ఖమ్మం : వెగ్గళం శ్రీనివాసరావు అండ్ అదర్స్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, ,ప్రధాన కార్యదర్శి గొడవర్తి శ్రీనివాసరావు, జనరల్ కార్యవర్గ సభ్యులు కమర్తపు మురళి పేర్కొన్నారు. ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండాలని ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ ప్రతిష్టలు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
అసలు వెగ్గళం శ్రీనివాసరావు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడు కాదని అతను రెండు సంవత్సరాల క్రితమే చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడిగా ఉండనని లిఖితపూర్వకంగా రాసినట్లు చెప్పారు. ఇటువంటి ఆరోపణలు చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పత్తిపాక రమేష్, సహాయ కార్యదర్శి కురివెళ్ల లక్ష్మీకాంతరావు, కోశాధ్యక్షులు తూములూరి లక్ష్మీ నరసింహారావు, జనరల్ కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల అధ్యక్ష కార్యదర్శులు, 300 మంది సభ్యులు పాల్గొన్నారు
No comments:
Post a Comment