Tuesday, 14 January 2020

నిలక్కళ్ లో బాగ్యనగర్ అయ్యప్ప సేవాసమితి విశిష్ట సేవలు

కేరళ /పట్టణం ధిట్ట : శబరిమలై దేవాలయం చేరాలంటే ప్రతి వాహనం..ప్రతి భక్తుడు  నిలక్కళ్ దాటి వెళ్లాలి..ఆ ప్రస్తానంలో నిలక్కళ్ శివ టెంపుల్ దగ్గర బాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితీ(BASS)తెలుగు రాష్ట్రాల అయ్యప్ప లను కలుపుకుని ఈనేల 7వ తేదీ నుండి 15 వరకు అన్నదానంతో పాటు  పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చెపట్టి భక్తులకు విశిష్ట సేవలను అందజేస్తోంది..దాతల సహకారంతో భాగ్య నగర్ అయ్యప్ప సేవా సమితి శబరిమలైలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు హైదరాబాద్ నుండి రెండు లారీల సరుకుతో  సుదీర్ఘ దూరం ప్రయాణం చేసి నిలక్కల్ శివం మందిరం దగ్గర  శిబిరం ఏర్పాటు చేసి వీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో పాదయాత్ర భక్తులు, ఇతర భక్తులు శిబిరంలో ఆహారం స్వీకరించి సేదతీరి, తిరిగి పంబవైపు సాగుతున్నారు..రద్దిని నిధులను దృష్టిలో పెట్టుకుని భాగ్య నగర్ అయ్యప్ప సేవా సమితి మరో లారీ సరుకు హైదరాబాద్ నుండి తెప్పించారు. మరోవైపు పరిసరల శుభ్రత  కొనసాగిస్తున్నారు..BASS అన్నదాన కేంద్రాన్ని ట్రావేన్కకూర్ దేవాలాయ బోర్డు అధ్యక్షుడు వాసు సందర్శించి భాగ్యనగర్ ఆయ్యప్ప సేవ సమితీ కార్యక్రమాలను ప్రశంసించారు..మరోవైపు సేవ సభ్యులు దక్షిణ భారత రాష్ట్రాల నుండి వచ్ఛెఅయ్యప్పల మన్ననలు అందుకుంటున్నారు.
🙏 శరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్🙏 

No comments:

Post a Comment