తాత నాకు వ్యవసాయం నెర్పిస్తావా అని హిరో అంటే భూమిలోకి దిగితే ఆ భూమాతే నేర్పుతుందంటూ ఆ వృద్ద రైతు సమాదానం గుర్తుకొచ్ఛేసినట్లుంది మహార్షి సినిమా సన్నివేశం.. ఈ సినిమా తరువాత కొందరు సాఫ్ట్వేర్ లు పల్లె బాట పట్టి వ్యవసాయం గురించి కాస్తోకూస్తో తెలుసుకున్నారు.. కొందరైతే తమ భూమిలో సొంతంగా వ్యవసాయం చెసేశారు...ఈ కధ ఇప్పుడేందుకు అంటారా అక్కడే వస్తున్నాం
ఏపీలోని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇద్దరూ తమ భార్యాపిల్లలతో కలిసి పొలంలో చెమట చిందించారు. రైతులతో పాటు వీళ్లు కూడా పొలంలో పనిచేశారు. ఎందుకంటారా.. సినిమా చూసి అడిగారో లేక పాఠ్యంశంలో డౌట్ అడిగారో కాని సదరు కలెక్టర్ల పిల్లలు వ్యవసాయం అంటే ఏమిటి అని ఇంట్లో అడిగారు
దీంతో వారు పిల్లలకు వ్యవసాయం గురించి నేరుగా చెప్పాలని డిసైడ్ అయిపోయారు.
అనుకున్నదే తడువు వారంతంలో బాపట్ల జిల్లా, బాపట్ల మండలం మురుకొండపాడు గ్రామ శివారులోని పొలలకు క్యారేజీలు కట్టుకుని నేరుగా తీసుకెళ్లారు.ప్రస్తుతం నాట్లు సీజన్ కావడంతో పొలంలో దిగి కలెక్టర్లు ఇద్దరూ నాట్లు వేశారు.
అంతేకాదు తమతో తెచ్చుకున్న భోజనాన్ని తింటూ అక్కడి ఉన్న వారికి పెడుతూ సందడి చేశారు. కాగా రెండు జిల్లాల కలెక్టర్లు తమతో కలిసి వరి నాట్లు వేయడం చూసిన రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ లుంగీ కట్టి వరి నాట్లు వేయడమే కాక పొలం గట్లపై రైతులతో కలిసి భోజనం చేసి కాసేపు వారితో ముచ్చటించారు. అటు కలెక్టర్లు పొలంలో దిగి పనిచేస్తున్న ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో నెటిజన్‌లు ప్రశంసిస్తున్నారు.
ఢిల్లీకి రాజైనా.. భూమాతకు బిడ్డే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగ గతంలో కూడా జిల్లా కలెక్టర్లు.. భారతి హోళికేరి..నీతు ప్రసాద్..భరత్ గుప్తా.డాక్టర్ ఇలంబర్తిలు,ఉషారాణి తదితరులు తమ విధి నిర్వహణలో పొలంబాట పట్టి వరినాట్లు వేశారు..
No comments:
Post a Comment