Saturday, 10 September 2022

గురుకులాల స్వఛ్ఛత మన అందరి బాధ్యత : మంత్రి అజయ్ కుమార్


ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన "స్వచ్ గురుకుల్" వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరం NSPక్యాంపులోని Dr.BR అంబేడ్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా NCC విద్యార్థినిలు మంత్రి పువ్వాడ కు సాదర స్వగతం పలికారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడరు.. ఎడతెరిపి లేని వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గురుకుల విద్యార్థులకు డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా, డయేరియా, ఫుడ్‌ పాయిజనింగ్‌, వైరల్‌ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
గురుకులాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల నుంచి అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన తెలిపారు.
అత్యధిక గురుకులలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్ గరిదేనని తెలిపారు. గురుకుల పాఠశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో విద్యను అందించి వారి ఉన్నతికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు. 
గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ. 1. 20లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. అక్టోబర్ నెలలో రాష్ట్రంలో మరో 33గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కళాశాల సిబ్బంది భోజనం వసతి విషయాల్లో నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 
విద్యార్థుల తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు తప్పక పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలన్నారు. 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి కోసమే నిత్యం ఆలోచిస్తుంది అని ఆయన తెలిపారు. స్వచ్చ గురుకుల్ కార్యక్రమంలోనే కాకుండా నిత్యం పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
స్వచ్ఛ స్ఫూర్తి నిత్యం కొనసాగాలి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వచ్ఛ గురుకుల ఉద్యమాన్ని నిర్వహించాలని, ఈ స్ఫూర్తి నిత్యం కొనసాగాలని మంత్రి పువ్వాడ చెప్పారు. 
ఇకపై గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, విద్యార్థుల ప్రవర్తన, చదువు తదితర విషయాలపై ప్రభుత్వం ప్రోగ్రెస్‌ సిద్ధం చేయనుందని తెలిపారు. 
ఇంటి నుంచి గురుకులానికి వచ్చే ప్రతి విద్యార్థికి హెల్త్‌ స్రీనింగ్‌ ఏర్పాటు చేసి వారి ఆరోగ్య పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతుందని, గురుకులాల్లో విద్యార్థుల పర్యవేక్షణ కోసం 24 గంటలు ఏఎన్‌ఎంతో పాటు వార్డెన్‌ అందుబాటులో ఉంటారని చెప్పారు.ఆనంతరం వంటశాల, డైనింగ్, స్టోర్ రూం ను పరిశీలించారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, జాయింట్ సెక్రటరీ శారద గారు, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా గారు, RCO ప్రత్యూష గారు, ప్రిన్సిపల్ చావా జ్యోతి, కార్పొరేటర్ శ్రీవిద్యా గారు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment