ఈ దీప సెమ్మెను సమితి గౌరవ సభ్యులు P. రామకృష్ణ దంపతుల సహకారంతో శనివారం ఉదయం బాపట్ల ఎం.ఎల్.ఏ. కోన రఘుపతి ద్వారా ఆలయంలో "భావ"దేవునికి భక్తితో సమర్పించడం జరిగిందని సమితి బాధ్యులు మంచిరాజు మహాలక్ష్మి తెలిపారు.. ఈ సందర్భంగా కార్యక్రమానికి.విచ్ఛేసిన రఘుపతి.. కుంభహారతికి వితరణ చేసిన రామకృష్ణ దంపతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు..కార్యక్రమంలో మంచిరాజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు
భావన్నారాయణ స్వామి దేవాలయం, బాపట్ల జిల్లా, బాపట్ల పట్టణంలో ఉంది.ఇది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఇది ఒకటి.[1] ఇది పూర్వం చోళుల చే నిర్మితమైంది. శైవానికి పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే, వైష్ణవానికి కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి బాపట్ల (భావపురి), పొన్నూరు (స్వర్ణపురి), భావనారాయణ (కృష్ణా జిల్లా), సర్పవరం (నేడు కాకినాడ (అంతర్భాగం), పట్టిసం. వీనిలో ప్రకాశం జిల్లాలోని పెదగంజాం కూడా ఉందని చెప్తారు. వీటిలో ప్రధానమైంది బాపట్ల. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్లగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడు ఇతర పరివార దేవతలయిన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారులతో కొలువైవుండి భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తాడు.ఇది పురాతన ఆలయం. పవిత్రోత్సవం, రథోత్సవం బాగా జరుగతాయి. ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం క్షీర భావనారాయణ స్వామి తన భార్య సుందరవల్లితో కలిసి కొలువై ఉన్నాడు. ఇక్కడి దేవత 1426సంవత్సరాల నాటి స్వయంభువు
No comments:
Post a Comment