ఖమ్మం:సెప్టెంబర్ 11: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలో నష్టపోయిన ప్రాంతాల్లో బుధవారం కేంద్ర బృందాలు పర్యటించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం వివరాలను ప్రజలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.*ఖమ్మం జిల్లా..ఖమ్మం రూరల్ మండలం కస్నా తాండ వద్ద వరద ముంపు ప్రాంతాన్ని దెబ్బతిన్న ఇండ్లను కేంద్ర బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందానికి వరద భీభత్సం గురించి వివరించారు.*
మున్నేరు, ఆకేరు వరదల తో నష్టపోయిన ప్రాంతా లను సందర్శించిన ఈ టీమ్ లోని అధికారులు రెండుగా విడిపోయి వరద నష్టాన్ని పరిశీలించారు
ఒక బృందం దెబ్బతిన్న పంటలను, మరో బృందం రోడ్లు, ఎన్నేస్పీ కాల్వలు, వంతెనలను పరిశీలించగా జిల్లా అధికారులు వారికి ఇష్టం వివరాలను తెలియజేశారు.
ఈరోజు మధ్యాహ్నం కూసుమంచి మండలంలోని భగవత్‌వీడు తండాలో నష్టం జరిగిన 100 ఎకరాలకు పైగా పంటలను పరిశీ లించి రైతులతో అధికారులతో కేంద్ర బృందం మాట్లాడారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలంలోని గూడురుపాడు, తనగం పాడు, కస్నాతండాలో ఇళ్లు, పంటలను సెంట్రల్ టీమ్ పరిశీలించింది. 3: 30 ప్రాంతంలో తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండా, ఖమ్మం రూరల్ మండలంలోని ఎంవీ.పాలెం లో ఇళ్లు, పంటలకు జరిగిన పరిశీలించి వివరాలు సేకరించారు..అనంతరం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు మహా బూబాబాద్ చేరుకుని అక్కడ పంటలను.. ఒక ప్రాంతంలో పరిశీలించారు.. బుధవారం రాత్రికి ఖమ్మంలో బస్సు చేయనున్న కేంద్ర బృందం రేపు గురువారం ఉదయం 7:30 నుంచి ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లి పరిధిలోని రాజీవ్ గృహకల్ప, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కాలనీలో పర్యటించి...,
8:15 నుంచి 10: 30 గంటల వరకు బొక్కలగడ్డ, మోతీనగర్, 35వ డివిజన్ వెనుకభాగం గ్యాస్ గోదాం సమీపాన, ప్రకాశ్‌నగర్, వైకుంఠధామం, ధంసలా పురం, కొత్తూరులో పర్యటించనుంది.
అలాగే, ఉదయం 10:40 నుంచి 11గంటల వరకు జలగంనగర్ ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లు, ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించనుంది. ఆ తర్వాత ఈ టీమ్ సూర్యాపేట జిల్లాలోని కోదాడకు వెళ్లనుంది.జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కెపి. సింగ్ నేతృత్వంలో మహేష్ కుమార్, శాంతినాథ్ శివప్ప, ఎస్కె. కుష్వాహ, టి. నియాల్ కన్సన్, డా. శ్రీ శశివర్ధన్ రెడ్డి లతో కూడిన కేంద్ర బృందం ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించింది. మొదటి బృందం కూసుమంచి మండలం భగత్ వీడు, ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు, తనకంపాడు, కస్నా తాండ, తిరుమలాయపాలెం మండలం రాకాశితండా గ్రామాల్లో, రెండో బృందం కూసుమంచి మండలం మల్లాయిగూడెం, భద్రు తాండ, పాలేరు, ఎర్రగడ్డ తాండ గ్రామాల్లో పర్యటించి, భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. గ్రామాల్లో ఇసుక మేటలు, మట్టి తో నిండిన పొలాలు, కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు, దెబ్బతిన్న ఇండ్లు, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను కేంద్ర బృందం కలిసి, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో జరిగిన నష్టం, తిరిగి సేద్య యోగ్యంగా పొలాన్ని తయారుచేయుటకు అగు ఖర్చును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ (విపత్తు నిర్వహణ) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రాష్ట్ర గనులు, భూగర్భ ఖనిజాల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ లు పర్యటించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందం పర్యటన సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను చూపిస్తూ, భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విలయాన్ని బృందానికి వివరించారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment