Tuesday, 21 January 2020

సారీ ఒకే..ఇంకోసారి కూడానా....

ఆస్ట్రేలియాలో తమ కంపెనీ ప్రకటన వివాదాస్పదం కావడంతో KFC క్షమాపణలు చెప్పింది, కారు అద్దంలో ఒక మహిళ తన యద అందాన్ని చూసేటప్పుడు ఇద్దరు యువకులు ఆమెను కన్నార్పకుండా చూస్తున్నట్లు వీడియో రూపొందించబడింది.
 లూసియానాకు చెందిన కెంటుకీ ఫ్రైడ్ చికెన్ కంపెనీ KFC గా పేరోందిన ఈ కంపెనీ చికెన్ ప్రైడ్ అమ్మకాలు చేస్తుంది. ఆ కంపెనీ ప్రకటన మహిళను కించపరచడమే కాకుండా యువకులను పెడదారి పట్టించేదిగా వుందని విమర్శలు వెల్లువెత్తడంతో  కంపెనీ యాజమాన్యం ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్ఛింది.
అయితే క్షమపణలతో మరోమారు ఆ వీడియో చక్కర్లు కొడుతుండటంతో కంపెనీ పై అసలు కంటే కొసరెక్కువ అంటు మరో రకం విమర్శలు వచ్చిపడుతున్నాయి

No comments:

Post a Comment