2022 2023 విద్యా సంవత్సరం కి సంబంధించి ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఎక్సమినేషన్ పోస్టర్ ను.SBIT ఇంజనీరింగ్ కళాశాల చైర్మెన్ RJC కృష్ణ గురువారం ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. విద్యార్థులకి చైతన్యం కల్పించి వారిని పోటీ పరీక్షలకి సిద్ధం చేస్తూ ఎన్నో అవార్డ్స్ మరియు రివార్డ్స్ తో విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారిలోని ప్రతిభను వెలికితీస్తూ ముందుకు నడిపిస్తున్న ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ అధినేత అంతటి రామకృష్ణను అభినందనీయుడని అన్నారు. ఈ సందర్భంగా.గత 4 సంవత్సరాల నుండి నిర్వహిస్తన్న పోటీ పరీక్షలలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులను అభినందిం చారు. 2022-2023 విద్య సంవత్సరంలో కూడా నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షల్లో తమ ప్రతిభను కనపరచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో SBI చైర్మన్ RJC కృష్ణ, TEOF ఫౌండర్ అంతోటి రామకృష్ణ, స్టేట్ ఇంచార్జి K. కావ్య డిస్టిక్ట్ కోఆర్డినేటర్స్ S. ఫాల్గుణి, K. వసుంధర తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment