*కన్నుల పండుగ గా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం* (బిఆర్పిఆర్)🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుందో అలా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం *రెడ్డి* ఆడిటోరియం లో ఘనంగా జరిగింది... కళ్యాణం లో కాసేపు నాకు *శ్రీహరి* అల్లుడు అయ్యాడు...లక్ష్మి దేవి కూతురు అయింది...జీలకర్ర బెల్లం నుండి, పుస్తె మట్టేల వరకూ నేను నా సహధర్మ చారిని *శైలజ* కలసి ఈ కళ్యాణం నిర్వహించాం..
.వేద పండితులు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, గణపతి ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించాం...శ్రీవారికి *కాళ్ళు కడిగే సన్నివేశం* నిజంగా భావొద్రెకానికి లొనయ్యాను....ఇక మా బావ మరిది శ్రీ కాంత్ పుస్తె మట్టెలు శాస్త్ర ప్రకారం కరణం బంధు జానానికి చూపించి అమ్మవారి మెడలో తాళి వేసి నప్పుడు నిజంగా ఆ ఆనంద అద్భుత ఘాట్టాన్ని భద్రాచలం లో వ్యాఖ్యత వ్యవహరించి సీతారాముల కళ్యాణం కన్నులకు కట్టి నట్టు చెప్పే *శ్రీ రామాయణ శర్మ* గారు యాదగిరి గుట్ట కు వచ్చి ఈ క్రతువులొ పాల్గొన్నారు...ఆయన నాకు అత్యంత ఆత్మీయులు...ఆయన వర్ణించి నట్టు అనిపించి నా పక్కన కూర్చున్న ఆయనను చూశాను...ఆయన తన్మయత్వంతో కళ్ళు మూసు కొని క్రతువు మంత్రాలు వింటూ ఉన్నారు... ఏమయినా నా పూర్వ జన్మ సుక్రుతం...ఇలాంటి అద్భుత అవకాశం ఈ సంఘం స్తాపించడం వల్ల మాకు దొరికింది!!
*మాతృ పితృ పాదపూజ లో ఆనంద భాష్పాలు!* 🌷🌷🌷🌷🌷🌷🌷🌷 (బి ఆర్ పి ఆర్) TKNBS సరికొత్త కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. ఈ సారి గుట్ట లో నిర్వహించిన సర్వ సభ్య సమావేశం లో *మాతృ పితృ పాదపూజ* లో తల్లి తండ్రుల కాళ్ళు పిల్లలు కడుగుతూ ఉం టే వాళ్ళ కంటి నుండి ఆనంద భాష్పాలు రాలాయి...ఒక వైపు పౌరోహితులు మంత్రాలు చదువుతూ తల్లి తండ్రులు చుట్టూ ప్రదక్షిణం చెస్తె అన్ని నదుల లో స్నానం చేసిన పుణ్యం అన్న ఆ సూక్తి ని చెబుతూ, మాత్రు దేవో భవ...పితృ దేవో భవ ఆచార్య దేవో భవ అనే శ్లోకం తో తల్లి దండ్రులు, ఇటు పిల్లలు బావొ ద్రెకానికి లోనయ్యారు! దాదాపు 21 జంటలు ఈ పాద పూజ లో పాల్గొంటే వాళ్ళ పిల్లలు దాదాపు 60 మంది ఈ పాద పూజ లో పాల్గొన్నారు.
తెలంగాణ నలుమూలల నుండి వచ్చి మన సత్తా చాటిన నియోగ కరణం బంధుజనం కు విజయాభివందనం!
No comments:
Post a Comment