Thursday, 30 July 2020

ప్రారంభమైన పవిత్రోత్సవాలు... యధావిధిగా శ్రీవారి దర్శనాలు...


తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి..మూడు రోజులు జరుగనున్న పవిత్రీకరణ ఉత్సవాలలో బాగంగా మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు
అనంతరం సాయంత్రం 6.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో వేంచేపు చేస్తారు. కాగా సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. 
భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నాలు యథావిధిగా ఉంటుంది : టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి  
  ఈ సంద‌ర్భంగా టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ఆల‌యం ఎదుట‌ మీడియాతో మాట్లాడుతూ భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నాలు య‌థావిధిగా ఉంటుందని, స్వామివారి అనుగ్ర‌హంతో కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయి  ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నారు.  ప్ర‌తి ఏడాది తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హించ‌డం అన‌వాయితీగా వ‌స్తుంద‌న్నారు. ఇందులో భాగంగా గురు‌వారం ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయిన‌ట్లు తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌ చ‌ర్య‌ల‌లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో మూడు రోజుల పాటు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఛైర్మ‌న్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న రష్యాన్ యువతి ఎస్తర్..


ఆధ్యాత్మిక యాత్రకు వచ్చి, కరోనా కారణంగా దక్షిణాదిలో  ఇరుక్కుపోయిన రష్యా యువతి ఎస్తర్‌ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
ఈమె ఇబ్బందులు పేర్కంటూ.  వివిధ పత్రికలు..మీడియా..సోషల్ మీడియాలలో కథనాలు రావడంతో.. స్పందించిన తితిదే చైర్మన్.వి.సుబ్బారెడ్డి.. 
తన ప్రతినిధులను ఎస్తర్‌ వద్దకు పంపించారు. 
ఇవాళ శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఈ విషయంలో సినీ నటుడు సోనూ సూద్‌ కూడా స్పందించారు. 
తనవంతుగా ఎలాంటి సాయమైనా చేస్తామంటూ హామీ ఇచ్చారు. 
ఓ న్యాయవాది కుటుంబం ఆదరించి ఎస్తర్‌కు వారింట్లోనే బస, భోజన వసతి కల్పించింది.
రష్యాకు చెందిన తల్లీకూతుళ్లు ఒలివియా(55), ఎస్తర్‌(32)లకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణభారతి ట్రస్టు ఛైర్మన్‌ దీపా వెంకట్‌ అండగా నిలిచారు. తల్లీకూతుళ్లతో ఆమె మాట్లాడారు. రష్యన్‌-తెలుగు, రష్యన్‌-హిందీ మాట్లాడే దుబాసీలను వారి వద్దకు పంపుతున్నారు. బృందావనంలో వున్న ఎస్తర్ తల్లి ఒలివియాను తిరుపతికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు. వివరాలలోకి వెళితే.  
ఎస్తర్‌ రష్యా వనిత, తల్లి ఒలివియాతో 
కలిసి ఫిబ్రవరి 6న భారత్‌కు వచ్చారు.
 ఎస్తర్జి రష్యాలో పిజియోథెరపీ వైద్యురాలు. ఆలయాల అలంకరణలోనూ ప్రావీణ్యముంది. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా  భారత్ చేరుకున్న వీరికి కరోనా చేదు అనుభవం మిగిల్చింది.  లాక్ ‌డౌన్‌ సమయంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో గడిపి ఆంక్షలు సడలించాక  తిరుపతి శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చారు. కరోనా ఆంక్షల కారణంగా విదేశీయులకు దర్శన భాగ్యం లేదని తెలిసి నిరాశకు గురయ్యారు. చేతిలో డబ్బులు కరిగిపోగా... ఎవరైనా తమను ఆదుకుంటారనే ఆశతో రష్యన్లు ఎక్కువగా వచ్చే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావనం పట్టణానికి ఎస్తర్‌ తల్లి వెళ్లారు. అక్కడ ఎలాంటి సాయమూ అందలేదు. పైగా తిరిగి రాలేక అక్కడే ఇరుక్కుపోయారు. ఎస్తర్‌ అవస్థలను చూసిన కపిల తీర్థం సమీపంలోని ఓ వ్యక్తి ఆమెకు ఆశ్రయం కల్పించారు..    ఎస్తర్ రష్యా వాసి అయినప్పటికీ పూర్వ జన్మ సుకృతం ఏడుకొండలస్వామి దర్శనం అయింది.త్వరలోనే తల్లి.. కూతుళ్లు.. కలుసుకునివారి స్వదేశానికి చేరుకోవాలని వారి  కధ సుఖాంతం కాావాలని కోరుకుందాాం

Tuesday, 28 July 2020

బహుముఖ ప్రజ్జశాలి రావి కొండలరావు గుండెపోటుతో మృతి...


ప్రముఖ సినీ రంగస్థల నటుడు దర్శకుడు, జర్నలిస్ట్, కాలమిస్ట్, రచయిత శ్రీ రావి కొండలరావు గుండెపోటుతో కన్నుమూసారు. ఆనారోగ్యం దృష్ట్యా బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  ఆయన తుదిశ్వాస విడిచిచారు. 1932, ఫిబ్రవరి 11 న సామర్లకోట లో జన్మించిన రావి కొండలరావు, ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600లకు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు. 
రావికొండలరావు ప్రస్థానం "మిస్ ప్రేమ" అనే నాటకం ద్వారా శ్రీకాకుళం నుంచి మొదలైంది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, జర్నలిస్టుగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. కాగా, 1958లో శోభ చిత్రంలో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తమిళ, మలయాళ సినిమాలకు కూడా ఆయన డబ్బింగ్‌ చెప్పారు. మద్రాసు ఆనందవాణి పత్రిక సబ్‌ ఎడిటర్‌గా పనిచేశారు.  ‘తేనె మనసులు’, ‘దసరా బుల్లోడు’, ‘రంగూన్ ‌రౌడీ’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘భైరవ ద్వీపం’ ‘రాధాగోపాలం’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘కింగ్’‌, ‘ఓయ్’‌, ‘వరుడు’ తదితర చిత్రాల్లో రావికొండలరావు నటించారు.1996 మే లో రిలీజైన పౌరాణికచిత్రం "శ్రీకృష్ణార్జునవిజయం" .  చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి వెంకట్రామిరెడ్డి నిర్మించిన ఈ మూవీకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా రావికొండలరావు కధ మాటలు అందించారు. తెలుగు సినీ పరిశ్రమపై వ్రాసిన #బ్లాక్అండ్‌వైట్ అనే పుస్తకానికి గాను #నందిఅవార్డ్ ను అందుకున్నారు. ప్రముఖ నటి రాధాకుమారి రావి కొండలరావు సతీమణి, 2012 లో ఆవిడ మృతి చెందారు. పెళ్ళిపుస్తకం సినిమాకు కథను అందించడమే కాక, అందులో గమ్మడి సహాయకుడిగా సంభాషణలు లేని హావ,భావ అభినయాలతో రావి కొండలరావు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ చిరంజీవే...
 చివరి శ్వాస వరకు రంగస్థల వికాసం కోసం విశేష కృషి చేశారు! చిరస్థాయిగా  గుర్తుండిపోయే మంచి మనిషి రావి కొండలరావు.. గారికి నివాళి🙏🙏


అప్పట్లో డోగ్రాలంటే బ్రటిష్ వారికి వణుకు. ఈ ఆర్తీ డోగ్రా అంటే అవినీతికి వణుకు...

బ్రటిష్ వాడు ఎవ్వరికీ భయపడలేదుగాని ఈ డోగ్రా కమ్యూనిటీ అంటే మాత్రం వణికిపోయాడు.
అందుకే తమతోబాటు, కొన్ని డోగ్రా రెజిమెంట్లను, 
కొన్ని జమ్ము & కాష్మీర్,
కొన్ని గూర్ఖా రెజిమెంట్లను తీసుకుపోయడు. 
బ్రటిష్ దొరకు చెమటలు పట్టించిన డోగ్రాల సంతతి ఈ  కలేక్టర్...అందుకే అవినీతి పక్షానికిఆమే పేరు వింటే దడ ఆవిడే
 "ఆర్తీ డోగ్రా" IAS.,
నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలుచున్న ఈమే రాజస్థాన్ రాష్ట్రంలో ఓ సంచలనం. 
నిద్రపోతున్న అధికారిక వ్యవస్థలను ఒక్క కుదుపు కుదుపుతోంది. 
దేశం ఎలా పోతే మనకెందుకు? అనే వాళ్ళని మళ్ళీ ఆలోచింప చేస్తోంది.
రాజస్థాన్.బికనీర్.. అజ్మీర్ జిల్లాల్లో అవినీతి. అసాంఘిక కార్యకలాపాల ఆణచివేయడంలో తన ముద్రను వేసిన ఆర్తీ డోగ్రా.
 3.2 అడుగుల ఈ వామన స్త్రీ మూర్తి డెహ్రాడూన్లో  స్కూల్ విద్యా..శ్రీరాంమహిళా కళాశాల నుండి ఎకానమిక్సులో డిగ్రీ చదివారు..అనంతరం సివిల్ సర్వీసే లక్ష్యంగా పట్టుదలతో చదివి.  2006 సివిల్ సర్వీసేస్ ద్వారా ఐ.ఏ.ఎస్ సాధించారు..తండ్రి ఆర్మీ అధికారి..ఆ ధీరత్యాన్నే ఈమె తన విధి నిర్వహణలో చూపుతూ తాను పనిచేసిన చోట ప్రజల మన్ననలు అందుకుంటోంది @
మణికుమార్ ఫర్ సత్యన్యూస్ ఇంటర్నెట్ డెస్క్

Monday, 27 July 2020

చిత్తూరు రైతు కుటుంబానికి ప్రభుత్వం సాయం అందుతోంది.. వైకాపా నేతలు

చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావుకు నటుడు సోనూసూద్ ఉదారంగా ట్రాక్టర్ అందించడం పట్ల వైకాపా మహిళా నేత శైలజారెడ్డి అభినంధనలు వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదంటూ పలువురు విమర్శలు చేయడం సరికాదన్నారు..
వైకాపా ప్రభుత్వం రైతాంగ. పేదలకు అందించే సంక్షేమ పధకాలన్నీ నాగేశ్వరరావు కుటుంబం కూడా అందుకుంటోందని ఆమె పేర్కొన్నారు..
రైతులు గొప్పవారు కావడం హర్షణీయం అని అమె పేర్కొన్నారు. 
1. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో వేసిన ప్రభుత్వం
2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ.
3. నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ  ఒడి కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం
4. పెద్ద కూతురు జగనన్న తోడు కింద లబ్ధికోసం దరఖాస్తు చేశారు. చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది. 
5. నాగేశ్వర్రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్‌ అందుకుంటోంది. 
6. నాగేశ్వర్రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్‌ కింద ప్రతి నెలా రూ.2250లు అందుకుంటున్నారు. 
7. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వర్రావు కుటుంబం అందుకుంది. ఉచిత రేషన్‌కూడా తీసుకుంది. 
8. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలు తీసుకున్నారు. ఇలా చెప్పడం ఇబ్బందికరంగా వున్నప్పటికీ విమర్శకుల కోసం తాను చెప్పాల్సిన పరిస్థితి వచ్ఛిందని శైలాజరెడ్డి పేర్కొన్నారు.మరో వైపు రైతు నాగేశ్వరరావు పై పలువురు సోషల్ మీడియాలో విమర్శలు ట్రోల్ చేస్తున్నారు.
సోనీ సూద్ సాయం చేసింది  ఓ సాధారణ రైతుకి అనే రీతిలో కథనాలు రావడం సహేతుకంగా లేదని ఎదురు విమర్శలు వస్తున్నాయి.. కానీ సదరు రైతు వీరదల్లు నాగేశ్వర రావు ఇప్పటికే వివిధ సంస్థల్లో పనిచేశారని.
పైగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. వీరదల్లు నాగేశ్వర రావు గతంలో 2014 ఎన్నికల్లో లోక్ సత్తా తరుపున బరిలో దిగి వెయ్యి కి పైగా ఓట్లు కూడా సాధించారని
అంటే సమాజంలో అంతో ఇంతో గుర్తింపు ఉన్న వ్యక్తిగానే భావించవచ్చుకధా అలాంటి సమయంలో ఎందుకు ఈ ప్రయత్నం చేశారన్నది ఆశ్చర్యకరం అంటూ పలువురు పేర్కొన్నారు. ఊహించని రీతిలో  ఇది సంచలనంగా మారిందని వారు చెబుతున్నారు. 
అన్నింటికీ మించి వారు సమీప పట్టణంలో నివాసం ఉంటూ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఉపశమనం కోసం ఊరికి వచ్చినట్టు చెబుతున్నారు. ఏటా వ్యవసాయం చేసే కుటుంబం కాదని కూడా అంటున్నారు. తాత్కాలికంగా గ్రామానికి వచ్చిన వారిని రైతుగా చిత్రీకరించి ప్రచారం చేయడం పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు



Sunday, 26 July 2020

మన ఆరోగ్యం మనచేతుల్లో...శుభ్రత పాటిద్దాం: హరీష్ రావు


ఆదివారం డ్రైడే సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలో పలు ప్రాంతాల్లో కలయతిరిగారు..ఈ సందర్భంగా ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటి నిల్వలను ప్రత్యక్షంగా ఆయా నివాస కుటుంబీకులకు చూపి, ప్రతి ఆదివారం 'డ్రై' డే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని వారికి  విజ్ఞప్తి చేశారు.
• ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా.. మీ ఇంట్లో పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధుల వ్యాప్తి రాకుండా చూడాలని హరీష్ రావు సూచించారు.
• డెంగ్యూ చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని మంత్రి పేర్కొన్నారు.  

Friday, 24 July 2020

అమ్మలా మారిన మహిళా కానిస్టేబుల్... కొవిడ్ క్యారంటైన్ లోనూ వృద్దురాలికి సేవలు...

కరోనా కకావికలం చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ కరోనా చికిత్స చేయించుకుంటూ తోటి మహిళా వృద్దురాలిని అమ్మలా ఆదుకుంటోంది.
కోవి డ్ 19 బారిన పడిన విజయనగరం  జిల్లా 2వ పట్టణ మహిళా కానిస్టేబుల్ ధర్మవరపు రాధిక చికిత్స నిమిత్తం MIMS ఆసుపత్రిలో చేరి, తన ప్రక్కనే చికిత్స పొందుతున్న మరో 80 సం.ల వృద్ధురాలికి భోజనం, టిఫిన్ తినిపిస్తూ, ఇతర అవసరాలు తీరుస్తూ, సహాయ పడుతూ, సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు..
ఈ విషయం తెలుసుకున్న డిజిపి గారు మహిళా కానిస్టేబుల్ ధర్మవరపు రాధిక అభినందించారు.

చదువుల స్మార్ట్ ఫోన్ కై.. గోవును అమ్ముకున్న హిమాచల్ వాసి... వివరాలు తెలపండి : సోనూసూద్


కరోనా జీవన విధానంలో కుమారుని అన్లైన్ తరగతులకోసం ఓ తండ్రి తన ఆదాయ వనరుగా వున్న గోవును అమ్ముకోవల్సి వచ్ఛిందింటూ. హర్యానా వాసి కుల్డీప్ గురించి వచ్ఛిన వార్తపై విలక్షణ నటుడు సోనుసూద్  తాను అండగా నిలుస్తానని వెంటనే అతని వివరాలు తెలపాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు.. వివరాలలోకి వెళితే..
 హిమచల్ ప్రదేశ్ లో కుల్దీప్  నిరుపేద తన కొడుకు  అన్స్లలైన్ తరగతుల కోసం ఒక స్మార్ట్ ఫోన్ అవసరం ఉండగా తన దగ్గర ఉన్న అవుని అమ్మేసి ఒక ఫోన్ కొని ఇచ్చారు.మొబైల్ కొనేందుకు అప్పు ఇమ్మని కుల్టీప్ ఫైనాన్స్ సంస్థలతో పలువురిని అడిగి వేసారాడు..దీంతో విధిలేక తన ఏకైక ఆదాయ వనరుగా వున్న ఆవును అమ్మి పిల్లవానికి స్మార్ట్ ఫోన్ కొనిచ్ఛాడు..
కొడుకు జీవితాన్ని బాగుకోరుకునే ఎంతో మంది తల్లి తండ్రులు వాళ్ల జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు.కుల్డీప్ కూడా తన కుమారుడు చదువు కు కుటుంబానికి ఆదాయ మార్గమైన గోమాతను ఆమ్ముకున్నాడు..మరోవైప  అంబానీని ప్రపంచం 5వ ధనవంతుడు గా నిలిపిన మోబైల్ ..కుల్ధిప్ కు ఉన్న ఆదాయం కూడా లేకుండా చేసిందని నేటిజన్లు పేర్కోంటున్నారు.

Thursday, 23 July 2020

బాక్సులను మోసిన ఇవాంకా ట్రంప్... మేడం సూపరంటున్న వాషింగ్టన్ వాసులు...

వాషింగ్టన్ : అమెరికాలో కరోనా కరళ నృత్యం చేస్తున్న వేళా అధ్యక్షుడు డోనాల్డ్ జె ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఆహారం.. మందుల బాక్స్ లను మోసుకుంటూ వాషింగ్టన్ వీధుల్లో కనిపించింది..ట్రంప్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న ఇవాంకా.స్వఛ్ఛంద  సేవలలో నేను సైతం అంటూ కరోనా బాధితులతో ..కష్టలలో వున్న వారికి ఆహారం, మందులు స్వయంగా మోసుకుంటూ వెళ్లి అందజేసింది.ఆహారం.. మందులు. శానిటైజర్లు వున్న బాక్స్లను వాషింగ్టన్ డి సిలో పలువురికి అందజెసింది.
దీంతో ఆ ప్రాంత వాసులు ఇవాంకాను అభినంధనలతో ముంచెత్తుతున్నారు. మరీ ఇవాంక స్వచ్ఛంద సేవలు ట్రంప్ మరోమారు అధ్యక్షపగ్గాలు చేపట్టేందుకు ఎంత వరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి.@మణికుమార్, ఫర్ సత్యన్యూస్.ఇంటర్నెట్ డెస్క్.. .

Wednesday, 22 July 2020

రామమందిరం భూమిపూజకు 150 మంది అతిథులు🛕*అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం : స్వామి గోవింద్ దేవ్ గిరి.


దిల్లీ: అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారు.
 అయితే కరోనా మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా భౌతిక దూరం పాటించేందుకు ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు నిర్ణయించింది. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది వరకు పాల్గొంటారని పేర్కొంది. 
 అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపింది. ‘150 మంది అతిథులు సహా 200 మందికి మించి భూమిపూజలో పాల్గొనకూడదని నిర్ణయించాం’ అని ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌గిరి బుధవారం వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూమిపూజకు ముందు ప్రధాని మోదీ మందిరంలోని రాముడికి పూజ చేయనున్నారు. 
హనుమాన్‌ గిరి ఆలయంలోని హనుమంతుని పూజలోనూ పాలుపంచుకోనున్నారు. 
రామమందిరం ఉద్యమంతో ముడిపడిఉన్న ప్రముఖులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, వినయ్‌ కతియార్‌లకు ఆహ్వానం పంపనున్నట్లు గతంలో ట్రస్టు అధికారి ఒకరు తెలిపారు. కాగా వారి రాకపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌ను ఆహ్వానిస్తున్నట్లు మరో అధికారి వెల్లడించారు.
 

తిరుపతి..శ్రీనివాసం - విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలేక్టర్ భరత్ గుప్తా.. . అన్నిరకాల కోవిడ్ క్యూర్ మందులు 15 రోజులకు సరిపడా నిల్వ వుండాలని ఆదేశం...

 

తిరుపతి, జూలై 22: కోవిడ్ సెంటర్లలో మైల్డ్ కేసులను అడ్మిట్ చేసుకుంటున్నా చేరేముందు రక్త పరీక్షలు, అవసరాన్ని బట్టి ఎక్సరే  వుంటుందని, అందుకోసం కాల్ ఆన్ ల్యాబ్ లేదా ల్యాబ్ ఏర్పాటు, మొబైల్ ఎక్సరే మిషన్, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటు వుండాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా కోవిడ్ సెంటర్ ఇంచార్జులను ఆదేశించారు. 
బుధవారం సాయంత్రం తిరుపతి..శ్రీనివాసం  విష్టు నివాసం లలో కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలను తనిఖీ చేసిన కలేక్టర్.. అక్కడి పెషంట్లకు అందజేస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు.అంతకముందు కలేక్టర్ ఈ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జెసి (డి) వీరబ్రంహమ్ , అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ లతో కలసి మెడికల్ ఏజెన్సీలతో, ఇఎస్ ఐ , ఐ ఏం ఏ డాక్టర్లతో సమావేశమైనారు. కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సెంటర్లలో వైద్య సదుపాయాలు అందుబాటులో వుండేలా వైద్య పరికరాలు వుండాలని ఎపిఎం ఐ డి సి, ఇ ఇ ని ఆదేశించారు. కోవిడ్ కేంద్రానికి వచ్చిన వారు హోమ్ ఐసోలేషన్ వెళ్లదలచుకుంటే, హోమ్ క్యారంటైన్ కిట్ అందించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్లు వివరించాలని సూచించారు. 
అలాగే కోవిడ్ రోగులకు వాడే సి , జింక్, బి కాంప్లెక్స్ వంటివి కొరతలేకుండా 15 రోజులకు సరిపడా మందులు స్థానిక మెడికల్ ఏజెన్సీలు కోరిన ఇండెంట్ మేరకు సరఫార చేయాలని సూచించారు. ఇఎస్ ఐ లో అడ్మిషన్లు ప్రారంభించాలని, ఆయుర్వేద వైద్యశాలలో కోవిడ్ సేవలకు  డాక్టర్లకు విధులు కేటాయింపు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇఎస్ ఐ సూపర్నెంట్ బాల శంకర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బాలాంజనేయులు , ఎపి ఎం ఐడిసి  దనంజయ రావు, చక్రపాణి, మెడికల్ ఏజెన్సీలు యుగంధర్ మెడికల్స్, వాసవి మెడికల్స్, సాయి శ్రీనివాస మెడికల్స్, గెలాక్సీ మెడికల్స్, బాలాజీ వాక్సిన్ హౌస్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా కట్టడి లో అపశృతి...యువకునిపై లాఠీ దెబ్బ.. చికిత్స పొందుతూ మృతి


ఆంధ్రప్రదేశ్/ప్రకాశం జిల్లా/చీరాల : ప్రకాశం జిల్లా పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. చీరాలలో మూడు రోజుల క్రితం కిరణ్‌ తన స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చాడు. చీరాల ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ వారిని ఆపి మాస్క్‌ ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే మాస్క్‌ పెట్టుకోకుండా బయటకు వస్తారా? అని లాఠీతో కొట్టడంతో కిరణ్‌ అక్కడికక్కడే సృహతప్పి పడిపోయాడు. దీంతో అతన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయినా.. కిరణ్‌ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసు దెబ్బల కారణంగానే కిరణ్‌ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కిరణ్‌ తండ్రి మోహన్‌రావు చీరాలలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. మాస్క్‌ పెట్టుకోలేదన్న కారణంతో పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈవిషయంపై పోలీసులు స్పందించారు..18వతేది కిరణ్ తన మిత్రులతో కలసి మందు తాగి డ్రైవింగ్ చేయడంతోపాటు కరోనా ఉధృతంగా వున్న తరుణంలో కనీస బాధ్యత లేకుండా మస్కులేకుండా తిరగడంతో హెచ్చరించమని పేర్కొన్నారు...

Sunday, 19 July 2020

కరోనా విపత్తులో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయం.. మృతులకు నివాళీ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

మీడియా ద్వారా జర్నలిస్టీలు కరోనా విపత్తులో ప్రజలను చైతన్యం చేస్తోందంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కితాబిచ్చారు. ఆందోళన చెందవద్దని ప్రజలకు ధైర్యం చెప్పారు.సూచన

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు వెంకయ్య నివాళి అర్పించారు.

దేశంలో తాజా పరిస్థితులపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పందించారు. దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటంలో  మీడియా నిర్వహిస్తున్న పాత్ర అమోఘం అని కొనియాడారు. 

మహమ్మారి వ్యాప్తి పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో ప్రసార మాధ్యమాలదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారం చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇటీవల అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వారికి నివాళులు అర్పించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

Saturday, 18 July 2020

తిరుమలలో దర్శనాలు యదాతధం..



కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి గత మార్చి చివరిలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఈ కారణంగా దేవాలయాలు తెరవలేదు. దీని తరువాత, కర్ఫ్యూ ఆంక్షలను క్రమంగా సడలించిన తరువాత, జూన్ మధ్య భక్తుల దర్శనం కోసం తిరుపతి ఆలయం తిరిగి ప్రారంభించబడింది.
ఇంతలో, తిరుపతి ఆలయంలో 14 మంది అర్చకులతో సహా 140 మందిలో కరోనా నష్టం నిర్ధారించబడింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. తిరుపతి ఆలయ దర్శనాలను ఆపాలని ప్రధాన పూజారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ పరిస్థితిలో తిరుపతిలో దర్శనం ఆపే ఆలోచన లేదని ఆలయ పరిపాలన విభాగం ప్రకటించింది. ,టిటిడి భోర్ఢు ఛైర్మన్ ఎస్..వి.సుబ్బా రెడ్డి  ఈ విషయమై మాట్లాడారు.   కరోనా బాధితుల్లో 70 మంది కోలుకొన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది ఆలయ వద్ద భద్రతా విధుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు. వీటిలో, ఒకరికి మాత్రమే తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. ఆలయాన్ని సందర్శించిన భక్తులకు కరోనా సంక్రమణకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అందువల్ల, ఆలయాన్ని మూసివేసే ప్రణాళిక లేదని పేర్కొన్నారు.. సమీక్షలో  సీనియర్ అర్చకులు  పూజారులు పాల్గొనరు. ఆర్చకులు  సిబ్బంది ప్రత్యేక ఆశ్రయం కోసం అభ్యర్థించారు. వారికి ప్రత్యేక వసతి, ఆహారం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Wednesday, 15 July 2020

కరోనా కాలంలో జగనన్న పనితీరు భేష్ - శైలజా చరణ్ రెడ్డి


కరోనా కష్టకాలంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పనితీరు చాలా బేషుగ్గా ఉందని జాతీయ, అంతర్జాతీయ నాయకులు & మీడియా సైతం ప్రశంసిస్తున్నారు అని  ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు  యువ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి పాలనను  చూసి హర్షిస్తూ ఉంటే  చంద్రబాబు అండ్ టీం మాత్రం సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని,  దానికి తోడు పీకే ప్యాకేజీ ఉంటే ఒకలాగా ప్యాకేజీ అందిన తర్వాత ఇంకొక లాగా మాట మార్చి మాట్లాడడం చూస్తుంటే ఆయన నిలకడలేని తత్వం అర్థమవుతుందని  వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజినల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జి శైలజా చరణ్ రెడ్డి మండిపడ్డారు.
*జగనన్న టార్చ్ బేరర్*
➡️  దేశం నలుమూలల నుండి వచ్చిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తీసుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా  జగనన్న  ఒక మానవత్వ హృదయoతో శ్రామిక రైళ్ల ద్వారా వేల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించడం జరిగింది అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా,వెనుకడుగు వేయకుండా వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడంలో ముందడుగు వేసిన మా నాయకుడు జగనన్న అని ఆమె తెలిపారు
➡️  వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్ లు ,
వారికి భోజన సదుపాయాలు, ఉండేందుకు అణువుగా షెల్టర్ కల్పించడం జరిగింది.
➡️  16 శ్రామిక రైళ్ల ద్వారా 21,229 వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించడం జరిగింది.
➡️  వివిధ రాష్ట్రాల్లో ఉన్న 16 వందల మంది విద్యార్థులను మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది.
➡️  అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ దేశాల్లో ఉన్న మన రాష్ట్రానికి సంబంధించిన వారిని వందేమాతరం-ప్రత్యేక విమానాల ద్వారా తీసుకువచ్చారు.
➡️  వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులను, విదేశాలలో ఉన్న వారిని తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం తో పాటు, కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తూ  తన సమర్థతను చాటు ఉంటున్నాడని  40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే నాయకులకు సైతం  చెంపపెట్టు గా పాలన సాగిస్తున్నాడు అని శైలజా చరణ్ రెడ్డి తెలిపారు

Tuesday, 14 July 2020

తిరుమలలో ఘనంగా విశ్వశాంతి మహాయాగం... హాజరైన టిటిడి ప్రముఖులు


తిరుమల : 
లోక‌క‌ల్యాణం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని, ప్రపంచంలోని సమస్త మానవాళి ప్రజల ఆరోగ్యం కోసం  శ్రీ‌వారిని ప్రార్థిస్తూ విశ్వశాంతి మహాయాగాన్ని తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మంగళవారం సాంగోపాంగ అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ  విశ్వశాంతి మహాయాగం ఘనంగా జరిగింది. 
ఈ సందర్భంగా "ఓం నమో నారాయణాయ" అష్టాక్షరి మంత్రాన్ని, "ఓం నమో భగవతే వాసుదేవాయ" ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించి హోమం నిర్వహించారు.  రేవ‌తి, అశ్విని న‌క్షత్రాలు క‌లిసిన‌ భౌమాశ్విని యోగం ప‌ర్వదినం కావ‌డంతో  ఈ యాగాన్ని నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామివారు, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారు మంగ‌ళాశాస‌నాలు అందించారు.  
వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్  కుప్పా శివ‌సుబ్రమ‌ణ్య అవధాని మాట్లాడుతూ క‌రోనా వ్యాధి నుండి మానవాళిని రక్షించాలని స్వామివారిని కోరుతూ వేదపాఠశాలలో 30 రోజులుగా వేదపారాయణం జరుగుతోంద‌న్నారు.చేశామ‌న్నారు. ఇందులోభాగంగా ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేద పారాయణం, దివ్య ప్రబంధ నారాయణం  చేప‌ట్టిన‌ట్టు చెప్పారు.
వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు మోహ‌నరంగాచార్యులు, శ్రీ‌వారి ఆల‌య ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ  "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరి మంత్రాన్ని, "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని ప‌ఠించిన వారికి శ్రీ‌వారి ఆశీస్సుల‌తో బాధ‌లు తొల‌గిపోయి, స‌క‌ల‌శుభాలు క‌లుగుతాయ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ యాగంలో టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఓఎస్‌డి   పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

Monday, 13 July 2020

పాతనోట్లు మార్పిడికి అవకాశం ఇవ్వండి .. ఆర్థిక మంత్రికి - వై.వి.విజ్జప్తీ..


ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి*
మర్యధపూర్యకంగా కలిసినట్లు పేర్కొన్న వై.వి.
టీటీడీ వద్ద ఉన్న పాత రద్దయిన నోట్లను మార్పిడి చేయాలని  విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
నోట్ల రద్దు అనంతరం దాదాపు 50 కోట్ల పాత రూపాయలు టిటిడి వద్ద ఉండిపోయాయని, భక్తుల కానుకలు కొత్త నోట్లుగా  మార్చుకునేందుకు అనుమతించాలని వై.వి ..ఆర్ధికమంత్రికి విజ్జప్తీ చేశారని వెల్లడి.
లాక్ డౌన్ కారణంగా టిటిడికి రెవెన్యూ  లేదు 
కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలని కూడా నిర్మలసీతారామన్ను వై.వి. కోరారు
పోలవరం ప్రాజెక్టుకు, వెనకబడిన జిల్లాలకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి..తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాధం ఆందజేసిన వై.వి...

A Big Thanks To All..."Big B" from Nanawathy

It shall not be possible for me to acknowledge and respond to all the prayers and wishes expressed that have shown concern towards Abhishek, Aishwarya, Aaradhya and me .. 
I put my hands together and say .. 🙏
Thank you for your eternal love and affection    ..No worries..things are Going on...said |Big B" ..Amithabachan

Thursday, 9 July 2020

రైతు బాంధవుడు రాజన్న - శైలజా చరణ్ రెడ్డి కాణిపాకంలో ఘనంగా వైయస్సార్ జయంతి & రైతు దినోత్సవ వేడుకలు

రైతుబందవుడు..జననేత.  మాజీ ముఖ్యమంత్రి,స్వర్గీయ  వై.యస్.రాజశేఖర రెడ్డి గారి 71 వ జయంతి  వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాణిపాకంలో వైయస్సార్ కు వైకాపా నాయకులు, అభిమానులు. వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి  నివాళులు అర్పించారు.  వేడుకలపై  వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జ్ శైలజా చరణ్ రెడ్డి స్పందిస్తూ  రైతు దినోత్సవ వేడుకలలో, రైతులకు కులమతాలకతీతంగా ఘనంగా స్థానిక నాయకులు సన్మానం చేయటం  హర్షించదగ్గ విషయమని    ఆనందాన్ని వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో జగన్నాథరెడ్డి, చరణ్ రెడ్డి, చిన్నారెడ్డి, పుణ్య సముద్రం రవి , గిరి రెడ్డి, రాజ్ కుమార్ ,  కుమారి, యోగానంద, భాస్కరయ్య  ఇతర నాయకులు పాల్గొన్నారు.
శైలజా చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ  రాజశేఖర్ రెడ్డి గారు యుగపురుషుడు ,  రైతు బాంధవుడు,  మరణం లేని విధాత అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో సున్నా వడ్డీ పథకానికి గత ప్రభుత్వం గ్రహణం పట్టించింది. రైతులను మోసం చేసింది. దాదాపు 57 లక్షల మంది రైతులకు రూ.1,150 కోట్లు బకాయి పెట్టింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని మన ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే.. ఖరీఫ్, రబీ.. ఏ సీజన్‌కు ఆ సీజన్‌ పూర్తయ్యే నాటికి వారి వడ్డీ కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. వడ్డీ మొత్తాన్ని బ్యాంకులకు కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే  జమ చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు దద్దమ్మ అయితే వైయస్సార్ గారి కొడుకు చరిత్ర సృష్టించిన నాయకుడు  జగన్ అన్న అని ఆమె  ప్రశంసించారు.
 పుణ్య సముద్రం రవి మాట్లాడుతూ  తెలుగు జాతి మనుగడ ఉన్నంత కాలం రాజన్న చిరస్థాయిగా జగనన్న పథకాల్లో  బ్రతికే ఉంటారని,  బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైయస్సార్ అని,   రాబోయే రోజుల్లో రాష్ట్రం సస్యశ్యామలంగా  రైతు కళ్ళల్లో ఆనందం  జగనన్న సారథ్యంలో ఉండబోతుందని తెలిపారు.

టిటిడి సిబ్బందికి కరోనా... భక్తులకు నో కరోనా ఎఫెక్ట్... గోవిందా ..గోవిందా...

 కరోనా లాకౌట్ అనంతరం  శ్రీవారి ఆలయం తెరచుకున్నప్పటి నుంచీ శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటూ.. భక్తులకు దర్శనాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టీటీడీ సిబ్బంది సైతం కరోనా బారినపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా బుధవారం మీడియాకు తెలిపారు. నిత్యం 200 మంది టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 80 మందికి పాజిటివ్ వచ్చింది. భక్తుల ద్వారా ఉద్యోగులకు వైరస్‌ సోకినట్లు ఆధారాల్లేవు. ఇప్పటి వరకు 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ ఫలితాలు వచ్ఛాయని దీంతో భక్తుల ద్వారా సిబ్బందికి రాకపోవచ్ఛని కలేక్టర్ భరత్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా,

చిత్తూరు జిల్లాలో 1,765 మంది కరోనా బారినపడ్డారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం వరకు 22,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 11,101 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 264 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 10,894 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 10,77,733 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ ద్వారా సమాచారం వుందని కలేక్టర్ వెల్లడించారు. కరోనా భరిన పడకుండా అందరం తగు జాగ్రత్తలు పాటిద్దామని భరత్ కుమార్ పేర్కొన్నారు.

Wednesday, 8 July 2020

నేత్రపర్వంగా ప్రసన్న వెంకటేశ్వరునికి పుష్పయాగం



    తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగం మహోత్సవాన్ని టిటిడి ఆధ్వర్యంలో మంగళవారం  ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. కొవిడ్ -19 నిబంధనల దృష్ట్యా ఆలయసిబ్బంది మాత్రమే పాల్గొని కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
*  ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. 
 ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.
       పుష్ప‌యాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖలో దాతలు సమకూర్చిన కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు.
 పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైదికులు వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, ప‌గ‌డ‌పు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో స్వామి వారికిఇరువురు దేవేరులకు పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగింది.
 బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. యాగంలో భాగంగా ప్రత్యేక పూజలు ఉత్సవ విగ్రహాలను నిర్వహించారు.
టిటిడి ఇఒ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, డైయో శ్రీమతి ఝాన్సీ రాణి, ఎఇఒ శ్రీ సుబ్రమణ్యం, కంకనా భట్టర్ శ్రీ డివిఓ మణికందన్ ప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.@ మణికుమార్..

Monday, 6 July 2020

మంచుకొండల్లో వ్యవసాయం... తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పట్టభద్రురాలు. .

మంచుకొండల మధ్య వరిసాగు..ఉత్తరఖండ్..రుద్రపూర్ గ్రామంలో.. ఓ మధ్యతరగతి రైతు కుటంబంలో పుట్టిన శిఖావిశ్వాస్ ..వ్యవసాయ శాస్త్రం లో పట్ట బద్రురాలు..ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిని అయిన శిఖా కరోనా కారణంగా ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్ఛింది... అయితే నేం ఇంటి వద్ద వుండి తల్లి దండ్రులకు వ్యవసాయ పనుల్లో తన వంతు సాయం అందజేస్తోంది..కరోనా కొందరిని రోడ్డేక్కిస్తే..కొందరి ఉద్యోగాలు ఊడబికి ఉసురు పోసుకుంది.ఆ రంగం..ఈ రంగం అనే తేేడా లేేేేకుండా అన్ని రంగాలను కుదేలు చేసింది  లోనే కరోనా కఠీీన్యకాలం తొలగి..తిరిగి అందరికి మంచి కాాలం రావాలని కోరుకుందాం.

Sunday, 5 July 2020

శాకాంబరీ మాతగా భద్రకాళి అమ్మవారు...

వరంగల్: భద్రకాళి శాకాంబరీ ఉత్సవం*

*ఆషాడ శుద్ధ పౌర్ణమి  భద్రకాళి అమ్మవారి శాకాంబరీ అలంకరణ* 
 *27 కిలోల కూరగాయలు, ఆకుకూరలు అమ్మవారిని అలంకరణ*

*సంపూర్ణ శకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ భద్రకాళి అమ్మవారు*

*బారులు తీరిన భక్తులు*.. 

*సైకిల్ స్టాండ్ వరకు లైన్లో భక్తులు*

Saturday, 4 July 2020

కపిలేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు.. నేడు పూర్ణహుతి...

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శ‌ని‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.
ఇందులో భాగంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్, శ్రీ శ్రీ‌నివాస నాయ‌క్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు....@మణికుమార్, తిరుమల..

శాకాంబరీ అవతరంలో బెజవాడ దుర్గమ్మ.. భక్తులకు కదంభ ప్రసాద వినియోగం..

విజయవాడ :  ఆశాడ శుద్ద చతుర్దశి కనకదుర్గమ్మ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు రెండవ రొజులో భాగముగా శనివారం ఉదయం  ఆలయ స్థానాచార్యులు  విష్ణుభట్ల శివప్రసాద శర్మ పర్యవేక్షణలో సప్త శతి పారాయణము,  మహావిద్యా పారాయణము, మూల మంత్ర హవనము , మంటప పూజ కార్యక్రమములు నిర్వహించడం జరిగినది.  అనంతరం సా.04 గం.లకు మూల మంత్ర హవనములు, హారతి, మంత్ర పుష్పము, మరియు ప్రసాద వితరణ నిర్వహించబడును. శాకంభరీ దేవి ఉత్సవముల సందర్భముగా అమ్మవారు వివిధ కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరింపబడి శాకంబరీ దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు.  దేవస్థానము నందు గర్భాలయము, అంతరాలయము, మరియు ప్రధానాలయము వివిధ రకముల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించబడినది.  శాకంభరీ ఉత్సవముల సందర్భముగా భక్తులందరికీ కదంబం ప్రసాదముగా పంచిపెట్టబడినది. రేపు అనగా ఆషాడ శుద్ద పౌర్నమి, ది.05-07-2020 ఆదివారము రొజున ఉదయం 08 గం.ల నుండి   సప్త శతి హవణము , మహావిద్యా పారాయణము, శాంతి పౌష్టిక హొమము నిర్వహించిన అనంతరము ఉ.11 గం.లకు పూర్నాహుతి, కూష్మాండ బలి, మార్జనము కలశోద్వాసన, ఆశీర్వాదము కార్యక్రమములు కొనసాగనున్నాయి .
ఈరొజు దేవస్థానము నందు సామాజిక దూరం పాటిస్తూ , మాస్కులు ధరించి online యందు టైం స్లాట్ పద్దతి ద్వారా టికెట్లు పొంది అమ్మవారి దర్శనము చేసుకున్నారు.  పరిమిత సంఖ్యలో ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవావర్నార్చన, చండీ హోమం, శాంతికల్యాణము,  రుద్రహోమము, నవగ్రహ శాంతి హోమము మరియు లక్షకుంకుమార్చన సేవలు యందు సామాజిక దూరము పాటిస్తూ, మాస్కులు ధరించి, ప్రత్యక్షముగా పాల్గొని పూజలు నిర్వహించారు.  
అమ్మవారి దర్శనార్థము, సేవలు , ప్రసాదము పొందుటకు, తలనీలాలు సమర్పించుట కొరకు భక్తులందరూ విధిగా online నందు www.kanakadurgamma.org , మొబైల్ ఆప్: kanakadurgamma, మీ సేవా సెంటర్ల ద్వారా ముందస్తుగా టికెట్లు పొంది ప్రింటు తీసుకొని రావలెనని తెలిపారు.   
ప్రత్యక్షముగా పూజల యందు పాల్గొను అవకాశము లేనటువంటి భక్తుల సౌకర్యార్థము  దేవస్థానము నందు జరుగు   ఖడ్గమాలార్చన, రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శాంతి కళ్యాణము, శ్రీచక్రనవావర్నార్చన,  రాహు కేతు పూజలు పరోక్షముగా భక్తుల గోత్ర నామముల తో జరిపించుటకు చర్యలు తీసుకొనుట జరిగినదని, కావున ఈ పరోక్ష  సేవలు పరోక్షముగా  జరిపించుకోనదలచిన  భక్తులు టిక్కెట్లు  online నందు www.kanakadurgamma.org  – website  ద్వారా పొందవచ్చునని  ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపియున్నారు. పరోక్ష సేవలు బుక్ చేసుకున్న భక్తులందరికీ  అమ్మవారి ప్రసాదములు పోస్టు ద్వారా పంపబడును అని ఆలయ కార్యనిర్వహణ అధికారి వారు  తెలిపారు. దర్శనము మరియు సేవల, ప్రసాదము టికెట్లు కొరకు  భక్తులు  online నందు www.kanakadurgamma.org వెబ్ సైటు , kanakadurgamma అను ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్, మీ సేవ సెంటర్లు, దేవస్థానము కౌంటర్లు నందు పొందవచ్చని ఆలయ కార్యనిర్వహణాధికారి  ఎం.వి.సురేష్ బాబు గారు తెలిపారు. 
ఆషాడ మాసం సంధర్భముగా  శ్రీ అమ్మవారికి అషాడం సారె సమర్పించ దలచిన మరియు అమ్మవారి దర్శనం చేసుకొనదలచిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా విధిగా ఆన్ లైను(website: www.kanakadurgamma.org, ఆండ్రాయిడ్ మొబైల్ APP : kanakadurgamma), మీ-సేవ సెంటర్లు  ద్వారా వారి యొక్క పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ లేదా ఏదైనా ఇతర ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్ మరియు వివరములు నమోదు చేసుకొని టైం స్లాట్ ప్రకారము  దర్శనం టిక్కెట్లు తీసుకొని ప్రతి రోజు ఉదయం 6 గం.ల నుండి సాయంత్రం 5-00 గం.ల వరకు బృందములుగా కాకుండా మహామండపం ద్వారా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజేషన్ జాగ్రత్తలు పాటిస్తూ క్యూ-మార్గము ద్వారా విచ్చేసి, అమ్మవారికి సమర్పించదలచిన సారే, మడుపులు సమర్పించవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు   తెలిపారు. ఆలయ ప్రాంగానములందు శానిటైజర్లు, మరియు ఇతర ఏర్పాట్లు చేయడమైనదని తెలిపారు.  దేవస్థానము ప్రాంగణముల నందు కరోనా వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం, సానిటైజర్లు ఏర్పాటు, ప్రతినిత్యము క్యూ లైన్లు పరిశుబ్రత , థర్మల్ సేన్సార్స్ ఏర్పాటు మరియు ఇతర పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Øమాస్కు ధరించిన భక్తులను మాత్రమే శ్రీ అమ్మవారి దర్శనమునకు అనుమతించబడుచున్నదని తెలిపారు.
Øఆలయ పరిసర ప్రాంతములు పరిశుభ్రముగా ఉంచుతూ ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లేరైడ్ తో  శుభ్రపర్చుటకు తగిన చర్యలు తీసుకొనబడినదని తెలిపారు.
Ø భక్తులు కాళ్ళు, చేతులు శుభ్రపర్చుకొని మహామండపము క్యూ లైను మార్గము ద్వారా దర్శనమునకు వెళ్ళుటకు ఏర్పాట్లు చేశామని ఇ.ఓ.చెప్పారు.

జూలై ఆఖరు వరకు భక్తుల పెంపు లేదు... ఉద్యోగులంద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు... టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి..

తిరుమల :  దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి సంబంధించి రోజువారీ భ‌క్తుల సంఖ్య‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా జూన్ 8వ తేదీ నుంచి శ్రీ‌వారి ద‌ర్శ‌నం తిరిగి ప్రారంభించామ‌ని తెలిపారు. స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఏ ఒక్క భ‌క్తుడికీ క‌రోనా పాజిటివ్ రాలేద‌ని స్ప‌ష్టం చేశారు. భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్ ద్వారా స్వామివారి క‌ల్యాణోత్స‌వం సేవ ప్రారంభించే విషయం గురించి అర్చకులతో చర్చించి తగు నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌న్‌లో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తో క‌లిసి శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. 

- గ‌త 28 రోజులుగా భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నాం. స్వామివారి ద‌య‌వ‌ల్ల ఏ ఒక్క భ‌క్తుడికీ క‌రోనా పాజిటివ్ రాలేద‌ని నిర్ధార‌ణ అయింది.

- దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ర‌క‌మైన ప‌రిస్థితి ఉంద‌ని, ప్ర‌ధాన‌మంత్రి, ముఖ్య‌మంత్రి చెప్పిన‌ట్టు క‌రోనా ఒక‌రోజులో పోయే ప‌రిస్థితి లేదు. అందుకే తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు క‌ల్పించాల్సిన ద‌ర్శ‌నం విష‌యంతోపాటు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కోసం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించాం. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ద‌ర్శ‌నాల సంఖ్య‌ను పెంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించాం. 

- టిటిడి ఆర్థిక వ‌న‌రులు పెంచుకోవ‌డం కోస‌మే రోజువారీగా భ‌క్తుల ద‌ర్శ‌నాల సంఖ్య‌ను పెంచుతూ పోతోంద‌ని కొంత‌మంది దుష్ప్ర‌చారం చేస్తున్నారు. ఈ విష‌యంలో ఆదాయ వ్య‌యాలు చూసే ఆలోచ‌నే ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లికి లేదు.

- భ‌క్తులు ఎక్కువ మంది స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుని ఆశీస్సులు పొందితే క‌రోనా త్వ‌ర‌గా దూర‌మ‌వుతుంద‌నే ఉద్దేశంతోనే తొలుత రోజుకు 6 వేల‌తో ప్రారంభించిన ద‌ర్శ‌నం టికెట్ల‌ను 12 వేల‌కు పెంచాం. 

- గ‌త 28 రోజులుగా అనేక ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నా టిటిడిలో 17 మంది సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వీరంద‌రినీ క్వారంటైన్‌కు పంపి అత్యుత్త‌మ వైద్య‌సేవ‌లు అందించ‌డానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశాం. వీరికి వారి నివాస ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, కుటుంబ స‌భ్యుల ప్ర‌యాణాల కార‌ణంగానే క‌రోనా వ్యాధి వ‌చ్చింద‌ని నిర్ధార‌ణ అయింది. 

- ఉద్యోగుల్లో మ‌నోధైర్యం పెంచ‌డానికి ఎంత ఖ‌ర్చు అయినా వెనుకాడ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధికారుల‌ను ఆదేశించింది. ఉద్యోగుల‌కు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అండ‌గా ఉంటుంది. ఉద్యోగుల‌తో చ‌ర్చించి, అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తూ భ‌క్తుల‌కు సేవ చేయ‌డం కోసం శాస‌న‌స‌భ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌రరెడ్డి, శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి బాధ్య‌తలు అప్ప‌గించాం. 

- తిరుమ‌ల‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగులకు ప్ర‌స్తుతం వారానికోసారి షిఫ్టు అమ‌లు చేస్తున్నామ‌ని, ఉద్యోగుల ఆరోగ్యసంర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఇక‌పై షిఫ్టు విధుల‌ను రెండు వారాల‌కు పెంచాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. ఉద్యోగులంద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ పరీక్ష‌లు చేయిస్తాం. 

- క‌ల్యాణ‌క‌ట్టలో క్షుర‌కులు, త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే భ‌క్తుల ఆరోగ్యసంర‌క్ష‌ణలో భాగంగా క్షుర‌కులు ఒక భ‌క్తుడి త‌ల‌నీలాలు తీయ‌డానికి ఒక‌ గ్లౌజు చొప్పున వినియోగించేలా, క్షుర‌కుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండే పిపిఈ కిట్లు అందిస్తాం. ల‌డ్డూ ప్ర‌సాదాల పంపిణీ కేంద్రాల వ‌ద్ద కూడా మ‌రిన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించాం.

- శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం త‌రువాత ఉత్స‌వ‌మూర్తుల వాహ‌నాన్ని మోసే వాహ‌న‌బేర‌ర్ల‌కు మాస్కులు, గ్లౌజులు త‌ప్ప‌నిస‌రి చేస్తాం. వాహ‌నాన్ని మోసేందుకు వాడే తండ్ల‌ను(క‌ర్ర‌లు) ప్ర‌తిరోజూ శానిటైజ్ చేయాలని నిర్ణ‌యం.

- భ‌క్తుల నుంచి వ‌స్తున్న విన్న‌పాల మేర‌కు క‌ల్యాణోత్స‌వ సేవ‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించే విషయం గురించి అర్చకులతో చర్చించి తగిన నిర్ణ‌యం తీసుకుంటా ము. ఆన్‌లైన్ ద్వారా క‌ల్యాణోత్స‌వం టికెట్ తీసుకున్న భ‌క్తుల గోత్ర‌నామాలు అర్చ‌కులు చెబుతారు. త‌పాలా శాఖ ద్వారా భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు పంపే ఏర్పాట్లు చేయాల‌ని అధికారులకు సూచించాము. ఈ సేవను మొద‌లుపెట్టే తేదీని అధికారులు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

- భ‌క్తులు ఇప్ప‌టివ‌ర‌కు దేవ‌స్థానానికి పూర్తిగా స‌హ‌క‌రించి క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ‌కు అన్ని ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటిస్తూ ఎవ్వ‌రికీ ఇబ్బంది లేకుండా ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. ఇక‌మీద‌ట కూడా ఇలాగే స‌హ‌క‌రించి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని కోరుతున్నాం. తిరుప‌తిలోని స్థానిక ఆల‌యాల్లో కూడా తిరుమ‌ల త‌ర‌హాలో అన్ని జాగ్ర‌త్తలు తీసుకుని భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తాం.

- భ‌క్తులంద‌రూ ముందుగా ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ద‌ర్శ‌నానికి రావాలి. దేశంలోని రెడ్‌జోన్లు, కంటైన్‌మెంట్ జోన్ల‌లో ఉన్న భ‌క్తులు ద‌య‌చేసి ద‌ర్శ‌నానికి రాకూడ‌దు.

శ్రావ‌ణ‌మాసంలో క‌ర్ణాట‌క స‌త్రాల స‌ముదాయాల‌కు శంకుస్థాప‌న‌

           తిరుమ‌ల‌లోని క‌ర్ణాట‌క స‌త్రాల ప్రాంతంలో టిటిడి లీజుకు ఇచ్చిన 7.05 ఎక‌రాల భూమిలో యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం, క‌ల్యాణ‌మండ‌పం నిర్మాణానికి శ్రావ‌ణ‌మాసంలో తాను, ఎపి ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శంకుస్థాప‌న చేస్తామ‌‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ య‌డ్యూర‌ప్ప చెప్పారు. 

- సిఎం శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం, క‌ర్ణాట‌క సిఎం శ్రీ య‌డ్యూర‌ప్ప ఆహ్వానం మేర‌కు 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాల నిర్మాణాల వ్య‌వ‌హారంపై శుక్ర‌వారం జ‌రిగిన స‌మావేశంలో అవ‌గాహ‌న వ‌చ్చాం. 

- క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం టిటిడికి రూ.200 కోట్లు డిపాజిట్ చేస్తే టిటిడి నిబంధ‌న‌ల మేరకు టెండ‌ర్లు పిలిచి ఈ నిర్మాణాలు పూర్తి చేసేలా ఒప్పందం కుదిరింది. 

- తిరుమ‌ల‌లో అతిథిగృహాల నిర్మాణానికి స్థ‌లాల కేటాయింపు విష‌యంలో పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ఉండేందుకు సిఎం శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం మేర‌కు విరాళాల ప‌థ‌కం కింద ఆన్‌లైన్‌లో టెండ‌ర్ బిడ్డింగ్ ద్వారా స్థ‌లాలు కేటాయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం.

            ఈ స‌మావేశంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ కె.పార్థ‌సార‌ధి, శ్రీ సి.ప్ర‌సాద్‌కుమార్‌, శ్రీ గోవింద‌హ‌రి , శ్రీ ముర‌ళీకృష్ణ , జె ఈ ఓ శ్రీ పి.బసంత్ కుమార్ , సివి ఎస్ ఓ శ్రీ గోపినాథ్ జెట్టి  తదితరులు పాల్గొన్నారు.