అట్లాంటా : కోతి నుండి పుట్టాడు మానవుడు అన్నారు.. మరి కోతులకు మనిషి లక్షణాలు వుండటంలో వింతేముంది...అందుకే ఆ జూలో చింపాంజీలు పిల్లల మాదిరిగా కేరింతలు కొడుతూ ఉయ్యాల.. జంపాల ఆటలు ఆడేసుకొంటున్నాయి.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని జార్జియా ముఖ్యపట్టణం అట్లాంటా ఇక్కడ అబ్బుర పరచే జంతు ప్రదర్శనశాల వుంది. అనేకనేక పక్షులతో పాటు జంతువులు ఇక్కడి సందర్శకులకు ఆట వెలది.జంతువులకు తగ్గ ఆటవెలదికి జూ నిర్వహాకులు అనేకనేక ఏర్పాట్లు చేశారు..
అందులో బాగంగా చింపాంజీలు..గొరిల్లాలకోసం ఉయ్యాలలు..హెంగింగ్ నెట్స్ ఏర్పాటు చేశారు.. ఇహ చెప్పెదేముంది వీటిలో ఓ గొరిల్లా వైభోగంగా రిలాక్స్ అయిపోతే మరో గదిలో చింపాంజీలు ఉయ్యాల.. జంపాల ఆటలతో సందర్శకులచే ఔరా అనిపించుకుంటున్నాయి..ఇహ జూలో పిల్లల ఆనందం చెప్పాలంటారా..
No comments:
Post a Comment