ఖమ్మం, సెప్టెంబర్ 26: ప్రభుత్వ ఉత్తర్వులు 59 అమలుకు చేపడుతున్న సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లతో 59 జీవో అమలు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులపై పూర్తి అవగాహన కల్గివుండాలన్నారు. ఉత్తర్వులలోని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు లబ్ది పొందేలా చూడాలన్నారు. ధరణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మిస్సింగ్ సర్వే నెంబర్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. దరఖాస్తుదారులకు ఏ మాడ్యూల్ లో దరఖాస్తు చేయాలో సూచించాలన్నారు. వినతుల రిజిస్టర్ నిర్వహించాలని, నమోదులు చేసి, వాటి పరిస్థితి విషయమై ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ప్రతివారం వినతుల రిజిస్టర్ పై సమీక్ష చేయాలని అన్నారు. అన్ని మాడ్యూల్స్ లోని పెండింగ్ దరఖాస్తులపై చర్యలు చేపట్టి, వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాము, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment