Friday, 30 September 2022

శ్రీవారి గరుడ సేవకు చెన్నై గొడుగులు


తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా శుక్ర‌వారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టిటిడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆల‌యం ముందు ఈ గొడుగుల‌ను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.ఈ సంద‌ర్భంగా శ్రీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి మాట్లాడుతూ ఈనెల 25న చెన్నై నుంచి 11 గొడుగుల ఊరేగింపు ప్రారంభ‌మైంద‌న్నారు. చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం తిరువళ్లూరులోని వీరరాఘవ పెరుమాళ్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామ‌న్నారు. గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 2  గొడుగులను సమర్పించిన‌ట్టు చెప్పారు. గత 17 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి గరుడ సేవ నాడు అలంకరించడానికి శ్రీవారికి గొడుగులు స‌మ‌ర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో హిందూ ధర్మార్థ సమితి ఫౌండర్ శ్రీ వేదాంతం పాల్గొన్నారు.


Wednesday, 28 September 2022

డిఫెన్స్ చీఫ్ గా అనిల్ చౌహాన్.. కేంద్రం ఉత్తర్వులు..

దిల్లీ: నూతన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌)గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ని కేంద్రం నియమించింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా సీడీఎస్‌ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. బిపిన్‌ రావత్‌ తర్వాత ఈ అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేసి అనిల్ చౌహాన్‌ని ఎంపిక చేసింది. చౌహాన్‌ ఈస్టర్న్‌ కమాండ్‌ చీఫ్‌గా 2021 మే నెలలో పదవీ విరమణ చేశారు.

సామాన్యుని చేతిలో వజ్రాయుధం అర్టిఐ చట్టం : కమీషనర్ డా. గుగులోతు శంకర్ నాయక్


ఖమ్మం,  సెప్టెంబర్ 27: సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ డా. గుగులోతు శంకర్ నాయక్ అన్నారు.  బుధవారం డిపిఆర్ సి భవనంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా  సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగిన పౌరులు, పౌర సమాచార అధికారులతో 30 కేసులకు సంబంధించి విచారణను కమీషనర్ నిర్వహించారు. సమాచార హక్కుచట్టం సెక్షన్ 6(1) ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని, సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలో అందించాల్సిన బాధ్యత ఆయా శాఖల ప్రజా సమాచార అధికారులపై ఉందని ఆయన తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ  కార్యాలయాల్లో సమాచారం హక్కుక్రింద నిర్థేశిత సమయంలో అధికారులు అందజేస్తున్నారని..ఇటీవల గోదావరి వరదల కారణంగా వరద ప్రభావిత జిల్లాల్లో కొంత జాప్యం వుందని పేర్కొన్నారు.సమాచార  అనంతరం సమాచారహక్కు చట్టం విధులు, పరిధిపై పాత్రికేయుల సమావేశాన్ని కమీషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత అధికార యంత్రాంగంలో జవాబుదారితనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల కాలంలో ఇవ్వాలని, అలా సకాలంలో సమాచారం ఇవ్వని కారణంగా కమిషన్ నేరుగా. ప్రజలు,ఆయా శాఖల పౌర సమాచార అధికారులతో ఇవాళ జిల్లా  కేంద్రంగా కమిషన్ కోర్టును ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా కేసుల విచారణ  ప్రక్రియ నిర్వహించి దరఖాసుదారులు కోరిన సమాచారాన్ని అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వని యెడల, మొదటి అప్పీల్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు. 30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వని క్రమంలో సెక్షన్ 19 (1) ప్రకారం మొదటి అప్పీల్ చేసుకుంటే మొదటి అప్పిలేట్ అధికారి సమాచారం విచారణ చేపట్టి ఇప్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మొదటి అప్పిలేట్ అథారిటి ఉండి, పరిష్కారం చేయని యెడల సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషనర్ కి దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ఇట్టి జాప్యాన్ని తొలగించి, ప్రజల్లో చైతన్యం నింపేందుకు, 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం అందించే విధంగా కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం జిల్లాకు సంబంధించిన 30 కేసుల విచారణ నిర్వహించి దరఖాస్తు దారులకు కోరిన సమాచారం అందచేసినట్లు ఆయన అన్నారు. ప్రజా ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు సకాలంలో అందించాలని పౌర సమాచార అధికారులను కమీషనర్ ఆదేశించారు. పౌర సమాచార అధికారులు సెక్షన్ 4(1) బి ప్రకారం 17 అంశాలతో కూడిన సమాచారం కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. సెక్షన్ 4(1) బి నిర్వహణ వల్ల కార్యాలయ విధులు  నిర్వహణ, కార్యాలయ సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. సెక్షన్ 5 (1), 5 (2) ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005 లో పౌర సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అథారిటీల పేర్లు, హోదా, ఫోన్ నెంబర్ల వివరాలతో  అమలు బోర్డులు ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. ప్రతి పౌర సమాచార అధికారి సమాచార హక్కు చట్టం - 2005 సమాచార రిజిస్టర్ 16 కాలమ్ లతో కూడినది, మొదటి అప్పిలేట్ అథారిటీ 8 కాలమ్ లతో కూడిన రిజిస్టర్ లను నిర్వహించాలన్నారు. పౌరులకు సమాచారం అందచేయడం, సత్వర పరిష్కారానికి రాష్ట్ర కమీషన్ చర్యలు చేపడుతూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.  దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర కమిషన్ సెకండ్ అప్పిలేట్ ఆధారిటికి దరఖాస్తు చేస్తే, రాష్ట్ర కమీషన్ మూడు నుంచి ఆరు నెలల లోపే కేసు విచారణ చేపట్టి సమాచారం అందిస్తూ, విజయవంతంగా ముందుకు వెళ్తుందని అన్నారు. కరోనా ఉధృతి లాంటి విపత్కర పరిస్థితుల్లో టెలిఫోనిక్ హియరింగ్ చేపట్టి అనేకమంది దరఖాస్తుదారులకు సమాచారం ఇప్పించడంలో తెలంగాణ కమిషన్ సేవలు అందించిందన్నారు. జిల్లాలో 459 పై చిలుకు కేసులు పరిష్కరించినట్లు ఆయన అన్నారు.  రాష్ట్ర స్థాయిలో 38 వేల కేసుల్లో 30 వేల పైచిలుకు కేసులను పరిష్కరించామన్నారు. సమాచార హక్కు చట్టాలపై ప్రజలను చైతన్యపరుచుటలో మీడియా సహకారం అందించాలని ఆయన కోరారు. సమాచార హక్కుచట్టంపై ప్రజలకు చైతన్య సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ఎలా ఉపయోగించుకుంటున్నామో, సమాచారహక్కు చట్టాన్ని కూడా అదే తరహాలో సద్వినియోగ పరుచుకోవాలన్నారు.
    అంతకుముందు అదనపు కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డిఓ, తహశీల్దార్లు సమాచార హక్కు చట్టం కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మొక్కను అందచేసి స్వాగతించారు. 

Tuesday, 27 September 2022

మీన లగ్నంలో ధ్వజారోహణం... శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు మంగ‌ళ‌వారం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ ఎఆర్‌.శేషాచ‌లం దీక్షితులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి తదితరులు పాల్గొన్నారు.

చదివింది పదోతరగతి చేసేది డాక్టర్ వృత్తి


వరంగల్ : నకిలీ సర్టిఫికేట్లతో నగరంలో గత 25 సంవత్సరాలు వైద్యులుగా చలామణవుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫర్స్ మరియు మట్వాడా, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు.
 *ఈ నకిలీ డాక్టర్ల నుండి రెండు నకిలీ వైద్యవిద్య సర్టిఫికేట్లతో పాటు ఒక లక్ష 28వేల రూపాయల నగదు, డాక్టర్ క్లినికలకు నిర్వహణకు సంబంధించిన పరికరాలు, మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ వరంగల్, హంటర్ రోడ్ ప్రాంతానికి చెందిన ఇమ్మడి కుమార్ పదో తరగతి పూర్తి చేయగా, మరియు వరంగల్ చార్ బౌళి ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ ఫెయిల్ అయినాడు. వీరు ఇరువురు మిత్రులు కావడంతో పాటు గతంలో అనగా 1997 సంవత్సరానికి ముందు నగరంలో ప్రముఖ డాక్టర్ల వద్ద సహయకులుగా సంవత్సరాల కాలం పనిచేసారు. వీరు ఇరువురుకి సహయకులుగా చాలా కాలం పనిచేయడం ద్వారా వైద్యం చేయడంలో అనుభవం రావడంతో వీరు సైతం డాక్టర్లుగా చలామణి అయి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలకున్నారు. ఇందుకు కోసం నిందితులు బిహార్ రాష్ట్రంలోని దేవఘర్ విద్యాపీర్ విశ్వవిద్యాలయము నుండి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికేట్ తో పాటు గుర్తింపు కార్డును ఐదు వేల రూపాయల చొప్పున కోనుగోలు చేసారు. సంపాదించిన సర్టిఫికేట్ల సహయంతో ఇరువురు నిందితుల్లో ఒకడు ఇమ్మడి కుమార్ క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో వైద్యశాలను నిర్వహిస్తుండగా, మరో నిందితుడు రఫీ సలీమా క్లినిక్ పేరుతో చార్ బౌళి ప్రాంతంలో గత 25 సంవత్సరాలుగా వైద్యశాలలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ సహయకులుగా పనిచేసిన అనుభవంతో నిందితులు తమ వైద్యశాలకు సాధారణ రోగాలతో వచ్చే రోగులకు చికిత్స అందిస్తూ రోగుల వద్ద పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేసేవారు. ఒకవేళ రోగులు వ్యాధి తీవ్రత అధికంగా వుంటే నగరంలోని కార్పోరేట్ హస్పటలకు వెళ్ళమని సూచించేవారు. నిందితులు నిర్వహించే వైద్యశాలలోనే మందులు దుకాణంతో పాటు రక్తపరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి వారి నుండి కూడా పెద్ద మొత్తం కమీషన్లు తీసుకోనేవారు.
ఈ నకిలీ డాక్టర్లు భాగవతం కాస్తా టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలియడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానికి మట్వాడా, ఇంతేజా గంజ్ పోలీసులు మరియు వరంగల్ రిజినల్ ఆయుష్ విభాగానికి చెందిన వైద్యుల అధ్వర్యంలో ఈ నకిలీ డాక్టర్లు నిర్వహిస్తున్న వైద్యశాలలపై దాడులు నిర్వహించి నకిలీ డాక్టర్లను విచారించడంతో నిందితులు తాము పాల్పడుతున్న నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు.
ఈ నకిలీ డాక్టర్ల వ్యవహారంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి, రిజినల్ డిప్యూటీ డైరక్టర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆయుష్ రవినాయక్ టాస్క్ ఫోర్స్ ఇనన్స్ స్పెక్టర్లు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐలు లవణ్ కుమార్, శ్రీకాంత్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, సోమలింగం, అశోక్, స్వర్ణలత, కానిస్టేబుళ్ళు సృజన్, నవీన్,సురేష్, శ్యాం, శ్రీధర్, శ్రీను,శ్రవణ్ కుమార్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Monday, 26 September 2022

బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు... శాస్త్రోక్తంగాఅంకురార్పణ...


తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
విశిష్టత.: వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
సూర్యాస్తమయం తరువాతే..
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.
అంకురార్పణ క్రమం..
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.
       అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.
        ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.

ధరణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టండి...ఆధికారులకు కలేక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశాలు


ఖమ్మం, సెప్టెంబర్ 26: ప్రభుత్వ ఉత్తర్వులు 59 అమలుకు చేపడుతున్న సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లతో 59 జీవో అమలు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులపై పూర్తి అవగాహన కల్గివుండాలన్నారు. ఉత్తర్వులలోని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు లబ్ది పొందేలా చూడాలన్నారు. ధరణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మిస్సింగ్ సర్వే నెంబర్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. దరఖాస్తుదారులకు ఏ మాడ్యూల్ లో దరఖాస్తు చేయాలో సూచించాలన్నారు. వినతుల రిజిస్టర్ నిర్వహించాలని, నమోదులు చేసి, వాటి పరిస్థితి విషయమై ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ప్రతివారం వినతుల రిజిస్టర్ పై సమీక్ష చేయాలని అన్నారు. అన్ని మాడ్యూల్స్ లోని పెండింగ్ దరఖాస్తులపై చర్యలు చేపట్టి, వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాము, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పిల్లలు అడిగారని పొలంలో వరినాట్లు వేసిన ఐ.ఏ.ఎస్ లు..ఔరా అంటున్న జనం...

తాత నాకు వ్యవసాయం నెర్పిస్తావా అని హిరో అంటే భూమిలోకి దిగితే ఆ భూమాతే నేర్పుతుందంటూ ఆ వృద్ద రైతు సమాదానం గుర్తుకొచ్ఛేసినట్లుంది మహార్షి సినిమా సన్నివేశం.. ఈ సినిమా తరువాత కొందరు సాఫ్ట్వేర్ లు పల్లె బాట పట్టి వ్యవసాయం గురించి కాస్తోకూస్తో తెలుసుకున్నారు.. కొందరైతే తమ భూమిలో సొంతంగా వ్యవసాయం చెసేశారు...ఈ కధ ఇప్పుడేందుకు అంటారా అక్కడే వస్తున్నాం
  ఏపీలోని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇద్దరూ తమ భార్యాపిల్లలతో కలిసి పొలంలో చెమట చిందించారు. రైతులతో పాటు వీళ్లు కూడా పొలంలో పనిచేశారు. ఎందుకంటారా.. సినిమా చూసి అడిగారో లేక పాఠ్యంశంలో డౌట్ అడిగారో కాని సదరు కలెక్టర్ల పిల్లలు వ్యవసాయం అంటే ఏమిటి అని ఇంట్లో అడిగారు
దీంతో వారు పిల్లలకు వ్యవసాయం గురించి నేరుగా చెప్పాలని డిసైడ్ అయిపోయారు.
అనుకున్నదే తడువు వారంతంలో బాపట్ల జిల్లా, బాపట్ల మండలం మురుకొండపాడు గ్రామ శివారులోని పొలలకు క్యారేజీలు కట్టుకుని నేరుగా  తీసుకెళ్లారు.ప్రస్తుతం నాట్లు సీజన్ కావడంతో పొలంలో దిగి  కలెక్టర్లు ఇద్దరూ నాట్లు వేశారు. 
అంతేకాదు తమతో తెచ్చుకున్న భోజనాన్ని తింటూ అక్కడి ఉన్న వారికి పెడుతూ సందడి చేశారు. కాగా రెండు జిల్లాల కలెక్టర్లు తమతో కలిసి వరి నాట్లు వేయడం చూసిన రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ లుంగీ కట్టి వరి నాట్లు వేయడమే కాక పొలం గట్లపై రైతులతో కలిసి భోజనం చేసి కాసేపు వారితో ముచ్చటించారు. అటు కలెక్టర్లు పొలంలో దిగి  పనిచేస్తున్న ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో నెటిజన్‌లు ప్రశంసిస్తున్నారు. 
ఢిల్లీకి రాజైనా.. భూమాతకు బిడ్డే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగ గతంలో కూడా జిల్లా కలెక్టర్లు.. భారతి హోళికేరి..నీతు ప్రసాద్..భరత్ గుప్తా.డాక్టర్ ఇలంబర్తిలు,ఉషారాణి తదితరులు తమ విధి నిర్వహణలో పొలంబాట పట్టి వరినాట్లు వేశారు..

Sunday, 25 September 2022

సోమవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం

సెప్టెంబ‌రు 26న సోమ‌వారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు  మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు.

annualBrahmotsavams
The initial ritual of #Ankurarpanam will be observe in the evening. The Navadhanyas are sown in different mud pots invoking the blessings of Moon God The level of sprouting of the grains becomes the benchmark of hurdle free and successful conduction of the #.

#

Saturday, 24 September 2022

న్యాయ వాదులు - కక్షీదారుల సమన్వయంతోనే సత్వర న్యాయం .. న్యాయవాద పరిషిత్ ద్వీతియ రాష్ట్ర సమావేశాల్లో చీఫ్ జస్టిస్ ఉజ్జల భుయాన్ సూచన


ఖమ్మం : శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో ద్వితీయ మహసభలను ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రారంబించారు. ఈకార్యక్రమానికి  హజరు కావడం చాలా సంతోషం కలిగించిందన్నారు.. బారీగా హజరైనా తెలంగాణ పరిషత్ న్యాయవాదులు రాష్ట్ర నలుమూల నుంచి హజరైనారు. సత్వర న్యాయం -   న్యాయవాదుల పాత్ర అనే అంశంపై చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. తమ ప్రసంగం లో పలు కేసులను ఉదహరించారు.  సత్వర కేసుల పరిష్కారానికి  న్యాయవాదులతో పాటు కక్ష ి దారులు కూడా సహకరించాలి.  సత్వర న్యాయం వలన కక్షిదారులు లబ్ధి పొందుతారు. సత్వర న్యాయానికి అధునిక టెక్నాలజీ ని కూడా ఉపయోగించాలన్నారు. ప్రపంచంలో మన దేశ న్యాయవ్యవస్థ గొప్పదన్నారు. ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ  2010 సంవత్సరం లో రాసిన తన పుస్తకం లో సత్వర  న్యాయం  అనే అంశంపై తన పుస్తకం లో రాశారు.  ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు మాట్లాడుతూ పేదవాడి కి ఒక న్యాయం , ధనిక లకు ఒక న్యాయం ఉండకూడదు. కార్పొరేట్ లకు ఒక న్యాయం పేద వాడికి ఒక న్యాయం ఉండకూడదు. సత్వర  న్యాయం లో న్యాయమూర్తుల పాత్ర కీలకం అని అన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి  న్యాయవాదులు కూడా సహకరించాలు.పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తుల తో పాటు ఖమ్మం పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్   , జస్టిస్ కె.లక్ష్మణ్ , జస్టిస్ రాజేశ్వర్ రావు , జస్టిస్ నగేష్ . న్యాయవాద పరిషత్  కె.శ్రీనివాస మూర్తి , టి.సూర్యకరణ్ రెడ్డి , కరూర్ మొహన్ , సునీల్ , కె.విజయ్ కుమార్ , ఎస్.వెంకటేశ్వర గుప్తా లతో పాటు హర్కార్ శ్రీరామారావు , జి.సత్యప్రసాద్ , తెల్లాకుల రమేష్ , నెరెళ్ళ శ్రీనివాసరావు , కూరపాటి శేఖర్ రాజు , పసుమర్తి లలిత  సీనియర్ , జూనియర్ న్యాయవాదులతో పాటు ఖమ్మం ఉభయ జిల్లా ల నుండి న్యాయవాద పరిషత్ న్యాయవాదులు బారిగా హజరైనారు.

శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు


ఖమ్మం : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను ఖమ్మంలోని స్కూల్లో శనివారం  అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యతిధిగా పోలీస్ కమిషనర్ సతీమణి స్కూల్ చైర్ పర్సన్ హృదయ మేనన్ పాల్గొని వేడుకలను ప్రారంభించారు.  తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, మహిళలు పండగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని  సూచించారు.
ఈ సందర్భంగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు.
కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్  శేషగిరిరావు ,ఉపాధ్యాయులు,విద్యార్థినిలు పాల్గొన్నారు.

Thursday, 22 September 2022

డాబాలు..బెల్ట్ షాపులతో వ్యాపారం కొనసాగించలేకున్నాం.. బార్ & రేస్టారెంట్ యజమానుల ఆవేదన#


డాబాలు..బెల్ట్ షాపులలో
ఇబ్బడిముబ్బడిగా వైన్ అమ్మకాలు చేస్తుండటంతో తాము వ్యాపారం కొనసాగించలేకపోతున్నామ్మని  బార్ & రేస్టారెంట్ యజమానుల ఆవేదన వ్యక్తం చేశారు. వైరారోడ్డులో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు కిరణ్, విజయ్, రవికుమార్, ప్రసాద్, కిరణ్, తదితరులు పాల్గొని నిర్వాహణ పరంగా తాము ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులు వివరించారు..బార్ & రేస్టారెంట్లకు నిర్ణయించిన స్లాబ్ విధానం.. 42, 40, 30లక్షలుగా ప్రాంతాల వారీగా వుందని..అట్టి శ్లాబ్ విధానం తాము ఎంపిక చేసుకునే విధంగా ప్రభుత్వం మార్పులు చేయాలని..బార్ & రేస్టారెంట్లకు సైతం..90ఎం.ఎల్,180ఎం.ఎల్ సీసాలను సప్లై చేయాలని విజ్జప్తి చేశారు.. కరోనా సమయం అనంతరం వ్యాపారం తక్కువగా వుంటోందని బార్ & రేస్టారెంట్ల నిర్వహణ భారంగా మారిందని కిరణ్ పేర్కొన్నారు.. తాము ట్యాక్స్ లు కట్టి షాపులు నిర్వహిస్తు.  పలువురికి ఉపాధి కల్పిస్తున్నామని..ప్రభుత్వం.అప్కారి శాఖ అధికారులు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తమ వ్యాపార నిర్వహణకు సహకారాన్ని అందించాలని కిరణ్ విజ్జప్తి చేశారు..

Wednesday, 21 September 2022

ఫేక్ లోన్ యాప్ ల లిస్ట్ విడుదల చేసిన పోలీసు శాఖ.... కటుంబాలను చిధ్రం ఛేస్తున్నయాప్ లతో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్ఛరికలు...

పలువురి ఉపిరి తీసి కుటుంబాల ఉసురు తీస్తున్నా యాప్ ల సమాచారం పోలీస్ శాఖ అధికారికంగా విడుదల చేసింది..వీటి జోలికిపోతే చేజేతులా జీవితం నాశనం చేసుకున్నట్లే అని హెచ్చరించారు...
 ఫేక్ లోన్ యాప్స్ లిస్టు ఇది. 
*LIST OF FAKE LOAN APPS*
-------------------------------------------
UPA Loan
Mi Rupe
Rupee Loan
Cash Park Loan
Rupee Box
Asan Loan
Cash Pocket
Cash Advance
Loan Home Small
Lend Mall
Easy Loan
UPO Loan .com
My Cash Loan
Minute Cash
Hand Cash 
Friendly Loan
Early Credit App
rich cash
SUN CASH
onstream
Insta money
money stand pro
Forpay app
cashpal
Loanzone
ATD lone
Cash curry
66 cash
Daily Lone
Handy loan
Express Loan
Rupee Star
First Cash
Rich
Fast Rupee
Apna Paisa
Loan Cube
Wen Credit
Bharat Cash
Smart Coin
Cash Mine
Cash Machine Loan
Goldman Payback
One Loan Cash Any Time
Flash Loan Mobile
Hoo Cash
Small Loan
Live Cash
Insta Loan
Cash Papa
| Credit
Silver Pocket
Warn Rupee
Buddy Loan
Simple Loan
Fast Paisa
Bellono Loan
Eagle cash loan App
fresh loan
Minute cash
Kash loan
Slice pay
Pokemoney
Rupeeplus
fortune now
Fast coin
tree lone
cash machine
koko loan
Rupiya bus
More Cash
Koko Loan
Cash Carry App
Betwinner betting
Bus rupee
Small Loan
loan cube
Quality Cash
Dream loan
credit wallet
star loan
Balance lone
cash pocket live Cash
Loan Resource(disi)
Rupeeking
Loan Dream
Wow Rupee
Clear Loan
Loan Go
Loan Fortune
Coin Rupee
Hand Cash
Samay Rupee
Money Master
Lucky Wallet
Tyto Cash
For Pay
Cash Book
Reliable Rupee Cash
Cash park
Rupee mall
ob cash loan
Rupiya bus
I karza
loan loji
cash star miniso rupee
pocket bank
Easy Credit
cash bowl
Cash Cola
Orange Loan
Gold Cash
Angel Loan
Loan Sathi
Sharp Loan
Sky Loan
Jo Cash
Best Paisa
Hello Rupee
Holiday Mobile Loan
Phone Pay
Plump Wallet
Cashcarry Loan App
Crazy Cash
Quick Loan App
Rocket Loan
Rupee Magic
Rush Loan
Bellono Loan App
Agile Loan app
Income
Cash advance 1
Easy Borrow Cash loan
IND loan
Wallet Payee
Cash Guru App
Cash Hole
Mo Cash

ఈ సందేశం కేవలం సమాచారం కోసం మాత్రమే.....
మనం మనతో పాటు మన వాళ్ళకి తెలియపరచాలని మాత్రమే 🙏🙏🙏 public awareness post from+ *అభినవ స్వచ్ఛంద సేవ సంస్థ (ISO) అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థ)*

Saturday, 17 September 2022

ఖమ్మంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలు : జాతీయ జెండా ను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ..


ఖమ్మం : .75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అరవై ఎండ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు.
జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కారించుకుని ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు మంత్రి పువ్వాడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం ను స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.వీరోచిత పోరాటలతో రాచరిక పాలన నుండి తెలంగాణ ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజని, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజును తెలంగాణ జాతి పండుగా జరుపుకోవడం అత్యంత ఆనందాయకం అని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా  ఉద్యమకారులు, స్వాతంత్ర్య సమరయోధులను కలిసి మంత్రి శాలువాతో సత్కరించారు. అనంతరం దళిత బందు పథకం ద్వారా మంజూరైన యూనిట్స్ ను ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు.
వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఅర్ దార్శనిక పాలనలో విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఇలా ఐటీ నుంచి అగ్రికల్చర్‌ వరకు అన్ని రంగాలలో యావత్ భారతావనికే తెలంగాణ ప్రభుత్వం దిక్సూచిగా నిలిచిందన్నారు.
అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఅర్ గారు దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి తెలంగాణ చిత్తశుద్ది నిరూపించుకుని ఆదర్శంగా నిలిచిందన్నారు.స్వరాష్ట్రం సాకారంమై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్‌ గారు అనతికాలంలోనే ఈ ప్రాంతం రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సాగునీటి, కరెంటు సమస్యలను తీర్చారని వివరించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ పౌరులు తలెత్తుకొని సగర్వంగా జీవించేలా చేసిన, అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్లలోనే పూర్తిచేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దినా, కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చినా అది కేసీఆర్‌ గారి నాయకత్వం వల్లనే సాధ్యమైందన్నారు.రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఉద్దేశించిన రైతుబంధు పథకం ద్వారా 2 లక్షల 15 వేల 673 మంది రైతులకు ఇప్పటి వరకూ వేయి 667 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంగా అందజేశారని అన్నారు.రైతుభీమా ద్వారా 2 వేల 777 మంది రైతు కుటుంబాలకు 138 కోట్ల 85 లక్షల బీమా పరిహారం చెల్లించామని, దేశంలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదన్నారు.దేశంలోనే తొలిసారిగా ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేకత చాటుకుంటుందన్నారు.అభాగ్యులకు ఆసరాగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రస్తుతం 2 లక్షల 2 వేల 424 మంది వృద్ధులు, వితంతువులు వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు బీడీ కార్మికులు, వృద్ధ కళాకారులకు అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించిన ప్రభుత్వం పెన్షన్ దారులకు ప్రతినెల 42 కోట్ల 44 లక్షల రూపాయలను పెన్షన్ల కింద పంపిణీ చేయడం గర్వకారమన్నారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దళితుల అభ్యున్నతిని కాంక్షించి చేపట్టిన గొప్ప పథకం దళిత బంధు అని, ఖమ్మం జిల్లా చింతకాని మండలంకు పైలట్ ప్రాజెక్టు గా మొత్తం మండలంకు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ పథకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గానికి 100 మంది చొప్పున మంజూరు చేయగా జిల్లాకు సంబంధించిన గ్రౌండింగ్ పనులు పూర్తి చేసుకున్నామని వివరించారు
సంతృప్తస్థాయిలో దళితులందరికీ దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుందని, కూలీలుగా ఉన్న వారిని యజమానులుగా చేసిన ఘనత కేసీఅర్ గారిదే అన్నారు.ఇలాంటి అనేక సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్‌ గారి పాలన తెలంగాణ సంక్షేమానికి ట్రేడ్‌మార్క్ గా మారిందన్నారు.సంక్షేమ పథకాలైన ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత కరెంటు, కల్యాణ లక్ష్మి, గురుకుల పాఠశాలలు, విదేశీవిద్య వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర బడ్జెట్లో 35శాతం నిధులను సంక్షేమానికే వెచ్చిస్తున్నా ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని అన్నారు.నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, జిల్లా కేంద్ర ఆసుపత్రిని కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అధునాతన వైద్య పరికరాలను సమకూర్చి ఖరీదైన వైద్య చికిత్సలను అందిస్తున్నామన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సాక్షిగా జాతీయ సమైక్యత సమగ్రతను చాటేలా యావత్ భారతావనికే తెలంగాణను దిక్సూచిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు.
తెలంగాణ సెక్రటేరియట్‌కు జాతి నిర్మాత‌,  మహామేధావి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్  పేరు పెట్ట‌డం చారిత్రాత్మ‌క నిర్ణ‌య‌మ‌ని, తెలంగాణ ప్రజలందరికీ ఇది గర్వకారణమ‌ని అన్నారు.దేశవ్యాప్తంగా మువ్వన్నెల జాతీయ జెండాను ఏడాదికి రెండుసార్లు మాత్రమే ఎగురవేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నాలుగుసార్లు ఇగురవేసే ఎగురవేసే సందర్భం ఉందని అన్నారు.స్వాతంత్రం వచ్చిన 15 ఆగస్టు నాడు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 జనవరిన జాతీయ జెండాలను దేశవ్యాప్తంగా ఎగురవేస్తారని కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతి ఏటా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున, హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో అంతర్భాగం అయిన సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ జెండాలను ఎగురవేసి గొరవించుకున్నామన్నారు.

సత్తుపల్లిలో జి.వి.మాల్ ప్రారంభం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జివీ మాల్ వస్త్ర సముదాయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,  సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలసి ప్రారంభించారు..జిల్లాలో మరో శాఖ ఏర్పాటు చేసిన యాజమాన్యం గుర్రం ఉమామహేశ్వరరావు, గుర్రం నరసింహ రావు లను మంత్రి అభినందించారు...కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే లతో పాటు..భద్రాద్రి కొ-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ చెరుకూరి కృష్ణ మూర్తి ..తదితరులు పాల్గొన్నారు...

Friday, 16 September 2022

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ : పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్


ఖమ్మం : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గోన్నారు.
ఖమ్మం zp సెంటర్ వద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. Zp సెంటర్ నుండి నుంచి ప్రారంభమైన ర్యాలీలో భారీగా హాజరైన జనంతో కలిసి కలెక్టరేట్, టీటీడీసీ, ఇల్లందు సర్కిల్, పటేల్ స్టేడియం మీదగా SR &BGNR కళాశాలకు చేరుకున్నారు. అనంతరం ఎర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్ మధు సుధన్, స్నేహలత, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ లు తదితరులు ఉన్నారు.

Thursday, 15 September 2022

డిప్యూటీ తహశీల్దార్‌కు కమీషన్ నోటీసులు


విశాఖ /పరవాడ : పరవాడ మండలంలో డిప్యూటీ తహశీల్దార్‌  పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌కు రాష్ట్ర సమాచార కమిషన్‌ నోటీసు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన కమిషన్‌ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశించారు. మంత్రిపాలెం రెవెన్యూ సర్వేనెంబర్‌ 252లో రిజిష్ట్రేషన్‌ కోసం జారీ చేసిన ప్యామిలీమెంబర్‌ సర్టిఫికేట్‌ కోసం సమర్పించిన నకళ్లు అందించాలని ఆర్‌టిఐ కార్యకర్త కెఎ దొర పరవాడ తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌టిఎ`2005 చట్టం కింద 2021వ సంవత్సరం జూన్‌నెల 28వ తేదీన దరఖాస్తు చేశారు. కోరిన సమాచారం ఇవ్వనందున ఫస్ట్‌ అప్పీలేట్‌ ఆథార్టీ ఆనకాపల్లి ఆర్డీవో దరఖాస్తు చేశారు

. ఈ దరఖాస్తుపై అనకాపల్లి ఆర్డీవో దరఖాస్తు దారుడు కోరిన సమాచారంతో పాటు, రికార్డులు పరిశీలనకు ఆదేశాలిచ్చారు. అయినా పరవాడ సమాచార అధికారి డెప్యూటీ తహశీల్దార్‌ నిరాకరించడంతో రెండో అప్పీలును కమిషన్‌కు దాఖలు చేశారు. దీనిపై ఎపి ఇన్‌ఫర్మేషన్‌ కమిషన్‌ ఈ నెల 22వ తేదీన ఎపి ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ ఎదుట సంబంధిత రికార్డులతో హాజరు కావాలని ఆదేశిస్తూ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నోటీసు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా మంత్రిపాలెం సర్వేనెంబర్‌ 252లో భూమిని కాజేసేందుకు కొంతమంది నకిలీ ధృవపత్రాలు సృష్టించారని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు స్పందన వేదికగా కెఎ దొర ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కోసం పరవాడ పోలీసులను అనకాపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు.

Wednesday, 14 September 2022

లంచం వద్దంటున్న నర్శయ్య.. వైరల్ అయిన మ్యాటర్..

*నాకు లంచం వద్దు*

 బల్లగుద్ది లంచం అడిగే ఈ రోజుల్లో నాకు లంచం వద్దనే వారు ఏవరైనా వుంటారా..వున్నారని చెబుతోంది సోషల్   మీడియా ..సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం పాలకీ డు మండలం ఆర్. ఐ చిలకరాజు నర్సయ్య నాకు లంచం వద్దు అని చొక్కా జేబుకు కార్డు పెట్టుకొని తోటి ఉద్యోగులకు సవాల్ విసురుతున్నారు..

.ఇది నియోజక వర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది...మరోవైపు లంచావతారాలు పాపం అమాయకుడు అనుకుంటున్నారు 

Tuesday, 13 September 2022

3వ రైల్వే లైనుకు 126 ఎకలాల భూ సేకరణ..అభివృద్ధి పనులకు సహకరించండి..ఖమ్మం కలేక్టర్. వి.పి.గౌతమ్


ఖమ్మం, సెప్టెంబర్ 13: అభివృద్ధి పనులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, 3వ రైల్వే లైన్ భూ నిర్వాసితులతో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 3వ రైల్వే లైన్ ఏర్పాటు కొరకు 126 ఎకరాల మేర భూసేకరణ చేపట్టుతున్నట్లు తెలిపారు. పరిహారం నిర్ణయానికి భూమి కోల్పోతున్న రైతులతో సంప్రదింపులు జరిపి ధర నిర్ణయానికి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. చింతకాని మండలం చింతకాని గ్రామంలో 8 మంది రైతులకు చెందిన 2.33 ఎకరాలు, నాగులవంచ గ్రామానికి చెందిన 24 మంది రైతుల నుండి 4.37 ఎకరాలు, ఆనంతసాగర్ గ్రామానికి చెందిన 28 మంది రైతుల నుండి 7.14 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, రైల్వే అధికారి సూర్యనారాయణ, చింతకాని మండల తహసీల్దార్ మంగీలాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లారీల అంతర్రాష్ట్ర పన్నుల సమస్య త్వరలోనే పరిష్కారిస్తాం : అసెంబ్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ.


రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టకుండా ఉండేందుకే మోటార్ వెహికల్‌ పన్నుల సవరణ బిల్లు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సభలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం నేడు మంగళవారం మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు.వాహనాల విక్రయంలో మోటార్ వెహికల్‌ పన్నుల సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వానికి పన్నులు సరిగా వస్తాయని మంత్రి అన్నారు. డీలర్ల రాయితీ నిలువరించేందుకే పన్నుల చట్ట సవరణ బిల్లు అని ఈ చట్ట సవరణ వల్ల వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు.తెలంగాణ మోటారు వాహన పన్నుల చట్టం 1963లోని సెక్షన్ 2కి సవరణ చేయాలని ప్రతిపాదించామని వాహనం ధరపై ఎటువంటి నిర్వచనం లేనందున వాహనం ధర యొక్క నిర్వచనాన్ని క్లాజ్ (ఏ) తర్వాత క్లాజ్ (ఏఏ)గా చట్టంలో చేర్చినట్లు మంత్రి వివరించారు. 
వాహనం యొక్క ధర తయారీదారు నిర్ణయించిన వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధర కంటే తక్కువగా ఉండకూడదన్నారు. 
దిగుమతి చేసుకున్న మోటారు వాహనం విషయంలో, బిల్ ఆఫ్ ఎంట్రీలో చూపిన ధర కస్టమ్స్ డ్యూటీ, సేల్స్ టాక్స్ లేదా జీఎస్టీ వర్తించే విధంగా ఏదైనా ఇతర విధింపు కలిగి ఉంటుందన్నారు. డీలర్లు డిస్కౌంట్ చూపించిన తర్వాత ఇన్‌వాయిస్‌లు జారీ చేస్తున్నారని అందువల్ల ఇన్‌వాయిస్ ధర ఎక్స్-షోరూమ్ ధర కంటే తక్కువగా ఉంటుందని దాని ఫలితంగా ప్రభుత్వానికి లైఫ్ టాక్స్‌లో రాబడి నష్టం జరుగుతుందన్నారు.మోటారు వాహనాల జీవిత పన్ను చెల్లింపుల్లో అవకతవకలను అరికట్టేందుకు 1963 ఎంవీ యాక్ట్‌ను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఆయా వాహనాలపై జీవితపన్నును తగ్గించుకునేందుకు ఖరీదు ఎక్కువైనప్పటికీ తక్కువ ధరతో ఇన్‌వాయి్‌సలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సవరణ బిల్లును ప్రవేశపెట్టామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. 
రాష్ట్రంలోని అన్ని ఆటోమొబైల్ డీలర్లు వాహనం యొక్క నిర్దిష్ట వేరియంట్ ధర యొక్క ఏకరూపతను నిర్ధారించడానికి ఈ బిల్లు ఎంతో దోహద పడుతుందన్నారు.
 లారీల అంతర్రాష్ట్ర పన్నులపై ఏపీ అధికారులతో మాట్లాడుతున్నామని త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. గ్రీన్‌ ట్యాక్స్‌ అనేది కేంద్రప్రభుత్వం తెచ్చిందని అనివార్యంగా ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆలోచించి సహేతుకంగానే తెలంగాణలో పన్నును విధించామని వెల్లడించారు.అలానే రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రవాణా సౌకర్యం కొరకు ఆర్టీసీ బస్సు ఉచిత పాసులు అంశాన్ని పరిశీలించి పరిష్కరిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Saturday, 10 September 2022

గురుకులాల స్వఛ్ఛత మన అందరి బాధ్యత : మంత్రి అజయ్ కుమార్


ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన "స్వచ్ గురుకుల్" వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరం NSPక్యాంపులోని Dr.BR అంబేడ్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా NCC విద్యార్థినిలు మంత్రి పువ్వాడ కు సాదర స్వగతం పలికారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడరు.. ఎడతెరిపి లేని వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గురుకుల విద్యార్థులకు డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా, డయేరియా, ఫుడ్‌ పాయిజనింగ్‌, వైరల్‌ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
గురుకులాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల నుంచి అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన తెలిపారు.
అత్యధిక గురుకులలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్ గరిదేనని తెలిపారు. గురుకుల పాఠశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో విద్యను అందించి వారి ఉన్నతికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు. 
గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ. 1. 20లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. అక్టోబర్ నెలలో రాష్ట్రంలో మరో 33గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కళాశాల సిబ్బంది భోజనం వసతి విషయాల్లో నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 
విద్యార్థుల తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు తప్పక పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలన్నారు. 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి కోసమే నిత్యం ఆలోచిస్తుంది అని ఆయన తెలిపారు. స్వచ్చ గురుకుల్ కార్యక్రమంలోనే కాకుండా నిత్యం పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
స్వచ్ఛ స్ఫూర్తి నిత్యం కొనసాగాలి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వచ్ఛ గురుకుల ఉద్యమాన్ని నిర్వహించాలని, ఈ స్ఫూర్తి నిత్యం కొనసాగాలని మంత్రి పువ్వాడ చెప్పారు. 
ఇకపై గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, విద్యార్థుల ప్రవర్తన, చదువు తదితర విషయాలపై ప్రభుత్వం ప్రోగ్రెస్‌ సిద్ధం చేయనుందని తెలిపారు. 
ఇంటి నుంచి గురుకులానికి వచ్చే ప్రతి విద్యార్థికి హెల్త్‌ స్రీనింగ్‌ ఏర్పాటు చేసి వారి ఆరోగ్య పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతుందని, గురుకులాల్లో విద్యార్థుల పర్యవేక్షణ కోసం 24 గంటలు ఏఎన్‌ఎంతో పాటు వార్డెన్‌ అందుబాటులో ఉంటారని చెప్పారు.ఆనంతరం వంటశాల, డైనింగ్, స్టోర్ రూం ను పరిశీలించారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, జాయింట్ సెక్రటరీ శారద గారు, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా గారు, RCO ప్రత్యూష గారు, ప్రిన్సిపల్ చావా జ్యోతి, కార్పొరేటర్ శ్రీవిద్యా గారు తదితరులు ఉన్నారు.

Friday, 9 September 2022

వి.ఆర్.ఏ.ల సమ్మెకు డోర్నకల్ జర్నలిస్టుల మద్దతు... శిబిరంలో వంట - వార్పు... ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి..

 .డోర్నోకల్ , స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లు చేపట్టిన సమ్మెకు డోర్నకల్ ప్రెస్ క్లబ్ మద్దతుగా వంటావార్పు చేపట్టింది.47వ రోజైన శుక్రవారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన వివిధ పత్రికలు,టీవీ చానెళ్ల విలేకరులు వీఆర్ఏలకు సంఘీభావం తెలుపుతూ శిబిరంలో కూర్చున్నారు.ముఖ్యఅతిథిగా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్,ఎమ్మార్వో వివేక్,ఎస్సై రవికుమార్ విచ్చేసి సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా చిత్తనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమస్య ఎక్కడుంటే జర్నలిస్టులు అక్కడ ఉంటారన్నారు.వీఆర్ఏల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని అభిప్రాయపడ్డారు.వారి సమస్యల పరిష్కారానికి మార్గం దొరికే వరకు వెన్నంటి ఉంటామని భరోసా ఇచ్చారు.సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పేస్కేలు జీవోను వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏలకు ప్రమోషన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.55 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. గత అనేక ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు వీఆర్ఏలకు సంఘీభావంగా వంటవార్పుతో మధ్యాహ్న భోజనం అందజేశారు.వీఆర్ఏ మండల జేఏసీ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గండి సీతారాం గౌడ్,ప్రధాన కార్యదర్శి పిట్టల సరేష్, కోశాధికారి కుంటిగొర్ల రామకృష్ణ,ఉపాధ్యక్షులు మంద ప్రకాష్,జనం సాక్షి బ్యూరో ప్రశాంత్,సభ్యులు శ్రీనాథ్,యాకయ్య, నాగరాజు,సక్రం,రవి, సత్యనారాయణ,వెంకట్,కిరణ్,సృజన్ తదితరులు పాల్గొన్నారు.

Royal Website Placed Book For Condolences... Mourning and Condolences from all over the world

Mourning and Condolence arrangements at the Royal Residences
Royal Mourning;
Following the death of Her Majesty The Queen, it is His Majesty The King's wish that a period of Royal Mourning be observed from now until seven days after The Queen’s Funeral. The date of the Funeral will be confirmed in due course.
Royal Mourning will be observed by Members of the Royal Family, Royal Household staff and Representatives of the Royal Household on official duties, together with troops committed to Ceremonial Duties.
Death Confirmation notice  Displayed At royal palace gate.
🇬🇧 Flags at Royal Residences;
Flags at Royal Residences were half masted yesterday, Thursday 8th September, and will remain half-masted until 0800hrs on the morning after the final day of Royal Mourning.
The half-masting of flags at Royal Residences does not apply to the Royal Standard and the Royal Standard in Scotland when The King is in residence, as they are always flown at full mast.

Guidance on flags at other public buildings has been issued by the Department for Culture, Media and Sport.

Royal Gun Salute;

Royal Salutes will be fired in London today at 1300hrs BST in Hyde Park by The King's Troop Royal Horse Artillery and at the Tower of London by the Honourable Artillery Company. One round will be fired for each year of The Queen's life.

Closure of the Royal Residences;

Royal Residences will close until after The Queen’s Funeral. This includes The Queen's Gallery and the Royal Mews at Buckingham Palace, and The Queen's Gallery in Edinburgh. Balmoral Castle and Sandringham House, The Queen's private estates, will also close for this period. In addition, Hillsborough Castle, The Sovereign’s official residence in Northern Ireland, will be closed.

Floral Tributes at the Royal Residences

Following the death of Her Majesty The Queen, the following guidance is given to members of the public who wish to leave floral tributes at Royal Residences:

At Buckingham Palace members of the public will be guided to lay floral tributes at dedicated sites in The Green Park or Hyde Park. Flowers left outside the gates of Buckingham Palace will be moved to The Green Park Floral Tribute Garden by The Royal Parks. Further guidance will be issued by The Royal Parks.

At Windsor Castle, floral tributes can be left at Cambridge Gate on the Long Walk. These flowers will be brought inside the Castle every evening, and placed on the Castle Chapter grass on the south side of St George’s Chapel and Cambridge Drive.

At the Sandringham Estate, members of the public are encouraged to leave floral tributes at the Norwich Gates.

At Balmoral Castle, floral tributes can be left at the Main Gate.

At the Palace of Holyroodhouse, members of the public are encouraged to give floral tributes to the Wardens at the entrance to The Queen’s Gallery. Those flowers will be laid on the Forecourt grass in front of the North Turret of the Palace.

At Hillsborough Castle, floral tributes may be laid on the Castle Forecourt, in front of the main gates.
 
Information on Floral Tributes at other public buildings and locations will be issued by the Cabinet Office.

Books of Condolence at the Royal Residences;

There are no physical Books of Condolence at the Royal Residences.
An online Book of Condolence for those who wish to leave messages is available on the Royal website:
 https://www.royal.uk/send-message-condolence.


Tuesday, 6 September 2022

యాదాద్రిశుని సన్నిధిలో కరణం(నియోగి)సంఘం ఆత్మీయ సమ్మేళనం.. భక్తిశ్రద్ధలతో నృసింహుని కళ్యాణం... మాతపితరుల పాదసేవలో తరించిన అహుతులు

*వెల్లువెత్తిన జన ప్రభంజనం* *హాలీడే రోజు కాకుంటే అంత పెద్ద హాల్ కూడా సరిపోయేది కాదు! రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చిన కరణం కేడర్!* (బండారు రాం ప్రసాద్ రావు)🌷🌷🌷🌷🌷🌷🌷🌷 యాదగిరి గుట్ట దైవ దర్శనం లో ఇవ్వాళ ఉదయం ఏ లైన్ లో చూసినా నియోగ బంధు జనం...రాత్రి ముప్ఫై గదులు అంటే అరవై గదులు నిండి పోయాయి...శని వారం లేదా ఆదివారం TKNBS కార్యవర్గ సమావేశాలు గుట్ట లో పెడితే అసలు తట్టు కోవడం నా తరం కాక పోయేది. 
*కన్నుల పండుగ గా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం* (బిఆర్పిఆర్)🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుందో అలా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం *రెడ్డి* ఆడిటోరియం లో ఘనంగా జరిగింది... కళ్యాణం లో కాసేపు నాకు *శ్రీహరి* అల్లుడు అయ్యాడు...లక్ష్మి దేవి కూతురు అయింది...జీలకర్ర బెల్లం నుండి, పుస్తె మట్టేల వరకూ నేను నా సహధర్మ చారిని *శైలజ* కలసి ఈ కళ్యాణం నిర్వహించాం..
.వేద పండితులు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, గణపతి ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించాం...శ్రీవారికి *కాళ్ళు కడిగే సన్నివేశం* నిజంగా భావొద్రెకానికి లొనయ్యాను....ఇక మా బావ మరిది శ్రీ కాంత్ పుస్తె మట్టెలు శాస్త్ర ప్రకారం కరణం బంధు జానానికి చూపించి అమ్మవారి మెడలో తాళి వేసి నప్పుడు నిజంగా ఆ ఆనంద అద్భుత ఘాట్టాన్ని భద్రాచలం లో వ్యాఖ్యత వ్యవహరించి సీతారాముల కళ్యాణం కన్నులకు కట్టి నట్టు చెప్పే *శ్రీ రామాయణ శర్మ* గారు యాదగిరి గుట్ట కు వచ్చి ఈ క్రతువులొ పాల్గొన్నారు...ఆయన నాకు అత్యంత ఆత్మీయులు...ఆయన వర్ణించి నట్టు అనిపించి నా పక్కన కూర్చున్న ఆయనను చూశాను...ఆయన తన్మయత్వంతో కళ్ళు మూసు కొని క్రతువు మంత్రాలు వింటూ ఉన్నారు... ఏమయినా  నా పూర్వ జన్మ సుక్రుతం...ఇలాంటి అద్భుత అవకాశం ఈ సంఘం స్తాపించడం వల్ల మాకు దొరికింది!!
*మాతృ పితృ పాదపూజ లో ఆనంద భాష్పాలు!* 🌷🌷🌷🌷🌷🌷🌷🌷    (బి ఆర్ పి ఆర్) TKNBS సరికొత్త కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. ఈ సారి గుట్ట లో నిర్వహించిన సర్వ సభ్య సమావేశం లో *మాతృ పితృ పాదపూజ* లో తల్లి తండ్రుల కాళ్ళు పిల్లలు కడుగుతూ ఉం టే వాళ్ళ కంటి నుండి ఆనంద భాష్పాలు రాలాయి...ఒక వైపు పౌరోహితులు మంత్రాలు చదువుతూ తల్లి తండ్రులు చుట్టూ ప్రదక్షిణం చెస్తె అన్ని నదుల లో స్నానం చేసిన పుణ్యం అన్న ఆ సూక్తి ని చెబుతూ, మాత్రు దేవో భవ...పితృ దేవో భవ ఆచార్య దేవో భవ అనే శ్లోకం తో తల్లి దండ్రులు, ఇటు పిల్లలు బావొ ద్రెకానికి లోనయ్యారు! దాదాపు 21 జంటలు ఈ పాద పూజ లో పాల్గొంటే వాళ్ళ పిల్లలు దాదాపు 60 మంది ఈ పాద పూజ లో పాల్గొన్నారు.
తెలంగాణ నలుమూలల నుండి వచ్చి మన సత్తా చాటిన నియోగ కరణం బంధుజనం కు విజయాభివందనం!

సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రజలు ఆదరించాలి...


ఖమ్మం : ఖమ్మంనగర ప్రజలకు సి.ఎః.ఆర్ మెగా మాల్ బుధవారం నుండి అందుబాటులోకి రానున్నది.. అనేక రకాల వస్త్రాలు, బంగారు నగలు..ప్రత్యేక డిజైన్ల తో సీఎంఆర్ షాపింగ్ మాల్ 19వ బ్రాంచ్ ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతినిధులు ఫణి కుమార్, వెంకట్రావు లు తెలిపారు. మంగళవారం స్థానిక ఎస్ పార్క్ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో  వారు మాట్లాడారు. బుధవారం ఉదయం  10 గంటలకు మేనేజింగ్ డైరెక్టర్ మా ఊరి వెంకటరమణ ఆధ్వర్యంలో  జరిగే సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరో రామ్, హీరోయిన్ కుమారి రీతువర్మ, హాజరవుతున్నారని వారు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , అతిథులుగా మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు  పువ్వాడ నాగేశ్వరావు,  ఎంపీ లు నామ నాగేశ్వరావు, వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, లావుడియా రాములు నాయక్, మేయర్ పూనకొల్లు నీరజ, లు హాజరుకానున్నారని  తెలియజేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో సిఎంఆర్ బ్రాంచ్ లు 18 ఉన్నాయని ఖమ్మంలో ప్రారంభించబోయేది 19వ బ్రాంచ్ అని పేర్కొన్నారు. ప్రజలు ఈ షాపింగ్ మాల్ ను ఆదరించాలని కోరారు. అన్ని వయసుల వారికి అనుకూలమైన, నాణ్యమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు ఈ షాపింగ్ మాల్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. షాపింగ్ మాల్ లో అవసరమైన 450 మంది ఉద్యోగులను స్థానికులనే తీసుకుంటామని వివరించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ పథకం ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఖమ్మంలో గణేష్ మండపాలకు అవసరమైన లడ్డూలను ఇతర పూజ ద్రవ్యాలను అందించడం జరిగిందన్నారు. విలేఖర్ల ఆటల పోటీలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు అవసరమయ్యే విద్యా వనరులను తమ సంస్థ ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు. బుధవారం జరిగే సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి జిల్లా ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నామని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ బాధ్యులు మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Thursday, 1 September 2022

ఒలింపియాడ్ ఫౌండేషన్ పోష్టర్ ఆవిష్కరించిన RJC కృష్ణ...

2022 2023 విద్యా సంవత్సరం కి సంబంధించి ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఎక్సమినేషన్ పోస్టర్ ను.SBIT ఇంజనీరింగ్ కళాశాల చైర్మెన్ RJC కృష్ణ గురువారం ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. విద్యార్థులకి చైతన్యం కల్పించి వారిని పోటీ పరీక్షలకి సిద్ధం చేస్తూ ఎన్నో అవార్డ్స్ మరియు రివార్డ్స్ తో విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారిలోని ప్రతిభను వెలికితీస్తూ ముందుకు నడిపిస్తున్న ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ అధినేత అంతటి రామకృష్ణను అభినందనీయుడని అన్నారు. ఈ సందర్భంగా.గత 4 సంవత్సరాల నుండి నిర్వహిస్తన్న పోటీ పరీక్షలలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులను అభినందిం చారు.  2022-2023 విద్య సంవత్సరంలో కూడా నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షల్లో తమ ప్రతిభను కనపరచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో SBI చైర్మన్ RJC కృష్ణ, TEOF ఫౌండర్ అంతోటి రామకృష్ణ, స్టేట్ ఇంచార్జి K. కావ్య డిస్టిక్ట్ కోఆర్డినేటర్స్ S. ఫాల్గుణి, K. వసుంధర తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలను అకస్మీక తనిఖీ చేసిన కలేక్టర్ వి.పి.గౌతమ్...


ఖమ్మం, సెప్టెంబర్ 1: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ నగరంలోని స్తంభానినగర్ లోగల ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గైర్హాజరు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి, గైర్హాజరుకు కారణాలు తెలుసుకోవాలని, చదువు ప్రాముఖ్యతపై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి చైతన్యం తేవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం ఉంటుందని ఆయన తెలిపారు. పాఠశాలలో 6గురు ఉపాధ్యాయులు ఉన్నట్లు, ప్రతిరోజు తప్పక 4గురు ఉపాధ్యాయులు విధుల్లో ఉండాలని, ఇద్దరి కంటే ఎక్కువ సెలవులు మంజూరు చేయకూడదని కలెక్టర్ అన్నారు. పాఠ్యపుస్తకాల మేరకు బోధన చేయాలని, పిల్లలకు త్వరగా అర్థమయ్యేలా బోధన ఉండాలని అన్నారు. జిల్లా విద్యాశాఖచే చేపడుతున్న మౌఖిక పరీక్షల సరళిని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఎంతమేర జవాబులు చెపుతున్నది కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై వారిని ప్రశ్నలు అడుగుతూ, జవాబులు రాబడుతూ, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. 1వ తరగతి విద్యార్థులకు రాయడం, చదవడంతో పాటు సంఖ్యలు, రంగులు తెలిసేలా బోధన చేయాలన్నారు. రూ. 11.4 లక్షల అంచనాలతో పాఠశాలలో మన బస్తి-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో విద్యుద్దీకరణ, త్రాగునీరు, టాయిలెట్, ప్రహారీ గోడ, మైనర్ మేజర్ పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యుద్దీకరణ పనులు వెంటనే పూర్తి చేసి, వెలుతురు, గాలి అందించాలని ఆయన తెలిపారు. పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సిహెచ్. వెంకటనారా యణ, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, డిఇ ధరణి కుమార్, ఎంఇఓ ఎం. శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.