ఖమ్మం : ఈ నెల 16 న గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం వున్న నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 16 (సోమవారం) మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 ఉదయం 6:00 గంటల నుండి 17వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు (మద్యం దుకాణాలు) మద్యం సరఫరా చేసే బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్ళు మూసివేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు సెప్టెంబర్ 16 న మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరిగేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.
No comments:
Post a Comment