24-11-2022
ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం.
---------------------------------------------------------
*ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహణ..*
*టిఆర్ఎస్ పార్టీ తరఫున విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన FRO శ్రీనివాస్ రావు గారికి నివాళులు అర్పించిన
*పోడు భూముల సమస్యలను తీర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు బాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసినందున. త్వరలోనే పోడు భూముల సమస్య పూర్తిగా తీరనున్నదని ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు.ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలతో కలసి పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నాయకులపై ఇడి, ఐటి అధికారులు దాడులు చేస్తున్నారని, BJP పార్టీ ఉడత ఊపులకు తెలంగాణ బిడ్డలు భయపడే ప్రసక్తే లేదంటూ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంపై అనేక కుట్రాలు., కుయుక్తులు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వ బీజేపీ నిరంకుశ విధానాన్ని తాత మధుసూదన్ .తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈడీ దాడులతో టిఆర్ఎస్ నాయకులను కేంద్ర బిజెపి భయపెట్టించాలని చూస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట నడుస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులను లొంగదీసుకునేందుకే తమ చేతిలో కీలుబొమ్మగా ఉన్న ఈడి లను మన రాష్ట్రంలో ఉపయోగించి మొన్న నామ నాగేశ్వరరావు , నిన్న మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ రవిచంద్ర, నేడు మంత్రి మల్లారెడ్డి పై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు*
*తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తెలంగాణ గడ్డపై స్వామీజీల ముడుపుల రూపంలో పట్టుబడిన బిజెపి నాయకుల బండారం బయటపడిందని ఈ వ్యవహారంతోనే బిజెపి పార్టీ గోరి కట్టడం ఖాయమని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలుగా చలామణి అవుతున్న బిజెపి ఎంపీలు రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా ? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కుంగలో తొక్కి గుజరాతీలకు గులాం గిరి చేస్తున్న బిజెపి నాయకులకు త్వరలోనే తెలంగాణ ప్రజలు తమ గుణపాఠం నేర్పుతారని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంగా మెలుగుతున్నారని, తెలంగాణ బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరికినే ప్రసక్తే లేదని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితమ్మ పై అవక్కులు చవాకుల పేలిన ఎంపీ అరవింద్ ఇకనైనా బుద్ధితో మెలగాలని హితవు పలికారు. Bjp నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో CM కెసిఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలతో యావత్ దేశంలో తమకు రాజకీయ ఉనికి కోల్పోతామని భయపడుతున్న బిజెపి నాయకులు కొందరు వ్యక్తులతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర పన్నుతున్న విషయం మనందరికీ తెలిసిందేనని, తెలంగాణ ప్రజలంతా జాగ్రత్తగా మెదగాలని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ & జిల్లా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ వెంట జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, నగర మేయర్ నీరజ , రాష్ట్ర విత్తన అభివృద్ధి శాఖ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , జిల్లా రైతు సమన్వయ కోఆర్డినేటర్ నల్లమల్ల వెంకటేశ్వర్లు , కార్పొరేటర్ కమర్తపు మురళి , మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖమార్ , రూరల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment