తిరుమలలో ప్లాస్టిక్తి నిషేధం అమలవుతున్న నేపథ్యంలో జ్యోర్లింగక్షేత్రం శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని శ్రీశైల ఆలయ వర్గాలు బావిస్తు న్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిషేధం అమలు కానుంది.*భ్రమరాంబికా* *మల్లికార్జున* *స్వామి* *వారి* *దేవాలయములో* *14.02.2020* *నుండి* *24.02.2020* *వరకు* జరుగనున్న *మహాశివరాత్రి* *బ్రహ్మోత్సవములు* అంగరంగ వైభవముగా జరుపుటకు దైవజ్ఞులు నిర్ణయించినట్లు ఆలయ ఈ.ఓ . రామారావు తెలిపారు.
ఈ బ్రహ్మోత్సవములను ప్లాస్టిక్ *రహిత* ఉత్సవములుగా ప్రకటించటం జరిగిందని ఆయన పేర్కొన్నారు..
ఈ క్షేత్రమును దర్శించేందుకు వచ్చే భక్తులు మంచి నీళ్ల బాటిల్స్, గ్లాసులు, ప్లేట్లు మరియు సంచులు ప్లాస్టిక్ వి కాకుండా జూట్ బ్యాగ్ లు గానీ, కాటన్ సంచులు, స్టీల్ గ్లాసులు, స్టీల్ బాటిల్స్ తో మాత్రమే దేవాలయమునకు రావలసినదిగా ఈ క్షేత్రము తరపున ఆయన విజ్జప్తి చేశారు.
శ్రీశైల క్షేత్రంలో ప్లాస్టిక్ నిషేధం విషయాన్ని అన్ని వర్గాలకు చేరేలా చూడాలని. సమాచారమును మీ సోషల్ మీడియాలో సైతం సాధ్యమైన మేరకు ప్రచారాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సిందిగా ఆయన కోరారు.
బ్రహ్మోత్సవములకు వెళ్లే భక్తులకు ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు వెంట తీసుకొని రాకుడదని తెలిపారు. *ప్లాస్టిక్* *రహిత* *సమాజం* కోసం, *పర్యావరణ* *పరిరక్షణ* కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కాగోరుతున్నామన్నారు. ప్రకృతిని మనందరం కలసి కాపాడుకుందామని ఇ.ఓ రామారావు విజ్జప్తి చేశారు.
No comments:
Post a Comment