ఖమ్మం-మే30
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు వనం వెంకటేశ్వర్లు రాష్ట్ర
స్ధాయి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా హైదరాబాదులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు
.సీనియర్ జర్నలిస్ట్ ,మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమీషన్ సభ్యులు ఆర్. సత్యనారాయణ స్ధాపించిన ‘ఆర్ ఎస్ ఎన్ సేవా ఫౌండేషన్ ’ సమాజ హితాన్ని కాంక్షిస్తూ కలాలను పదునెక్కిస్తున్న పాత్రికేయులను ప్రోత్సహించడానికి ,పత్రికల్లో రోజు రోజుకు తగ్గిపోతున్న మానవీయ కథనాలను పెంచడానికి రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ కథనాలను ఆహ్వానించి అందులో మానవీయ కథనాలను రాసిన వారిని ఉత్తమ జర్నలిస్ట్ లుగా ఎంపిక చేశారు. ఈ అవార్డును సోమవారం హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు
చేతుల మీదుగా అందుకున్నారు
ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు)జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి,
తెలంగాణ సాహిత్య అకాడమి పూర్వ అధ్యక్షులు డా నందిని సిద్దారెడ్డి,టిపిఎస్ సి మెంబర్ కారం రవీందర్ రెడ్డి,తెలంగాణ బేవరేజెస్ మాజీ చైర్మన్ జి దేవిప్రసాద్ రావు,టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఆర్ ఆర్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ చైర్మన్ ఆ సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజేష్
టీయూడబ్ల్యూజే నాయకులు శంకర్
దితరులు పాల్గొన్నారు
‘మన తెలంగాణ ’ దినపత్రిక ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ గా కొనసాగుతున్న వనం
వనం వెంకటేశ్వర్లు తన జర్నలిజం కేరిర్ లో ఇప్పటికి పలు మార్లు ఉత్తమ జర్నలిస్ట్ గా ఎంపికయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం చే మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు.2003లో అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రజాశక్తి దిన పత్రిక వ్యవస్ధాపక సంపాదకులు మోటూరు హన్మంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు.అదేవిధంగా 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చే
బి. నాగేశ్వర్ రావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు(రూ.2లక్షల క్యాష్ అవార్డు)ను,2008లో రాష్ట్ర ప్రభుత్వం చే ఎం. నర్సింగరావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు(రూ.1లక్ష క్యాష్ అవార్డు)ను,2012లో విశాఖ పట్టణంలోని ఆర్పిత స్వచ్చంద సేవా సంస్ధ చే ‘ఆంధ్ర రత్న’ అవార్డును,2013 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం పర్యటక శాఖ చే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు.అదేవిధంగా 2007 లో ‘వార్త’ దిన పత్రిక యాజమాన్యంచే ఖమ్మం జిల్లా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును,1989లో నల్లగొండ జిల్లాలో ప్రజాపోరు సాయంకాల దినపత్రిక యాజమాన్యంచే బెస్ట్ జర్నలిస్ట్ అవార్డును,1994లో నల్లగొండలోని గాంధి సేవా సమితి చే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు వార్త దినపత్రికలో ఖమ్మం,హైద్రాబాద్,న్యూఢిల్లీ ,సూర్యాపేటలోపనిచేశారు.నల్లగొండ లో ఆంధ్రభూమి,ఈనాడు,ప్రజాపోరులో పనిచేశారు .దాదాపు 20 ఏళ్ల పాటు వార్త దిన పత్రికలో ప పనిచేసిన ఆయన ప్రస్తుతం మన తెలంగాణ దినపత్రికకు ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు. ఇటివలనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టి యు డబ్ల్యు జె ఐజెయు)ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు
No comments:
Post a Comment