Wednesday, 16 November 2022

నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి


కొమురం భీం ఆసిఫాబాద్
జిల్లాలోని పలు మండలాలలో నిర్మించిన ఏడు పోలీస్ స్టేషన్ లను బుధవారం హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చి దేశంలోనే ఎక్కడ లేనివిధంగా హైదరాబాదులో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ కెమెరాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నూతన జిల్లాలను ప్రకటించిన అనంతరం అడ్మినిస్ట్రేషన్ , ల్యాండ్ ఆర్డర్ చాలా చక్కగా పనిచేస్తున్నాయని తెలిపారు. పౌరరక్షణ, శాంతిభద్ర తలను కాపాడటంలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నరని వారికి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజారక్షణకు కృషి చేస్తారని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పోలీస్ స్టేషన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో వాంకిడి, రెబ్బెన్ కాగజ్ నగర్ రూరల్, పెంచికల పేట్, చింతలమానెపల్లి, కౌటాల, కాగజ్ నగర్ సర్కిల్ భవనం నిర్మాణాలకు రెండేళ్ల క్రితం నిధులు విడుదల చేశామన్నారు. భవనాలు పూర్తి స్థాయిలో పూర్తి కాగా వీటిని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, డిజిపి మహేందర్ రెడ్డి, జిల్లా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment