ష్మీ నరసింహారావు, జనరల్ కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల అధ్యక్ష కార్యదర్శులు, 300 మంది సభ్యులు పాల్గొన్నారు

Wednesday, 2 November 2022

భ్రూణ హత్యలతో నేరస్తులుగా మిగలకండి : సమాజానికి జిల్లా జడ్జి.. కలేక్టర్ల హితవు


ఖమ్మం, నవంబర్ 2: వివాహాలు స్వర్గంలో జరుగుతాయని, వరకట్న అగ్గితో ఆడవారిని దహించవద్దని, భ్రూణ హత్యలకు పాల్పడి నేరస్తులుగా మిగలకండి అని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి డా. టి. శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లు సమాజానికి హితవు పలికారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో వరకట్నం, భ్రూణ హత్యలపై రూపొందించిన బ్యానర్లను వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వధువు వైపు వారి నుండి ఏదీ ఆశించవద్దని, అది నిన్ను దహించివేస్తుందని అన్నారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని వారు తెలిపారు. శిశువును గర్భంలోనే తుంచవద్దని, ప్రపంచాన్ని చూడనివ్వాలని, భ్రూణ హత్యలు ఆపాలని, ఆడపిల్లలను కాపాడాలని వారు అన్నారు. ప్రజల్లో అవగాహన కలిగి, చైతన్యం కొరకు బ్యానర్లను కలెక్టరేట్, జిల్లా కార్యాలయాల్లో ప్రదర్శించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.