*ఖమ్మం త్రీ టౌన్*/ సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో మరణించడం చాలా దురదృష్టకరమని ఆయన మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ తెలిపారుస్థానిక ఖమ్మం త్రీ టౌన్ లో బుడిగం కృష్ణమూర్తి భవనంలో సీతారాం ఏచూరి సంతాప సభ సిపిఎం త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థి గా తన ఉద్యమ ప్రయాణం ప్రారంభించి 1974లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చేరి అధ్యయనం .పోరాటం స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే మహోత్తరమైన లక్ష్యాలతో అలుపెరగకుండా పోరాటం చేస్తూ J N U ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్నికలలో మూడుసార్లు అధ్యక్షులుగా గెలిచి చదువులో కూడా గోల్డ్ మెడలు సాధించినటువంటి గొప్ప మేధావి 1984లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా 1986లో ఆలిండియా కార్యదర్శివర్గ సభ్యులుగా తర్వాత కాలంలో పోలిట్ బ్యూరోనుండి సభ్యుడిగా ప్రస్తుతం సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందటం సిపిఎం పార్టీకి వారి కుటుంబానికి తీరనిలోటు భారతదేశం గొప్ప భరతమాత బిడ్డను కోల్పోయింది జాతీయ సమైక్యత సమగ్రతల కోసం నిరంతరం కృషి చేశారు మతోన్మాదానికి వ్యతిరేకంగా. దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. అవినీతి కరమైన ఎన్నిక బాండ్లకు వ్యతిరేకంగా చట్ట పరంగా కూడా పోరాడారు ప్రజా పోరాటాలతో పాటు పార్లమెంటు రంగంలో కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలపై అనే అంశాలను పార్లమెంట్లో మాట్లాడారు అనారోగ్యంతో 72 సంవత్సరాలు వయసులో మరణించడం దేశానికి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు కమ్యూనిస్టు శ్రేణులు ఎంతో దుఃఖ సముద్రంలో ఉన్న ఈ తరుణంలో మార్క్సిజం లెనినిజం అజేయంగా కామ్రేడ్ సీతారామ్ ఏచూరి గారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుదాం
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు వజినేపల్లి శ్రీనివాసరావు సీనియర్ నాయకులు బండారు యాకయ్య కార్యదర్శి వర్గ సభ్యులు బండారు వీరబాబు, శీలం వీరబాబు త్రీ టౌన్ కమిటీ సభ్యులు ఎస్ కే బాబు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment