Sunday, 26 January 2020

అభివృద్ధిలో ఖమ్మం జిల్లాకు టాప్ ర్యాంక్ : కలెక్టర్ ఆర్.వి.కర్ణన్.

 
 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో కలేక్టర్ ఆర్.వి.కర్ణన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లా అభివృద్ధిని గణంకాలతో సహా వివరించారు.
 సమాగ్రాభివృద్దిలో ఖమ్మం జిల్లా తెలంగాణ లోనే ముందంజలో వుందని కలేక్టర్ పేర్కొన్నారు.
 ఉద్యోగులు..పోలీసులు..కృషి ఫలితంగా ఇప్పటి వరకు వివిధ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని ఫలితంగా  డెమోక్రసి అవార్డును అందుకున్నామన్నారు.
 ఇదే ఉత్సహంతో మరింత అభివృద్ధి సాధనకు ప్రణాళికతో ముందుకు సాగుదామని కలేక్టర్ పిలుపునిచ్చారు..
ఖమ్మం జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తు జిల్లా యంత్రాంగానికి సహకారాన్ని అందజేస్తున్న ప్రజాప్రతినిధులకు..జిల్లా న్యాయమూర్తి, కమీషనర్ ఆఫ్ పోలీసు , సిబ్బంది.. జిల్లా ఉద్యోగులకు..తదితరులకు కలేక్టర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

No comments:

Post a Comment