హైదరాబాద్/షాద్ నగర్ : ఓ చిరుత ఆటవీ దారి తప్పింది.. షాద్ నగర్ జనవాసలలోకి చొరబడింది..బహుశా రాత్రి పూట షాద్ నగర్ ప్రాంతం చేరుకుని పటేల్ రోడ్డు లోని ఓ ఇంటి మొదటి అంతస్తులో పూల కుండిల మధ్య నక్కింది..
వెంటనే అక్కడికు చేరిన పోలీసు బృందం ..ఫారేష్టు అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు మూడు గంటల శ్రమించి చిరుతక మత్తు తూటలు ఇచ్ఛారు అనంతరం వలలో దానిని బందించి జూపార్క్‌కు సురక్షితంగా తరలించారు.
ఈ ఆపరేషన్లో 8మంది సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది విజవంతంగా చిరుతను రెస్క్యూ చేయడం పట్ల అధికారులు అభినందించారు
షాద్ నగర్ ప్రస్తుతం జిల్లా కేంద్రంగా వుంది గతంలో మహాబూబ్ నగర్ జిల్లా.. నలమల ఇటవీ ప్రాంతానికి దగ్గర వుండటంతో చిరుత శ్రీశైలం ఆటవీ ప్రాంతం నుండి వచ్ఛి వుంటుదని బావిస్తున్నారు..

No comments:
Post a Comment