Wednesday, 28 September 2022

డిఫెన్స్ చీఫ్ గా అనిల్ చౌహాన్.. కేంద్రం ఉత్తర్వులు..

దిల్లీ: నూతన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌)గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ని కేంద్రం నియమించింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా సీడీఎస్‌ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. బిపిన్‌ రావత్‌ తర్వాత ఈ అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేసి అనిల్ చౌహాన్‌ని ఎంపిక చేసింది. చౌహాన్‌ ఈస్టర్న్‌ కమాండ్‌ చీఫ్‌గా 2021 మే నెలలో పదవీ విరమణ చేశారు.

No comments:

Post a Comment