ఖమ్మం : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను ఖమ్మంలోని స్కూల్లో శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యతిధిగా పోలీస్ కమిషనర్ సతీమణి స్కూల్ చైర్ పర్సన్ హృదయ మేనన్ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, మహిళలు పండగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు.
కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శేషగిరిరావు ,ఉపాధ్యాయులు,విద్యార్థినిలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment