Thursday, 15 September 2022

డిప్యూటీ తహశీల్దార్‌కు కమీషన్ నోటీసులు


విశాఖ /పరవాడ : పరవాడ మండలంలో డిప్యూటీ తహశీల్దార్‌  పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌కు రాష్ట్ర సమాచార కమిషన్‌ నోటీసు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన కమిషన్‌ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశించారు. మంత్రిపాలెం రెవెన్యూ సర్వేనెంబర్‌ 252లో రిజిష్ట్రేషన్‌ కోసం జారీ చేసిన ప్యామిలీమెంబర్‌ సర్టిఫికేట్‌ కోసం సమర్పించిన నకళ్లు అందించాలని ఆర్‌టిఐ కార్యకర్త కెఎ దొర పరవాడ తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌టిఎ`2005 చట్టం కింద 2021వ సంవత్సరం జూన్‌నెల 28వ తేదీన దరఖాస్తు చేశారు. కోరిన సమాచారం ఇవ్వనందున ఫస్ట్‌ అప్పీలేట్‌ ఆథార్టీ ఆనకాపల్లి ఆర్డీవో దరఖాస్తు చేశారు

. ఈ దరఖాస్తుపై అనకాపల్లి ఆర్డీవో దరఖాస్తు దారుడు కోరిన సమాచారంతో పాటు, రికార్డులు పరిశీలనకు ఆదేశాలిచ్చారు. అయినా పరవాడ సమాచార అధికారి డెప్యూటీ తహశీల్దార్‌ నిరాకరించడంతో రెండో అప్పీలును కమిషన్‌కు దాఖలు చేశారు. దీనిపై ఎపి ఇన్‌ఫర్మేషన్‌ కమిషన్‌ ఈ నెల 22వ తేదీన ఎపి ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ ఎదుట సంబంధిత రికార్డులతో హాజరు కావాలని ఆదేశిస్తూ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నోటీసు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా మంత్రిపాలెం సర్వేనెంబర్‌ 252లో భూమిని కాజేసేందుకు కొంతమంది నకిలీ ధృవపత్రాలు సృష్టించారని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు స్పందన వేదికగా కెఎ దొర ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కోసం పరవాడ పోలీసులను అనకాపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు.

No comments:

Post a Comment