Monday, 30 December 2024

*ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి.... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ*


ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామానికి చెందిన జే. కోటేశ్వర్ రావు తాను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానని, తనకు అవుట్సోర్సింగ్ లో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన కె. రమేష్ తన తాత గారు పోచారం గ్రామానికి వి.ఆర్.ఏ.  గా పనిచేసి ఆ ఉద్యోగం తన తండ్రికి ఇచ్చారని, ప్రస్తుతం తన తండ్రికి ఆరోగ్యం బాగా లేనందున ఈ ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ పరిపాలన అధికారికి రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన డి. మల్లిఖార్జున్ రావు గత పది సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్ గా పని చేస్తున్నానని, 2021 లో అనారోగ్య కారణంగా పంచాయతి కార్యదర్శికి లేఖ రాసి సెలవు తీసుకున్నానని, ప్రస్తుతం తనకు గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఖమ్మం నగరం 43వ డివిజన్ ఎన్.ఎస్.పి. రోడ్డుకు చెందిన ఎం. రమాదేవి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా,  ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాజీ సైనికులకు ప్రభుత్వం అందజేసే భూమిని కేటాయించాలని మాజీ సైనికుడు  చెందిన సంతోష్ వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో అరుణ, తదితరులు పాల్గొన్నారు.

Sunday, 29 December 2024

దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం.. 179 మంది మృతి...

 సౌత్ కొరియాలో మోయిన్ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది మృతి చెందినట్లు యాంహాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రమాద సమయంలో మొత్తం 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారని తెలిపింది.ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. 1997 తర్వాత దక్షిణ కొరియాలో జరిగిన అతి పెద్ద విమానం ప్రమాదంగా తెలుస్తోంది 97 లో జరిగిన ప్రమాదంలో 200 పైబడి ప్రయాణికులు మృతి చెందగా ఆదివారం జరిగిన ప్రమాదంలో 179 మంది చనిపోయినట్లు తెలుస్తోంది

An aircraft with 181 on board crashed at South Korea's Muan airport on Sunday, after it suffered a bird strike during landing, reported the national fire agency. One flight attendant and one passenger have been rescued so far.
According to news reports, 179 people have been presumed dead. Authorities confirmed the number of dead, and casualties are expected to rise sharply. A total of 181, including six crew members, were aboard the plane that was returning from Bangkok.


Saturday, 28 December 2024

ఏడుకొండలు చేరాలంటే..! ఏడు మార్గాలు ఉన్నాయి మీకు తెలుసా..!!



 *అందరికీ తెలుసు. మరి ఆ 7కొండలు ఎక్కేందుకు 7 మార్గాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు..? ఆ ఏడు మార్గాల్లో… ఏ దారి నుంచి వెళ్లినా… తిరుమల చేరుకోవచ్చు.ఆ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.*                                               *(1) మొదటిది అలిపిరి. ఇది అందరికీ తెలిసిన దారే. తిరుమల వెళ్లేందుకు ప్రధాన మార్గం కూడా ఇదే. బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్‌ జీపులు… అన్నీ అలిపిరి నుంచే వెళ్తాయి. కాలినడకన కొండెక్కేవారు మొదట ఎంచుకునేది కూడా అలిపిరి మార్గమే. ఎందుకంటే ఇది… తాళ్లపాక అన్నమాచార్య నడిచిన మార్గం. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. కొంత నడకమార్గం కాగా… 3650 మెట్లు ఉంటాయి. ఈ మార్గం నుంచి వెళ్తే.. ఎన్నో ఉపాలయాలు, మోకాళ్ల పర్వతాన్ని దర్శించుకోవచ్చు.* 
 *(2) రెండో మార్గం.. శ్రీవారి మెట్టు మార్గం. ఇది కొంతమందికి మాత్రమే తెలుసు. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం నుంచి… మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీవారు పద్మావతి అమ్మవారిని వివాహమాడిన శ్రీనివాసుడు… తిరుమలకు ఈ మార్గం నుంచే వెళ్లారట. అందుకే దీనికి శ్రీవారి మెట్టుఅందుకే దీనికి శ్రీవారి మెట్టు అని పేరొచ్చింది. శ్రీవారి మెట్టు నుంచి మూడుకిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మార్గంలో వెళ్తే… గంటన్నరలో తిరుమల చేరుకోవచ్చు.* 

 *(3) మూడో మార్గం.. మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యంలో ఉంటుంది. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుంచి వచ్చే భక్తులు ఈ మార్గం నుంచి… శ్రీవారి ఆలయం చేరుకుంటారు. ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాతి మెట్లను ఏర్పాటుచేశారు.* 

 *(4)నాలుగో మార్గం… కళ్యాణి డ్యామ్‌. తిరుమల కొండకు పశ్చిమం వైపున ఉంటుంది. డ్యామ్‌ నుండి 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం 15 కిలోమీటర్లు. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ మార్గం నుంచే తిరుమల చేరుకుంటారు.* 

( *5) ఐదో మార్గం… తుంబురుతీర్థం. కడప సరిహద్దు-చిత్తూరు ఎంట్రెన్స్‌ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి తుంబురుతీర్థం, పాపవినాశనం మీదుగా తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం నుంచి పాపవినాశనం మధ్య 12 కిలోమీటర్లూ దూరం ఉంటుంది. పాపవినాశనం నుంచి సులువుగా తిరుమల చేరుకోవచ్చు.* 

 *(6)ఆరో మార్గం.. అవ్వాచారి కోన. ఏడుకొండల మధ్యలో ఉన్న కొంత పల్లపు ప్రాంతాన్నే అవ్వాచారి కోన అంటారు. దీనినే అవ్వాచారి కొండ అని కూడా పిలుస్తారు. అవ్వాచారికొండ…. మొదటి ఘాట్‌రోడ్డులోని అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంటుంది. రేణిగుంట సమీపంలోని కడప-తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి లోయలో ఉన్న అవ్వాచారి కోన మీదుగా పడమరవైపుకి వెళ్తే… మోకాళ్ల పర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.* 

( *7) ఏడో మార్గం… తలకోన. ఇక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తిరుమల కొండకు తల భాగంలో ఉంటుంది కనుకే.. దీనికి తలకోన అని పేరువచ్చింది. తలకోన జలపాతం నుంచి నడుచుకుంటూ జెండాపేట దారిలో వెళితే తిరుమల వస్తుంది. ఈ మార్గం 20 కిలోమీటర్లు ఉంటుంది.* 

 *సేకరణ.. సోషల్ మీడియా ద్వారా

కొత్త సంవత్సరం వేళ వినూత్నంగా సైబర్ నేరగాళ్లు.. తస్మాత్ జాగ్రత్త..: వి.సి.సజ్జానార్


*నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ లింకులు పంపి మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేసే అవకాశం ఉందని ప్రజలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్రమత్తం చేశారు.*
*హైదరాబాద్: నూతన సంవత్సర శుభాకాంక్షల' పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్లాన్ వేశారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ చేశారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తి గత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.*
*పొరపాటున లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతి*
*న్యూ ఇయర్ విషెస్ చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చని, ఇందు కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవు. ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి జొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల అధీనం లోకి వెళ్లిపోతుంది. *బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రెండు, మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాష్ట్ర ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు.*

Thursday, 26 December 2024

ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి

*దక్షిణా మూర్తి........!!*

*అన్ని జన్మలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ. అది జ్ఞాన సంపాదనకు, మోక్షసాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు. అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటటువంటి, జ్ఞానాలను ప్రసాదించేటటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి.ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. వసిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మవిద్యను సంపాదించాడు.*
*దక్షిణామూర్తి స్వరూపం, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకరకుండలం ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి. ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా. ఈ విషయాన్నే లలితాసహస్రంలో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ అని వివరిస్తోంది.దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం, గురువు. ఈ రూపం శివుడిని యోగా, సంగీతం, జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది. శాస్త్రాలపై వివరణ ఇస్తుంది. హిందూ గ్రంధాల ప్రకారం, ఒక వ్యక్తికి గురువు లేకుంటే, వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. చివరికి వారు యోగ్యులైతే, స్వీయ-సాక్షాత్కార మానవ గురువుతో ఆశీర్వాదం పొందుతారు.*
*ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి. బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం సనక సనందనాదులు సదా శివుని వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో శివుడు గౌరి సమేతుడై దేవ గణాల మధ్యన నాట్యం చేస్తు న్నాడు. ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారు. అలా తిరగగానే శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ద్వారా సనక సనందనాదులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడింది. శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి. మహా విష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం.*

Wednesday, 25 December 2024

"రియల్" స్టార్ రోజు సంపాదన 20 కోట్ల పై మాటే..

**

అదృష్టం ఎవరిని ఏ తీరం వైపు తీసుకు వెళుతుందో చెప్పలేము ఒక ఫుట్పాత్ వ్యాపారి రోజు 20 కోట్ల అర్జించే స్థితికి వెళ్ళాడు అంటే దాని వెనక అతని నిబద్ధత పట్టుదల కృషి తో పాటు అదృష్టం కూడా కనికరించాల్సిందే.    ఇహ అసలు విషయంలోకి వద్దాం   సేల్స్‌మెన్‌గా ఉన్న అలాంటి భారతీయ వ్యాపారవేత్త గురించి మీకు తెలుసా, కానీ నేడు రూ.20,830 కోట్ల ఆస్తికి యజమాని. విశేషమేమిటంటే..
ఈ వ్యక్తి ఒకప్పుడు ఫుట్‌పాత్‌పై పాల నుండి పుస్తకాల వరకు అన్నీ అమ్మేవాడు, కానీ నేడు ఖరీదైన ఆస్తులను అమ్ముతున్నాడు.

రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యాపారవేత్త రిజ్వాన్ సజన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ముంబై వీధుల నుండి బయటపడి సౌదీ అరేబియాలోని ప్రాపర్టీ మార్కెట్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. రిజ్వాన్ సజన్ మాట్లాడుతూ ధనవంతుడు కావాలంటే డబ్బు కాదు నైపుణ్యం కావాలి. 

ఒకప్పుడు ముంబయి వీధుల్లో, రోడ్లపై కష్టపడ్డ రిజ్వాన్ సజన్ ఇప్పుడు సౌదీ అరేబియాలో ఎన్నారై వ్యాపారవేత్త. రిజ్వాన్ సజన్ తన కెరీర్‌ను సేల్స్‌మెన్‌గా ప్రారంభించాడు. తన నైపుణ్యంతో, అతను అటువంటి విజయాన్ని సాధించాడు, ఈ రోజు అతను దుబాయ్‌లోని అత్యంత ధనవంతులలో ఒకడు.

 *నైపుణ్యాల ద్వారా డబ్బు సంపాదించారు* 

రిజ్వాన్ సజన్ యొక్క రియల్ ఎస్టేట్ 'డాన్యూబ్ గ్రూప్' బిలియన్ డాలర్ల వ్యాపార వెంచర్. ఈ కంపెనీ సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతార్ మరియు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద నిర్మాణ సామగ్రి కంపెనీలలో ఒకటి.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన రీల్‌లో, నేను చాలా మంచి సేల్స్‌మెన్‌ని, ఇది నా అతిపెద్ద క్వాలిటీ అని చెప్పాడు. ఈరోజు తాము ఏటా 10 బిలియన్ దిర్హామ్‌ల వరకు సంపాదించే స్థాయికి చేరుకున్నామని రిజ్వాన్ సజన్ అన్నారు. ఈ మొత్తం నుంచి రోజువారీ సంపాదన లెక్కిస్తే దాదాపు రూ.32 కోట్లు అవుతుంది. నేటి ప్రపంచంలో విజయవంతమైన ప్రతి వ్యాపారి దగ్గర డబ్బు ఉండదని, తన కష్టార్జితంతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడని, వారిలో నేను కూడా ఒకడినని అన్నారు.

 *ముంబై నుంచి దుబాయ్‌కి ప్రయాణం* 

విశేషమేమిటంటే రిజ్వాన్ సజన్ తనపై తనకు ఎంత నమ్మకంగా ఉన్నాడంటే.. 'నా డబ్బు అంతా పోతే మళ్లీ నా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను. నేను ఆఫ్రికాలోని అరణ్యాలలో కూడా డబ్బు సంపాదించగల వ్యక్తిని అని అతను పేర్కొన్నాడు.

రిజ్వాన్ సజన్ ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు  తొలినాళ్లలో ఫుట్‌పాత్‌పై కూడా సరుకులు అమ్మేవాడు. తన తండ్రి మరణం తర్వాత, రిజ్వాన్ సజన్ 1981లో కువైట్‌కు వెళ్లాడు. ఇక్కడ ట్రైనీ సేల్స్‌మెన్‌గా పనిచేశాడు.

1993లో, అతను డాన్యూబ్ గ్రూప్‌ను ప్రారంభించాడు, ఇది ఇప్పుడు నిర్మాణ వస్తువులు, గృహాలంకరణ మరియు రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో వ్యాపార సమ్మేళనం. DNA నివేదిక ప్రకారం, UAE ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో రిజ్వాన్ సజన్ నికర విలువ 2.5 బిలియన్ US డాలర్లు (రూ. 20,830 కోట్లు).

అంగట్లో అనుబంధం @ప్రస్తుతానికి ఇది కథే..


future!
అమ్మ 
పొద్దున్న 8 గంటలకి కాలింగ్ బెల్ మ్రోగింది. పరుగున వెళ్లి తలుపు తీశాడు వరుణ్. బయిట అమ్మ  నిలుచుని ఉంది.
"అమ్మా " అని సంతోషంగా ఆమెని లోనికి తీసుకుని వచ్చాడు. అతడికి వివాహం అయ్యాక అమ్మ ఇప్పుడే మొదటి సారి అతడింటికి రావడం. మళ్ళీ ఈ రాత్రికే తిరిగి వెళి పోతుంది. మరో అన్నయ్య ఇంటికి వెళ్ళాలి. 
తల నిమిరి "ఎలా ఉన్నావు బాబూ 
అని పలకరించింది. అప్పుడే వంటింట్లోంచి వచ్చిన కోడలు విమల " రండి అత్తయ్యా బాగున్నారా " అని పలకరించింది. ఆమెని కౌగిలించుకుని " మా మనవడూ మనవరాలూ ఏరీ? " అని అడుగుతుండగానే లోపలినించి తొంగి చూసి వెంటనే లోపలికి పారిపోయారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. రమ్యకి అయిదేళ్ళు   రవికి మూడేళ్లు . మొదటి సారి బామ్మను చూస్తున్నారు కదా. సిగ్గు. 
విమల పిల్లల్ని పిలిచింది. " ఇలా రండి. బామ్మ వచ్చింది. చూడండి "
ఇద్దరూ భయంతో,  సిగ్గుతో బయిటకి వచ్చారు. బామ్మ తెలుసా అని విమల అడుగుతే పెద్దది " తెలుసు. డాడీ మొబైల్లో ఫోటో చూపించారుగా " అంది.
అమ్మ తను తెచ్చిన బొమ్మ లు , తినుబంఢారాలు పిల్లలకి ఇచ్చి ఇద్దరినీ ఒడిలో కూచో పెట్టుకుంది.
కాసేపట్లో లేచి " సమయం లేదు. నీకు నచ్చిన కూరలూ పప్పు అన్నీ వండాలి.  ఏమైనా special కావాలంటే చెప్పు" అని వరుణ్ ని అడిగింది. " మీరు కూచోండత్తయ్యా నేను వంట చేస్తాను " అంది కోడలు.  "భలేదానివే.  వాడికి నచ్చినవి ఉన్న  ఒక్క రోజైనా నన్ను  చేయనీ. కావాలంటే వచ్చి కొంచెం సాయం చేయి" అంది అత్తగారు. ఇద్దరూ చేసి వడ్డించిన భోజనం బ్రహ్మాండంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తృప్తిగా భోజనం చేసాడు వరుణ్. విమలకీ పిల్లలకీ కూడా ఆ వంట బాగా నచ్చింది. 
పిల్లలిద్దరూ బామ్మ తో కలిసి పోయినందున కధలు చెప్తూ వాళ్ళతో సంతోషంగా సమయం గడిపింది బామ్మ. వరుణ్ ఒక చిన్న కునుకు తీసి లేచే సరికి ఇల్లంతా వాసన. జీడిపప్పు బర్ఫీ, వేడి వేడి పకోడీలు అతన్ని ఆహ్వానించాయి.
అందరూ ఇష్టంగా తినగా పిల్లలు " సూపర్ బామ్మా" అని పొగిడారు
7.45 కి అమ్మ మౌబైల్ లో message వచ్చింది. చూసి " మీ అన్నయ్య.  కారు పంపించాడట. "
" సరేనమ్మా మీరు బయిలు దేరండి" అన్నాడు వరుణ్. "ఇక్కడే ఉండి పో బామ్మా" అన్నారు పిల్లలు. " మీ నాన్న ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తానుగా. ఇప్పుడు వెళతాను. OKనా " అంది బామ్మ తన సామాన్లు సర్దుకుంటూ. 
"ఎంతైందమ్మా "అడిగాడు వరుణ్. 
ఆమె చిరునవ్వుతో తన సంచీలలోనించి I padలాటి ఒక మానిటర్ తీసి లెక్కలు చేసి మొత్తం 12 గంటలయింది. గంటకి 1500 చొప్పున 18000అయింది.  GST estra నేను పిల్లలకి తెచ్చిన బొమ్మలు గట్రా ఈ పేకేజీలో వచ్చేసాయి. మా app moneyఉంటే 10%  cashback offer ఉంది. G pay , Card payment మి ఇష్టం.

" మీకు తలిదండ్రులు పోయారా?
మీ తల్లిగా తండ్రిగా మీతో ఒకరు ప్రేమగా గడపాలా? వారి గురించి మీ కుటుంబ సభ్యుల గురించిన వివలాలు మా website కు పంపండి. మా దగ్గర ప్రశిక్షణ పొందిన వారిని మీరే ఎంపిక చేసుకోవచ్చు. వారిని మీ ఇంటీకి పంపుతాం. వారు మీ ఇంటీకి వచ్చి  మీకు తగిన విధంగా ప్రేమాభిమానాలు చూపి వెళతారు. 
మా " భంధుత్వం.com ని గాని మా app download చేసిగాని...

ఓ నెల కిందట చూసిన ఈ ప్రకటన,    9 సంవత్సరాల కిందట మరణించిన తల్లి ముఖం గుర్తుకు రాగా Gpay లో డబ్బులు పంపాడు వరుణ్. 

చేయి ఊపుతూ తన next appointment కి బయిలుదేరింది ఆ "అద్దె" అమ్మ....!

ఈ రోజు ఇది కధ. 
రేపు ఇది వాస్తవం కావచ్చు  
మనం ఎటు వెళుతున్నామో తెలియడం లేదు.
____________________________
ఒక తమిళ కధకి అనువాదం.
#everyone
Courtesy: Murali Krishna@Face Book

Tuesday, 24 December 2024

ప్రజా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం : గరిక ఉపేందర్ రావ్

ఖమ్మం : రెవెన్యూ చరిత్రలో భూ భారతి ఓ మైలురాయిగా కితాబు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల , టీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి , తదితరుల అండతోనే తాము విజయం సాధించామన్న గరికె ఖమ్మంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించిన వీఆర్వోల రాష్ట్ర అధ్యక్షులు గరికె . గత ప్రభుత్వ పాలనలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు కావడంతో రెండున్నర సంవత్సరాలుగా మానసిక వేదనతో ఆందోళనలో ఉన్న రాష్ట్రవ్యాప్తంగా 5,139 మంది వీఆర్వోల కుటుంబాలకు అండగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం విఆర్ఓ లను రెవిన్యూలోకి ఆప్షన్ పద్ధతిలో తీసుకుంటూ నిర్ణయించడం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికి ఉపేంద్ర రావు అన్నారు . మంగళవారం ఖమ్మం లోని టీటీడీసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు , పలువురు రాష్ట్ర కమిటీ , జిల్లా కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి యావత్ వీఆర్వోల కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు . గత ప్రభుత్వం వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి విడదీయడమే కాకుండా గ్రామస్థాయి రెవిన్యూ రద్దుచేసి వీఆర్వోల భవిష్యత్తును అంధకారంలో నెట్టింది అన్నారు . నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు అనేక దఫాలుగా ఆందోళనలు నిరసనలు తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని అవినీతిపరులుగా గ్రామ రెవెన్యూ అధికారులను చిత్రీకరించి అవమానులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు . ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వంపై కోటి ఆశలతో ఉన్న వీఆర్వోలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోపాటు మిగతా మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , రాష్ట్ర సీసీఎల్ఏ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ , తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ , తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల చైర్మన్, రెవెన్యూ ఎక్స్ పర్ట్ , డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి లచ్చి రెడ్డి , కృషి ఫలితంగా మరియు డిప్యూటీ కలెక్టర్ సంఘం తెలంగాణ తాసిల్దారుల సంఘం కృషి ఫలితంగా గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ బలోపేతంలో సమస్త విఆర్ఓ లకు ఆప్షన్ పద్ధతిలో తీసుకోవడానికి కృషి చేసిన వారికి ప్రతి ఒక్కరికి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తరఫున గరిక ఉపేంద్రరావు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు .రెవెన్యూ చరిత్రలో  భారతి చట్టం 2024 ఒక వరం . గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతుల భూ సమస్యలు స్థానికంగా వేగవంతంగా న్యాయమైన సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా చట్టంలో రూపకల్పన చేయటం అట్లాగే ఆప్షన్ విధానం మండల డివిజన్ జిల్లా స్థాయిలలో అవకాశం కల్పించడంతోటే దళిత , గిరిజన , సన్న కారు , చిన్న కారు మధ్యతరగతి , రైతులకు ఎంతో వెసులుబాటును కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గరికె ఉపేంద్ర రావు అన్నారు . రీ డిప్లయ్మేంట్ ద్వారా ఇతర ప్రభుత్వ శాఖల్లోకి బలవంతపు సర్దుబాటు ద్వారా అర్ధరాత్రి వేళ లాటరీ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగుల సిసిఏ రూల్స్ , ఫండమెంటల్ రూల్స్ కు విరుద్ధంగా తీసుకున్న గత ప్రభుత్వ నిర్ణయం వలన వీఆర్ఓ లందరూ పూర్వపు సర్వీసులు పూర్తిగా కోల్పోయారు . పే ప్రొటెక్షన్ కోల్పోయారు , పదోన్నతులు కోల్పోయారు , డి గ్రేట్ చేయబడి అటెండర్లుగా , కామాటిగా , వంట కుక్కు , స్వీపర్లుగా , మహిళా జీపు డ్రైవర్‌గా , వార్డు అధికారిగా ఇలా అవమానింపబడి సమాజంలో మానవ హక్కులు కోల్పోయామని అన్నారు .  ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఆందోళనలకు గురికావడమే కాకుండా జిసిసి లో పనిచేస్తున్న వారికి నేటికీ నెల వారి వేతనాలు రాక మనోవేదనతో ఆర్థిక భారం తట్టుకోలేక ఇద్దరు విఆర్వోలు అకాల మరణం చెందటం చింతించదగిన అంశంగా భావిస్తున్నామని వారు తెలిపారు . గత ప్రభుత్వం నిరంకుశ విధానాల వలన మాకు జరిగిన నష్టాన్ని నేటి ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అనేక దఫాలుగా సంఘం ఆధ్వర్యంలో మెమొరాండాలు సమర్పించి మా సమస్యల పరిష్కారానికి నివేదించుట మూలంగా మా సమస్యలను సానుకూలంగా తీసుకొని మాకు నేడు గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలోకి రావడానికి ఆప్షన్ పద్ధతి ద్వారా మమ్మల్ని తీసుకోవడం హర్షించదగిన పరిణామం అన్నారు . నేటి ఆప్షన్ లో గత సర్వీస్ యొక్క పరిస్థితిని ప్రమోషన్ విధానాన్ని ఆప్షన్ ఫామ్ లో పొందుపరచలేదనే అంశం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నది . తప్పకుండా నేటి ప్రభుత్వం వీఆర్వోల న్యాయమైన గత సర్వీసును పరిగణలోకి తీసుకొని కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి ని గౌరవ రెవిన్యూ శాఖ మాతృ గారిని కోరారు . విలేకరుల సమావేశంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చీమల నాగేంద్రబాబు , బంక కృష్ణ  , షేక్ జానీ మియా , వజ్జ రామారావు , చర్ల శ్రీనివాస్ , ధరావత్ భాస్కర్ , కిషోర్ , నెల్లూరు లవన్ కుమార్ , బంక భాస్కర్ ,  శ్రీ వాణి , మల్లీశ్వరి , వాంకుడోత్ వెంకన్న , వస్త్రం ధన్నూరి బాలరాజు , చిట్టి మల్ల నాగేశ్వరరావు , షేక్ నాగుల మీరా మరియు వందమంది పూర్వ విఆర్వోలు పాల్గొన్నారు .

వెంటనే ఇల్లు కట్టి ఇవ్వండి..దిక్కారం పై కోర్టు కన్నేర్ర.... ధనవంతులవైతే ఇదే వేగం చూపిస్తారా అంటూ ప్రశ్న

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17: నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట గ్రామంలో స్టే ఉత్తర్వులున్నప్పటికీ అక్రమ నిర్మాణమంటూ కూల్చివేసిన పేదల ఇంటిని పునరుద్ధరించాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. పేదలు ఇల్లు అయినందున కూల్చివేశారని, అదే ధనవంతులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ధైర్యం ఉందా అని నిలదీసింది. దోమలపెంటలో కటకం మహేశ్‌, నాగలక్ష్మి ఓ ఇల్లు కట్టుకొని చాలా ఏండ్ల నుంచి నివాసముంటున్నారు. అది అక్రమ నిర్మాణమంటూ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేయగా వారు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వారి ఇంటిని కూల్చరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ, కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించిం ది. ఉత్తర్వులు అమలులో ఉండగా నే ఇంటిని కూల్చివేయడంతో బాధితులు కోర్టు ధికరణ పిటిషన్‌ దాఖలు చేశా రు. దీనిపై జస్టిస్‌ పీ మాధవీదేవి విచారణ చేపట్టారు. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ పంచాయతీ కార్యదర్శి వల్ల ఇది జరిగిందని, ఇది జి ల్లా పంచాయతీ అధికారికి తెలియదని చెప్పారు. కూల్చివేసిన నిర్మాణాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

Friday, 20 December 2024

బడుగు బలహీన వర్గాల వైపు ఓ లుక్కేస్తున్న ఖమ్మం కలెక్టర్... ఆదుకునేందుకు వెంటనే చర్యలు..


*ఖమ్మం కలెక్టర్  ముజమ్మిల్ ఖాన్ తాను ప్రయాణించే దారిలో పేదల జీవితాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు గతంలో ఆటో కార్మికుల అడ్డాలో ఆయన కలెక్టర్ వారి బాగోగులను స్వయంగా విచారించారు అనంతరం మహిళా శక్తి క్యాంటీన్ల వద్దకు వెళ్లి వ్యాపార నడుస్తున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు అక్కడే ఆయన స్వయంగా టీ తాగారు అయితే తాజాగా త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల స్థితిని తెలుసుకున్న కలెక్టర్ ఆమెకు మెప్మా ద్వారా వెంటనే సహాయం అంది ఎలా చర్యలు చేపట్టారు 
దివ్యాంగురాలు కమల చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమలమ్మ పల్లీ బండి వద్ద కారులో ఆగారు. కలెక్టర్ అంటే ఎవ్వరో తెలియని కమల పల్లీలు కావాలా సార్ అని ఆడగటంతో... ఓ చిరునవ్వు నవ్వారు.  దివ్యాంగురాలు కమల కుటుంబ పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం సార్ అంటూ తన దుర్భర జీవితాన్ని వివరించింది. స్పందించిన కలెక్టర్.. నీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మాటా ఇచ్చి వెళ్లారు. తర్వాత కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు ఫోన్ చేసిన కలెక్టర్, జమలమ్మకు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో మెప్మా డీఎంసీ సుజాత, టీఎంసీ సుజాత, సీవో రోజా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బ్యాంక్ తో మాట్లాడి కేవలం ఐదురోజుల్లోనే రూ.1లక్ష వ్యాపార రుణం చెక్కును గురువారం అందించారు. త్వరలో కమలతో కూరగాయాల వ్యాపారం ఏర్పాటు చేసేందుకు కార్యచరణ చేశారు.

Thursday, 19 December 2024

తెలంగాణ పంచాయతీలో ప్రజాశాంతి... పార్టీ బలోపేతానికి క్యాంపెయిన్లు నిర్వహిస్తాం : కె.ఎ.పాల్


ఖమ్మం డిసెంబర్ 19: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలను ఓడించాలని, ప్రజాశాంతి పార్టీ ద్వారా గెలిచిన సర్పంచ్ లకు భారీగా నిధులు కేటాయిస్తూ వంద రోజుల్లో ఆ గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కె ఏ పాల్ అన్నారు.ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. , ప్రజలకు ఇచ్చిన  వాగ్దానాలను అమలు చేయలేక బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన అభివృద్ధికి దూరంగా కొనసాగుతు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అవినీతి పాలన చేసిన బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి సాగనంపారని ఆరోపించారు.ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా భద్రాచలం నుంచి ఖమ్మం దాకా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఎక్కడ చూసినా  అభివృద్ధి ఆనవాళ్లు కనిపించలేదని, దోచుకోవటం దాచుకోవటమే వారికి పనిగా మారిందని దుయ్యబట్టారు. ప్రజలపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మిగులు బడ్జెట్ గా ఉన్నా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాశాంతి పార్టీ ద్వారా గెలిచే గ్రామ సర్పంచ్ కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాశాంతి పార్టీ బలోపేతం కోసం క్యాంప్యాన్లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విదేశాల నుంచి డబ్బును సేకరించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, తాగునీరు విద్యా ,వైద్యం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
  రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే గ్రామ సర్పంచ్ అభ్యర్థులు ప్రజాశాంతి పార్టీని ఆదరించి పెద్ద ఎత్తున చేరికలు చేపట్టాలని డాక్టర్ కె ఏ పాల్ పిలుపునిచ్చారు.

Monday, 16 December 2024

*ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి ..... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


ఖమ్మం : ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఖమ్మం మదీన మసీదు అధ్యక్షుడు ఎం.డి. హకీం ముస్తఫా నగర్ ఏరియాలోని మైనారిటీలకు ఖబరస్తాన్ ఏర్పాటుకు భూమి కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన చింతలపాటి చెన్నారావ్ మన ఊరు మన బడి పథకం క్రింద తల్లాడ మండలం కుర్నవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 45 లక్షల విలువ గల పనులు చేశానని, అందులో 10 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, త్వరగా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా,  జిల్లా విద్యా శాఖ అధికారికు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 
ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన కృష్ణవేణి వల్లభి గ్రామం నందు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఖాళీ అయినందున ఎస్టి కులస్తురాలైన తనకు అవకాశం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా సంక్షేమ అధికారికి రాస్తూ నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.తల్లాడ గ్రామానికి చెందిన ఈలప్రోలు అంజలి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా, ఈఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ ప్రజావాణిలో డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వో ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, జిల్లా అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Saturday, 14 December 2024

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కామన్ డైట్ మెనూ కార్యక్రమం... పేదల పిల్లలు కార్పొరేట్ విద్యార్థుల్లా చదవాలి : మంత్రి పొంగులేటి


ఖమ్మం, డిసెంబర్ 14:  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ప్రభుత్వం డైట్ మెనూ కార్యక్రమం ప్రారంభోత్సవాలు నిర్వహించింది శనివారం ఖమ్మం జిల్లా రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.శనివారం మంత్రి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం, మహ్మదాపురం లోని గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వైద్యానికి పెద్దపీట వేసిందని..ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు.కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి విద్యార్థులు, అధికారులు బ్యాండ్ వాయిస్తూ, పూలతో ఘనంగా స్వాగతం పలికారు.ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. కామన్ డైట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదోని పిల్లలు కూడా ధనికుల పిల్లల్లా చదవాలని, పేదోని పిల్లల కోరికలు తీరేలా ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచిందన్నారు. ప్రభుత్వానికి అదనంగా సుమారు 500 కోట్ల భారం పడుతున్నప్పటికి, దీనిని భారంగా కాక, బాధ్యతగా చేశామని తెలిపారుఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్నామన్నారు.గడిచిన పది సంవత్సరాల్లో గత  ప్రభుత్వం పేదవారి పిల్లలను పట్టించుకోలేదని, ఇందిరమ్మ రాజ్యంలో హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీలు నలబై శాతం కాస్మొటిక్ చార్జీలు 250 శాతానికి పెంచామని అన్నారు.డైట్  చార్జీలను 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి1330 రూపాయలకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు, ఇంటర్  నుంచి  పీజీ విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు ప్రజా ప్రభుత్వం పెంచిందని, అదేవిధంగా కాస్మోటిక్ చార్జీలను బాలికలకు  7వ తరగతి వరకు 55 నుంచి 175  రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలికలకు 75 నుంచి  275 రూపాయలకు, బాలురు 7వ తరగతి  వరకు 62 నుంచి 150  రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలురు 62 నుంచి  200 రూపాయలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయల తో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేస్తున్నట్లు, అన్ని సదుపాయాలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు.52 నుంచి 54 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు ఈ సంవత్సరం బడ్జెట్ లోనే నిధులు కేటాయించుకున్నామని, త్వరలోనే నిర్మాణాలు చేపడతామని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని చేసాం, ఇంకా కొన్ని చేయాల్సి ఉందని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల ఇబ్బందులు కలిగాయని, అన్ని చక్కదిద్దుకొని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తామన్నారు.అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళల ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యం కి పెద్దపీట వేశామని మంత్రి తెలిపారు. ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారికి 10 లక్షల ఉచిత వైద్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్న గత ప్రభుత్వం వదిలేసిన ప్రాజెక్టు లను పూర్తి చేస్తున్నామని అన్నారు.
ఖర్చు పెట్టె ప్రతి రూపాయి పేదవారికి చెందే విధంగా అధికారులు సహకరించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలు సద్వినియోగం చేయాలని మంత్రి అన్నారు.
విద్యార్థుల పట్ల ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, స్వంత పిల్లలా చూసుకోవాలని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీల పెంపుతో పాటు, కిచెన్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిందన్నారు. దశల వారిగా 3 నెలలు సిబ్బందికి కిచెన్, స్టోరేజ్ నిర్వహణపై శిక్షణ ఇస్తామన్నారు. తల్లిదండ్రులు సంతృప్తి గా వుండేలా, పిల్లలు బాగుగా వుండేలా కృషి చేస్తామని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ సందర్భంగా మంత్రి పిల్లలతో కలిసి భోజనం చేశారు.
అంతకుముందు మంత్రి, పాఠశాలలో సిద్ధం చేసిన వంటలను పరిశీలించారు. స్టోర్ రూమ్ పరిశీలించారు. సామాగ్రి ఎన్ని రోజులకు వస్తున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రుడ్లను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న పాఠశాల భవన పనులను పరిశీలించారు. రూ. 5 కోట్లతో జి ప్లస్ 3 గా నిర్మిస్తున్న పాఠశాల కాంప్లెక్, ప్రిన్సిపాల్, స్టాఫ్ క్వార్టర్స్, సెక్యూరిటీ రూమ్ ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతలో రాజీ లేకుండా, అగ్రిమెంట్ సమయంలోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. పాఠశాల కాంపౌండ్ నిర్మాణం పూర్తి చేయాలని, సుందరీకరణ, జనరేటర్, ఆర్వో ప్లాంట్ ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, సిఇ శంకర్, డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి, ఇఇ తానాజీ, తహసీల్దార్ రామకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Friday, 6 December 2024

*ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై సంపూర్ణ అవగాహన కల్పించాలి.. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


ఖమ్మం, డిశంబర్ -6 : ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై క్షేత్ర స్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి జిల్లాకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ అందిందని, లాగిన్ ఐడీలు ఇచ్చారని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపిడివో లు, ఎంపిఓ లు, ఏపీవో లు, మునిసిపల్ కమిషనర్ల కు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు శిక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు.జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం క్రింద స్వీకరించిన దరఖాస్తుల్లో 357869 దరఖాస్తులు ఇండ్ల నిమిత్తం వచ్చినట్లు, ఇందులో అత్యధికంగా ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 53990 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ అన్నారు. రోజుకు ఒక అధికారిచే కనీసం 40 దరఖాస్తుల పరిశీలన లక్ష్యంగా చేపట్టి, ఈ నెల 20 లోగా దరఖాస్తుల విచారణ పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలన్నారు.ఈ సమీక్షలో శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డిఆర్వో రాజేశ్వరి, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, హౌజింగ్ ఇఇ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*ఖర్గే, మోడీ నవ్వులు! పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం వైరల్*

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో  మహాపరినిర్వాణ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోడి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పరస్పరం పలకరించుకొని నవ్వుతూ మాట్లాడుకున్నారు. మొదట ఖర్గే ప్రధాని మోడీ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఇరువురు ముచ్చటించారు. ఖర్గే చెప్పిన ముచ్చట విని ప్రధాని మోడీతో పాటు అందరూ సరదాగా నవ్వారు.ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకునే నాయకులు ఇలా సంతోషంగా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంబేడ్కర్‌కు నివాళులు అర్పించిన వారిలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, విపక్ష నేతలు ఉన్నారు.

Thursday, 28 November 2024

*వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలి....... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


ఖమ్మం, నవంబర్ -28 : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి పాఠశాలల హెడ్ మాస్టర్ లు, ఎం.ఈ.ఓ. లతో సమీక్షించారు. పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు ఖాళీలు ఏర్పడ్డాయా, విద్యార్థుల హాజరు, పేరెంట్ టీచర్స్ మీటింగ్, నాలెడ్జ్ బుక్ లెట్, మిడ్ డే మిల్, సైన్స్ ఫెయిర్, న్యూట్రీ గార్డెన్, 10వ తరగతి పరీక్షలు, తదితర అంశాలపై మండలాల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,*   విద్యార్థుల జీవితంలో 10వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, ఇక్కడ ఫెయిల్ అయిన విద్యార్థులు చదువు నిలిపి వేసే ప్రమాదం ఉందని, కావున వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వారం రోజులలో  బాగా చదివే పిల్లలు ఏ కేటగిరి, యావరేజ్ పిల్లలను బీ కేటగిరీ, ఫెయిల్ అవుతారు అనుకునే పిల్లలను సి కేటగిరీ గా విభజించాలని అన్నారు. బీ క్యాటగిరి పిల్లలు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు పరిశీలించి, అందులో వారికి అవసరమైన అదనపు శిక్షణ అందించాలని అన్నారు. సి కేటగిరీ పిల్లలకు ముఖ్యమైన పాఠ్యాంశాలు అనేకసార్లు బోధిస్తూ పాస్ అయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని అన్నారు. ప్రతి క్యాటగిరి విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ హెడ్ మాస్టర్ లకు సూచించారు.డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థులకు పరీక్షలు అలవాటు అయ్యే విధంగా వీలైనంత వరకు ఎక్కువ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.  సీ కేటగిరీ విద్యార్థులకు ఇప్పటి నుంచి గతంలో పరీక్షలలో అనేకమార్లు వచ్చిన ప్రశ్నలు, పాఠ్యాంశాలు బోధిస్తూ వారానికి రెండు రోజులు పరీక్షలు పెట్టాలని అన్నారు.చదువులో వెనుకబడిన సి క్యాటగిరి విద్యార్థుల తల్లిదండ్రులకు వారానికి 2 సార్లు ఫోన్ చేస్తూ పిల్లలను ఇంట్లో కూడా కొంత సమయం చదివించాలని, చదివే వాతావరణం ఇంట్లో కల్పించాలని, నాణ్యమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ చేయాలనీ అన్నారు.  10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఆ సమయంలో వారికి మంచి పౌష్టికాహారం అందించాలని, దీనికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి అందజేయాలని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల కోసం జనవరి నెలలో ఒక మోటివేషన్ సెషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులకు ఏదైనా సలహాలు, సూచనలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని, 16 పాఠశాలల్లో అమలు చేశామని అన్నారు. 16 పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చాయని, మిగిలిన ఉన్నత పాఠశాలలో సైతం స్పోకెన్ ఇంగ్లీష్ విద్యార్థులకు నేర్పే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  విద్యాశాఖ ద్వారా వచ్చే మార్పు ఇతర శాఖల ద్వారా సాధ్యం కాదని, మన పై అత్యధిక బాధ్యత ఉంటుందని, దీనినీ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.
సమావేశంలో పాల్గొన్న *అదనపు కలెక్టర్ డా. శ్రీజ మాట్లాడుతూ,* పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు ఏదైనా కారణం చేత సెలవు లో ఉంటే మండల పరిధిలో  డిప్యూటేషన్ విధులు కేటాయించి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారికి సూచించారు.  విద్యార్థుల హాజరు అంశాన్ని ప్రతి వారం మండల విద్యా శాఖ అధికారి రివ్యూ చేయాలని, తక్కువ హాజరు ఉన్న విద్యార్థులపై శ్రద్ధ వహించి ఫాలో అప్ చేయాలని అన్నారు.పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటుకు వీలుగా అవసరమైన కూరగాయల మొక్కలు, మెడిసినల్ మొక్కలు గ్రామాలలోని నర్సరీలో పెంచేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అభ్యాస దీపికలతో పాటు విద్యార్థులకు మరింత సమాచారం అందించేందుకు ఖమ్మం నాలెడ్జ్ బుక్ లెట్ తయారు చేస్తున్నామని, మండలాలలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఈ బుక్లెట్ రూపొందిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం పర్యవేక్షణకు ప్రతిరోజు ఒక్క ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాలని, పిల్లల భోజనం నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ పడవద్దని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో  జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, ఎం.ఈ.ఓ లు, హెడ్మాస్టర్ లు, తదితరులు పాల్గోన్నారు.

Wednesday, 27 November 2024

*సమాజానికి చేసే సేవ శాశ్వతంగా నిలిచిపోతుంది .......జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*



*నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు విద్యార్థులు క్రమ పద్ధతిన కృషి చేయాలి*

*వి.వెంకటాయపాలెం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బోర్వెల్, పైప్ లైన్ ఆర్.ఓ. ప్లాంట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం, నవంబర్ -27 : సమాజంలో నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తూ సేవలు అందించే వారే శాశ్వతంగా నిలిచిపోతారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం రఘునాధపాలెం మండలం వి. వెంకటాయ పాలెం గ్రామంలోని జహీర్ అహ్మద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 లక్షల 50 వేల రూపాయలతో ఏర్పాటు చేసిన బోర్ వెల్, పైప్ లైన్, ఆర్. ఓ.ప్లాంట్ ను, 50 వేల విలువ గల కరెంట్ మోటర్ ను జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.కుతుంబాక బసవ నారాయణ, కుతుంబాక కోటేశ్వరరావు స్నేహానికి జ్ఞాపకార్ధంగా  పాఠశాలకు 3 లక్షల 50 వేల విలువచేసే ఆర్.ఓ. ప్లాంట్, బోర్ వెల్, పైప్ లైన్ ను కూతుంబాక మధు, 50 వేల రూపాయల కరెంట్ మోటర్ ను కూరాకుల నాగభూషణం పాఠశాలకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,*  పాఠశాల అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  మాటలకే పరిమితం కాకుండా విద్యార్థుల శ్రేయస్సు గురించి ఆలోచించి వసతులు కల్పించడం సంతోషకరమని అన్నారు. 
పాఠశాలలో అవసరమైన టాయిలెట్లు సైతం రాబోయే రోజులలో పూర్తి చేస్తామని అన్నారు.  పాఠశాలకు జహీర్ అహ్మద్ పేరు పెట్టారని, కొంత సమయం గడిచిన తర్వాత  మన రంగు, కులం, మతం, ఆస్తి ఎవరు గుర్తు పెట్టుకోరని, సమాజంలో మనం చేసిన సేవే శాశ్వతంగా గుర్తుంటుందని కలెక్టర్ తెలిపారు. సమాజం కోసం పనిచేసే వారికి విలువ ఉంటుందని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదగడంతో పాటు ఇతరులకు సహాయం చేసే ఆలోచనతో ఉండాలని, మన గ్రామాలను,రాష్ట్రాలను బాగు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని, దాన్ని సాధించేందుకు చేయాల్సిన పనులు క్రమ పద్ధతి ప్రకారం పూర్తి చేయాలని అన్నారు.విద్యార్థి దశలో పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మన స్నేహితులు కూడా బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో చదివితేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయని కలెక్టర్ అన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ పాఠశాలలోని లైబ్రరీనీ పరిశీలించి ఆకర్షణీయంగా, పిల్లలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, షూస్ కొరకు గతంలో కలెక్టర్ అందించిన లక్షా 50 వేలతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ డ్రెస్, షూస్ ను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు.

అనంతరం దాతలు కూతుంబాక మధు, కూరాకుల నాగభూషణం ను జిల్లా కలెక్టర్ సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్య కమిటీ చైర్ పర్సన్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గోన్నారు.
-----------------------------
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీచేయనైనది.

Thursday, 21 November 2024

భర్త మినిస్టర్.. భార్య ఆఫీసర్.. అన్నా వదిన అంటూ పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి..


TG: CM రేవంత్ వేములవాడ పర్యటనలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ఐటీ మినిస్టర్ శ్రీధరాబాబు సతీమణి శైలజారామయ్యార్ వచ్చారు. మంత్రులకు స్వాగతం పలికారు. తన భర్త శ్రీధర్ బాబుకు సైతం ఆమె ఫ్లవర్ బొకే ఇచ్చి వెల్కం చెప్పారు. సీఎం రేవంతు స్వాగతం పలకగా 'అన్నా.. వదిన' అంటూ ఆయన నవ్వుతూ వారిని పలకరించారు. 'ఫొటో బాగా దిగండి' అని పొన్నం సైతం నవ్వులు పూయించారు.

Thursday, 7 November 2024

పెలేది ఆటంబాంబు... పొంగులేటి వార్నింగ్


మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటుబాంబు పేలబోతోంది అంటూ ఇదివరకే ఓసారి కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈసారి నాటు బాంబు..లక్ష్మిబాంబు కాదు..త్వరలోనే ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోంది అంటూ ప్రకటించారు. గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. తప్పు చేసిన ఎవ్వరినీ చట్టం వదిలి పెట్టదని.. ఏ తప్పూ చేయకపోతే అంత వివరణ ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు.ప్రభుత్వానికి చెందిన రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్ళాయో త్వరలోనే బయటపడతాయని, అపుడు ఎవరు ఏమిటనేది ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఆటంబాంబు పేలుతుంది.. సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాగా ఫార్ములా ఈ రేసింగ్ కేసులో జరిగిన అక్రమాల్లో కేటీఆర్ జైలుకు వెళతారనే ప్రచారం నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

*సొసైటీ అక్రమాలపై విచారణ... రికార్డ్ ట్యాంపరింగ్ పై చర్యలు..*


*కల్లూరు సొసైటీలో* పలు అవకతవకలపై విచారణ ప్రారంభమైంది. ధాన్యం కొనుగోలు కమీషన్ గోల్మాల్ అయ్యిందని విశాల సహకార పరపతి సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న తోట ప్రవీణ్ అక్టోబర్ 25న తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.దాంతో డిస్ట్రిక్ట్ కోపరేటివ్ ఆఫీసర్ అక్టోబర్ 28న విచారణ అధికారిని నియమించారు. అలాగే సోమవారం ఖమ్మంలో జరిగిన గ్రీవెన్స్ లో తోట ప్రవీణ్, నల్లగట్ల రాజేష్ కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదును అందజేశారు. కల్లూరు సొసైటీలో పలు అవకతవకలకు పాల్పడ్డారని, ధాన్యం కొనుగోలు కమీషన్ గోల్మాల్ అయిందని, సర్వీస్ రికార్డు ట్యాంపరింగ్ జరిగిందని, గతంలో జరిగిన విచారణలో అధికారులు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని, 2006 నుంచి 2021 వరకు సబ్ స్టాప్ గా ఉన్న వ్యక్తి స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేశానని తప్పుడు వాంగ్మూలం ఇచ్చి అధికారులను, పాలకవర్గాన్ని మోసం చేసి సీఈఓ అయ్యాడని వారు కలెక్టర్ కు వివరించారు. దాంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే విచారణ జరిపి నివేదికను అందించాలని ఆదేశించారు. 
జిల్లా సొసైటీ అధికారి ఉషారాణి కల్లూరు సొసైటీలో మంగళవారం విచారణ చేపట్టారు. ఈ విచారణ సజావుగా సాగినా నిజాలు నిగ్గు తేలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా, సొసైటీ అక్రమాలపై చర్యలు తీసుకునేలా నివేదికలు ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విచారణలో న్యాయం జరగకపోతే 51 మందిని ఎంక్వయిరీ చేసి సమగ్ర విచారణ చేస్తే సొసైటీ అక్రమాలు బయటపడే అవకాశం ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Wednesday, 6 November 2024

*అర్హులైన లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీకి చర్యలు.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


ఖమ్మం : ఇందిరా మహిళా డైరీ ఏర్పాటులో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పాడి పశువులను సంబంధిత కార్పొరేషన్ల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలో పర్యటించి ఇందిరమ్మ మహిళా డెయిరీ చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,* చిల్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసే  స్థలం వెంటనే స్వాధీనంలోకి తీసుకొని ప్రహరీ గోడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముదిగొండ మండల పరిధిలో చిల్లింగ్ యూనిట్ సంబంధించి 5 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాల సేకరణ కేంద్రానికి కనీసం 10 మంది పాడి రైతులను ట్యాగ్ చేయాలని అన్నారు. పాడి పశువులను పంపిణీ చేసేందుకు మహిళా సంఘాల సభ్యులలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  పాడి పశువుల అంశంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించాలని, ప్రస్తుతం ఒకటి, రెండు పశువులు ఉన్న వారికి మరో రెండు పాడి పశువులు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పాడి పశువుల పంపిణీ కోసం లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వారికి సంబంధిత కార్పొరేషన్ల (ఎస్సీ, బీసీ, ఎస్టీ) ద్వారా రుణం మంజూరు అయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
అనంతరం ముదిగొండ మండలంలో ఉన్న గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, ఎంతమంది పాఠకులు ప్రతి రోజు గ్రంథాలయానికి వస్తున్నారు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులు హాజరవుతున్నారా, వారికి స్టడీ మెటీరియల్ అందించారా మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీలో పుస్తకాల రిజిస్టర్, పుస్తకాల లెండింగ్ రిజిష్టర్లను కలెక్టర్ పరిశీలించారు. 

గ్రంథాలయాన్ని ప్రతి రోజు తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని, దీని నిర్వహణ బాధ్యతలలో స్థానిక యువతను భాగస్వామ్యం చేయాలని, ముదిగొండలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఈ లైబ్రరీ వినియోగించుకునేలా చూడాలని, గ్రంథాలయం మరమ్మత్తుల కోసం అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, డిటీడబ్ల్యూఓ విజయలక్ష్మీ, ముదిగొండ మండల ఎంపీడీఓ శ్రీధర్ స్వామి, తహసీల్దార్ సునీత ఎలిజబెత్, లైబ్రేరియన్ శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------

*ఇందిరా డెయిరీ నిర్వహణ, పాల సేకరణ కేంద్రాలు, క్రొత్త యూనిట్లు ఏర్పాటు, మహిళా సంఘాల గ్రేడింగ్ తదితర అంశాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం :మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న ఇందిరా మహిళా డెయిరీలో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణ, పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు, క్రొత్త యూనిట్ ల ఏర్పాటు, మహిళా సంఘాల గ్రేడింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,*  ఇందిరా మహిళా డెయిరీలో కల్పించాల్సిన మౌళిక సదుపాయాలపై దృష్టి సారించాలని అన్నారు.  మండలంలో ఏ గ్రామాలలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలో ముందుగా నిర్థారించాలని, పాల ఉత్పత్తి అధికంగా ఉంటూ, అందుబాటులో ప్రభుత్వ భూమి ఉన్న గ్రామాలలో ముందుగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 

పాల సేకరణ కేంద్రాలకు అవసరమైన కియాస్కులు ఏపిఎం ల వద్ద అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ అవసరమైన మిల్క్ గ్రేడర్, సెగ్రిగేటర్, క్యాన్ లు, రిఫ్రాక్టోమీటర్ మొదలగు పరికరాలను ఏపిఏం సేకరించి పాల సేకరణ కేంద్రంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పాల సేకరణ కేంద్రాల నుంచి మండల కేంద్రంలోని బి.ఎం.సి. పాయింట్ వద్దకు పాలు తరలించే రూట్స్, వాహనాల క్రమబద్ధీకరణ చేయాలని కలెక్టర్ తెలిపారు. 

మధిర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఏర్పాటు చేయు బి.ఎం.సి. పాయింట్ లకు గ్రామాల నుంచి ఇక్కడికి పాలు తరలించేలా రూట్ ర్యాషనలైజేషన్ చేయాలని అన్నారు. నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఎర్రుపాలెం మాదిరి బి.ఎం.సి. యూనిట్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 

బల్క్ మిల్క్ చిల్లింగ్ కేంద్రాల ద్వారా 5000 లీటర్ల పాల చిల్లింగ్, స్టోరెజ్ యూనిట్ ఏర్పాటు అవుతుందని అన్నారు. ప్రతి బి.ఎం.సి. కేంద్రం యూనిట్ కంటేనర్ తో సహా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

నియోజకవర్గ మండలాల్లో బి.ఎం.సి. యూనిట్ ఏర్పాటుకు స్థలాల గుర్తింపు పూర్తయిందని, ముందుగా ప్రహరీ గోడ, గేట్ నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, ఈ పనులు వెంటనే ప్రారంభం అయ్యేలా చూడాలని అన్నారు.  కాంపౌండ్ వాల్ అనంతరం కంటేనర్ మాడల్ లో బి.ఎం.సి. కేంద్రాల ఏర్పాటుకు టేండర్ ఆహ్వానించాలని కలెక్టర్ తెలిపారు. 

బి.ఎం.సి. కేంద్రాల నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తే నిధులు మంజూరు చేస్తామని, 4 మండలాలలో ఎర్రుపాలెం మాదిరిగానే విద్యుత్ సరఫరా పనులు చేపట్టాలని కలెక్టర్ ఎస్ఈ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. 

రాబోయే సమావేశం నాటికి బి.ఎం.సి. యూనిట్ ఏర్పాటుకు గుర్తించిన భూములలో కాంపౌండ్ వాల్, గేట్ నిర్మాణం, బి.ఎం.సి. యూనిట్ టెండర్ ప్రక్రియ, విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాల ఉత్పత్తి పెంచేందుకు డిసెంబర్ నెలలోపు 500 గేదెలు కొనుగోలు చేసి 250 యూనిట్లు గ్రౌండ్ చేయడం జరుగుతుందని అన్నారు. 

పాల ఉత్పత్తి చేసే పాడి కుటుంబాలను గుర్తించి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా వారీగా  పాడి పశువుల యూనిట్ గ్రౌండ్ చేయాలని, మండలానికి 50 యూనిట్లు డిసెంబర్ నాటికి గ్రౌండింగ్ కావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం తక్కువ పశువులు ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి రెండు గేదెల చొప్పున పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

నవంబర్ 15 నాటికి పాడి పశువులు పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించి వారి జాబితా అందజేయాలని కలెక్టర్ తెలిపారు. పాడి పశువుల యూనిట్ల సంబంధిత లబ్ధిదారుల కులాల కార్పొరేషన్ (ఎస్సి,బీసి, ఎస్టీ) కార్పొరేషన్ ద్వారా గ్రౌండ్ చేయడం జరుగుతుందని అన్నారు. 

పాడి పశువుల యూనిట్ గ్రౌండింగ్ చేశాక పాలు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉందని, మన దగ్గర పాలు పోసే పాడి రైతులకు అందుబాటులో ఉన్న రివాల్వింగ్ ఫండ్ నుంచి 48 గంటల వ్యవధి లోగా చెల్లింపు చేస్తున్నామని అన్నారు.  

జిల్లాలో కనీసం 90 శాతం స్వశక్తి మహిళా సంఘాలకు ఏ+ బి  గ్రేడింగ్  ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  ముదిగొండ మండలంలో విఓఏ  ల ఏ+ బి గ్రేడింగ్ పెరిగిందని, ఇదే పనితీరు కొనసాగించాలని కలెక్టర్ తెలిపారు. తల్లాడ మండలంలో విఓఏ  ల ఏ+ బి గ్రేడింగ్ తగ్గడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు. తల్లాడ మండల పరిధిలో విఓఏ సమావేశాలు రెగ్యులర్గా ఎందుకు జరగడం లేదు కారణాలు తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

మహిళా శక్తి కార్యక్రమ అమలు కోసం నిరంతరం స్వశక్తి మహిళా సంఘాల సమావేశాలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు.  రాబోయే రెండు నెలల తర్వాత నిర్వహించే సమావేశంలో సైతం పని తీరు మెరుగు కానీ పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని , పనిచేయడం ఇష్టం లేని పక్షంలో ఖమ్మం జిల్లా వదిలి ఇతర జిల్లాలకు బదిలీ చేసుకుని వెళ్లిపోవాలని కలెక్టర్ సూచించారు.కూసుమంచి మండలంలో 300 పైగా గ్రూపులకు గ్రేడింగ్ జరగక పోవడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు.  మహిళా సంఘాల గ్రూపులకు గ్రేడింగ్ వచ్చే విధంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. 
ముదిగొండ, వైరా, రఘునాధపాలెం, మొదలగు మండలాలలో గ్రేడింగ్ పెరిగిందని సంబంధిత అధికారులను కలెక్టర్ అభినందిస్తూ, ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ భవిష్యత్తులో మరింత పెరిగేలా పని చేయాలని  సూచించారు. మహిళా సంఘాల సమావేశాలు రెగ్యులర్ గా నిర్వహిస్తూ వారి  జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేయాలని అన్నారు.
మహిళా శక్తి కింద గ్రౌండ్ చేసిన యూనిట్లు లాభసాటిగా నడిచేలా ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు అందించాలని అన్నారు.  మహిళా శక్తి యూనిట్లలో బాగా నడవని వివరాలను సీసీ ల ద్వారా సేకరించి వాటిని పరిశీలిస్తూ ఎందుకు నడవడం లేదు పరిశీలించి వాటి పని తీరు మెరుగయ్యేలా చూడాలని అన్నారు. 
మధిర, చింతకాని మండలాలు మహిళా శక్తి యూనిట్ గ్రౌండింగ్ బాగా చేశాయని కలెక్టర్ అభినందించారు. మహిళా శక్తి యూనిట్ ల గ్రౌండింగ్ కాకపోవడానికి గల కారణాలు, ఎటువంటి యూనిట్ల గ్రౌండింగ్ కాలేదు కలెక్టర్ ఆరా తీశారు.  సీసీలను ఎప్పటి కప్పుడు ఫాలో అప్ చేస్తూ , బ్యాంకర్లతో సంబంధం చేసుకుంటూ త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రాబోయే సమావేశం నాటికి కనీసం 70 శాతం వరకు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. 
ఐకేపి ద్వారా సన్న రకం ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. స్థానిక రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతు ఎన్ని ఎకరాలలో పంట పండించాడొ అంత పంట మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్డీఏ డిపిఎంలు, ఏపీఎం లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Monday, 4 November 2024

*చెల్లెమ్మ టీ స్టాల్ మంచిగా నడుస్తుందా.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


*మహిళలు వ్యాపార రంగంలో రాణించి  మహిళా శక్తి బ్రాండ్ గా నిలవాలి... జిల్లా కలెక్టర్*
*అతివలకు ఇందిర మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుంది.. జిల్లా కలెక్టర్*
ఖమ్మం : మహిళలు ఆసక్తి ఉన్న రంగంలో అర్ధికంగా రాణించాలని, ఇందిరా మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. 
సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న ఇందిర మహిళా శక్తి స్త్రీ టీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. స్త్రీ టీ నిర్వాహకురాలను చెల్లెమ్మ చాయ్ సెంటర్ మంచిగా నడుస్తుందా, వ్యాపారం అనుకూలంగా ఉందా అని అప్యాయంగా అడిగారు. కలెక్టరేట్ బస్ స్టాప్ లోనే టీ స్టాల్ ఉందిగదా గిరాకి వస్తుందా అని ఆరాతీసారు. చెల్లెమ్మ టీ పెట్టమ్మ అంటూ కలెక్టర్ చాయ్ ని సేవించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, వ్యాపార అభివృద్దికి సౌకర్యాలు కల్పించే అవసరం ఉందా అని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ* ఇందిర మహిళా శక్తి పథకం కుటుంబానికి ఆర్ధిక ప్రగతినిస్తుందని, మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. చేయూత ఇచ్చే భాద్యత మాది.. మీ తలరాతలు మార్చుకునే శక్తి మీదని కలెక్టర్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. మహిళలకు లబ్ది చేకూరాలనేది ప్రభుత్వం లక్ష్యమని, ఇందుకోసం స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నమని తెలిపారు. ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా అతివలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌‌లలో మెలకువలు నేర్పించేందుకు సౌకర్యాలను కల్పిస్తున్నామని, 
గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్టి చేకూరే విధంగా కార్యాచరణను వివరించారు. సుదీర్ఘకాలంగా మహిళాభ్యున్నతికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి నిలదొక్కుకునే విధంగా చేయాలనేదే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అధికారులు తోడ్పాటు అందిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని స్వయం సహాయక గ్రూపుల సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా ఇంట్లో ఉండి ఏదైనా వ్యాపారం చేసుకోసి స్వయం ఉపాధిని పొందవచ్చు అన్నారు. ఒంటరిగా వ్యాపారాలు చేయలేని మహిళలు గ్రూపులుగా కూడా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని వారికి చిన్నగా చేయూత ఇస్తే, ఇక వారు వెనక్కి తిరిగి చూసుకోకుండా అనుకున్నది సాధిస్తారని చెప్పారు.మహిళాలు ఆర్థికంగా ఎదిగి, మిగతా వారికి ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ ఆకాక్షించారు.
#################################
---------------------------------------------------------------------
*పక్కా ప్రణాళికతో ఇంటింటి సర్వే... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్* 
---------------------------------------------------------------------
*ఇంటింటి సర్వేలో ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వవద్దు.. జిల్లా కలెక్టర్* 
------------------------------------------------------------------------
*ఇంటింటి సర్వే నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్*
------------------------------------------------------------------------
ఖమ్మం, నవంబర్- 4 :  రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాప్రణాళికతో, ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 633304 కుటుంబాలున్నట్లు అంచనా ఉందన్నారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామన్నారు. 3654 ఇబి లుగా చేపట్టి, 3719 ఎన్యుమరేటర్లను, 314 మంది సూపర్వైజర్ల, 5 గురు నియోజకవర్గ అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. వివిధ శాఖల నుండి గెజిటెడ్ అధికారులను సూపర్వైజర్లుగా, వివిధ శాఖల సిబ్బందిని ఎన్యుమరేటర్లలుగా నియమించామన్నారు. ఖమ్మం కు డిప్యూటీ సిఇఓ నాగలక్ష్మి, పాలేరుకు అదనపు డిఆర్డీవో నూరోద్దీన్, వైరా కు డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సత్తుపల్లి కి కల్లూరు ఆర్డీవో రాజేందర్, మధిర నియోజకవర్గ బాధ్యులుగా ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు లను నియయించినట్లు ఆయన అన్నారు.ఒక ఎన్యుమరేషన్ బ్లాక్ కి ఒక సర్వేయర్ ఉండాలన్నారు. సర్వేలో 75 పప్రశ్నలు ఉన్నట్లు, ఒక ఇంటి సర్వేకు 30 నిమిషాల సమయం, రోజుకు ఒక సర్వేయర్ 10 ఇండ్ల సర్వే చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. ఈ నెల 6,7,8 తేదీల్లో ఇండ్ల లిస్టింగ్ పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఒక్కో సర్వేయర్ కు 150 ఇండ్లు కేటాయించామన్నారు. రోజువారి లక్ష్యం పెట్టుకొని, 15 రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్ధంగా ఉంచాలని, వీరిని మండల స్టాటిస్టిక్ అధికారులు పర్యవేక్షణ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఏ దశలో పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు ఎప్పటికప్పుడు సూపర్ చెక్ చేపడుతూ, పర్యవేక్షణ చేస్తూ, వారికి కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి రాజేశ్వరి, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Sunday, 3 November 2024

*ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు*- *వనసమారాధనలో రాష్ట్ర మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు*-



ఖమ్మం : ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,  తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడి తోటలో ఆదివారం తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ (టి.జి.ఈ.జే.ఏ.సి.) ఆధ్వర్యంలో నిర్వహించిన సకల ఉద్యోగుల కార్తీక మాస వన సమారాధన, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో *రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* ఆత్మీయ అతిథులుగా హాజరు కాగా, ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస రావు, చైర్మన్ మారం జగదీశ్వర్  ఆత్మీయ అతిథులకు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా  *మంత్రి పొంగులేటి మాట్లాడుతూ,* ప్రత్యేక రాష్ట్ర సాధనలో 204 ఉద్యోగ సంఘాలు ఏకధాటిగా పోరాటం చేశాయని, వీరి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం రావాలని ఉద్యోగుల కోరడంతో నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగి, మహిళా, రైతు, జర్నలిస్టులు వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే అవకాశం లేదని అన్నారు.  ప్రజా ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుందని,  ఉద్యోగులకు భరోసా కల్పించడమే కాకుండా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని అన్నారు.   ప్రభుత్వం చిత్తశుద్ధితో దుబారాలు చేయకుండా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన డీఏ లను క్రమ పద్ధతిలో మంజూరు చేస్తామని అన్నారు.రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం చర్చించారని, ఆర్ధికేతర ఇబ్బందులను వచ్చే మార్చి లోపల పూర్తి చేస్తామని అన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా, వారి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.ఆర్థికంగా ఇబ్బందులేని సమస్యలను ఈ సంవత్సరం క్యాలెండర్ మారే లోపల పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గత ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాను అశ్రద్ద చేసిందని, ప్రస్తుత ప్రభుత్వంలో ఖమ్మం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆనాటి ప్రభుత్వంలో ఉద్యోగులకు స్వేచ్ఛ, గౌరవం లేదని, అనేక ఇబ్బందులు పెట్టారని మంత్రి గుర్తు చేశారు.గతంలో టీచర్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా టీచర్లకు బదిలీలు, పదోన్నతులు కల్పించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఏ ఉద్యోగిని ఎటువంటి ఇబ్బందులకు పెట్టదని తెలిపారు. కొంతమంది ప్రశాంత వాతావరణం పాడు చేసే విధంగా అపోహలు సృష్టిస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేస్తూ ఉద్యోగులపై భారం తగ్గిస్తున్నామని అన్నారు. మంత్రి *తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ,*  ఉద్యోగులు కోరుకున్న మార్పు ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ముఖ్యమంత్రి ధైర్యం చేసి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. బ్యాలెట్ పేపర్ లలో ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రజల అవసరాలు గమనించే ఉద్యోగులు ఇచ్చిన తీర్పుగా ఇది భావిస్తామని, ప్రజల కష్టాలను తీర్చగలిగేది ఉద్యోగులు మాత్రమేనని అన్నారు. ప్రజలు తమకు జరిగే మంచిలో అధికారుల, ఉద్యోగుల పేర్లు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారని మంత్రి తెలిపారు.ఉద్యోగుల కష్టాన్ని, త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు. 40 సంవత్సరాలుగా తన హయాంలో పనిచేసిన అధికారుల కారణంగానే ప్రజలు తనను గుర్తు పెట్టుకున్నారని, రోడ్డు వేసిన, నీటిపారుదల పనులు జరిగిన, అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగుల శ్రమ ఉందని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని, పూర్వ వైభవం తీసుకుని రావడంలో ఉద్యోగులు దృష్టి సారించాలని అన్నారు. 
ఉద్యోగులకు రావాల్సిన ప్రతి అంశాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతని, బాకీలను దశల వారీగా చెల్లిస్తూ ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఉద్యోగులకు తెలుసని, పేద ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఉద్యోగులు నిజాయితీగా పని చేసే శక్తిని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.*ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ,*   గత 10 నెలల కాలంలో నిర్బంధ ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చాక మన హక్కుల గురించి ప్రశ్నించే స్వేచ్ఛ మనకు లభించిందని, సీఎం మన సమస్యల పరిష్కారం కోసం మనతో సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. గత పది సంవత్సరాలలో ఉద్యోగుల జేఏసీ లేదని, సర్వీస్ రూల్స్ లేవని , ప్రశ్నిస్తే ప్రతిబంధకాలు, క్రిమినల్ కేసులు నమోదు చేశారని అన్నారు. రాబోయే మార్చి తర్వాత ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, దీపావళి తర్వాత ఆర్థికేతర సమస్యలు పరిష్కరించడంతో పాటు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.రైతులు, మహిళలతో పాటుగా ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ప్రాధాన్యమేనని సీఎం తెలిపారని, ప్రతి ఒక్కరితో చర్చించి ఇచ్చిన మాటలు అమలు చేస్తామని అన్నారు.*ఉద్యోగుల ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ...* తెలంగాణ రావడానికి ఖమ్మం జిల్లా చైతన్యం కారణమని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యల పరిష్కారానికి సీఎం ముందుకు వచ్చారని అన్నారు. ఉద్యోసమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణతో పాటు ఆర్కెస్ట్రా, చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశిష్టంగా అలరించాయి.
జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అన్నం శ్రీనివాస రావును, వనజీవి రామయ్యలను, సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఉద్యోగులను ఉద్యోగ సంఘాల తరపున ఉద్యోగుల ఐకాస రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, శాసనమండలి సభ్యులు ఏ. నర్సిరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, టీజీఓ జిల్లా అధ్యక్షులు కస్తాల సత్య నారాయణ, టి.జి. ఓ. జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేదాద్రి, టి.జి.హెచ్.డబ్ల్యు.ఓ. జిల్లా అధ్యక్షులు కోటిపాక రుక్మారావు, దేవరకొండ సైదులు, నాగిరెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు, పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్, తదితరులు పాల్గొన్నారు.

Saturday, 2 November 2024

హైదరాబాద్‌లో మరింత దూరం మెట్రో... రెండో దశకు అనుమతులు... జీవో నంబ‌ర్ 196ను జారీ చేసిన తెలంగాణ సర్కార్

హైదరాబాదులో మెట్రో రైలు మరింత దూరం పరుగులు పెట్టేందుకు రెండవ దశ పనులకు తెలంగాణ సర్కార్ పచ్చ జెండా ఊపింది ఇందుకు సంబంధించి. జీవో నంబ‌ర్ 196ను  తెలంగాణ సర్కార్ జారీ చేసింది.రెండో దశలో మొత్తం 116.4 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయం.. ఇందులో పార్ట్‌-ఏ కింద 76.4 కిలోమీటర్లు, పార్ట్-బీ కింద 40 కిలోమీట‌ర్ల నిర్మాణంపార్ట్‌-ఏలో నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం 36.8 కిలోమీట‌ర్లు, రాయదుర్గం-కోకాపేట 11.6 కిలోమీట‌ర్లు, ఎంజీబీఎస్-చాంద్రయాణగుట్ట 7.5 కిలోమీట‌ర్లు, మియాపూర్‌-ప‌టాన్‌చెరు 13.4 కిలోమీట‌ర్లు, ఎల్బీనగర్‌-హ‌యత్‌నగర్ 7.1 కిలోమీట‌ర్ల నిర్మాణ పార్ట్-బీలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు నిర్మాణం
మొత్తం రూ.24,269 కోట్ల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లు, పీపీపీ పద్ధతిలో రూ.1,033 కోట్లు రూపాయల వ్యయంతో రెండవ దశ కొనసాగనం ఉంది.

సిపిఎం ఫిర్యాదుతో కదిలిన ప్రభుత్వం.... రంగంలోకి హైడ్రా డిప్యూటీ కలెక్టర్....

హైదరాబాద్ :.భూముల పరిరక్షణ కోసం సిపిఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు  మాదాపూర్ లోని 41/14 సర్వే నంబర్లు జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించిన హైడ్రా డిప్యూటీ కలెక్టర్ విజయ్ కుమార్...CPM నాయకులు శోభన్,  ప్రభుత్వ భూముల పరిరక్షణ కోరుతూ వివరాలు తెలపగా తమ శాఖ నుండి చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు...ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం ఏ విధంగా జరుగుతుందో డిప్యూటీ కలెక్టర్ కు వివరించిన సిపిఎం జోన్ కార్యదర్శి చల్లా శోభన్ జోన్ సభ్యులు కొంగరి కృష్ణ సీతారామయ్య మాణిక్యం వరుణ్ శ్రీనివాస్. ఈ  సందర్భంగా సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శోభన్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి మండలం పరిధిలోని ఖానా మెట్ విలేజ్ లో 41/14 సర్వే నంబర్లు మొత్తం 250 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించింది అని తెలిపిన సిపిఎం శోభన్...సుమారుగా 70 ఎకరాల భూమి ఇంకా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ  అనేక పర్మిషన్లు తీసుకొని ప్రభుత్వ భూములనే లక్ష్యంగా చేసుకుంటూ ప్రైవేటు సర్వేనెంబర్లు వేసి 41/14లో నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిచ్చిన సిపిఎం నాయకులు... గతంలో రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్న సిపిఎం నాయకులు...ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా కమిషన్ సభ్యులు ఈరోజు పర్యటించడం తమ పోరాటానికి బలాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు.హైడ్రా పై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని ప్రభుత్వ భూముల రక్షణ కోసం హైడ్రాకు తమ పార్టీ వైపు నుండి సంపూర్ణ సహకారం ఉంటుందన్న సిపిఎం ...

  .

ఖర్గేకు ఇప్పుడు తెలిసొచ్ఛిందా.. ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్

ఢిల్లీ; కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్ ఎటాక్ చేశారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారయ్యాయని మోడీ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర బడ్జెట్‌ ఆధారంగా ఎన్నికల గ్యారంటీలను ప్రకటించాలని, ఇష్టమొచ్చినట్లు హామీలివ్వరాదని రాష్ట్ర ఇంచార్జ్‌లకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం సూచించారు. ఆర్థికంగా అమలు చేయగలిగే వాగ్దానాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. దీనికి కౌంటర్‌గా మోడీ ట్వీట్‌ చేశారు. ''అడ్డగోలు హామీలు ప్రకటించడం చాలా తేలికైన విషయమే. కానీ వాటిని సరిగ్గా అమలు చేయడం కఠినం, అసాధ్యమనే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడే గుర్తించింది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తారు. వాటిని ఎప్పటికీ నెరవేర్చలేరని కూడా వారికి తెలుసు. కాంగ్రెస్‌ నిజ స్వరూపం ఇప్పుడు బయట పడింది. ప్రజల ముందు దోషుల్లా నిలబడి ఉంది. ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. ఇది రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేయడమే. ఇలాంటి రాజకీయాల వల్ల నష్టపోయే బాధితులు పేదలు, యువకులు, రైతులు, మహిళలే. వీరంతా గ్యారంటీల ప్రయోజనాలకు దూరమవుతారు. ఉన్న పథకాలు కూడా వారికి దక్కుండాపోతాయి' అని మోడీ పేర్కొన్నారు. హర్యానా ప్రజలు మాత్రం కాంగ్రెస్ మోసాన్ని తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. గతంలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అమలు కాని వాగ్దానాలు చేసి మోసం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎలా పనిచేస్తుందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయన్నారు. భారతదేశ ప్రజలు అభివృద్ధి మరియు పురోగతిని కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు.

Friday, 1 November 2024

ఇహ బడ్జెట్ ఉంటేనే హామీలు : ఖర్గే కీలక ప్రకటన


న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన హామీలు ఇవ్వబోమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. బడ్జెట్‌ ఆధారంగా మాత్రమే హామీలు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.
లేకపోతే రాష్ట్రం ఆర్థిక సంక్షోభానికి లోనవుతుందని హెచ్చరించారు. ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ.. 'మహారాష్ట్ర ఎన్నికల్లో 5, 6, 10, 20 వంటి ఎలాంటి హామీలను ఇవ్వడం లేదు. బడ్జెట్‌ ఆధారంగా మాత్రమే హామీలు ఇవ్వాలి. ప్రణాళిక లేకుండా ప్రగతి సాధించడం కష్టం. ఇలాటి పరిస్థితుల్లో ఇవ్వబోయే హామీలు నెరవేర్చలేకపోతే, భవిష్యత్‌ తరాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. రోడ్ల నిర్మాణానికి కూడా నిధుల పొంది ఉంటే, ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉంటారు. ప్రభుత్వానికి విఫలత రాకుండా చూసుకోవాలి' అన్నారు.
అయితే ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ పలు హామీలను ఇస్తోంది. కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో, తెలంగాణలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ఇప్పుడు అందించిన ఉచిత పథకాల అమలుకు విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలో ఉచిత బస్సు పథకం ప్రారంభమైన నెల రోజుల్లోనే నిలిపివేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. తెలంగాణలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడంలో నిస్పృహగా ఉన్న కాంగ్రెస్‌పై విపక్షాలు కఠినమైన విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీలపై వెనకడుగు వేస్తున్నట్లు భావిస్తున్నారు.

*85 వేల మంది ఎన్యూమరేటర్లతో తెలంగాణలో మేగా సర్వే"..... సంక్షేమ పథకాలకు మార్గదర్శి అవుతుంది : మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టబోయే ఇంటింటికి సమగ్ర సర్వే  (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కులాల సర్వే) కు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్  విజ్ఞప్తి చేశారు.దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రాహుల్ గాంధీ  మాట మేరకు ఈ జరుగుతున్న ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ సర్వే రాబోయే కాలంలో అన్ని రకాల పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు ఒక మెగా హెల్త్ చెకప్ మాదిరిగా ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సర్వేలో సమాచారం సేకరిస్తున్నవారు, సమాచారం తెలుపుతున్నవారు ప్రతి తెలంగాణ బిడ్డ ఈ సర్వేలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు.
 *85 వేల మంది ఎన్యూమరేటర్లు..* 

నవంబర్ 6వ తేదీ నుంచి 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక అబ్జర్వర్ గా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల పర్యావేక్షణ ఉంటుందన్నారు. ఇంటింటి నుంచి సమగ్ర సమాచారం సేకరించి ఆ డేటాను ఎంట్రీ చేయడంతో పాటు నవంబర్ 30 లోపు ఈ సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కులగణన కోసం ప్రభుత్వం ఇప్పటికే జీవో నెం 199 ద్వారా నిరంజన్ చైర్మన్ గా రాపోలు జయ ప్రకాశ్, తిరుమల గిరి సురేందర్, బాల లక్ష్మి మెంబర్లుగా బీసీ కమిషన్ ను నియమించిందని, రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ను నోడల్ డిపార్ట్ మెంట్ గా ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ పౌరులతో పాటు ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాలపై ప్రణాళికలు రచ్చించి వాటిని అమలు చేయడం నిమిత్తం ఈ సర్వే కోసం ఫిబ్రవరిలోనే శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కర్మాటక సీఎం సిద్దరామయ్య  సమక్షంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4 ఫిబ్రవరి న తెలంగాణలో ఇంటింటికి సమగ్ర సర్వే చేపట్టాలని రాష్ట్ర క్యాబినెట్  తీర్మానించిందన్నారు.

*వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి* : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. *పిల్లల సంరక్షణకు పక్కా చర్యలు..... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ*


ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఆంగ్ల పరిజ్ఞానం అందేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శుక్రవారం మామిళ్ళగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఆంగ్ల పాఠ్యాంశం బోధిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తరగతి గదిలో విద్యార్థినులతో కలిసి కూర్చొని పరిశీలించారు. ఆంగ్ల భాష పట్ల భయం అవసరం లేదని, ప్రతిరోజు ఒకరికొకరు కొంత సేపు ఆంగ్లంలో మాట్లాడుకుంటే భాషను సులువుగా నేర్చుకోవచ్చని అన్నారు. కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారిని ఆంగ్లంలో మాట్లాడించి, వారిని చైతన్య పరిచారు.అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై, బోధన ప్రమాణాలు, పాఠశాల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,*  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లం సులువుగా అర్థం చేసుకొని, మాట్లాడే విధంగా *యూ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్* కార్యక్రమాన్ని మన ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సైతం ఆంగ్ల పదాలు సరిగ్గా ఉచ్చరించి మాట్లాడే విధంగా బోధించాలని కలెక్టర్ సూచించారు.
పాఠశాలల్లో 80 శాతం కంటే తక్కువ అటెండెన్స్ ఉన్న విద్యార్థుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  హై స్కూల్ చదివే బాలికలకు పీరియడ్స్ టైంలో పాఠశాలకు గైర్హాజరు కాకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. బేస్ లైన్ పరీక్షను పక్కాగా నిర్వహించి క్రమపద్ధతిలో విద్యార్థుల ప్రమాణాలు పెంచేలా చూడాలని అన్నారు.
పాఠశాలలో పిల్లల, ఉపాధ్యాయుల హాజరు, నాణ్యమైన భోజనం, పాఠ్యాంశాల బోధన విధానం, తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్నారు. సాధారణంగా ఉపాధ్యాయులకు బాగా చదివే పిల్లలపై శ్రద్ధ ఉంటుందని, మన పాఠశాలల్లో తరగతి గదులలో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో బాలికల టాయిలెట్ల నిర్వహణ పై శ్రద్ధ వహించాలని, టాయిలెట్లను రెగ్యులర్ గా శుభ్రం చేయాలని అన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచి చేతులు కడుక్కునే అలవాటు వచ్చేలా చూడాలని అన్నారు. పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులు మందు, మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు గుర్తించామని, వారి తల్లి దండ్రులకు సమాచారం అందించి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేదని పాఠశాల హెడ్ మాస్టర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు.  పాఠశాలకు పిల్లల హాజరు తక్కువగా ఉందని, రెగ్యులర్ గా పాఠశాలకు వచ్చేలా చూడాలని, పిల్లలను మానిటర్ చేయాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాలకు బానిస పడిన పిల్లలకు వెంటనే కౌన్సెలింగ్ ఇవ్వాలని, ఇది సులువు కానప్పటికీ టీచర్లు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.మత్తుకు బానిసైనా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మన పిల్లలుగా భావించి ఓపికతో పిల్లలను బాగు చేయాలని, వారికి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించాలని, క్రీడలు, చదువులో వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు.
పాఠశాలలో డైనింగ్ హాల్ లేకపోవడం, ప్లే గ్రౌండ్ లేకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రదేశానికి ఆలోచన చేయాలన్నారు. పాత డిఆర్డీవో కార్యాలయ భవనాలను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భవనాల సద్వినియోగం చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఏఎంఓ రవి, పాఠశాల హెచ్ఎం లక్ష్మీ, ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు
----------------------------------------------------------------------
*పిల్లల సంరక్షణకు పక్కా చర్యలు..... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ*
ఖమ్మం : పిల్లల సంరక్షణకు పక్కా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పిల్లల సంరక్షణపై తీసుకుంటున్న చర్యల గురించి సంబంధించిన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పిల్లల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తున్నట్లు, గత 3 నెలలుగా తీసుకున్న చర్యల వివరాల నివేదికను అధికారులు వివరించారు.  ఈ సందర్భంగా *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ,*   జిల్లాలోని విద్యా సంస్థలలో మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి విద్యా సంస్థలో డ్రగ్స్ నిర్మూలన కోసం విద్యాశాఖ, సంక్షేమ శాఖ,  వైద్యశాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో యాంటి డ్రగ్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఫోక్సో కేసుల వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  పోక్సో కేసుల ఫైలింగ్, వైద్యుల నివేదికల సేకరణ పక్కాగా జరగాలని అన్నారు. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు చిన్నారి కార్యక్రమ అమలుపై సర్కులర్ జారీ చేయాలని విద్యాశాఖ అధికారికి అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తే వారిని గుర్తించి వెంటనే పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. బాల్య వివాహాల నివారణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలనీ అన్నారు. 
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, జిల్లా బీసి అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కెవిబి. రెడ్డి, స్కోప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ప్రసాద్, జాగృతి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రామ్మోహన్ ఈ డబ్బులు పే చేయాలి నువ్వు.. : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు...


కేంద్ర మంత్రి రామ్మోహన్ డబ్బులు కట్టాలని.. కేంద్రం నుండి తేవాలని ఏ.పి.ముఖ్యమంత్రి చంద్రబాబు అనడంతో అక్కడ నవ్వులు పూసాయి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నియోజకవర్గం ఈదుపురంలో దీపం పథకం 2 ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఈదుపురం చేరుకున్న చంద్రబాబు నాయుడు, ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్; కెంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఇతర అధికారులతో కలిసి అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లారు అక్కడ వారి కుటుంబానికి దీపం 2 పథకం కింద సిలిండర్ అందజేశారు. మీ ఇంటికి గ్యాస్ తీసుకొని వచ్చాను అని చంద్రబాబు వారితో అనడంతో చంద్రబాబుకి శాంతమ్మ, కుటుంబ సభ్యులు నమస్కరించారుఅనంతరం శాంతమ్మతో ఇంట్లో పాలు ఉన్నాయమ్మా మంత్రులందరూ మీ ఇంటికి వచ్చారు కాఫీ పెట్టి ఇస్తావా అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పోయి వెలిగించి పాలు పెట్టి టీకా కాచారు.. శాంతమ్మ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడిన చంద్రబాబు అక్కడ జానకమ్మ అనే ఒంటరి మహిళకు పింఛన్ మంజూరు చేశారు. టీకాచేసమయంలోనే దీపం 2 పథకానికి డబ్బులు కేంద్రం నుంచి వచ్చేలా చూడాలంటూ రామ్మోహన్ కు చెప్పారు..

Thursday, 31 October 2024

కోదాడ డిఎస్.పి శ్రీధర్ రెడ్డికి కేంద్ర దక్షతా పతకం.. హాజీపూర్ నిందితుల పట్టివేతలో కీలకపాత్ర వహించిన శ్రీధర్ రెడ్డి...

*నేర పరిశోనలో అత్యుత్తమమైన  ప్రతిభకు గుర్తింపుగా కోదాడ డి యస్ పి శ్రీ మామిళ్ల శ్రీధర్ రెడ్డికి   కేంద్ర హోమ్ మంత్రి దక్షత పతకాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం*
తేది 31.10.2024 నాడు జాతీయ సమైక్యత దినోత్సవం (సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి) సందర్బంగా కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ, నేర పరిశోధనలో అత్యున్నతమైన ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా, సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ డి యస్ పి 
శ్రీ మామిళ్ళ  శ్రీధర్ రెడ్డి కి 2024 సంవత్సరానికి "కేంద్ర హోమ్ మంత్రి దక్షత పతాకాన్ని" ప్రకటించటం జరిగింది. 
1998 నవంబర్ లో సబ్-ఇన్స్ పెక్టర్ గా  ఎంపికైన శ్రీ మామిళ్ల  శ్రీధర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో , రాచకొండ కమిషనెరేట్ మరియు ప్రత్యేక నిఘా విభాగంలో పనిచేసారు.ప్రతిష్ట్మాకమైన  ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ దళానికి దేశం తరుపున ఎంపికై 2016-17 లో   హైతీ దేశంలో పోలిస్ ఆపరేషన్స్ ప్లానింగ్ అధికారిగా పని చేసారు.సంచలనాత్మక హాజీపూర్ కేసులో ముగ్గురు  మైనర్ బాలికల అత్యాచారం, హత్య చేసిన  నిందితుడిని  తన సాంకేతికత నైపుణ్యాన్నీ ఉపయోగించి  స్వల్పకాలంలోనే అరెస్ట్ చేయడంలో, అత్యంత కీలక పాత్ర పోషించటం జరిగింది. నర్సింహులగూడెం  ఫ్యాక్షన్ హత్య కేసు, మరో మూడు హత్య, అనేక దోపిడీ, దొంగతనాల కేసుల ఛేదన మరియు దర్యాప్తును తనదైన శైలీలో కృషి, పట్టుదలతో చేసి అనేక కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా విధులను నిర్వహిస్తూ, అనేక సందర్భాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. 26 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసులో అనేక కీలక మైన శాంతి భద్రతల విషయాల్లో, సామాజిక విషయాల్లో , పోలీస్ ప్రజా సంబంధాలను పటిష్టం చేయటంలో, అనేక  తీవ్రవాద, దోపిడీ, హత్య , మనుషుల అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల కేసుల్లో తన ప్రతిభ పాటవాలను గుర్తించి, తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం మరియు   పొలిసు ఉన్నతాధికారులు, గతంలో కూడా పోలీస్ సేవ పతాకాన్ని, తెలంగాణ రాష్ట్ర శౌర్య పతాకాన్ని, ఉత్తమ సేవ పతాకాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పతాకాన్ని ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ బహుకరించటం జరిగింది. అంతేకాకుండా 2015 లో పంజాబ్ లో జరిగిన అఖిల భారత స్థాయి  డ్యూటీ మీట్ లో  ఫోరెన్సిక్ సైన్స్ విభగంలో రజత పతాకాన్ని సాధించారు.   2017 లో ఐక్య రాజ్య సమితి శాంతి పతాకాన్ని సాధించారు. మరో రెండొందలకు పైగా రివార్డులు/అవార్డులు పొందారు. ఈ సందర్బంగా రాష్ట్ర డీజీపీ శ్రీ జితెందర్ IPS, శాంతి భద్రతల అదనపు డీజీపీ శ్రీ మహేష్ భగవత్,IPS, జోనల్ ఐజీపీ శ్రీ సత్యనారాయణ IPS, సూర్యాపేట జిల్లా యస్ పి శ్రీ సన్ ప్రీత్ సింగ్, IPS & అదనపు యస్ పి నాగేశ్వర్ రావు మరియు ఇతర అధికారులు కోదాడ  డి ఎస్ పి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించటం జరిగింది.