ఖమ్మం : ఖమ్మంనగర ప్రజలకు సి.ఎః.ఆర్ మెగా మాల్ బుధవారం నుండి అందుబాటులోకి రానున్నది.. అనేక రకాల వస్త్రాలు, బంగారు నగలు..ప్రత్యేక డిజైన్ల తో సీఎంఆర్ షాపింగ్ మాల్ 19వ బ్రాంచ్ ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతినిధులు ఫణి కుమార్, వెంకట్రావు లు తెలిపారు. మంగళవారం స్థానిక ఎస్ పార్క్ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం ఉదయం 10 గంటలకు మేనేజింగ్ డైరెక్టర్ మా ఊరి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగే సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరో రామ్, హీరోయిన్ కుమారి రీతువర్మ, హాజరవుతున్నారని వారు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , అతిథులుగా మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు పువ్వాడ నాగేశ్వరావు, ఎంపీ లు నామ నాగేశ్వరావు, వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, లావుడియా రాములు నాయక్, మేయర్ పూనకొల్లు నీరజ, లు హాజరుకానున్నారని తెలియజేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో సిఎంఆర్ బ్రాంచ్ లు 18 ఉన్నాయని ఖమ్మంలో ప్రారంభించబోయేది 19వ బ్రాంచ్ అని పేర్కొన్నారు. ప్రజలు ఈ షాపింగ్ మాల్ ను ఆదరించాలని కోరారు. అన్ని వయసుల వారికి అనుకూలమైన, నాణ్యమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు ఈ షాపింగ్ మాల్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. షాపింగ్ మాల్ లో అవసరమైన 450 మంది ఉద్యోగులను స్థానికులనే తీసుకుంటామని వివరించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ పథకం ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఖమ్మంలో గణేష్ మండపాలకు అవసరమైన లడ్డూలను ఇతర పూజ ద్రవ్యాలను అందించడం జరిగిందన్నారు. విలేఖర్ల ఆటల పోటీలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు అవసరమయ్యే విద్యా వనరులను తమ సంస్థ ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు. బుధవారం జరిగే సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి జిల్లా ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నామని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ బాధ్యులు మోహన్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment