న్యూఢిల్లీ ; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో పుంగనూరు లేగ దూడ సందడి చేస్తోంది
*మోదీ ఈ దూడకు దీపజ్యోతి అని అని నామకరణం చేశారు. ఈ లేగదూడ ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిందని చెప్పారు.*దీపజ్యోతిపై మోదీ పెట్టిన వీడియో సందేశం నేటిజన్స్ ఫిదా అవుతున్నారు ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన కోడె దూడ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
*దూడ నుదుటిపై దీపం ఆకారం:* కాగా ప్రధాని మోదీ అధికారిక నివాసమైన 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఓ గోవు లేగ దూడకు జన్మినిచ్చింది. ఆ లేగ దూడకు దీపజ్యోతి అని నామకరణం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ తెలిపారు. దీపజ్యోతితో కొంత సమయం గడిపానని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు. ఈ దూడ నుదుటిపై దీపం ఆకారం కనిపించిందని, అందుకే దీపజ్యోతి అనే పేరు పెట్టినట్లు మోదీ వివరించారు.
No comments:
Post a Comment