Thursday, 22 September 2022

డాబాలు..బెల్ట్ షాపులతో వ్యాపారం కొనసాగించలేకున్నాం.. బార్ & రేస్టారెంట్ యజమానుల ఆవేదన#


డాబాలు..బెల్ట్ షాపులలో
ఇబ్బడిముబ్బడిగా వైన్ అమ్మకాలు చేస్తుండటంతో తాము వ్యాపారం కొనసాగించలేకపోతున్నామ్మని  బార్ & రేస్టారెంట్ యజమానుల ఆవేదన వ్యక్తం చేశారు. వైరారోడ్డులో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు కిరణ్, విజయ్, రవికుమార్, ప్రసాద్, కిరణ్, తదితరులు పాల్గొని నిర్వాహణ పరంగా తాము ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులు వివరించారు..బార్ & రేస్టారెంట్లకు నిర్ణయించిన స్లాబ్ విధానం.. 42, 40, 30లక్షలుగా ప్రాంతాల వారీగా వుందని..అట్టి శ్లాబ్ విధానం తాము ఎంపిక చేసుకునే విధంగా ప్రభుత్వం మార్పులు చేయాలని..బార్ & రేస్టారెంట్లకు సైతం..90ఎం.ఎల్,180ఎం.ఎల్ సీసాలను సప్లై చేయాలని విజ్జప్తి చేశారు.. కరోనా సమయం అనంతరం వ్యాపారం తక్కువగా వుంటోందని బార్ & రేస్టారెంట్ల నిర్వహణ భారంగా మారిందని కిరణ్ పేర్కొన్నారు.. తాము ట్యాక్స్ లు కట్టి షాపులు నిర్వహిస్తు.  పలువురికి ఉపాధి కల్పిస్తున్నామని..ప్రభుత్వం.అప్కారి శాఖ అధికారులు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తమ వ్యాపార నిర్వహణకు సహకారాన్ని అందించాలని కిరణ్ విజ్జప్తి చేశారు..

No comments:

Post a Comment